LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్

Posted by PAATASHAALANEWS on Thursday, 16 May 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ బుధవారం వీసీ అశోక్‌కుమార్ విడుదల చేశారు.
 టీఎస్ ఆన్‌లైన్, మీ సేవ కేంద్రాలు, rgukt.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో 28.04.2018 నుంచి 01.06.2018 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 
పదో తరగతి పరీక్షలు రాసిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సూచించారు. హార్డ్ కాఫీ అప్లికేషన్ల చివరి తేది 04.06.2018గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక జాబితాను 11.06.2018న విడుదల చేస్తామన్నారు.
జూన్ 18,19 తేదీల్లో తొలి విడత ప్రవేశ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. సైనికోద్యోగుల పిల్లలు, వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు జూన్ 21,22,23వ తేదీల్లో కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
 పీయూసీ-1 ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు జూలై 2న ప్రారంభమవుతాయని, 2018 బ్యాచ్ తరగతులు జూలై 3 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఎక్కువగా అవకాశం ఉంటుందని, రిజర్వేషన్ల ప్రకారం ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని వీసీ అశోక్‌కుమార్ తెలిపారు. మొత్తం 1000 మంది విద్యార్థులను 2018 బ్యాచ్‌కు ఎంపిక చేస్తామని తెలిపారు.
 ఇదిలా ఉండగా కళాశాలలో ప్రవేశానికి ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. నాన్ రెసిడెన్షియల్ మాడల్ స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్థులకు 0.4 జీపీఏ కలుపనున్నట్లు వీసీ తెలిపారు. ఈ సందర్భంగా వీసీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ఏకైక ట్రిపుల్‌ఐటీ సరస్వతీ క్షేత్రం బాసరలో మన అందరీ అదృష్టమన్నారు. 275 ఎకరాల్లో కళాశాలలో ఐఐటీకి మించి అధునాత సౌకర్యాలు ఉండడం ల్యాబ్‌లు, హాస్టల్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ, ఇంక్యూబేషన్ సెంటర్లు తదితర సేవలను అందిస్తున్నామని అన్నారు. ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్, దుస్తులు, ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. 
గ్రామీణ పేద విద్యార్థుల కోసమే ప్రభుత్వం ఈ కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని గుర్తు చేశారు. కళాశాలలో అద్భుతమైన ఫ్యాకల్టీ ఉందని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు చదువుపై శ్రద్ధ వహించేలా సలహాలు, సూచనలు ఇస్తున్నారని, ఇప్పటికే కళాశాల నుంచి పలువురు విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో, ప్రభుత్వ శాఖల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు.*
*500 సీట్లు పెంచే అవకాశం..*
*బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న వెయ్యి సీట్లను 500కు పెంచి 1500కు చేసే అవకాశముందని వీసీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వానికి సీట్ల పెంపు విషయ నివేదికను పంపామన్నారు. 500 మంది విద్యార్థులకు సరిపడేలా బడ్జెట్‌ను కేటాయించారని, నివేదికలు పంపామన్నారు. కళాశాల 2008లో ప్రారంభించినప్పుడు ఏడాదికి 2వేల మంది విద్యార్థులు ఉండే వారని, వాటిని వెయ్యి సీట్లకు తగ్గించినప్పటికీ కళాశాలలో 2వేల మంది చదువుకునేందుకు వీలుగా హాస్టల్ భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, మెస్ భవనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 1500 మందికి సరిపడా ఇన్ఫాసెక్చర్ కళాశాలలో ఉందని, ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఈ సంవత్సరమే సీట్ల పెంపు ప్రారంభమవుతుందని అన్నారు.*
*రాష్ట్రంలో మరో ట్రిపుల్ ఐటీ..!*
*ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థులకు రాష్ట్రంలో బాసరతో పాటు మరో ట్రిపుల్‌ఐటీని కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉందని సమాచారం  దీనిపై వీసీ అశోక్ మాట్లాడుతూ.. కళాశాల అధికారులు గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న వనపర్తి నూతన జిల్లాలో ట్రిపుల్‌ఐటీని ఏర్పాటుకు కావాల్సిన పలు అంశాలను ప్రభుత్వం నియమించిన కమిటీ పర్యవేక్షించిందని, దీనిపై ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయమని అన్నారు.*
*ప్రవేశ అర్హతలు..*
*అభ్యర్థులు తొలి ప్రయత్నంలోనే 2018లో ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. * వయస్సు 31-12-2017 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యరులకు 21 ఏళ్లు నిండకూడదు.*
*దరఖాస్తు ఆన్‌లైన్..*
*పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు www.rgukt.ac.in లేదా admissions.rgukt.ac. in వెబ్‌సైట్ ద్వారా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.*
*జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు ఇలా..*
*పదో తరగతిలో గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒకే జీపీఏ ఉన్న అభ్యర్థులకు సబ్జెక్టు వారీగా పొందిన గ్రేడ్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జడ్పీ హైస్కూళ్లు, మున్సిపల్ హైస్కూళ్లలో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. నాన్ రెసిడెన్షయల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు కూడా 0.4 డిప్రెవేషన్ స్కోర్ ఈ ఏడాది అదనంగా కలుపుతున్నారు. దీనిని సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వెయిటేజీగా పేర్కొన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 అర్టికల్ డీ సెక్షన్ 95, 2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.*
*గ్రేడ్ పాయింట్లు సమానమైతే ఇలా..*
*ట్రిపుల్‌ఐటీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో సంబంధిత కేటగిరీలో ఏ ఇద్దరి విద్యార్థులు జీపీఏలు ఒక్కటే అయితే వరుసగా గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లిష్, సోషల్‌లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్‌లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.*
*ప్రవేశాల షెడ్యూల్ ఇదీ..*
*ఆన్‌లైన్ ప్రారంభం ఏప్రిల్ 28 * ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ జూన్ 6 * ఎంపిక విద్యార్థుల జాబితా విడుదల తేది జూన్ 11 * మొదటి విడత జాబితా ప్రవేశ కౌన్సెలింగ్ జూన్ 18 * రెండో విడత ప్రవేశ కౌన్సెలింగ్ జూన్ 19 * సైనికోద్యోగుల పిల్లలు, ఎస్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు బాసరలో ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీ జూన్ 21 * సీఏపీ కౌన్సెలింగ్ జూన్ 22 * వికలాంగులకు ప్రవేశ కౌన్సెలింగ్ జూన్ 23 * ఎన్‌ఆర్‌ఐ, గ్లోబల్ ప్రవేశ కౌన్సెలింగ్ జూన్ 25 *రెండో విడత ఫేస్ టూ ప్రవేశ కౌన్సెలింగ్ జూన్ 26,  గ్లోబల్ కేటగిరిలో సీట్లు మిగిలిపోయిన వారికి కౌన్సెలింగ్ జూన్ 28,  పీ1 విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు జూలై 2* 2018-19 బ్యాచ్ తరగతులు ప్రారంభం జూలై 7
*కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు..*
*ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రసీదు, టెన్త్ హాల్ టికెట్, మార్కుల లిస్టు, రెసిడెన్స్ సర్టిఫికెట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగులైతే వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే వాటికి సంబంధించిన అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.*
*గతేడాది జీపీఏలు ఇలా..*
*ఆర్జీయూకేటీలో గతేడాది ఓసీ కేటగిరికి 10.1, బీసీ-ఏ కేటగిరికి 10 జీపీఏ, బీసీ-బీకి 10 జీపీఏ, బీసీ-సీకి 9.8, బీసీ-డీకి 10 జీపీఏ, బీసీ-ఇకి 10 జీపీఏ, ఎస్సీ, ఎస్టీలకు 9.9 జీపీఏ వచ్చిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హత సాధించారు. గత సంవత్సరం దాదాపు వెయ్యి సీట్లకు గాను 22వేల దరఖాస్తులు వచ్చాయి.*
*రిజర్వేషన్లు ఇలా..*
*ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఏలకు 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, బీసీ-సీకి ఒక శాతం, బీసీ-డీకి 7 శాతం, బీసీ-ఈకి 4 శాతం. * ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. * 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.*
*ఫీజుల వివరాలు:*
*రాష్ట్రంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి ట్యూషన్ ఫీజు కింద రూ. 36 వేలు చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించనవసరం లేదు.*
*రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500 చొప్పున చెల్లించాలి. క్యాషన్ డిపాజిట్ కింద ఏకేటగిరి అభ్యర్థులైనా వారు రూ. 2వేలు చెల్లించాలి. ఇతర రాష్ర్టాల విద్యార్థులు ఏడాదికి రూ. 1.36 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు రూ. 3లక్షల ఒక వెయ్యి ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఇలా దరఖాస్తు చేసుకోండి*
*అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల ద్వారా ఆర్జీయూకేటీ వెబ్‌సైట్ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. *ఓసీ, బీసీ అభ్యర్థులు అప్లికేషన్ రుసుం రూ. 150, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.* అప్లికేషన్ ఫీజుతో పాటు సర్వీసు చార్జి కింద ఆన్‌లైన్ సెంటర్లకు అదనంగా రూ. 20 చెల్లించాలి.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: May 16, 2019

0 comments:

Post a Comment