వేడి నీరు, నిమ్మరసంతో ఎన్నో ప్రయోజనాలు
- నిమ్మకాయ ఓ అద్భుత ఫలం. వీటిని వంటల్లో ఉపయోగిస్తాం. పచ్చడి చేసుకుని తింటాం. పులిహోరలో నిమ్మరసం కలిపితే కలిగే రుచే వేరు.
- కొంతమంది జుట్టుకి చుండ్రు పోవడానికి నిమ్మరసంతో మసాజ్ చేస్తారు.
- ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. వీటికి మించిన ప్రయోజనాలు నిమ్మరసంతో కలుగుతాయంటే నమ్మాల్సిందే.
- రోజూ ఉదయాన్నే ఓ గ్లాస్ వేడి నీళ్లు తీసుకుని, ఓ నిమ్మకాయను అందులో పూర్తిగా పిండి, ఆ నీటిని తాగాలి. అప్పుడు కలుగుతాయి ఎన్నో ప్రయోజనాలు.
- అంతేకాదు చాలా రోగాలు కూడా మాయమవుతాయి. బాడీకి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అంతెందుకు రోజూ నిమ్మరసం తాగుతూ ఉంటే, ఇక తమ దగ్గరకు రావాల్సిన పని ఉండదని డాక్టర్లే చెబుతున్నారు. వేడి నీటితో నిమ్మరసాన్ని తాగితే పొందే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వును కరిగించేస్తుంది : శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఔషధ గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. దీంతో అధిక బరువు ఉన్నవారు నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది. అంతేకాదు ఇలా తాగడం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. గుండె సంబంధ సమస్యలు కూడా దాదాపు రావు.
షుగర్ వ్యాధికి చెక్ :
డయాబెటిస్ ఉన్నవాళ్లు నిమ్మరసం తాగితే, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.
వ్యర్థాలు పరార్ :మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం, తాగే నీళ్ల వల్ల చాలా మలినాలు మన బాడీలోకి వెళ్తుంటాయి. ఒక్కోసారి విష పదార్థాలు కూడా లోపలికి వెళ్లి తిష్టవేస్తాయి. వాటికి వేడి నిమ్మరసం సరైన పరిష్కారం. ఆ రసం తీసుకుంటే, వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు క్యూ కడతాయి. అంతేకాదు మరిన్ని రోగాలు రావని పరిశోధనల్లో తేలింది.
రోగ నిరోధక శక్తి, ఇన్‌ఫెక్షన్లు రావంతే :
నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉండడం వల్ల చాలా రకాల ఇన్‌ఫెక్షన్లు తేలిగ్గా తగ్గిపోతాయి.కిడ్నీలో రాళ్లకు చెక్ :
వేడి నీటితో నిమ్మరసం తీసుకుంటే, బాడీలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. సిట్రేట్ లెవెల్స్ కూడా మెరుగవుతాయి. ఫలితంగా కిడ్నీలో రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి.
గాల్ బ్లాడర్‌లో రాళ్ల సమస్య :
కిడ్నీలోనే కాదు గాల్ బ్లాడర్‌లో రాళ్లను కూడా తరిమికొడుతుంది నిమ్మరసం. ఫలితంగా కడుపునొప్పి సమస్య తీరుతుంది. ఇందుకోసం రోజూ వేడి నీటి నిమ్మరసం తాగాల్సిందే.
కిడ్నీలోనే కాదు గాల్ బ్లాడర్‌లో రాళ్లను కూడా తరిమికొడుతుంది నిమ్మరసం. ఫలితంగా కడుపునొప్పి సమస్య తీరుతుంది. ఇందుకోసం రోజూ వేడి నీటి నిమ్మరసం తాగాల్సిందే.
జీర్ణాశయ సమస్యలకు పరిష్కారం :
- రోజూ నిమ్మరసాన్ని తాగితే జీర్ణాశయ సమస్యలు రావు. ప్రధానంగా గ్యాస్, ఏసీడీటీ, మలబద్దకం, అజీర్ణం వంటివి మనకు తెలియకుండానే తగ్గిపోతాయి.
- మిలమిలలాడే చర్మం కావాలా :
- యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల నిమ్మరసం మన చర్మానికి మేలు చేస్తుంది. స్కిన్ మెరుస్తుంది. మృదువుగా, కోమలంగా తయారవుతుంది. ముడతలు, మచ్చలు పోతాయి.
- వాపులకు, ఫ్లూ జ్వరం తగ్గిపోవాల్సిందే :
- నొప్పులు, వాపులు ఉన్నవారు నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది బాగా ఉపకరిస్తుంది. ఫ్లూ జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం వేడి నీటి నిమ్మరసం.
- ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, రోజూ ఉదయాన్నే గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి, తాగమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
0 comments:
Post a Comment