TS POLYCET కౌన్సెలింగ్.. షెడ్యూల్
పాలిటెక్నిక్ డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ కౌన్సెలింగ్‌ను మే 14 నుండి నిర్వహించనున్నారు.
దీనిపై నిర్ణయం తీసుకొనేందుకు మే 10వ తేదీ శుక్రవారం పాలిసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ మీటింగ్‌లో ప్రవేశాల షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
*మే 14 నుంచి మే 16వ తేదీ వరకు విద్యార్థులు ఆన్ లైన్‌లో వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.*
*ఆన్ లైన్‌లో మే 15వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు హెల్ప్ లైన్ సెంటర్లలో ఏదో ఒక రోజున నిర్ణీత టైం ఎంచుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.*
అనంతరం ఆ సెంటర్‌కు వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది..
*మే 15 నుండి మే 19త తేదీ వరకు వెబ్ ఆఫ్షన్లు ఇచ్చుకోవాలి.*
ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్, విద్యార్థులకు సూచనల వివరాలను మే 14న తమ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది.
మరోవైపు *సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్ ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్, ఆదాయ సర్టిఫికేట్, కుల, నివాస ధృవీకరణ పత్రం తీసుకెళ్లాలి.*
*- 14-5-2019 నుంచి 16-05-2019 ఆన్ లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు*
*- 15-05-2019 నుంచి 18-05-2019 స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్*
*- 15-05-2019 నుంచి 19-05-2019 వెబ్ ఆప్షన్లకు అవకాశం*
*- 22-05-2019 సీట్ల కేటాయింపు*
*-23-05-2019 నుంచి 25-05-2019 ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్*
01-06-2019 నుంచి : కాలేజీల్లో రిపోర్టింగ్, తరగతులు ప్రారంభం
0 comments:
Post a Comment