గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే? డయాబెటిస్ ఉన్నవారు తెలుసుకోవాల్సిందే...
Diabetes Diet : ఒక్కోసారి కొంత మందికి సడెన్‌గా కళ్లు తిరుగుతాయి. నీరసం వచ్చేస్తుంది. చెమట పట్టేస్తుంది. దాహం వేస్తుంది. ఇలాంటి రకరకాల లక్షణాలు ఉంటుండటంతో... ఎందుకైనా మంచిదని డాక్టర్‌ను కలుస్తారు. పరీక్షించిన డాక్టర్... మీకు షుగర్ వ్యాధి వచ్చింది. డోంట్ వర్రీ... నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి... అంటూ... వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (Glycemic Index - GI) తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి అంటారు. చాలా మంది ఆ పదాన్ని మొదటిసారి వింటారు. అదేంటో సరిగా అర్థం కాకపోతే... రెండోసారి అడగడానికి కూడా సాహసించరు. ఎందుకంటే... షుగర్ వచ్చిందనే బాధలో వాళ్లుంటారు. నిజానికి డయాబెటిస్ వచ్చినంత మాత్రాన ఆవేదన చెందాల్సిన పని లేదు.
తినే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే... డయాబెటిస్ అస్సలు బాధించదని డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకోసం GI పై ఆధారపడమని సూచిస్తున్నారు. ఆహార పదార్థాల్లో ఉండే షుగర్ (గ్లూకోజ్) లెవెల్స్‌ని బట్టీ... ఆహారానికి GI ర్యాంక్ 1980 నుంచీ ఇస్తున్నారు. దీని ప్రకారం... గ్లైసెమిక్ ఇండెక్స్ మూడు రకాలుగా ఉంటుంది. తక్కువ, మీడియం, ఎక్కువ. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలు... బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని పెంచవు. అలాగే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఆహార పదార్థాలు తింటే... బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి.

తక్కువ GI ఉన్న పండ్లు : పియర్స్, యాపిల్స్, ద్రాక్ష (గ్రీన్, బ్లూ), ప్లమ్, ఆరెంజ్, స్ట్రాబెర్రీస్, పీచ్, చెర్రీస్, కమలాలు.... ఇవి డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు. ఐతే... లిమిట్‌గా తినాలి. మరీ ఎక్కువగా తింటే ప్రమాదమే.తక్కువ GI ఉన్న ఆహారాలు : పై పండ్లతోపాటూ... ఓట్స్, పొర్రిడ్స్ ఓట్స్, కాయధాన్యాలు, కిడ్నీ బీన్స్, క్వినోవా, పాలు, బాదం, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, వాల్‌నట్స్‌లో GI తక్కువగా ఉంటుంది.
తక్కువ GI ఉన్న కూరగాయలు : కారెట్స్, బ్రకోలీ, టమాటాలు, కాలీఫ్లవర్.
GI తక్కువ ఉండే ఆహారం తింటే... కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా తగ్గుతాయి. అధిక బరువు సమస్య తగ్గుతుంది. అందువల్లే డాక్టర్లు ఈ ఫుడ్డే ఎక్కువ తినమంటున్నారు. ఐతే... ఏవి ఎంత తినాలి అనేది మాత్రం ఓసారి డాక్టర్‌ని కలిసి.... వాళ్ల సలహాలూ, సూచనలూ పాటిస్తే... డయాబెటిస్ తిక్క కుదురుతుంది
0 comments:
Post a Comment