LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

GS bits@2

Posted by PAATASHAALANEWS on Monday, 10 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

GS bits
.మెరుపు కనిపించిన తరవాతే ఉరుము శబ్దం వినిపించడానికి కారణం?

ఎ) గాలిలో ధూళి కణాలు ధ్వనిని నిరోధిస్తాయి

బి) మన దృష్టి జ్ఞానం మొదట ప్రతిస్పందిస్తుంది

సి) ధ్వని వేగం కంటే కాంతి వేగం ఎక్కువ

డి) ఏదీ కాదు

 

2.సరస్సు నీటి లోతు, ఉన్నదాని కంటే తక్కువగా ఎందుకు కనిపిస్తుంది?

ఎ) నీటిలో అడుగు భాగం పరావర్తనం చెందుతుంది బి) కాంతి వక్రీభవనం

సి) నీరు పైకి కిందకి కదులుతూ ఉండటం వల్ల

డి) నీరు పక్కకి కదులుతుండటం వల్ల

 

3.ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణమైన కాంతి ధర్మం?

ఎ) కాంతి సరళరేఖా మార్గం బి) కాంతి పరిక్షేపణం

సి) కాంతి విశ్లేషణం డి) కాంతి పరావర్తనం

4.ఉపగ్రహంలో ప్రయాణిస్తున్న వ్యోమగామికి భూమి ఏ రంగులో కనిపిస్తుంది?

ఎ) నీలం బి) నారింజ సి) ఆకుపచ్చ డి) నలుపు

 

5.లఘు లోలకం పొడవు 2 శాతం పెరిగితే, సమయం....?

ఎ) 2%  పెరుగుతుందిబి) 1%  పెరుగుతుంది

సి) 4%  పెరుగుతుంది డి) 1%  తగ్గుతుంది

 

6.రెండు దుప్పట్లు కప్పుకొంటే వెచ్చగా ఉండటానికి కారణం?

ఎ) వాటి మధ్య ఏర్పడిన గాలి పొర అథమ ఉష్ణవాహకంగా పనిచేస్తుంది

బి) వాటిలో ఎక్కువ ఉన్ని ఉంటుంది

సి) మన శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచుతాయి

డి) పైవేవీ కావు

 

7.ఒక వస్తువు ద్రవ్యరాశి అంటే?

ఎ) ఆ వస్తువు రూపొందిన పదార్థం

బి) ఆ వస్తువులో ఉన్న మొత్తం పదార్థ పరిమాణం

సి) దాని ఘన పరిమాణం డి) పైవన్నీ

 

8.మృతదేహం నీటిపై తేలడానికి కారణం?

ఎ) శరీర ఉష్ణోగ్రతలు శూన్యం కాబట్టి మంచులా నీటిపై తేలుతుంది

బి) చనిపోయిన తరవాత శరీరం బరువు కోల్పోతుంది

సి) మృత దేహం స్థానభ్రంశం చేసిన నీటి బరువు, మృతదేహం బరువు కంటే ఎక్కువ

డి) మృత దేహం స్థానభ్రంశం చేసిన నీటి బరువు, మృతదేహం బరువు కంటే తక్కువ

 

9.వాన చినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం?

ఎ) స్నిగ్థతబి) తలతన్యత

సి) కేశనాళికేయత డి) గురుత్వాకర్షణ

 

10.ఒక ఆశ్వ సామర్థ్యం = -------- వాట్స్‌?

ఎ) 746 బి) 764 సి) 467 డి) 476

 

11.జలాంతర్గామిలో నిట్టనిలువుగా అమర్చిన పెరిస్కోప్‌లో రెండు సమతల దర్పణాల మధ్య ఉంటే కోణం?

ఎ) 30ని బి) 45ని సి) 90ని డి) 0ని

 

12.అగ్నిమాపక దళ సభ్యుడి హెల్మెట్‌ను బాగా పాలిష్‌ చేయడానికి కారణం?

ఎ) అతను అందరికీ కనిపించడానికి

బి) మంటల వల్ల వచ్చే ఉష్ణం పరావర్తనం చెందడానికి

సి) మంటల వల్ల వచ్చే ఉష్ణం వక్రీభవనం చెందడానికి

డి) పైవన్నీ

 

13.సాపేక్ష ఆర్థ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం?

ఎ) భారమితిబి) స్పైరోమీటర్‌

సి) హైగ్రోమీటర్‌ డి) హైడ్రోమీటర్‌

 

14.సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం?

ఎ) 497 సెకన్లుబి) 498 సెకన్లు

సి) 499 సెకన్లు డి) 500 సెకన్లు

 

15.శాశ్వత అయస్కాంతాలను తయారు చేయడానికి అనువైన లోహం?

ఎ) సిల్వర్‌ బి) నికెల్‌ సి) జింక్‌ డి) క్రోమియం

 

16.భూమధ్య రేఖ వద్ద ’జ’ విలువ?

ఎ) గరిష్ఠం బి) శూన్యం సి) కనిష్ఠం డి) మారుతుంది

17.ఉష్ణం ఖిఐ ప్రమాణం?

ఎ) ఆంపియర్‌ బి) కెలోరి సి) జౌల్స్‌ డి) సెంటిగ్రేడ్‌

 

18.కింది వాటిలో కాంతి ఘటం Photo Cell అంటే?

ఎ) రసాయన శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చే సాధనం బి) అయస్కాంత శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చే సాధనం సి) కాంతి శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చే సాధనం 

డి) విద్యుత్‌ శక్తిని కాంతి శక్తిగా మార్చే సాధనం

 

19.విద్యుత్‌ హీటర్‌లో ఉండే ఎలిమెంట్‌ను దేనితో తయారు చేస్తారు?

ఎ) టంగ్‌స్టన్‌బి) రాగి

సి) నిక్రోమ్‌ డి) తగరం

 

20.క్రికెట్‌ ఆటగాడు వేగంగా వస్తున్న బంతిని పట్టుకొనే సందర్భంలో చేతులను వెనక్కి తీసుకోవడానికి కారణమైన నియమం?

ఎ) న్యూటన్‌ మొదటి గమన నియమం

బి) న్యూటన్‌ రెండో గమన నియమం

సి) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం

డి) ప్రచోదనం

 

21.ధ్వని అనేది ఒక రకమైన...?

ఎ) విద్యుత్‌ శక్తిబి) యాంత్రిక శక్తి

సి) విద్యుత్‌ అయస్కాంత శక్తి డి) అయస్కాంత శక్తి

 

22.వృద్ధుల శ్రావ్య అవధి?

ఎ) 20Hz- 20,000Hzబి) 10Hz - 12,000Hz

సి) 20Hz - 30,000Hzడి) 10ఏ్డ - 20,000Hz

 

23.పీడనం పెరిగే కొద్దీ ధ్వని వేగం?

ఎ) పెరుగుతుందిబి) తగ్గుతుంది

సి) మారదు డి) పైవేవీ కాదు

 

24.ట్రాఫిక్‌ సిగ్నల్స్‌లో ఎరుపు రంగు వాడటానికి కారణం?

ఎ) ఎరుపు రంగు ప్రమాదానికి సూచన కాబట్టి

బి) ఎరుపు రంగు తరంగధైర్ఘ్యం ఎక్కువ 

సి) ఎరుపు రంగు తరంగధైర్ఘ్యం తక్కువ

డి) ఎరుపు రంగు శక్తి ఎక్కువ

 

25.అయస్కాంతంలో అధికమైన అయస్కాంతత్వం ఎక్కడ ఉంటుంది?

ఎ) అంచుల సమీపంలో బి) మధ్యలో

సి) దక్షిణ ధృవం వద్ద డి) ఉత్తర ధృవం వద్ద

 

26.భూమికి గల కవల గ్రహం అని దేనిని అంటారు?

ఎ) శుక్ర బి) గురు సి) శని డి) ఫ్లూటో

 

27.సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?

ఎ) ఎడ్వర్డ్‌ బి) చాడ్విక్‌ సి) లిస్టర్‌ డి) ఐన్‌స్టీన్‌

 

28.ఇనుము తుప్పుపట్టకుండా ఉండటానికి దేనితో గాల్వనైజేషన్‌ చేస్తారు?

ఎ) రాగి బి) అల్యూమినియం సి) నికెల్‌ డి) జింక్‌

 

29.రిఫ్రిజిరేటర్‌లో థర్మోస్టాట్‌ చేసే పని?

ఎ) ఉష్ణోగ్రతను తగ్గించడం

బి) ఘనీభవన స్థానం తగ్గించడం

సి) స్థిరమైన ఉష్ణోగ్రతలను నిర్వహించడం

డి) కరిగే స్థానాన్ని తగ్గించడం

 

30.సాధారణంగా ట్రాన్సిస్టర్లలో ఉండేది?

ఎ) రాగి బి) బెరీలియం సి) ఇనుము డి) జర్మేనియం

 

31.బాగా పొడిగా ఉన్న జుట్టును రుద్దిన దువ్వెనను చిన్న చిన్న కాగితం ముక్కలకు సమీపంలో ఉంచితే అది కాగితాలను తన వైపు ఆకర్షించడానికి కారణం?

ఎ) వాటి మధ్య ఉండే అయస్కాంత ఆకర్షణ

బి) వాటి మధ్య విద్యుత్‌ ఆకర్షణ

సి) వాటి మధ్య ఉండే ఘర్షణాయుత ఆకర్షణ

డి) వాటి మధ్య ఉండే అయానిక ఆకర్షణ

 

32.ట్రాన్స్‌ఫార్మర్‌ ఉపయోగం?

ఎ) ఈ.ఇ నుంచి అ.ఇ మార్చడానికి

బి) అ.ఇ నుంచి ఈ.ఇ మార్చడానికి

సి) అ.ఇ ఓల్టేజిని పెంచడానికి

డి) విద్యుత్‌ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి

 

33.గాలి వేగాన్ని, దిశను కొలవడానికి ఉపయోగించే పరికరం?

ఎ) భారమితిబి) అనిమో మీటర్‌

సి) ఫొటో మీటర్‌ డి) యుడో మీటర్‌

 

34.లౌడ్‌ స్పీకర్‌ అనేది?

ఎ) ధ్వని శక్తిని విద్యుత్‌ శక్తిగా మారుస్తుంది

బి) విద్యుత్‌ శక్తిని ధ్వని శక్తిగా మారుస్తుంది

సి) అయస్కాంత శక్తిని ధ్వని శక్తిగా మారుస్తుంది

డి) ధ్వని శక్తిని అయస్కాంత శక్తిగా మారుస్తుంది

 

35.న్యూక్లియర్‌ రియాక్టర్లలో మితకారిగా ఉపయోగించే పదార్థం?

ఎ) నీరు బి) ప్లాటినం సి) బంగారం డి) భారజలం

 

36.కింది కిరణాల్లో అధిక పౌనఃపుణ్యం కలది?

ఎ) గామాబి) సూక్ష్మ తరంగాలు

సి) రేడియో తరంగాలు డి) X -కిరణాలు

 

37.ఏదైనా బయటి బలం పనిచేస్తున్నప్పుడు తప్ప, సాధారణంగా ఒక వస్తువు వేగం స్థిరంగా ఉండే లక్షణం?

ఎ) త్వరణంబి) వ్యాకోచత్వం

సి) తలతన్యత డి) జడత్వం

 

38. రేఖీయ సరళ హరాత్మక చలనంలో ఉన్న కణం శక్తి?

ఎ) గతిశక్తి బి) స్థితిశక్తి

సి) గతిశక్తి ్క్ష స్థితిశక్తి డి) ఏదీకాదు

 

39. ఆవర్ధిత మిథ్యా ప్రతిబింబం ఏర్పరిచే దర్పణం?

ఎ) పుటాకారబి) కుంభాకార

సి) సమతల డి) ఏటవాలు

 

40. విద్యుత్‌ సర్క్యూట్లలో ఉపయోగించే ఫ్యూజ్‌ వైర్‌ తయారీ లోహం లక్షణం?

ఎ) అధిక ద్రవీభవన స్థానం గల లోహం

బి) అల్ప ద్రవీభవన స్థానం గల లోహం

సి) అధిక విశీష్టోష్ణం గల లోహం

డి) అల్ప విశీష్టోష్ణం గల లోహం

 

41.గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం?

ఎ) సోడియంబి) క్రోమియం

సి) టైటానియం డి) పాదరసం

 

42.చలిస్తున్న విద్యుదావేశం ఏర్పరిచే క్షేత్రం?

ఎ) అయస్కాంత క్షేత్రంబి) గురుత్వ క్షేత్రం

సి) ఎ, బి డి) ఘర్షణ

 

43.వజ్రానికి చెందిన కింది ధర్మాల్లో క్యారెట్లలో కొలిచే ధర్మం?

ఎ) సాంద్రత బి) రంగు సి) స్వచ్ఛత డి) బరువు

 

44.గాజు తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు?

ఎ) సున్నపు రాయి, గంథం, ఇసుక

బి) సున్నపు రాయి, పొటాష్‌, గంథకం 

సి) ఇసుక, సున్నపు రాయి, సోడాయాష్‌డి) పైవన్నీ

 

45.కింది వాటిలో కంప్యూటర్‌ భాష కానిది?

ఎ) బేసిక్‌ బి) కావోస్‌ సి) కోబాల్‌ డి) పోర్ర్టాన్‌

 

46.‘పుల్లర్స్‌ ఎర్త్‌’ అని దేనికి పేరు?

ఎ) విస్పోటనంబి) లాక్యాటిన్‌

సి) ఖనిజం డి) రసాయనిక ఎరువు

 

47.భూ ఉపరితలం నుంచి పలాయన వేగం దాదాపు.....?

ఎ) 11.2 km/secబి) 21.2 km/sec

సి) 31.2 km/sec డి) 7.9 జుkm/sec

 

48.కాంతి తరంగాలు?

ఎ) యాంత్రిక తరంగాలుబి) స్థిర తరంగాలు

సి) పురోగామి తరంగాలు

డి) విద్యుత్‌ అయస్కాంత తరంగాలు

 

49.అనిశ్చితత్వ నియమాన్ని ప్రతిపాదించింది?

ఎ) ఐన్‌స్టీన్‌బి) రూథర్‌ఫర్డ్‌

సి) హైసెన్‌ బర్గ్‌ డి) డార్విన్‌

50.హైడ్రోజన్‌ బాంబుకు ఆధారం?

ఎ) రసాయన చర్యబి) కేంద్రక సంలీనం

సి) కేంద్రక విచ్ఛిత్తి డి) రేడియో థార్మికత

 

51.కదులుతున్న రైలు కిటికీలో నుంచి ఒక వస్తువును కిందికి విసిరితే అది అనుసరించే మార్గం?

ఎ) రుజు మార్గంబి) పరావలయ మార్గం

సి) వలయాకారం డి) పైవన్నీ

 

52.చిలికినప్పుడు పాల నుంచి వెన్న వేరు కావడానికి కారణం?

ఎ) ఘర్షణ బలంబి) అపకేంద్ర బలం

సి) అభికేంద్ర బలం డి) గురుత్వ బలం



సమాధానాలు

1) సి 2) బి 3) బి 4) డి 5) సి 6) ఎ 7) బి 8) సి 9) బి 10) ఎ 11) డి 12) బి 13) సి

 

14) ఎ 15) బి 16) సి 17) బి 18) సి 19) సి 20) డి 21) బి 22) బి 23) సి 24) బి 25) ఎ

 

26) బి 27) డి 28) డి 29) సి 30) డి 31) బి 32) సి 33) బి 34) బి 35) డి 36) ఎ 37) డి

 

38) సి 39) ఎ 40) బి 41) డి 42)  సి 43) సి 44) సి 45)  బి 46) సి 47) ఎ 48) డి

 

49) సి 50) బి 51) బి 52) బి

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 10, 2016

0 comments:

Post a Comment