కరోనాకు దూరంగా ఇలా!
‘భవిష్యత్తులో కరోనా ముప్పును తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ 15 నియమాలు పాటిస్తామని ఎవరికి వారే వాగ్దానం చేసుకోవాలి..’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేసింది ఆరోగ్య శాఖ. ఆ వాగ్దానాలేంటంటే..?
. కరచాలనం చేయము.. భౌతిక దూరం పాటిస్తూనే పలకరించుకుంటాం.
- . కనీసం ఆరడుగుల సామాజిక దూరం పాటిస్తాం.
- . ఇంట్లో తయారుచేసిన రీయూజబుల్ ఫేస్‌మాస్క్ వాడతాం.
- . కళ్లు, ముక్కు, నోటిని తాకే అలవాటు మానుకుంటాం.
- . శ్వాసకోశ సంబంధిత పరిశుభ్రత పాటిస్తాం. (అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యూ అడ్డుపెట్టుకోవడం, చీదిన తర్వాత టిష్యూను మూత ఉన్న డస్ట్‌బిన్‌లో పడేయడం మొదలైనవి)
- . పదే పదే చేతులు శుభ్రం చేసుకుంటాం.8. పదే పదే తాకే ప్రదేశాలను క్రిమి సంహారక ద్రావణాలతో తరచూ శుభ్రం చేసుకుంటాం.
- . అనవసర ప్రయాణాలు చేయము.
- . గుంపులుగా ఉన్న ప్రదేశానికి వెళ్లము.
- . మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటాం.
- . కరోనా బాధితుల పట్ల వివక్ష చూపము.
- కరోనాకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా విశ్వసనీయమైన వర్గాలు, వెబ్‌సైట్స్ నుంచే తెలుసుకుంటాం. తప్పుడు సమాచారం ప్రచారం చేయము
- పొగాకు, ఖైనీ.. వంటివి నమలము.. జనసంచారం ఉన్న ప్రదేశాల్లో వాటిని ఉమ్మివేయము.
- జలుబు, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఎదురైతే జాతీయ టోల్ ఫ్రీ నంబర్ 1075కి లేదంటే రాష్ట్ర హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేస్తాం.
ఒత్తిడి, ఆందోళనలు ఎదురైతే మానసిక నిపుణుల సహాయం తీసుకుంటాం.
ఇలా ఎవరికి వారే ప్రతిజ్ఞ చేసుకోవడమే కాదు.. మాటిచ్చి తప్పకూడదన్నట్లు ఈ వాగ్దానాలను తు.చ. తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుందాం.. కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉందాం..!
ఇలా ఎవరికి వారే ప్రతిజ్ఞ చేసుకోవడమే కాదు.. మాటిచ్చి తప్పకూడదన్నట్లు ఈ వాగ్దానాలను తు.చ. తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుందాం.. కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉందాం..!
0 comments:
Post a Comment