LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోండి ఇలా Aadhaar Mobile Number Update step by step

Posted by PAATASHAALANEWS on Saturday, 1 August 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
 Aadhaar Mobile Number Update step by step Process

ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోండి ఇలా

▪️ఆధార్ అప్‌డేషన్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ పాత ఫోన్ నెంబర్‌తో పాటు కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వాలి.


Aadhaar Mobile Number Update Process ▪️ఆధార్ అప్‌డేషన్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ పాత ఫోన్ నెంబర్‌తో పాటు కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వాలి.

ఆధార్ కార్డ్... భారతదేశంలో అందరికీ ఉపయోగపడే ఐడెంటిటీ కార్డ్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఈ కార్డుతో ఉపయోగాలెన్నో. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోవడమే కాదు... ప్రభుత్వం అందించే పథకాలు పొందేందుకు కూడా ఈ కార్డు ముఖ్యమైపోయింది.

▪️ఇప్పటి వరకు 66 కోట్ల మంది మాత్రమే తమ మొబైల్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో అప్‌డేట్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి.

▪️ అయితే కొత్త నెంబర్ తీసుకున్న తర్వాత... ఆధార్ కార్డులో కూడా ఆ నెంబర్ అప్‌డేట్ చేయకపోవడం వల్ల ఇబ్బందులొస్తాయి.

▪️ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఆన్‌లైన్ సర్వీసుల్ని ఆధార్ ఓటీపీ ద్వారా పొందొచ్చు.

.

ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఎలా మార్చుకోవాలి?

▪️మరి మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి

▪️ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చడానికి తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్ అప్‌డేషన్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

▪️ మీ పాత ఫోన్ నెంబర్‌తో పాటు కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఫామ్ ఇచ్చిన తర్వాత మీకు అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్‌తో అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ వస్తుంది

. మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ అయిన తర్వాత ఓటీపీలన్నీ కొత్త నెంబర్‌కే వస్తాయి.

▪️మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ అయిందో లేదో UIDAI వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. uidai.gov.in ఓపెన్ చేసి ‘Aadhaar Services’ కేటగిరీలో ‘Verify Email/Mobile Number’ పైన క్లిక్ చేయాలి.

▪️పర్సనల్ డీటైల్స్ సెక్షన్‌లో మీ పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ‘Get OTP’ క్లిక్ చేస్తే కొత్త నెంబర్‌కు ఓటీపీ వచ్చినట్టైతే మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ అయినట్టే....
Aadhaar Mobile Number Update Process step by step
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 01, 2020

0 comments:

Post a Comment