కంటి చూపు మెరుగుపరిచే ఆహారాలు
Foods for eye health and eyesight
వయసు పైబడడం లేదా కొన్ని ఆనారోగ్యపరిస్థితుల కారణంగా కంటి చూపు క్షీణిస్తుంది. అయినప్పటికీ, అద్దాల అవసరం లేకుండా ఒకవ్యక్తి వారి దృష్టిని రక్షించుకోవడానికి మరియుమెరుగుపరచడానికి అనేక సహజ మార్గాలుఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు మరియువిటమిన్-ఎ అధికంగా ఉండే సమతుల్యమరియుఆరోగ్యకరమైన ఆహారం తినండి. తగినంత నిద్ర పొందండి. సమతుల్య ఆహారాన్నితీసుకోవడం మికళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలోచాలా కీలకం, మరియు కంటి పరిస్థితులనుమెరుగు పరచి ప్రమాదాన్ని తగ్గించడంలోసహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు అనిపిలువబడే విటమిన్లు, పోషకాలు మరియుఖనిజాలను కలిగి ఉన్న ఆహారాన్ని మీరుచేర్చుకుంటే తీవ్రమైన కంటి సమస్యలనుకొంతవరకు నివారించవచ్చు.
కంటిచూపుని పెంచే ఆహార పదార్థాలు
1.ఆకు కూరలలో ఉండే లూటిన్, సెల్ డ్యామేజ్ మరియు మస్కులార్ డిజనరేషన్, కాటరాక్ట్స్రాకుండా ఆపవచ్చు.
2.క్యారెట్స్ లోని విటమిన్-ఎ, సి, లూటెన్, జియాక్సిథిన్ కాటరాక్ట్, మస్కులర్ డిజనరేషన్, రేచీకటి మొదలగు కళ్ళ వ్యాధులు రాకుండారక్షణగా ఉంటుంది.
3.చేపల్లో డి.హెచ్.ఎ అనే ఒమేగా 3ఫ్యాటీయాసిడ్స్ ఉండటం వలన సెల్ డ్యామేజ్లేకుండా చూసి మాక్యూలర్ డిజనరేషన్జరగకుండా సహాయపడుతుంది.
4.పాలు మరియు పాల ఉత్పత్తులలో విటమిన్-ఏ, జింక్ ఖనిజం ఉంటాయి.విటమిన్ ఎకార్నియాను రక్షిస్తుంది,జింక్ రాత్రి సమయంలోదృష్టిని మెరుగుపరచడంతో పాటు కంటిశుక్లంనివారణకు కూడా సహాయపడుతుంది.
5.గుడ్లులో ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్, డిహెచ్ ఎ, ల్యూటిన్ మరియు జియాక్సిథిన్ కళ్ళకి చాలామంచివి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇవి తినేముందు డాక్టర్ ని అడగటం మంచిది. 6.నట్స్ లోఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్-ఇ అధికంగా ఉంటాయి. ఇవి వాపునుతగ్గించి కంటి ఆరోగ్యాన్ని, కార్డియో వాస్కులర్ఆరోగ్యాన్నీ కాపాడుతాయి.
7.బీన్స్ తో కంటి చూపు మెరుగుపడుతుంది. ఇవి జింక్ మరియు బయోఫ్లేవినోయిడ్ల(bioflavonoids) యొక్క గొప్ప వనరులు,
8.కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీఆహారంలో రాజ్మా గింజలు, పెసలు, అలసందలు, ఉలవలు, పచ్చి బఠానీలు, శనగలు మరియుమొలకలు తగినంత మొత్తంలో ఉండాలి.
9.బీట్ రూట్ మరియు చిలగడదుంప రెండూకంటి వాపును తగ్గించడానికి మరియు టాక్సిన్స్ను బయటకు తొలగించడానికిసహాయపడతాయి.
10.సిట్రస్ పండ్లలో విటమిన్ సి పోషకాలుఅధికంగా ఉండి కంటి కండరాలను డీజనరేషన్ఆపేందుకు సహాయం చేస్తుంది.
11.గుమ్మడికాయలో జియాథిన్ అధికశాతంలోఉండటం వల్ల ఇది ఆప్టికల్ ఆరోగ్యానికి చాలాఆరోగ్యకరం.
12.వెల్లుల్లి, ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్గ్లూటథియొనో ఉత్పత్తి చేసే యాంటిఆక్సిండెంట్స్కంటి చూపుకు చాలా ఉపయోగకరం.
13.ద్రాక్షలో ఆంథోసైనిన్ అధికంగా ఉండి, రాత్రిల్లోకంటి చూపును స్టాంగ్ గా ఉండేలా చేస్తుంది.
14.బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్, బీటా-కార్టోయిన్ ఆరోగ్యకరమైన కళ్ళు మరియు దృష్టికిసహాయపడుతుంది.
15.వ్యాయామాలు కంటి కణాలనుపునర్నిర్మించడానికి మరియు అరిగిపోకుండాఉండడానికి సహాయపడతాయి తద్వారా కళ్ళయొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.
16.సన్ గ్లాసెస్ కేవలం ఫ్యాషన్ అనుబంధంకాదు, అవి అతినీలలోహిత (యువి) కాంతినుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.
17.బెర్రీస్ లో ఉన్న ఫ్లెవనాయిడ్స్, నేచురల్యాంటీయాక్సిండెస్ కళ్ళును సురక్షితంగాఉంచేందుకు ఉపయోగపడుతాయి.
0 comments:
Post a Comment