The nutritional benefits of cooked eggs
గుడ్డు
ఈ ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉన్నాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. గుడ్డు ఖనిజాల గని. శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే గుడ్డులో 44 ధాతువులు ఉన్నాయి. గుడ్డులో మరీ ముఖ్యంగా పచ్చసొనలో 12 ఖనిజాలు మరియు 8 లవణాలు ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలెస్ర్టాల్ అన్ని రకములైన జీవక్రియకు ఉపయోగపడుతుంది.
గుడ్డులో ఏమేమి ఉంటాయి..?
ఒక గుడ్డు సుమారుగా 50 గ్రాములనుకుంటే, దానిలో 90% నీరు, 10% పొషకపదార్ధాలు ఉంటాయి. ఒక గుడ్డు నుంచి 7 గ్రాముల ప్రోటీన్లు, 6.5 గ్రాముల కొవ్వులు 1 మిల్లీ గ్రాము ఇనుము, 35 గ్రాముల ఫోలిక్ యాసిడ్, 0.9 మైక్రో గ్రాముల బి 12, 210 మైక్రో గ్రాముల బీటా కేరోటిన్, 5 మైక్రో గ్రాముల విటమిన్ D, 30 మిల్లీ గ్రాముల కాల్షియం, 0.4 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటాయి. పచ్చి గుడ్డులో 51% ప్రోటీన్లు, వండిన గుడ్డులో 91% ప్రోటీన్లు ఉంటాయి.
గుడ్డులో తెల్లసొన, పచ్చసొన అని రెండు భాగాలు ఉంటాయి. తెల్లసొనలో ఒవ ఆల్బూమిన్, కొన్ ఆల్బుమిన్, ఒవ మ్యుకాయిడ్, ఒన మ్యూసిన్, లైసోజైం, ఎవిడిన్, ఒవ గ్లొబ్యూలిన్, ఒవ ఇనిహిబీటర్ అనే 8 మాంసకృత్తులు ఉంటాయి. పచ్చసొనలో లిపో విటిలిన్స్, పోజ్ విటిన్, లివిటిన్ తక్కువ డెన్సిటి కలిగిన లిపో ప్రోటీన్లు అనే నాలుగు మాంసకృత్తులు ఉన్నాయి.
ఫారంలో పెరిగే కోడి గుడ్డులో కంటే బయట తిరిగే కోడిగుడ్డులోనే పోషకపదార్ధాలు ఎక్కువ ఉంటాయి. కోడి గుడ్డు తో పోలిస్తే బయట తిరిగే కోడిగుడ్డులో ..
>1/3 వంతు తక్కువ కోలెస్ర్టాల్
>1/4 వంతు తక్కువ సంతృప్తి కొవ్వులు
>2/3 వంతు ఎక్కువ విటమిన్ A
>2 వంతు ఎక్కువ ఉమేగా -3
>3 వంతు ఎక్కువ ఇ విటమిన్ ఉంటాయి.
గుడ్డు తినడం వలన కలిగే ఉపయోగాలు
>మెదడుకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు గుడ్డులో ఉన్నాయి.
>గుడ్డు పచ్చసొనలో 300 మైక్రోగ్రాములు ఖోలిన్ అనే పోషకపదార్థం ఉంటుంది.
>గుడ్డులో ఉన్న ఇనుమును మన శరీరం సులభంగా గ్రహిస్తుంది.
>గుడ్డుని తినడం వలన కండరాలు దృఢంగా అవుతాయి. ఇది క్రీడాకారులుకు మంచి ఆహారం.
>గుడ్డులో ఉన్న రైబోఫ్లేవిన్ చర్మం ఆరోగ్యానికి, సరిగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది .
>ల్యూటిన్, అనే రంగు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి . కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
>గుడ్డులో బి 12 (సయానోకోబాలిమిన్) అనే విటమిన్ ఉంటుంది. ఇది ఎర్రరక్త కణాలు వృద్ధి చెందడానికి, నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది .
>గర్భవతులకు గుడ్డు చాలా ఆరోగ్యకరం. గుడ్డులో ఉండే ఫోలిక్ యాసిడ్, ఇనుము పుట్టబొయే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది .
>గుడ్డును ఆహారంగా తీసుకోవడం వలన మానసిక ఆందోళనను, గుం డె వ్యాధులను, కాలేయంలో కొవ్వు ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే కాలేయ పనితీరును పెంచుతుంది .
>వెంట్రుకలు, గోళ్ళు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడే బయోటిన్ గుడ్డులో లభిస్తుంది.
>అలాగే రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తుంది.
>కొవ్వులో కరిగే A,D,E,K అనే విటమిన్లు, నీటిలో కరిగే ‘బి’ కాంప్లెక్స్ విటమిన్లు గుడ్డు యొక్క పచ్చసొనలో ఎక్కువుగా ఉంటాయి.
0 comments:
Post a Comment