తెలంగాణ ప్రభుత్వం 6, 7, 8 మరియు 9వ తరగతులకు ప్రవేశప్రకటన
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్
Rc.No.Acad-1/13/BLV/2019
తేది: 09-05-2019
2019-20 విద్యా సంవత్సరానికి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) అలగనూర్, కరీంనగర్లో గల కళాశాల నందు 8వ తరగతికి గాను మరియు ఇతర టి.ఎస్.డబ్ల్యూ.ఆర్ (T.S.W.R.I) ఇన్స్టిట్యూషన్లలో గల 6వ తరగతి నుంచి 9వ తరగతులలో ఉన్న మిగిలిన (బ్యాక్లాగ్) ఖాళీలలో ప్రవేశం కొరకు ప్రకటన జారీ చేయనైనది.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అలగనూర్, కరీంనగర్ జిల్లా నందు 8వ తరగతికి (31)జిల్లాల వారు అర్హులు మరియు టి.ఎస్.డబ్ల్యూ.ఆర్ (T.S.W.R.I) ఇన్స్టిట్యూషన్లలో 6వ, 7వ, 8వ మరియు 9వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీలలో (Back Log) ప్రవేశం కొరకు సంబంధిత జిల్లాలవారు మాత్రమే) 2018-19 విద్యా సంవత్సరంలో 5వ, 6వ, 7వ మరియు 8వ తరగతులు పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి.
దరఖాస్తుదార్లు 09.06.2019 (ఆదివారం) నిర్వహించబడే ప్రవేశపరీక్షకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో హాజరు కావాలి. పూర్తి వివరాల కొరకు వెబ్ సైట్ అడ్రస్ను దర్శించండి.
www.tswreis.in (లేదా)
http://tsswreisic.cgg.gov.in (లేదా) *జిల్లాలోని సమీప TSWR పాఠశాల/జూనియర్ కాలేజ్ ప్రధానాచార్యుల వారిని సంప్రదించగలరు.
- దరఖాస్తులను ఆన్లైన్ (online) ద్వారా మాత్రమే దాఖలు చేయాలి.*
- *దరఖాస్తులు 18.05.2019 నుంచి 27.05.2019 (అర్ధరాత్రి ) వరకు స్వీకరించ బడతాయి*
సం/- ప్రవీణ్ కుమార్, సెక్రటరీ
తె.సా.సం.గు. పా సంస్థ, హైదరాబాద్
తె.సా.సం.గు. పా సంస్థ, హైదరాబాద్
0 comments:
Post a Comment