AP పాలిసెట్ ప్రవేశ పరీక్ష ధరఖాస్తుకు గడువు పొడిగింపు
అవనిగడ్డ,: పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశాలు కొరకు నిర్వహించే పాలిసెట్ 2020 ప్రవేశ పరీక్ష దరఖాస్తు స్వీకరణ గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నాగేశ్వర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి విద్యార్థులందరూ తమ ఎస్ఎస్సి హాల్ టిక్కెట్ నెంబరు మరియు పుట్టిన తేదీ తో దగ్గరలోని మీ- సేవా, ఈ సేవా కేంద్రాలు ద్వారా రూ.400 రుసుము ఈ నెల 27వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పాలిసెట్ అర్హత కలిగిన వారు మాత్రమే ప్రభుత్వ పథకాలైన జగనన్న వసతి దీవెన ద్వారా సంవత్సరానికి రూ.15వేలు, జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.25 వేలు పొందుతారని, వీరికి సంవత్సర ఆదాయం రూ.2.50లక్ష లోపు ఉన్న అన్ని కులాలు వారు ఈ పథకానికి అర్హులని, నగదును విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో చెల్లిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు సంప్రదించాలని తెలిపారు.*
click here and get More information
0 comments:
Post a Comment