కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రొవిజినల్ పెన్షన్
దిల్లీ: *🌍కరోనా సమయంలో పదవీ విరమణ చేసిన కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కొంత కాలంపాటు ‘ప్రొవిజినల్ పెన్షన్’, ‘ప్రొవిజినల్ గ్రాట్యుటీ ఇవ్వనున్నారు. వారికిపెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) అందేవరకు ఇదే విధానం కొనసాగనుంది. లాక్‌డౌన్ కారణంగా అన్ని రకాల పత్రాలను కేంద్ర కార్యాలయాలకు పంపడం ఉద్యోగులకు కష్టంగా మారిందని అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సిబ్బంది, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్ర కార్యాలయాలు ఒకచోట, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు ఒకచోట ఉండడంతో పత్రాలు పంపడంలో కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బందికి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. ఈ కారణంగా పీపీఓల రూపకల్పనలో కొంత ఆలస్యం జరుగుతుందని తెలిపారు. తొలుత ఆరు నెలల వరకు ప్రొవిజినల్ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అవసరమైతే అనుకోని సందర్భాల్లో దానికి ఏడాది వరకు పెంచే వీలు కూడా ఉంది. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన వారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు.
0 comments:
Post a Comment