LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

KVS Admissions: కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో మారిన అడ్మిషన్ రూల్స్ ఇవే

Posted by PAATASHAALANEWS on Wednesday, 15 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

KVS Admissions: కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో మారిన అడ్మిషన్ రూల్స్ ఇవే..

*కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS స్కూళ్లలో అడ్మిషన్లు కోరుకుంటున్నవారికి అలర్ట్. 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ రూల్స్‌ని మార్చింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్. ఈ వివరాలను https://kvsangathan.nic.in/ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. ప్రస్తుత విద్యార్థులతో పాటు కొత్త విద్యార్థులకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో 27 శాతం సీట్లు ఓబీసీ విద్యార్థులకు కేటాయించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2019 డిసెంబర్‌లోనే నిర్ణయించింది. ఇప్పుడు ఆ నిర్ణయం అమలులోకి వచ్చింది. 1వ తరగతిలో అడ్మిషన్లు ఆన్‌లైన్ డ్రా ద్వారా చేపడతారు. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రాధాన్యతా క్రమంలో అడ్మిషన్లు ఉంటాయి.ఒకవేళ ఉన్న సీట్ల కన్నా దరఖాస్తులు ఎక్కువైతే లాటరీ సిస్టమ్ అమలు చేస్తారు. 9వ తరగతి అడ్మిషన్లు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. 11వ తరగతి అడ్మిషన్లు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇక 10వ తరగతి, 12వ తరగతి అడ్మిషన్లు సీట్ల లభ్యతను బట్టి ఉంటుంది.*
*కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, అటనామస్ బాడీస్, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యక్తిగత కారణాల వల్ల భారతదేశంలో పనిచేస్తున్న విదేశీయులు పిల్లలకు కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో ప్రాధాన్యం ఉంటుంది. అయితే భారతీయ విద్యార్థులు వెయిటింగ్ లిస్ట్‌లో లేకపోతేనే విదేశీయుల పిల్లల్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఏ తరగతికి ఏఏ వయస్సు విద్యార్థులు అర్హులో ఈ కింది జాబితాలో తెలుసుకోండి. మార్చి 31 నాటికి వయస్సును లెక్కిస్తారు.*
1వ తరగతి- 5 నుంచి 7 ఏళ్లు
2వ తరగతి- 6 నుంచి 8 ఏళ్లు
3వ తరగతి- 7 నుంచి 9 ఏళ్లు4వ తరగతి- 8 నుంచి 10 ఏళ్లు
5వ తరగతి- 9 నుంచి 11 ఏళ్లు
6వ తరగతి- 10 నుంచి 12 ఏళ్లు
7వ తరగతి- 11 నుంచి 13 ఏళ్లు
8వ తరగతి- 12 నుంచి 14 ఏళ్లు
9వ తరగతి- 13 నుంచి 15 ఏళ్లు
10వ తరగతి- 14 నుంచి 16 ఏళ్లు
*సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలైన 20 రోజుల్లోనే 11వ తరగతి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కేంద్రీయ విద్యాలయ పాఠశాలల ప్రిన్సిపాల్స్ దగ్గర రిజిస్ట్రేషన్ ఫామ్స్ తీసుకోవచ్చు. 1వ తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ అడ్మిషన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది


*Kendriya Vidyalaya App for admissions - 2020-21*

https://play.google.com/store/apps/details?id=com.kvsadmissions

KVS Admission Schedule 2020-2021

https://kvsangathan.nic.in/sites/default/files/hq/KVS%20Admission%20Schedule%202020-2021.pdf


https://kvsangathan.nic.in/announcement/kvs-admission-notice-2020-2021

.. మరిన్ని వివరాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS అధికారిక వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ చెక్ చేయాలి.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 15, 2020

0 comments:

Post a Comment