ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ టిప్స్ పాటించండి
కరోనా వైరస్‌ను రోగ నిరోధక శక్తితో ఎదుర్కోవచ్చు&చికిత్స కన్నా నివారణే మేలు. ఈ మాట అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ విషయంలోనూ అంతే. ఈ వైరస్ బారిన పడకుండా ఉండటమే ఇప్పుడు అందరికీ అవసరం. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అవసరం. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఇమ్యూనిటీ పెంచుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టారు. ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చని సూచిస్తోంది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు, రోగాల నివారణ కోసం ఆయుర్వేదం ఉపయోగపడుతుందని కేంద్ర ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి-AYUSH మంత్రిత్వ శాఖ చెబుతోంది.
దినచర్య అంటే రోజువారీ అలవాట్లు, రుతుచర్య అంటే కాలానుగుణంగా జరిగే మార్పుల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని మెయింటైన్ చేయొచ్చని చెబుతోంది ఆయుష్ మంత్రిత్వ శాఖ.
ఇమ్యూనిటీని పెంచుకోవడంతో పాటు శ్వాసకోశ సమస్యల్ని తగ్గించేందుకు కొన్ని టిప్స్ వెల్లడించింది.
ఇమ్యూనిటీని పెంచుకోవడంతో పాటు శ్వాసకోశ సమస్యల్ని తగ్గించేందుకు కొన్ని టిప్స్ వెల్లడించింది.
- రోజంతా వేడి నీళ్లు తాగుతూనే ఉండాలి.
- వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి.
- రోజూ కనీసం 30 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ చేయాలి.
- వంటలో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఉపయోగించాలి.
- రోజూ ఉదయాన్నే 10 గ్రాముల చవన్‌ప్రాష్ తినాలి.
- రోజూ పసుపుపాలు తాగడం కూడా మంచిది.
- 150 మిల్లీలీటర్ల పాలలో అర చెంచా పసుపు కలిపి రోజూ ఒకటి లేదా రెండు పూటలు తాగాలి. జలుబుగా ఉంటే ముక్కు రంధ్రంలోకి నువ్వుల నూనె, కొబ్బరి నూనె పూయాలి.
- రోజూ ఉదయం, సాయంత్రం ఈ ప్రతిమర్శ్ నశ్య క్రియ చేయాలి.
- ఒక చెంచా నువ్వుల నూనె లేదా కొబ్బరినూనెతో ఆయిల్ పుల్లింగ్ థెరపీ రోజూ ఒకట్రెండుసార్లు చేయాలి.
- గొంతు నొప్పిగా ఉన్నా, పొడిబారినా పుదీనా ఆకులు, వామ వాసన చూడాలి.
- లవంగాలు పొడిచేసుకొని చక్కెర, తేనెలో కలిపి రోజూ రెండుమూడుసార్లు తినాలి.
- డయాబెటిక్స్ ఉన్నవాళ్లు షుగర్ ఫ్రీ చవన్‌ప్రాష్ తీసుకోవాలి.
- తులసీ, దాల్చినచెక్క, మిరియాలు, సొంఠి, మునక్కాతో చేసిన హెర్బల్ టీ లేదా డికాక్షన్ రోజూ రెండుసార్లు తాగాలి
- .బెల్లం, నిమ్మరసం కలిపితే టేస్ట్ ఇంకా బాగుంటుంది.
- పొడి దగ్గ, గొంతు మంటగా ఉన్నప్పుడు ఇవి పాటించొచ్చు. ఈ లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.
దేశవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద పండితులు సూచించిన ఈ చిట్కాలను వీలైనంతవరకు పాటించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరుతోంది. పైన వెల్లడించిన చిట్కాలన్నీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికే తప్ప, COVID 19 చికిత్స కోసం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ చెబుతోంది.
0 comments:
Post a Comment