ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా శుభ్రం చేసుకోండి.!
మన దేశం లో పెరుగుతున్న జనాభా మరియు దానితో పాటే పెరుగుతున్న మోటార్ వెహికల్స్, అవి విడుదల చేస్తున్న కాలుష్యం వల్ల మనిషి ఆరోగ్యం చెడిపోతుంది. చెట్లను నరికి వేయడం మరియు పరిశ్రమల నుంచి విడుదల అయ్యే రసాయనాల వల్ల వాయు కాలుష్యం రోజు రోజుకి పెరిగి పోతుంది. దీనితో అనేక రకాల శ్వాసకోశ వ్యాధులు ప్రభలుతున్నాయి. వీటికి తోడు చెడు వ్యసనాలకు బానిసలు అవడం వల్ల కూడా మన ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లుతుంది. అయితే దీనికి పరిష్కారం మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కొంత వరకు వీటి నుంచి ఉపసమనం పొందవచ్చు.
పూర్వం నుండి మనం తీసుకునే ఆహారమే ఎన్నో వ్యాధులకు మంచి ఔషదాలుగా పనిచేస్తుంది. అయితే వీటిలో మన ఊపిరితిత్తులకు వ్యాధులు సోకకుండా ఉంచే ఆహారాలు చాల ఉన్నాయి.
ఊపిరితిత్తులను శుభ్ర పరచుకోవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడతాయి. సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆరెంజ్ లు,నిమ్మ, బత్తాయి వంటివి మనకు కావలసిన ఆక్సిజన్ గ్రహించేలా చేస్తాయి. అలాగే దానిమ్మ పళ్ళను తినడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే కణితులను నివారించటానికి దోహదం చేస్తాయి.
పొగతాగే వారు ఉల్లిని ఎక్కువగా వాడటం మంచిది. రోజుకి 300ml పైనాపిల్ జ్యూస్ తాగాలి. అలాగే విటమిన్ ఇ, బి, ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పాలు, పాల పదార్థాలను సాద్యమైనంతవరకు దూరం పెట్టాలి. వీటిలో కొన్ని రకాల ఎంజైములు ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తాయి. ఏది ఏమైనా కాలుష్యం నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
0 comments:
Post a Comment