అజీర్తి, నిద్రలేమి, అధిక బరువు, భావోద్వేగాల నియంత్రణ కోసం...
Do you suffer from problems such as indigestion, insomnia, overweight, lack of emotion ... but you should take soybeans often…Frequent intake of these magnesium magnesium can help you sleep better.
అజీర్తి, నిద్రలేమి, అధిక బరువు, భావోద్వేగాల నియంత్రణ లేకుండా పోవడం... లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా... అయితే మీరు తరచుగా సోయాబీన్స్‌ను soybeans- తీసుకోవాల్సిందే....
- వీటిని తరచుగా తీసుకోవడం వల్ల నిద్రలేమి నుంచి బయటపడవచ్ఛు వీటిల్లో అధికంగా ఉండే మెగ్నీషియం ఎక్కువసేపు హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
- * ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వీటిల్లో ఉండే ఇనుము, కాపర్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఈ కణాలు ఎక్కువగా ఉత్పత్తికావడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.
- వీటిల్లో ఉండే జింక్, సెలీనియం, మెగ్నీషియం, క్యాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఎముకలకు తగిలిన గాయాలను తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.
- * ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడతాయి. వీటిల్లో అధికంగా ఉండే పీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- వీటిల్లో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడుకు చురుకుదనాన్ని అందించి కంటిచూపును మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి.
0 comments:
Post a Comment