*"ర"కీ, "ఱ"కి మధ్య తేడా ఏమిటి..?* తెలుగుభాషాభిమానుల కోసం👇
*అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు..?*
అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేశారు మన ఆధునిక భాషావేత్తలు. ఒకవిధంగా తెలుగుకు పట్టిన దుర్గతి అనుకోవాలి.
అయితే.. ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగుభాషా లక్షణాన్ని నిరూపించేవి. కావ్యభాషలోను,లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగుకవులు,రచయితలు తెలుసుకోవాలిగదా..! మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా..! *అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది.* పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూద్దాం
అరుఁగు = వీధి అరుగు
అరుగు = వెళ్ళు, పోవు
అఱుగు = జీర్ణించు
ఏఁడు = సంవత్సరం
ఏడు = 7 సంఖ్య
కరి = ఏనుగు
కఱి = నల్లని
కాఁపు = కులము
కాపు = కావలి
కాఁచు = వెచ్చచేయు
కాచు = రక్షించు
కారు = ఋతువు, కాలము
కాఱు = కారుట (స్రవించు)
చీఁకు = చప్పరించు
చీకు = నిస్సారము, గ్రుడ్డి
తఱుఁగు = తగ్గుట, క్షయం
తఱుగు=తరగటం
(ఖండించటం)
తరి = తరుచు
తఱి = తఱచు
తీరు = పద్ధతి
తీఱు = నశించు, పూర్తి(తీరింది)
దాఁక = వరకు
దాక = కుండ, పాత్ర
నాఁడు = కాలము
నాడు = దేశము, ప్రాంతము
నెరి = వక్రత
నెఱి = అందమైన
నీరు = పానీయం
నీఱు = బూడిద
పేఁట = నగరములో భాగము
పేట = హారంలో వరుస
పోఁగు - దారము పో( గు
పోగు = కుప్ప
బోటి = స్త్రీ
బోఁటి = వంటి [నీబోఁటి]
వాఁడి = వాఁడిగా గల
వాడి = ఉపయోగించి
వేరు = చెట్టు వేరు
వేఋ = మరొకవిధము
మడుఁగు = వంగు, అడఁగు
మడుగు = కొలను, హ్రదము.
తెలుసుకోవడానికి ప్రయత్నంచేస్తే.... తెలుగుభాషలో చాలానే ఉన్నాయి.🪷🪴
0 comments:
Post a Comment