పాత పెన్షన్ ఉద్యోగిపదవీ విరమణ/ అకాల మరణం చెందిన సందర్బంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ?*
* సమాధానం:-కొత్త పెన్షన్ వారికి అవకాశం లేకుండా పాత పెన్షన్ లో ఆర్థిక లబ్ది ఉన్నవాటిని, వాటిని ఎలా గణిస్తారో మీ ముందుంచుతాను. చేసిన సర్వీస్ ని యూనిట్ల ప్రకారం లెక్కిస్తారు. ఆరు నెలలకు ఒక యునిట్ చొప్పున లెక్కించాలి. చివరగా మిగిలిన నెలలు రోజులకు గాను 3నెలలు దాటితే ఒక యునిట్ గా లెక్కించాలి.*
*అకాల మరణం పొందిన సందర్భంలో :*
- డెత్ గ్రాట్యూటి : ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే క్రింది విధంగా గ్రాట్యుటీ చెల్లించబడును.
- ఎ) సర్వీస్ ఒక సంవత్సరం పూర్తికాకుండానే ఉద్యోగి మరణిస్తే 3 సంవత్సరాల అర్హత గల సర్వీస్ కు అర్హతగల గ్రాట్యుటీ ఇవ్వబడును.
- బి) సర్వీస్ 1 సంవత్సర కాలం పూర్తి చేసి 5 సంవత్సర కాలం పూర్తిగా కాకుండా మరణిస్తే 9 ఏండ్ల సర్వీసుకు లెక్కకట్టి చెల్లిస్తారు.
- సి) సర్వీస్ 5 సంవత్సర కాలం పూర్తి చేసి 18 సంవత్సర కాలం పూర్తిగా కాకుండా మరణిస్తే 18 ఏండ్ల సర్వీసుకు లెక్కకట్టి చెల్లిస్తారు.
- డి) సర్వీస్ 18 సంవత్సర కాలం పూర్తి చేసి మరణిస్తే చేసిన సర్వీసుకు లెక్కకట్టి చెల్లిస్తారు.
- Formula :
(Last drawn (Pay+DA) X Qualifying Service Half Units) 4
(RPS 2015 ప్రకారం గరిష్ట పరిమితి 12 లక్షలు)
*ఫ్యామిలీ పెన్షన్ :* *ఉద్యోగం చేస్తూ కాని రిటైర్ అయిన తరువాత గాని ఉద్యోగి మరణించినచో వారి భార్య / భర్త లేదా అర్హత గల కుటుంబ సభ్యులకు ఇచ్చు పెన్షన్ ను కుటుంబ పెన్షన్ అంటారు.*
*ఫ్యామిలీ పెన్షన్ :* *ఉద్యోగం చేస్తూ కాని రిటైర్ అయిన తరువాత గాని ఉద్యోగి మరణించినచో వారి భార్య / భర్త లేదా అర్హత గల కుటుంబ సభ్యులకు ఇచ్చు పెన్షన్ ను కుటుంబ పెన్షన్ అంటారు.*
* i. సర్వీస్ 7 సంవత్సరాలు పూర్తి కాకుండా చనిపోయినచో అతని కుటుంబ సభ్యులలో అర్హులకు ఉద్యోగి చివరగా పొందిన మూలవేతనంలో 30% ఫామిలీ పెన్షన్ చెల్లిస్తారు. ఆరోజు ఉన్న కరువు భృతిని కలిపి చెల్లిస్తారు.*
* ii. సర్వీస్ 7 సం॥లు పూర్తి చేసి పదవీ విరమణ కాకుండా ఉద్యోగి మరణించినచో కుటుంబ సభ్యులలో అర్హులకు మొదటి 7సం॥ లు ఉద్యోగి చివరగా పొందిన మూలవేతనంలో 50% (మరణించిన ఉద్యోగి వయసు 65 సంవత్సారాలు మించకుండా), 7 సంవత్సరాల తరువాత జీవించి ఉన్నంత వరకు చివరినెల జీతంలో 30% చొప్పున ఇవ్వబడును. ఆరోజు ఉన్న కరువు భృతిని కలిపి చెల్లిస్తారు.*
* 1. సాదారణ పదవీ విరమణ/ స్వచ్చంద పదవీ విరమణ సందర్భంలో :*
* రిటైర్ మెంట్ గ్రాట్యిటీ : 5 సం॥ ల సర్వీస్ వేయిటెజ్ తో కల్పి ప్రతి 6 నెలల సర్వీస్ కి ఒక యూనిట్ చొప్పున మొత్తం యూనిట్స్ ని లెక్కించగా వచ్చిన యూనిట్లను గరిష్ఠం గా 66 యునిట్లతో చివరగా డ్రా చేసిన బేసిక్ పే మరియు డి.ఎ ను గణించి 4 తో భాగించగా వచ్చిన రూపాయలను RPS 2015 ప్రకారం గరిష్ఠం గా 12లక్షల వరకు చెల్లిస్తారు.*
*✏Gratuity Formul :* *Last drawn(Pay+DA) X Half Yearly Service Units
4*
4*
*✏సర్వీస్ పెన్షన్ : 5 సం॥ ల సర్వీస్ వేయిటెజ్ తో కల్పి ప్రతి 6 నెలల సర్వీస్ కి ఒక యూనిట్ చొప్పున మొత్తం యూనిట్స్ ని లెక్కించగా వచ్చిన యూనిట్లను గరిష్ఠం గా 66 యునిట్లను తేసుకొవాలి. ఆరోజు ఉన్న కరువు బృతి ని కలిపి చెల్లిస్తారు.*
*✏Service Pension Formula:* Last Pay drawn X Half Yearly Service Units
2 X 66
2 X 66
*✏ఫ్యామిలీ పెన్షన్ : రిటైర్ అయిన తరువాత ఉద్యోగి మరణించినచో వారి భార్య / భర్త లేదా అర్హత గల కుటుంబ సభ్యులకు ఇచ్చు పెన్షన్ ను కుటుంబ పెన్షన్ అంటారు. పెన్షనర్ గా ఉండి మరణిస్తే పదవీ విరమణ తేది నుండి 7సం॥ ల కాలము లేదా మరణించిన సర్వీస్ పెన్షనర్ కు 65సం॥ వయసు పూర్తయ్యే తేది వరకు ఏది ముందయితే అంతవరకు చివరినెల జీతంలో 50% తరువాత జీవించి ఉన్నంత వరకు చివరినెల జీతంలో 30% చొప్పున ఇవ్వబడును. ఆరోజు ఉన్న కరువు భృతి ని కలిపి చెల్లిస్తారు.*
*✏Commutation of Pension: ఉద్యోగికి మంజూరయిన పెన్షన్ లో కొంతభాగాన్ని గరిష్ఠంగా 40% అమ్ముకొని దానికి బదులుగా ఒకేసారి మొత్తాన్ని పొందే సౌకర్యం ఉంది. కమ్యుటేషన్ పొందిన తేది నుండి 15సం॥ ల పాటు కమ్యుటేషన్ చేసిన భాగం పెన్షన్ తగ్గింపు చేసి చెల్లిస్తారు కాని కరువు భృతిని మొత్తం పై కలిపి చెల్లిస్తారు. ఇది ఉద్యోగి ఐచ్చికం మాత్రమే తప్పని సరికాదు. ఇది బ్యాంకుక్షా నుండి దాదాపు 8.5% వడ్డికి అప్పు తీసుకుని చెల్లించినట్టుగా ఉంటుంది. ఇలాంటి అవకాశం కూడా కొత్త పెన్షన్ వారికి అవకాశం లేదు.
0 comments:
Post a Comment