LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

Women's Day special leave letter

Posted by PAATASHAALANEWS on Monday, 7 March 2022


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 Women's Day special leave model leave letter  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకునిWomen's Day special leave order


*🌹మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*

*✍️మహిళలు ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు*

👑ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది.
*(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996)*
(ఇది మహిళా ఉద్యోగులకు చరిత్రలో నిలిచిపోయే G.O.)

💁‍♀️ ఉద్యోగ కల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.
*(G.O.Ms.No.27 తేది:09-01-2004)*

💁‍♀️ మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.
*(G.O.Ms.No.350 తేది:30-07-1999)*

💁‍♀️ అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.
*(Memo.No.17897 తేది:20-04-2000)*

💁‍♀️ పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ 
ఉత్తర్వులు.
*(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)*

💁‍♀️ ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు. 
*(మెమో.నం.7679 తేది:14-09-2010)*

💁‍♀️ మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు.
*(G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)*

💁‍♀️ మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
*(G.O.Ms.No.374 తేది:16-03-1996)*

💁‍♀️ జూనియర్  లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.
*(G.O.Ms.No.03 తేది:05-01-2011)*

💁‍♀️ మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.
*(G.O.Ms.No.142 తేది:01-09-2018)*

💁‍♀️ వివాహం ఐన మహిళా ఉద్యోగికి 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి  సెలవు మంజూరు చేయబడుతుంది.
*(G.O.Ms.No.152 తేది:04-05-2010)*

💁‍♀️ మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.
*(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)*
*(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)*

💁‍♀️ మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)*

💁‍♀️ ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)*

💁‍♀️ మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)*

💁‍♀️ చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.
*(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)*

💁‍♀️ మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి  మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.
*(G.O.Ms.No.209 తేది:21-11-2016)


Women's Day special leave model leave letter
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 07, 2022

0 comments:

Post a Comment