LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

టెన్త్‌‌ తర్వాత కెరీర్ కు దారులెన్నో

Posted by PAATASHAALANEWS on Saturday, 11 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

🔥టెన్త్‌‌ తర్వాత కెరీర్ కు దారులెన్నో…🔥



🖊️ఉన్నత చదువులు, ఉద్యోగాలకు కనీస అర్హత పదోతరగతి. ఈ దశలో తీసుకునే నిర్ణయం మీ కెరీర్ ను నిర్ణయిస్తుంది. పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులకు వినూత్న కోర్సులు, కెరీర్స్ అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఏ కోర్సు చదవాలి? ఏ ఉద్యోగం చేయాలి? ఏం చదివితే ఏ ఉద్యోగం లభిస్తుంది? పదితోనే ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ఎలా? అనే సందేహాలున్నాయా? అయితే ఈ కోర్సులు, కెరీర్‍ వివరాలు  మీకోసమే…

📚టెన్త్  పూర్తయిన  స్టూడెంట్స్ ముఖ్యంగా కోర్సులు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాలు అనే మూడు అంశాల గురించి ఆలోచించాలి. వాటిలో ఇంటర్‍ ఐటీఐ వంటి రెగ్యులర్‍ కోర్సులతో పాటు హోటల్‍ మేనేజ్‍మెంట్‍, పారామెడికల్‍, పైలట్, సర్టిఫికెట్‍, షార్ట్‌‌టర్మ్, స్కిల్‍ డెవలప్‍మెంట్‍ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్, ఆర్‍జేసీ వంటి ప్రవేశ పరీక్షలతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకోవాలి.

👉వొకేషనల్‍ కోర్సులు

📚పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు రాష్ర్టంలో ఇంటర్మీడియట్‍ బోర్డు అందించే దాదాపు 31 రకాల రెగ్యులర్‍, 58 రకాల స్వల్పకాలిక వొకేషనల్ కోర్సులు చేయవచ్చు. వీటిలో అకౌంటింగ్–ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్‌‌షిప్, బేసిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మార్కెటింగ్ సేల్స్‌‌మన్‌‌షిప్, ఎక్స్‌‌పోర్ట్– ఇంపోర్ట్ ప్రాక్టీసెస్–డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్, ఆఫీస్ మేనేజ్‌‌మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్‌‌మెంట్, బ్యాంకింగ్, పర్చేజింగ్ – స్టోర్ కీపింగ్‍ వంటి బిజినెస్ అండ్‍ కామర్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్‌‌ అండ్‍ పారామెడికల్‍ కోర్సులు, రూరల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్–సర్వీసింగ్​, గార్మెంట్ మేకింగ్, కమర్షియల్ గార్మెంట్ డిజైన్ అండ్ మేకింగ్, ప్రీ స్కూల్ మేనేజ్‌‌మెంట్, హెల్త్ కేర్, బ్యూటీకల్చర్, కేటరింగ్, రెస్టారెంట్ మేనేజ్‌‌మెంట్, ఇనిస్టిట్యూషనల్ హౌస్ కీపింగ్ వంటి హోమ్ సైన్స్ కోర్సులతో పాటు, ఫిషరీస్, హార్టికల్చర్, సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ, డైరీయింగ్, సెరికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, సాయిల్ సైన్స్, ప్లాంట్ ప్రొటెక్షన్, వాటర్ షెడ్ మేనేజ్‌‌మెంట్, సాయిల్ కన్సర్వేషన్ వంటి అగ్రికల్చర్‍ కోర్సులు మరియు కమర్షియల్ ఆర్ట్, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, టూరిజం ట్రావెల్ టెక్నిక్స్ వంటి హ్యూమానిటీస్‍ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  వివరాలకు www.bieap.gov.in వెబ్‍సైట్‍ చూడవచ్చు.

👉ఇతర కోర్సులు హోట‌‌ల్ మేనేజ్‌‌మెంట్‌‌

📚కార్పొరేట్ లైఫ్ స్టైల్, సంపాదన శక్తి పెరగడం వల్ల డబ్బుని ఖర్చు చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. దీంతో  దేశ వ్యాప్తంగా  ఆతిథ్య, ప‌‌ర్యాట‌‌క రంగాల్లో విప‌‌రీత‌‌మైన పెట్టుబ‌‌డులు వ‌‌స్తున్న త‌‌రుణంలో ఈ కోర్సులు చేసినవారికి అనేక అవ‌‌కాశాలు ఉన్నాయి.  ఏడాది  నుంచి మూడేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏడాది కోర్సుల‌‌కు సంబంధించి ఫుడ్ అండ్ బెవ‌‌రేజ్‌‌, బేక‌‌రీ, హౌస్ కీపింగ్‌‌, మూడేళ్ల కోర్సుల‌‌కు సంబంధించి కేట‌‌రింగ్ అండ్ హోట‌‌ల్ అడ్మినిస్ట్రే‌‌ష‌‌న్‌‌ వంటి డిమాండెడ్ కోర్సుల్లో ప్రవేశం పొంది రెండు పదుల వయసు నిండకముందే ఉన్నతస్థాయి కెరీర్‍ సొంతం చేసుకోవచ్చు.

👉పారామెడిక‌‌ల్‌‌

📚మెడికల్ రంగానికి సంబంధించిన కోర్సుల్లో ఆసక్తి ఉన్న వారు పారామెడిక‌‌ల్ రంగంలో ప‌‌లు డిప్లొమా కోర్సులు చేయొచ్చు. వీటిలో  మెడిక‌‌ల్ ల్యాబ్ టెక్నాల‌‌జీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌‌, ఆప్టోమెట్రి టెక్నిషియ‌‌న్‌‌, యాక్సిలరీ నర్స్ మిడ్‌‌వైఫ్(ఏఎన్‌‌ఎం) త‌‌దిత‌‌ర కోర్సుల‌‌ను అభ్యసించ‌‌వ‌‌చ్చు. ప్రముఖ కార్పొరేట్ సంస్థలు హాస్పిటల్ రంగంలోకి రావడం వల్ల ఈ కోర్సులు చేసిన వారికి విప‌‌రీత‌‌మైన డిమాండ్ ఉంది. పారామెడికల్  డిప్లొమా పూర్తయిన త‌‌ర్వాత ఉన్నత చ‌‌దువుల‌‌కు కూడా వెళ్ళవ‌‌చ్చు. ఇవి సాధారణంగా ఇంటర్‍ వొకేషనల్ గ్రూపుల్లో వస్తాయి.

👉స్టూడెంట్ పైలట్ లెసైన్స్

📚పైలట్‍ కెరీర్లో మొదటిది స్టూడెంట్‍ పైలట్‍ లైసెన్స్ దశ. ఈ దశలో విమానయానానికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం, ఎయిర్‌‌క్రాఫ్ట్, ఇంజిన్స్, ఏరోడైనమిక్స్ వంటి సబ్జెక్టుల థియరీని బోధిస్తారు. ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. స్టూడెంట్ పైలట్ లెసైన్స్ కోర్సులో చేరాలంటే కనీసం పదోతరగతి పాసవ్వాలి. 16 ఏళ్లకు తక్కువ ఉండరాదు. డీజీసీఏ నిర్వహించే రెండు  పరీక్షల్లో పాసయితేనే కోర్సు ఉత్తీర్ణులయినట్లు. ఈ లైసెన్స్ పొందిన వారు విద్యార్థిగా విమానాలు నడపడానికి అర్హులవుతారు.

👉స‌‌ర్టిఫికెట్/షార్ట్ టెర్మ్

📚ఎస్‍బీటీఈటీ, ఎన్‌‌ఎస్ఐసీ, ఎంఎస్ఎంఈ, ఈజీఎంఎం వంటి సంస్థలు పలు సర్టిఫికెట్, షార్ట్ టెర్మ్ కోర్సులను అందిస్తున్నాయి. వీటి ద్వారా ఉద్యోగం, స్వయం ఉపాధిని త్వరగా పొందే అవకాశం ఉంటుంది. డీటీపీతో పాటు 2డి, 3డి గ్రాఫిక్స్, ఆఫీస్‍ ఆటోమేషన్, షార్ట్‌‌హ్యాండ్‍, టైప్‍ రైటింగ్‍, క్యాడ్‍/క్యామ్‍, వెబ్‍ డిజైనింగ్‍, యోగా, ఫుడ్‍ ప్రొడక్షన్, కన్‍స్ర్టక్షన్‍ సేఫ్టీ, ఫైర్‍ సేఫ్టీ, ఫ్యాషన్‍ డిజైన్‍, గార్మెంట్‍ టెక్నాలజీ, ఇంటీరియర్‍ డిజైన్‍, ఇండస్ర్టియల్‍ సేఫ్టీ, మల్టి మీడియా వంటి సర్టిఫికెట్, షార్ట్ టర్మ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా స్వయం ఉపాధి తో పాటు కాంట్రాక్ట్, ప్రైవేటు ఉద్యోగాలు పొందవచ్చు. ఈ శిక్షణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ఉచితంగా అందిస్తున్నాయి.

👉రైల్వే

📚ట్రాక్‍మన్‍, గేట్‍మన్‍, పాయింట్స్‌‌మన్‍, అసిస్టెంట్‍ పాయింట్స్‌‌మన్‍, హాస్పిటల్‍ అటెండెంట్‍, స్వీపర్‍, హెల్పర్స్, పోర్టర్స్, సఫాయివాలా  వంటి గ్రూప్‍–డి ఉద్యోగాలు రైల్వేలో ఉన్నాయి. దీనికి వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్ష, ఫిజికల్‍ మెజర్‍మెంట్‍ టెస్ట్, మెడికల్‍ టెస్ట్‌‌ల ద్వారా ఎంపిక చేస్తారు. అలాగే రైల్వే ప్రొటెక్షన్‍ ఫోర్స్‌‌లో కానిస్టేబుల్‍ పోస్టులుంటాయి. వీటికి కనీస వయసు 18 సంవత్సరాలు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ మెజర్‌‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ) ద్వారా ఎంపిక చేస్తారు. వీటితో పాటు అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, టైపింగ్‍ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

వివరాలకు: www.rrbsecunderabad.nic.in

👉ఎస్‍ఎస్‍సీ

📚పదోతరగతితో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసుల్లో మల్టి టాస్కింగ్‍ స్టాఫ్ (నాన్‍ టెక్నికల్‍) పోస్టులను స్టాఫ్‍ సెలెక్షన్‍ కమీషన్‍ భర్తీ చేస్తుంది. వయసు 25 ఏళ్లు మించకూడదు. దీనిలో రెండు పేపర్లుంటాయి. పేపర్‍–1 లో జనరల్‍ ఇంటెలిజెన్స్ అండ్‍ రీజనింగ్‍ నుంచి 25, న్యూమరికల్‍ ఆప్టిట్యూడ్‍ నుంచి 25, జనరల్ ఇంగ్లిష్‍ నుంచి 50, జనరల్‍ అవేర్‍నెస్‍ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 150 మార్కులుంటాయి. నెగెటివ్‍ మార్కింగ్‍ ఉంటుంది. పేపర్‍–2 లో షార్ట్ ఎస్సే, లెటర్‍ ఇన్‍ ఇంగ్లిష్‍ టాపిక్స్ వంటివి 50 మార్కులకుంటాయి. వివరాలకు వెబ్‌‌సైట్: www.ssc.nic.in

👉పోస్టల్‍

👉పోస్టల్ శాఖలో మెయిల్‌‌గార్డ్, పోస్ట్‌‌మాన్‍ ఉద్యోగాలుంటాయి. ఉన్నచోటనే ఉద్యోగంతో పాటు ప్రారంభంలోనే నెలకు 20 వేలకు పైగా వేతనాలు పొందవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా గ్రామీణ్‌‌ డాక్ సేవక్ (జీడీఎస్)–బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), మెయిల్ డెలివరర్ (ఎండీ), ప్యాకర్ పోస్టులకు పోటీపడవచ్చు.

వివరాలకు: www.indiapost.gov.in

👉బ్యాంక్స్

📚పదో తరగతి అర్హతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బీఐ) ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18–25 ఏళ్ల మధ్య వయసుండాలి. రాతపరీక్ష, లాంగ్వేజ్‍ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వివరాలకు వెబ్‌‌సైట్: www.rbi.org.in

👉పాలిటెక్నిక్

📚పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా ప్రభుత్వం పాలిసెట్ నిర్వహిస్తోంది. ఇందులో మెకానికల్, సివిల్, కంప్యూటర్ ఇంజినీరింగ్, టెక్స్ టైల్ టెక్నాలజీ, ఆటోమోబైల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మూడేళ్ల వ్యవధి గల ఈ కోర్సుల తర్వాత అప్రెంటిస్​షిప్‌‌ పూర్తిచేసిన వారికి బీహెచ్‍ఈఎల్‍ బీఈఎల్‍, ఐవోసీఎల్‍, బీపీసీఎల్‍, హెచ్‍పీసీఎల్‍, సెయిల్‍, గెయిల్‍, ఎన్‍ఎండీసీ, ఎన్‍ఎఫ్‍సీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఆర్‍టీసీ వంటి రాష్ర్ట ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. ఎంసెట్‍ లేదా లేటరల్‌‌ ఎంట్రీ స్కీం ద్వారా ఈసెట్ పరీక్ష రాసి బీఈ/ బీటెక్ కోర్సుల్లో చేరొచ్చు.

👉ఆర్‍జేసీ

📚రాష్ర్ట ప్రభుత్వ గురుకుల జూనియర్‍ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‍ఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశించడానికి రాయాల్సిన పరీక్ష రెసిడెన్షియల్‍ జూనియర్‍ కాలేజ్‍ కామన్‍ ఎంట్రన్స్ టెస్ట్. దీని ద్వారా ప్రవేశం పొందిన వారికి ఉచిత విద్య, వసతి కల్పిస్తారు.

👉డిఫెన్స్

📚పదోతరగతితోనే దేశసేవలో పాల్గొనేందుకు వీలు కల్పించేవి డిఫెన్స్ పరీక్షలు. వీటిలో ఎయిర్‍ఫోర్స్, నేవీ, ఆర్మీ, సీఐఎస్‍ఎఫ్‍, సీఆర్‍పీఎఫ్‍, బీఎస్ఎఫ్‍, ఐటీబీపీ వంటి అనేక విభాగాలున్నాయి.  రక్షణ రంగంలో అన్ని పోస్టులకు సెలెక్షన్ విధానం దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్‍ ఎఫీషియన్సీ టెస్ట్), రాత పరీక్ష, ఆరోగ్య పరీక్ష (మెడికల్‍ టెస్ట్)ల ఆధారంగా ఉంటుంది.  ఎయిర్‍ఫోర్స్‌‌లో ఎయిర్‌‌మెన్ గ్రూప్–వై మ్యుజీషియన్ ట్రేడ్, నేవీలో మెట్రిక్ రిక్రూట్ – స్టివార్డ్/కుక్స్, మ్యుజీషియన్‍ పోస్టులుంటాయి.  పారామిలిటరీ బలగాలైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌‌పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌‌ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్), సశస్ర్త సీమాబల్‍ (ఎస్‍ఎస్‍బీ)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ, ఇండో టిబెటన్ బోర్డర్‍ ఫోర్స్‌‌లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), కానిస్టేబుల్ (లైన్‌‌మెన్),  ఐటీబీపీలో హెడ్‌‌కానిస్టేబుల్ (రేడియో టెక్నీషియన్), కానిస్టేబుల్ (మోటార్ ట్రాన్స్‌‌పోర్ట్),  మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) లో  లోయర్‍ డివిజన్‍ క్లర్క్, స్టెనో గ్రేడ్–3 అనే గ్రూప్‍‌‌–సి పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు 18–27 ఏళ్ల వయసుండాలి. వీటికి ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరి. ఎల్‌‌డీసీ పోస్టులకు నిమిషానికి 30 ఇంగ్లిష్, 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. స్టెనో గ్రేడ్–3 పోస్టులకు స్టెనోగ్రఫీ/షార్ట్‌‌హ్యాండ్‌‌లో నిమిషానికి 80 ఇంగ్లిష్/హిందీ పదాలు రాయాలి
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 11, 2020

0 comments:

Post a Comment