LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

history ఆఫ్ తెలంగాణ...

Posted by PAATASHAALANEWS on Tuesday, 4 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
history
  ఆఫ్ తెలంగాణ...
-భూదానోద్యమం (1951): అఖిల భారత సర్వోదయ ఉద్యమంలో భాగం గా ఆచార్య వినోబాభావే పోచంపల్లి గ్రామాన్ని సందర్శించారు. భూదానోద్యమం నేపథ్యంలో ఎన్ని గ్రామాలు సందర్శించారు.? ఎన్నివేల ఎకరాల భూమిని పేద రైతులకు పంచి పెట్టారు? అసలు సర్వోదయ అంటే ఏమిటి? వినోభా ఆశ్రమం పేరేమిటి? వినోభా అసలు పేరేమిటి? వినోబాభావే సేకరించిన భూములకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ మంత్రి ఎవరు? అనే అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలి.
-తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951): రైతులకు సాయుధ శిక్షణ, గ్రామస్థాయిలో రక్షకదళాల ఏర్పాటు, కమ్యూనిస్ట్ భావాల వ్యాప్తి, వడ్డీ వ్యాపారానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు? భూస్వామ్య విధానం? వెట్టి చాకిరీ విధానం రద్దు కోసం తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం తదితర అంశాలతోపాటు.. సాయుధ పోరాటం ఎందుకు విఫలమయ్యిందో అనే అం శాలపై అధ్యయనం చేయాలి. మా భూమి (సుంకర వాసిరెడ్డి), తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం (దేవులపల్లి వెంకటేశ్వర్ రావు), ప్రజల మనిషి (వట్టికోట అశ్వార్స్వామి), చిల్లరదేవుళ్లు (దాశరథి రంగాచార్య) వంటివారి గ్రంథాల నేపథ్యం ఏమిటి? మొదలైన అంశాలు కీలకమైనవి.
-హైదరాబాద్ పరిపాలన(1948-1952): జయంతీనాథ్ చౌదరీ గవర్నర్ జనరల్గా నియామకం,1949 ఫిబ్రవరిలో చౌదరి ఫర్మానా, హాలిసిక్కా రద్దు, శుక్రవారం బదులు ఆదివారం సెలవు దినంగా ప్రకటన. రజాకార్ల పేరుతో యువకుల ఊచకోత? చివరికి ఎంకే వెల్లోడి ఆధ్వర్యంలో పౌర ప్రభుత్వం ఏర్పాటు, హైదరాబాద్ రాష్ట్ర తొలి, చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో రెవెన్యూ, విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు. 1952-56 కాలంలో బూర్గుల రామకృష్ణారావు పాత్ర, 1952లో ఫిబ్రవరిలో శాసనసభ ఎలక్షన్స్.

-విశాలాంధ్ర ఉద్యమం: 1951 బెంగళూర్లో అయ్యదేవర కాళేశ్వరరావు ప్రస్తావించగా నెహ్రూ దీనిని వ్యతిరేకించాడు. వరంగల్లో తొలి సమావేశం, హైదరాబాద్లో రెండో సమావేశం జరిగాయి. రామానందతీర్థ (హైదరాబాద్ ప్రకాశం పంతులు) దీన్ని సమర్థించారు. దీంతో హైదరాబాద్ కాంగ్రెస్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. బూర్గుల రామకృష్ణారావు (అనుకూలం), కె.వి.రంగారెడ్డి (వ్యతిరేకం) దీంతో 1953లో కేంద్ర, రాష్ర్టాల పునర్ నిర్మాణ సంఘం, ఎస్ఆర్సీ, భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు కోసం కమిషన్ నియమించబడింది. ఫజల్అలీ దీనికి అధ్యక్షుడు. మొత్తానికి 103 మంది విశాలాంధ్రకు అనుకూలం. వ్యతిరేకించింది 29 మంది. గోడమీద పిల్లివాటం ప్రదర్శించినది 15 మంది. చర్చల్లో పాల్గొన్నది (147 మంది). ముఖ్యంగా దీనిని వ్యతిరేకించిన ఆంధ్రనాయకుడు ఎన్జీ రంగా .
-పెద్ద మనుషుల ఒడంబడిక (1956, ఫిబ్రవరి 20): ఇది చాలా ముఖ్యమైనది. ఢిల్లీలోని హైదరాబాద్ భవన్లో ఆంధ్ర, తెలంగాణ నాయకుల (8 మంది) మధ్య జరిగింది. ఒప్పందంలో పాల్గొన్న నాయకులు తదితర ముఖ్యాంశాలు చదవాలి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం ఎలా జరిగిందో అధ్యయనం చేయాలి.

- 1969 తెలంగాణ ఉద్యమం: పెద్దమనుషుల ఒప్పందం- ఒక నాటకం, తెలంగాణ రక్షణ దినం (1968, జూలై 10), ఖమ్మం జిల్లాలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరవదిక దీక్షతో విద్యార్థ్ధుల్లో చైతన్యం. తెలంగాణ ప్రజాసమితి (మదన్మోహన్) ఏర్పాటు. అష్టసూత్రాల ప్రకటన (1969 ఏప్రిల్)లో మొదలైన అంశాలపై పూర్తి అంశాలను తెలుసుకోవాలి. 1969లో జరిగిన తెలంగాణ జలియన్ వాలాబాగ్ దురదృష్ట సంఘటన యావత్ దేశానికి మాయనిమచ్చగా చెప్పుకోదగినది. ఈ కాల్పుల్లో దాదాపు 369 మంది విద్యార్థులు అమరులయ్యారు.
మొబిలైజేషనల్ లేదా సమీకరణ
రెండో దశ (1971-1990)
జై ఆంధ్ర ఉద్యమం (1972), రాష్ట్రపతి పాలన (1973), ఆరు సూత్రాల పథకం, తెలంగాణపై జరిగిన కుట్రలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాట్లు
తెలంగాణ ముఖ్యమంత్రులు - జరిగిన అన్యాయాలు
1. జలగం వెంగల్రావు
2. మర్రి చెన్నారెడ్డి: మర్రిచెన్నారెడ్డి కాలంలో కొత్త జిల్లాలు ఏర్పాటు. 1978లో రంగారెడ్డి, హైదరాబాద్ లో మతకల్లోలాలు.
3. టంగుటూరి అంజయ్య: ఆల్విన్ కంపెనీల్లో కార్మికుడిగా జీవితం
1973-1990 వరకు ఏర్పడిన సంస్థలు
-తెలంగాణ సాధన కోసం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఐక్యంగా పోరాడేందుకు ఏర్పడిన కొన్ని ముఖ్యమైన సంస్థలు.
1. తెలంగాణ ప్రజాసమితి (1971),
2. తెలంగాణ జనసభ (1985) వ్యవస్థాపక అధ్యక్షులు సత్యనారాయణ
3. తెలంగాణ ప్రజాసమితి (1987) భూపతి కృష్ణమూర్తి
-4. 1990లో జానారెడ్డి కన్వీనర్గా తెలంగాణ ఫోరం ఏర్పాటు.
-ముల్కీ ఉద్యమాలు: ప్రత్యేకంగా చెప్పుకోదగినవి, పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు.

-ల్యాండ్ సీలింగ్ చట్టం
-ముల్కీ నిబంధనలపై హైకోర్టులో ఆంధ్రావారు కేసు వేయడం.
-1972 అక్టోబర్లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమని తీర్పు రావడం చెప్పుకోదగిన పరిణామాలు
-జై ఆంధ్ర ఉద్యమం (1972): జైఆంధ్ర ఉద్యమం 1972లో వచ్చింది. దీంతో 1973లో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి కాలంలో ఖండుభాయ్ దేశాయ్ గవర్నర్గా పనిచేశారు. హెచ్.సి.శరీన్ పాత్ర ప్రధానంగా ఉంది.
-5. ఆరుసూత్రాల పథకం అమలుతో తెలంగాణలో ముల్కీ నిబంధనలు రద్దు అయ్యాయి.
-మూడో దశ (1990-2014): తెలంగాణ మలిదశ ఉద్యమంలో మూడోదశ అత్యంత కీలకంగా మారింది. ఈ విషయంపై అభ్యర్థులు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 1990లో జానారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఫోరం ఏర్పాటు, తెలంగాణ రిజర్వేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు.
-1997లో జై తెలంగాణ పార్టీ- ఇంద్రారెడ్డి పాత్ర: 1996లో దేవెగౌడ ప్రధానిగా చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు అనుకూలం అనే ప్రకటనతో జై తెలంగాణ పార్టీ స్థాపించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్టేటివ్ ఫోరాన్ని చిన్నారెడ్డి స్థాపన మొదలైన అంశాలను కూలంకషంగా చదవాలి.
తెలంగాణ ఉద్యమం - పార్టీల దోరణులు

-కాంగ్రెస్: తెలంగాణ ఉద్యమం పట్ల కాంగ్రెస్ అవలంభించిన వైఖరి ప్రధానం. ఇందులో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, హైదరాబాద్ ఫ్రీజోన్ ప్రకటన.
-తెలంగాణ-కాంగ్రెస్: తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ అవలంభించిన విధానాలపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తదనంతర పరిణామాలు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు నుంచి రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి వరకు జరిగిన సంఘటనలు.

-తెలంగాణ టీడీపీ: తెలంగాణ ఉద్యమంలో టీడీపీ అవలంభించిన విధానాలు. పరిణామాలు, గిర్గ్లాని కమిటీ, నవతెలంగాణ పార్టీ ఆవిర్భావం.

-బీజేపీ పాత్ర: తెలంగాణ ఉద్యమంలో బీజేపీ,అవలంభించిన విధానాలపై కూడా అభ్యర్థులు దృష్టి సారించాలి. కాకినాడ తీర్మానం, తెలంగాణ సాధనసమితి, ఆలె నరేంద్ర ఆధ్వర్యంలో పార్టీ స్థాపన.

-టీఆర్ఎస్ పాత్ర: స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. ఇందులో ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాత్ర కీలకం. 2001, ఏప్రిల్ 27న కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు ప్రకటన. 2001, మే 11న కరీంనగర్లో సింహగర్జన సభా ఏర్పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం, 2009, నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన వరకు జరిగిన పరిణామాలు చాలా ముఖ్యమైనవి.
జాయింట్ యాక్షన్ కమిటీ కార్యక్రమాలు
-1. పల్లె పల్లె పట్టాల పైకి ( 2011, మార్చి 1న)
-2. మిలియన్ మార్చ్ (2011, మార్చి 10న)
-3. తెలంగాణ మార్చ్ (2012, సెప్టెంబర్ 30న నెక్లెస్ రోడ్డు), సాగరహారం
-4. సడక్బంద్: 2014, మార్చి 21న శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు సడక్ బంద్ జరిగింది. అలాగే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర, సకల జనుల సమ్మె, 2011, సెప్టెంబర్ 13 నుంచి 42 రోజుల పాటు సమ్మె జరిగింది. దీనిపై కూడా అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
-వివిధ కమిటీల పాత్ర: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగా అనేక కమిటీలు వచ్చాయి. ఇందులో లలిత్ కుమార్ (1969), బార్గవ, వాంఛూ (1969), భరత్రెడ్డి (1985), జీవో 610 (1985), గిర్గ్లానీ (2001), ప్రణబ్ ముఖర్జీ (2005), శ్రీకృష్ణ కమిటీ (2010, ఫిబ్రవరి 3) నియామకం. దుగ్గల్, రవీందర్ కౌర్, రణబీర్ సింగ్ తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించడం. చివరగా 2011, మార్చి 23న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి 8వ అధ్యాయంలోని అంశాలను కూడా ప్రత్యేకంగా చదవాలి.

-తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన (2013, జూలై 1), ఆగస్టు 5న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందనే ప్రకటన. అదే విధంగా 2013, ఆగస్టు 6న ఏకే ఆంటోని అధ్యక్షుడిగా విభజన కమిటీ ఏర్పాటు, జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) 2013 అక్టోబర్ 8న ఏకే ఆంటోని చైర్మన్గా కేంద్ర మంత్రుల గ్రూప్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు, పార్లమెంటులో బిల్లు (2014, ఫిబ్రవరి 13), లోక్సభ ఆమోదం, 2014 మార్చి 2న గెజిట్ విడుదల, 29వ రాష్ట్రంగా గుర్తింపు ( 2014, మార్చి 4న), 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంగా ప్రకటన వరకు జరిగిన అంశాలను సమగ్రంగా చదవాలి.


-తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన ఎన్నికలు. 2014 సాధారణ ఎన్నికల నోటిఫికేషన్, ఫలితాలు, టీఆర్ఎస్ గెలుపొందిన శాసనసభ, రాజ్యసభ స్థానాలు, తొలి మంత్రివర్గం ఏర్పాటు, మంత్రుల శాఖలు, ప్రభుత్వ పథకాలు మొదలయిన అంశాలపై అభ్యర్థులు దృష్టి సారించాలి.
‘గ్రూప్’ పరీక్షల్లో ఎకానమీ
నూతనంగా విడుదల చేసిన తెలంగాణ PUBLIC SERVICE COMMISSION GR-II, III ECONAMY SYLLABUS అంశాలను గమనిస్తే 150 మార్కులను 3 భాగాలుగా విభజన చేశారు. దీనిలో రెండు భాగాలు భారత ఆర్థ్ధిక వ్యవస్థకు సంబంధించినవి అంటే 150 మార్కుల్లో 100 మార్కులు భారత ఆర్థ్ధిక వ్యవస్థకు కేటాయించారు. మిగిలిన 50 మార్కులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వర్తింప చేశారు. అంటే ఆర్ధిక వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
భారత ఆర్థిక వ్యవస్థ
- ఆర్థికం, అభివృద్ధి
- అభివృద్ధి మార్పు అంశాలు
- పై రెండు అంశాల్లో మొదటిది స్థిర అంశాలకు సంబంధించినది కాగా రెండో భాగం చర అంశాలకు సంబంధించింది. అంటే అభ్యర్థులు ఆర్థిక వ్యవస్థను చదువుతూ అందులో వచ్చే మార్పు అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఉదా॥ జాతీయ ఆదాయం: కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం బదులు స్థిర ధరలో స్థూలదేశీయోత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే మార్పు అంశాలను ప్రాథమిక భావనలతో పాటు SUBJECTలో వచ్చిన మార్పులను గమనించాల్సి ఉంటుంది.

విత్తశాస్త్రం: కేంద్రం తన పన్ను ఆదాయంలో కొంత మొత్తాన్ని రాష్ర్టాలకు ఇవ్వాలి. అయితే 11, 12, 13 ఆర్థిక సంఘాల కంటే అత్యంత గరిష్ఠంగా 14వ ఆర్థిక సంఘం రాష్ర్టాలకు పన్ను ఆదాయం కేటాయించారు.
-11TH FC - 29.5 శాతం
-12 TH FC-30.5 శాతం
-13 TH FC- 32.0 శాతం
-14 TH FC- 42.0 శాతం
ఇలాంటి మార్పులను అభ్యర్థులు గమనించాలి. అంటే అభ్యర్థులు అం శాలను ఆర్థిక సర్వేతో అనుసంధానం చేసి చదవాలి.
-GDP- పన్ను నిష్పత్తి: 1991 కంటే ముందు అధిక పన్నులు, ఎగవేత వల్ల GDP-TAX నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే RAJA CHELLAIAH గారు అభిలషణీయ పన్ను నిష్పత్తిని పేర్కొన్నారో, GDP-TAX నిష్పత్తిలో మార్పు వచ్చింది. 1991 కన్నా ముందు జీడీపీలో పన్నులు 5శాతం లోపే ఉండేవి. 2014-15 సర్వేలో 10.3 శాతం నమోదు అయింది. అంటే ఇలాంటి మార్పులను అభ్యర్థులు గమనించాలి.
-ప్రత్యక్ష-పరోక్ష పన్నులు: అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రత్యక్ష పన్నుల వాటా అధికంగా ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన అభివృద్ధిగా భావించాలి. అయితే భారతదేశంలో 1947-2007 మధ్య కాలంలో పరోక్ష పన్నుల వాటా, ప్రత్యక్ష పన్నుల వాటా కంటే అధికంగా ఉండేది. పన్నుల్లో వచ్చిన ధనాత్మక మార్పుల వల్ల 2014-15 సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వాటా 54 శాతం, పరోక్ష పన్నుల వాటా కేంద్రంలో 46 శాతం నమోదై, ఒక ఆరోగ్యకరమైన పన్ను వాటా నమోదయింది. ఇలాంటి మార్పులను కూడా గమనించాలి.

-విదేశీమారక నిల్వలు: విదేశీమారక నిల్వలు ఒక దేశానికి ఎంతో అవసరం. 1947-1991 మధ్యకాలంలో FER కొరత వల్ల భారతదేశం చెల్లింపుల సమస్యకు గురికావడం, దానితో నాలుగు సార్లు మూల్యహీనీకరణకు దారితీసింది. ఇలాంటి పరిస్థితి నుంచి అంటే 40 సంవత్సరాల ఆర్థిక చరిత్రను (1947-1991) డాక్టర్ మన్మోహన్ సింగ్ LERMSగా ప్రారంభించారు. తర్వాత LPGDని ప్రారంభించారు. మూలధన ఖాతాలో మిగులును కూడా సాధించారు. చివరికి BALANCE OF SERVICEలో మిగులు సాధించి, ప్రస్తుత FER 354 USB $లకు చేరుకొని ఇకముందు మూల్యహీనీకరణ చేయకుండా పరిస్థితులు మారాయి.
-బ్యాంకింగ్: 1991 కంటే ముందు ప్రయివేటు బ్యాంకింగ్ రంగాన్ని నిరుత్సాహపరుస్తూ, ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ ఒక అనారోగ్యకర వాతావరణం కల్పించారు. నర్సింహం కమిటీ సూచనల మేరకు ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించి దాదాపు 74 శాతం FDI కి అవకాశం కల్పిస్తూ, ప్రభుత్వరంగంలో కూడా 20 శాతం FDIకి అవకాశం కల్పించారు. విదేశీ బ్యాంకుల్లో విదేశాలకు 100 శాతం FDI అవకాశం కల్పించారు.
-వ్యవసాయం: మొదటి ప్రణాళికలో తప్ప మిగిలిన ప్రణాళికల్లో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవడం లేదు. 50 శాతం రైతులు వర్షాలపై ఆధారపడటం, ఆత్మహత్యలు, ప్రచ్ఛన్న నిరుద్యోగం, కాల నిరుద్యోగం, ప్రతి ఏడాది 10 శాతం సాగు వ్యవసాయం పెరగడం మొదలైన సమస్యలున్నాయి. అయితే 2004 నుంచి వ్యవసాయంరంగంలో కొంత వరకు మూలధన సంచయనం పెంచడం ఆరోగ్యకరమైన మార్పుగా భావించవచ్చు. FCP, KVK, ATMA, SOIL HEALTH CARDS, KCC, RKVY, AIBP, IWMP, NFSM మొదలైన చర్యల వల్ల వ్యవసాయరంగంలో కొంత మార్పు వస్తున్నది. ఇలాంటి మార్పులను అభ్యర్థులు గమనించాలి.
-PARTICIPATARY NOTES: FII ద్వారా ప్రవేశించే P-NOTES లను నిషేధిస్తారనే అనుమానంతో SENSEX కొన్ని పాయింట్లు కోల్పోయింది. గతంలో మాంద్యం అనంతరం (2008-09) PN నిషేధానికి గురయింది. ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకునే ఇలాంటి మార్పులను అభ్యర్థ్ధులు గమనించాలి. ఆర్థిక వ్యవస్థలోకి FDIతో పాటు QFI, FII, PN ఆకర్షించాల్సి ఉంది. మార్జిన్ మార్కెట్ను నియంత్రణ చేయాలి.
-వాణిజ్య ధోరణులు: 1991 కంటే ముందు కొద్ది సంఖ్యలో ఉన్న OECD దేశాలతో భారత్ అధికంగా వాణిజ్యం చేసేది. ప్రస్తుతం వాణిజ్య ధోరణి OECD దేశాలలో కాకుండా ASIA దేశాలతో పెంచుకున్నారు. ఇలాంటి మార్పుల వల్ల ప్రస్తుతం భారతదేశం దాదాపు 19,00,000 కోట్ల రూపాయల విదేశీ మారకాన్ని ఎగుమతుల ద్వారా ఆర్జించింది. ఇలాంటి వాణిజ్య మార్పులను అభ్యర్థులు గమనించాలి.
-ప్రణాళికలు: 60 ఏండ్ల ప్రణాళికల అమలులో ఆశించిన ఫలితాలు సాధించలేదు. 1947-2015 మధ్య కాలంలో చైనా 10,000 USB $ జాతీయ ఆదాయాన్ని సాధించింది. అందువల్ల మోడీ ప్రభుత్వం ప్రణాళిక సంఘం బదులు చైనా తరహా ఉన్న NITI AAYOGను ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళిక తయారీలో ముఖ్యమంత్రులందరి భాగస్వామ్యం ఉంటుంది. ఇలాంటి ప్రతి మార్పును అభ్యర్థులు గమనించాలి.
-తెలంగాణ ఎకానమి: తెలంగాణ ఎకానమికి 50 మార్కులే కేటాయించినా అనేక అంశాలు అధ్యయనం చేయాలి. ఇందులో వ్యవసాయం, పరిశ్రమలు, జనాభా, సాంకేతిక సమాచారం, భూసంస్కరణలు, సహకార రంగం, ప్రాజెక్టులు, విద్యుత్ రంగం, ప్రజా పంపిణీ వ్యవస్థ, పర్యాటకం, సంక్షేమ పథకాలు, రోడ్లు, బ్యాంకింగ్, రైల్వేలు, ప్రభుత్వ సంస్థలు, ప్రణాళికలు, మత్స్య పరిశ్రమ, అడవులు, పాడి పరిశ్రమ, గనులు, ఉద్యానవనం మొదలైన అంశాలు అధ్యయనం చేయాలి.
history ఆఫ్ తెలంగాణ...
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 04, 2016

0 comments:

Post a Comment