ఉపాధ్యాయ వృత్తికి గేట్‌వే డీఈఈసెట్-2020
*📚ఉపాధ్యాయ వృత్తి నోబుల్ ప్రొఫెషన్. ఒకప్పుడు బతకలేని బడి పంతులు నేడు బతుకు నేర్చినవాడు, నేర్పేవాడు అయ్యాడు. కేవలం ఆదాయమే కాకుండా ఆత్మ సంతృప్తినిచ్చేది ఉపాధ్యాయ వృత్తి. అయితే ఈ వృత్తిలో ప్రవేశించాలంటే ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసుకోవాలి. ఇంటర్‌తో ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సులో చేరడానికి నిర్వహించే డీఈఈ సెట్ -2020 ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ పరీక్షకు సంబంధించిన వివరాలు..*
*👉డీఈఈసెట్*
*🖊️డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డీఈఈసెట్). ఇంటర్ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించదలచిన వారికి డీఈఈసెట్ గేట్‌వే. ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌లో మంచి ర్యాంకు సాధిస్తే డీఈడీ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. తర్వాత ఈ కోర్సు పూర్తిచేసి ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయవచ్చు. వీటన్నింటికీ ఈ ప్రవేశపరీక్షలో ర్యాంకే కీలకం.*
*👉ఎవరు రాయవచ్చు?*
*🔍విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించినవారు. ఈ సంవత్సరం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశాల సమయం నాటికి ఇంటర్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.*
*📚ఇంటర్‌లో ఓసీ/బీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది.*
*👉ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసినవారికి ఈ కోర్సు చేయడానికి అవకాశం లేదు.*
*👉వయస్సు*
*🔍సెప్టెంబర్ 1కి అభ్యర్థికి 17 ఏండ్లు నిండి ఉండాలి.*
*🖊️పరీక్ష విధానం🖊️*
*🖊️పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు.
పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు సమయంలోనే ఏ మీడియంలో పరీక్ష రాస్తారో నిర్ణయించుకోవాలి.*
*🖊️పరీక్ష మూడు పార్ట్‌లుగా ఉంటుంది.*
*👉పార్ట్-1లో జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్‌పై 10 ప్రశ్నలు ఇస్తారు. 10 మార్కులు.*
*👉పార్ట్-2లో జనరల్ ఇంగ్లిష్-10, జనరల్ తెలుగు-20 ప్రశ్నల చొప్పున మొత్తం 30 ప్రశ్నలు 30 మార్కులు.*
*👉పార్ట్-3లో మ్యాథ్స్ నుంచి 20 ప్రశ్నలు, ఫిజికల్ సైన్సెస్ నుంచి 10, బయాలజికల్ సైన్సెస్ నుంచి 10, సోషల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. అంటే పార్ట్-3లో మొత్తం 60 ప్రశ్నలు 60 మార్కులు ఉంటాయి.*
*👉పార్ట్-3లో ఆయా సబ్జెక్టుల ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి.*
*☀️డీఈఎల్‌ఈడీ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లో నిర్వహిస్తారు. డీపీఎస్‌ఈ పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ఉంటుంది.*
*2020 టీఎస్ డీఈఈసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.*
*👉సీట్ల కేటాయింపు*
*🔍రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్ కాలేజీల్లో అన్ని సీట్లను డీఈఈసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తారు. అదేవిధంగా ప్రైవేట్, అన్ ఎయిడెడ్, నాన్ మైనార్టీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో కేటగిరీ ఏ కింద 80 శాతం సీట్లను డీఈఈసెట్ ర్యాంక్ ద్వారా భర్తీ చేస్తారు.*
*👉పరీక్ష కేంద్రాలు: పాత పది జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.*
*📚ఉద్యోగ అవకాశాలు📚*
*🔍ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేవీ, ఎన్‌వీఎస్‌లతోపాటు ఆర్మీ ఇతర కేంద్ర పాఠశాలల్లో ఉద్యోగానికి అర్హులు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రైమరీ, ప్రీప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా పనిచేయవచ్చు. వీరు సీటెట్/టెట్‌లో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. పలు కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్‌లో అపారంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి.*
*👉ముఖ్యతేదీలు*
*దరఖాస్తు: ఆన్‌లైన్‌లో*
*చివరితేదీ: ఏప్రిల్ 27*
*ఫీజు: రూ.450/-*
*పరీక్షతేదీ: మే 22*
*ఫలితాల వెల్లడి: మే 29*
*పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://www.deecet.cdse.telangana.gov.in.*
*🔍ఎలా ప్రిపేర్ కావాలి?🔎*
*📚టీచింగ్ ఆప్టిట్యూడ్: టీచింగ్ ఆప్టిట్యూడ్‌లో ఉపాధ్యాయ వృత్తి పట్ల అభ్యర్థికి ఉండే అభిరుచి, సహజ సామర్థ్యాలను పరిశీలించే అంశాలు ఉంటాయి. ఇందులో నేడు మారుతున్న విద్యావిధానంపై అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి రూపొందించే పథకాలు, ప్రస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న విద్యా కార్యక్రమాలతోపాటు నూతన మూల్యాంకన విధానం, తరగతి నిర్వహణ, జాతీయ ప్రణాళికా చట్టం-2005, విద్యాహక్కు చట్టం-2009 మొదలైన వాటిపై ప్రశ్నలు ఇస్తారు. దీనికోసం పై అంశాలపై పట్టుసాధించాలి.*
*📚జనరల్ నాలెడ్జ్: దీనిలో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల నుంచి వర్తమాన అంశాలు వస్తాయి. దీనికోసం ప్రతిరోజూ వార్తాపత్రికలను చదవడం, వాటిలో ముఖ్యమైన సమచారాన్ని నోట్స్‌గా రాసుకోవడం చేయాలి. అదేవిధంగా స్టాండర్డ్ జీకే నుంచి దేశాలు-రాజధానులు, దేశాలు-కరెన్సీ, వివిధ రకాల గ్రంథాలు, క్రీడలు, దేశాలు-పార్లమెంటులు, వివిధ రకాల నాట్యరీతులు, కొత్తపేర్లు-పాత పేర్లు, శాస్త్రీయ అధ్యయనాలు, విటమిన్ల లోపం వల్ల కలిగే వ్యాధులు, విటమిన్లు లభించే పదార్థాలు మొదలైన అంశాలను చదవాల్సి ఉంటుంది. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను ఒక్కసారి పరిశీలిస్తే ఏయే అంశాలపై ప్రశ్నలు ఇస్తున్నారో అవగతమవుతుంది.*
*📚ఇంగ్లిష్: దీనిలో మంచి మార్కులు సాధించాలంటే గ్రామర్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా పదోతరగతి స్థాయిలో చదువుకున్న గ్రామర్ అంశాలైన.. టెన్సెస్, వాయిస్, వొకాబులరీ, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ మొదలైన అంశాలను అర్థం చేసుకుని, మాదిరి ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.*
*👉పార్ట్-3: దీనిలో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ అంశాలను పదోతరగతి స్థాయిలో ఇస్తారు. కాబట్టి 8, 9తోపాటు పదోతరగతి పుస్తకాలను బాగా ప్రిపేర్ కావాలి.*
*👉ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులకు సరైన సమయం కేటాయించి ప్రిపేరైతే మంచి మార్కులు సాధించవచ్చు.*
*👉మాదిరి ప్రశ్నపత్రాలను డీఈఈసెట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.*
-Ḳ.ṠḲ08
0 comments:
Post a Comment