LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

CPS ఉద్యోగి పదవీ విరమణ పొందేరోజు ఎంత చెల్లిస్తారు? పెన్షన్ ఎలా చెల్లిస్తారు? ఏఎ రకమైన పెన్షన్ చెల్లిస్తారు

Posted by PAATASHAALANEWS on Thursday, 16 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
CPS ఉద్యోగి పదవీ విరమణ పొందేరోజు ఎంత చెల్లిస్తారు? పెన్షన్ ఎలా చెల్లిస్తారు? ఏఎ రకమైన పెన్షన్ చెల్లిస్తారు?

👉 సమాధానం:-GOMS. No.. 62 తేది 07.03.2014 ప్రకారం ఖాతాదారుడు స్వచ్చంద పదవీ విరమణ, పదవీ విరమణ, అకాల మరణం మూడు సందర్భాలలో ఖాతా నుండి డబ్బును తిరిగి పొందగలరు.

1).స్వచ్చంద పదవీ విరమణ సందర్భంలో : ఉద్యోగి స్వచ్చంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతా లో ఉన్న మొత్తంలో నుండి 80% ను నెలవారీ పెన్షన్ గా ఇవ్వడానికి Annuity Service Providers లో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అంద చేస్తారు. 20% నిధిని చెల్లిస్తారు. మొత్తం నిది 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

2).సాదారణ పదవీ విరమణ సందర్భంలో : ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తంలో నుండి 40% ను నెలవారీ పెన్షన్ గా ఇవ్వడానికి Annuity Service Providers లో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అంద చేస్తారు. 60% నిధిని చెల్లిస్తారు. మొత్తం నిది 2 లక్షల లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

3).అకాల మరణం పొందిన సందర్భంలో : ఉద్యోగి ఖాతా లో ఉన్న మొత్తం (100%) ను నామినికి(లకు) చెల్లిస్తారు.

నిర్ణిత శాతంలలో చేతికి ఇచ్చే సొమ్ముకు ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు లేకపోవడం ఇబ్బందికరం.

PFRDA సర్కులర్

PFRDA/2015/27/EXIT/2 తేది 12. 11.2015 ప్రకారం తేది 01.04.2016 నుండి CPS అమౌంట్ ని విత్ డ్రా చేయడం కోసం అప్లై చేయడం కేవలం (except death cases) ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి.
ప్రస్తుతానికి నెలవారిగా పెన్షన్ చెల్లించడానికి 5 Annuity Service Providers గా నియామాకం చేశారు అవి.
1) Life Insurance Corporation of India 2).HDFC Life Insurance Co. Ltd
3). ICICI Prudential Life Insurance Co. Ltd
4).SBI Life Insurance Co Ltd
5).Star Union Dai-ichi Life Ins. Co. Ltd
డిఫాల్ట్ Annuity ప్రొవైడర్ గా SBI ని తీసుంటున్నారు.
పెన్షన్ చెల్లించడానికి నియామకం చేసిన ఐదు అన్యుటి సర్వీస్ ప్రొవైడర్స్ లో ప్రభుత్వ రంగ సంస్థలయిన SBI మరియు LIC లను పరిశీలనకు తీసుకొనగా SBI వారు 15 రకాల పెన్షన్ లను LIC వారు 10 రకాల పెన్షన్ లను వివిధ వయసుల వారిగా అందిస్తున్నారు, మనం పెట్టే పెట్టుబడికి 1లక్ష రూపాయలకు నెలవారిగా ఆయా వయసువారికి పెన్షన్ గా చెల్లించే మొత్తము తేది 03.03.2016 నాటి విలువలు క్రింది టేబుల్ లో ఉన్నాయి.

🌷సందేహం:- CPS ఉద్యోగి పదవీ విరమణ/ అకాల మరణం చెందిన సందర్బం లో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ?

👉 సమాధానం:-పైన చెప్పిన టేబుల్ లో ఎంచుకున్న పెన్షన్ చెల్లిస్తారు, సాదారణ పదవీ విరమణ అయిన సంధర్బంలో 60% CPS నిధిని, స్వచ్చంద పదవీ విరమణ అయిన సందర్బంలో 20% CPS నిధిని చెల్లిస్తారు. గ్రాట్యూటి ని ప్రస్తుతం చేల్లించడం లేదు, గ్రాట్యూటి అనేది ఉద్యోగులకు వాళ్ళు చేసిన సేవలకు భాహుమానంగా ఇచ్చేది దీనిని ప్రైవేట్ సెక్టార్ లో కూడా చెల్లిస్తున్నారు కాని CPS ఉద్యోగులకు గ్రాట్యూటి సదుపాయం లేకపోవడం గర్హనీయం. ఉద్యోగి అకాల మరణం చెందిన సందర్భంలో వారి ఖాతా లో జమ అయిన మొత్తం నిధిని చెల్లిస్తారు.

👉 కాని కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన పామిలీ పెన్షన్ చెల్లించడం లేదు. మిగితా బెనిఫిట్స్ పాత పెన్షన్ విధానం లో లాగే ఖాతా లో జమ ఉన్న EL/HPL ఎన్ క్యాష్ మెంట్, GIS కింద జమచేసిన అమౌంట్ కాని ఆకాల మరణం పొందిన సందర్భంలో GIS కింద జమచేసిన అమౌంట్ తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ అమౌంట్ ను APGLI అమౌంట్ ను మొ|| వాటిని చెల్లిస్తారు.

సీపీఎస్ గురించి వివరణ

👉 ఉద్యోగ విరమణానతరం ప్రతినెల ఉద్యోగికి/ తనపైన ఆదారపడిన వారికి చెల్లించే జీవన భృతికి అప్పటివరకు ఉన్న విధానం లో కాకుండా అప్పటి NDA ప్రభుత్వం వారు 2001-02 బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు ఉద్యోగ విరమణానంతరం ఇచ్చే పెన్షన్లో మార్పు చేయడానికి బి.కె భట్టాచార్య నేతృత్వంలో హైపవర్ కమిటిని ఏర్పాటు చేసి, వారి ప్రతిపాధనలను తేది 23.08.2003 రోజున ఆమోదించి తేది 01.01.2004 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. అప్పటి వరకు ఉద్యోగి వాటా ఏమి చేల్లించకుండా పొందే పెన్షన్ కి బదులు ఉద్యోగి వాటాగా బేసిక్ పే మరియు డి.ఎ ల మొత్తం పై 10% నిధిని జమ చేస్తే అంతే మొత్తంలో ప్రభుత్వ వాటా చెల్లించేలా నూతన విదానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పెన్షన్ నిదిని National Pension System (NPS) Trust వారు National Securities Depository Limited (NSDL) ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టి తదుపరి పదవీ విరమణ సమయంలో సర్వీస్ మొత్తం లో ఉద్యోగి మరియు ప్రభుత్వ వాటా మొత్తం నిధిలో నిర్ణిత శాతంలో Anuity ప్లాన్ లలో పెట్టి నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు. దీనికోసం Pension Fund Regulatory and Development Authority (PFRDA) ను ఏర్పాటు చేసారు. ఈ నూతన పెన్షన్ విదానాన్ని మిగితా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి ఆర్ధిక పరిస్థితిని భట్టి అమలు చేయొచ్చు అని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగానే తమిళనాడు మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ఠ్రాలు నూతన పెన్షన్ అమలు చేస్తుండగా, కేవలం పచ్చిమ బెంగాల్ మరియు త్రిపురా రెండు రాష్ఠ్రాలు మాత్రమే పాత పెన్షన్ ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ. చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ సంస్కరణ (Pension Reform) లో భాగంగా అప్పటివరకు పెన్షనర్ లకు చేల్లించే ఖరువు భృతిని (Dearness Relief) 2001 నుండి నిలుపుదల చేసినాడు. కి.శే. రాజశేకర్ రెడ్డి గారు 2004 సాధారణ ఎన్నికలలో హామీ ఇచ్చి ఆరు విడుతల ఖరువు భృతిని విడుదల చేసి పెన్షన్ తో డి.ఆర్ చెల్లించే విదానం కొనసాగించారు. ఒకవేళ 6 నెలలకు ఒకసారి పెంచే ఖరువు భృతిని చెల్లించడము నిలిపివేసి, ప్రతి 5సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ రివైస్ చేయడం ఆపేస్తే పాత పెన్షన్ పరిస్థితి కొత్త పెన్షన్ కంటే అద్వాన్నంగా ఉండేది.

👉 మిగతా అన్ని రాష్ఠ్రాలు వేరు వేరు తేదిలలో నుండి ఈవిదానాన్ని అమలుచేస్తూ National Pension System (NPS) Trust లో చేరి తమ రాష్ట్ర ఉద్యోగుల పెన్షన్ నిదిని NSDL ద్వారా షేర్ మార్కేట్ లో పెడుతున్నారు. కాని తమిళనాడు రాష్ఠ్రం CPS ముందునుండి అమలు చేస్తున్నా వారి నూతన పెన్షన్ నిదిని NPS Trust లో చేరని కారణంగా వారి వద్దే ఉన్నాయి. తమిళనాడు రాష్ఠ్ర ఉద్యోగ సంఘాల నిరసనల మేరకు పాత పెన్షన్ కొనసాగించడానికి ఉన్న సాద్యాలను పరిశీలించడానికి ఆరాష్ఠ్ర ప్రభుత్వం హైపవర్ కమిటి ని ఏర్పాటు చేసారు. త్వరలో వారికి పాత పెన్షన్ పునరుద్దరిస్తారని ఆశిస్తూ... అది ఇతర రాష్ఠ్రాల వారికి మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ నూతన పెన్షన్ విధానాన్ని అప్పటి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ 653, 654, 655 తేది 22.09.2004 ప్రకారం తేది 01.09.2004 నుండి ఉద్యోగంలో చేరిన వారికి కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం (CPS) ని అమలు చేస్తూ, GPF సదుపాయాన్ని తీసివేసారు, బేసిక్ పే మరియు డి.ఎ ల మొత్తం పై 10% ఉద్యోగివాటాగా అంతే మొత్తంలో ప్రభుత్వ వాటాను కలిపి సి.పి.యస్ ఖాతాకు పెన్షన్ నిదిగా జమచేస్తుంది.

👉 ఖాతా నిర్వహణకు దాదాపు 2009 వరకు ట్రెజరీ ఐడి పై కట్ చేశారు తదుపరి CPS ఖాతా నిర్వహణ కు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA), నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) రూపొందించిన పెర్మనెంట్ రిటైర్మెంట్ ఎకౌంటు (PRAN) ను దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఖాతా నెంబర్ గా జారి చేస్తారు. CPS నిధిని SBI పెన్షన్ ఫండ్ స్కీం నందు 34%, LIC పెన్షన్ ఫండ్ స్కీం నందు 34% మరియు UTI పెన్షన్ ఫండ్ స్కీం నందు 32% గా పెట్టుబడి పెడుతున్నారు. దాదాపు 2010 సంవత్సరం వరకు జీతంలో కట్ అయిన అమౌంట్ కు మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పటివరకు వారి వారి ఖాతాలలో జమ కాలేదు. జి.ఓ 226 తేది 29.09.2011 ప్రకారం 01.04.2009 నుండి 31.03.2011 వరకు మరియు జి.ఓ 142 తేది 17.06.2013 ప్రకారం 01.04.2011 నుండి సి.పి.యస్ లబ్ధిదారుడి వాటా మరియు ప్రభుత్వ వాటా రెండింటి మొత్తాన్ని ఖాతాలో జమ చేసేంత వరకు జరిగిన ఆలస్యానికి సంవత్సరానికి 8% చొప్పున వడ్డి ఖాతాదారుడి ఖాతాలో జమచేయాలి.


 పాత పెన్షన్ ఉద్యోగిపదవీ విరమణ/ అకాల మరణం చెందిన సందర్బంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ?
https://patashalanews.blogspot.com/2020/07/gptcps.html
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 16, 2020

0 comments:

Post a Comment