LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

వాతావరణ పీడనం - ప్రభావాలు

Posted by PAATASHAALANEWS on Monday, 10 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register


*వాతావరణ పీడనం - ప్రభావాలు*
Climate అనే *గ్రీకు పదం నుంచిClimate అనే ఇంగ్లిష్ పదం ఆవిర్భవించింది*. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అని అర్థం
  *వాతావరణ స్థితి*: ఒక ప్రదేశ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతాల సంయుక్త స్థితిని వాతావరణ స్థితి అంటారు.
వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం మెటీరియాలజీ.

  *శీతోష్ణస్థితి*: ఒక ప్రదేశానికి సంబంధించిన దీర్ఘకాల (కనీసం 30 ఏళ్ల) వాతావరణ స్థితుల సరాసరిని శీతోష్ణస్థితి అంటారు.
 
*వాతావరణ పీడనం*: ఒక ప్రదేశంలోని వాయువుల పొర బరువును వాతావరణ పీడనం అంటారు.
  గాలికి బరువు ఉందని గెలీలియో నిరూపించాడు.
  వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం - భారమితి (బారోమీటర్)
   భారమితిని కనిపెట్టింది టారిసెల్లి (ఇటలీ, క్రీ.శ.1643). ఇతను గెలీలియో శిష్యుడు.
  సామాన్య వాతావరణ పీడనం అంటే భారమితిలో పాదరస మట్టం 760 మిల్లీ మీటర్లు.
  760 మి.మీ. = 76 సెంటీమీటర్లు = 29 అంగుళాలు = 1013.2 మిల్లీ బార్లు.
  గొట్టంలో పాదరసం ఎత్తు 3 మిల్లీ మీటర్లు అయితే 4 మిల్లీ బార్లకు సమానం.
  1 మి.మీ. = 1.33 మి.బార్లు.
  ఒక చదరపు సెం.మీ వైశాల్యంలో 1 గ్రా. బరువును మిల్లీబార్ అంటారు.

*వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు*
*1. ఎత్తు*: భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ పీడనం తగ్గుతుంది. ప్రతి 10 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్ చొప్పున పీడనం తగ్గుతుంది. ప్రతి 300 మీటర్ల ఎత్తుకు 25.4 మిల్లీబార్ల పీడనం తగ్గుతుంది.
  6 కి.మీ ఎత్తులో 506 మిల్లీబార్లు లేదా 308 మి.మీ. వాతావరణ పీడనం తగ్గుతుంది.

*2.ఉష్ణోగ్రత*: ఇది పెరిగితే గాలి సాంద్రత తగ్గి, పీడనం కూడా తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. ఉష్ణోగ్రత, పీడనం విలోమానుపాతంలో ఉంటాయి.

*3. నీటి ఆవిరి*: పొడి గాలి కంటే నీటి ఆవిరి బరువు తక్కువ కాబట్టి వాతావరణంలో నీటి ఆవిరి పెరిగితే పీడనం తగ్గుతుంది.

*4.వాయు ప్రవాహాలు* : అధిక ఉష్ణోగ్రత వల్ల అల్పపీడనం గల ప్రాంతాల్లో పైకి తేలిపోయే వాయు ప్రవాహాలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి పవనాలు వీస్తాయి.
  అల్ప ఉష్ణోగ్రత వల్ల అధిక పీడనం గల ప్రాంతాల్లో కిందకు దిగే వాయు ప్రవాహాలుంటాయి. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు పవనాలు వీస్తాయి.
  సముద్ర మట్టం వద్ద సరాసరి వాతావరణ పీడనం 900-1030 మిల్లీబార్లు ఉంటుంది.
  *ప్రపంచంలో అత్యంత వాతావరణ పీడనం గల ప్రాంతం సైబీరియాలోని అగాటా*. ఇక్కడ 1083.3 మిల్లీబార్లుగా నమోదైంది (1963, డిసెంబర్ 31).
  ప్రపంచంలో అత్యల్ప వాతావరణ పీడనం గల ప్రాంతం టిప్ అని పిలిచే చక్రవాతం (మరియాన ద్వీపం). ఇక్కడ 870 మిల్లీబార్లు నమోదైంది (1979 అక్టోబర్ 12).

*భూగోళంలో పీడన మేఖలలు*
*1.భూమధ్యరేఖ అల్పపీడన మేఖల*: 100 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఏర్పడుతుంది. భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతాన్ని డోల్‌డ్రమ్స్ లేదా ప్రశాంత మండలం, నిశ్చలవాత ప్రాంతాలు అంటారు. ఈ ప్రాంతంలో సగటున 1013 మిల్లీబార్ల్ల వాతావరణ పీడనం ఉంటుంది.

*2.ఉప ఆయనరేఖా అధిక పీడన మేఖల*: భూమధ్యరేఖకు ఇరువైపులా 250-300 అక్షాంశాల మధ్య ఉంటుంది. వీటినే గాలి కిందకి దిగే ప్రాంతాలు అంటారు. పీడన మండలాలు సూర్య గమనాన్ని బట్టి ఉత్తర, దక్షిణాలుగా కొద్దిగా జరుగుతాయి.

*3. ఉప ధ్రువ అల్పపీడన మేఖల*: భూమధ్యరేఖకు ఇరువైపులా 450-650 ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్యలో ఉంటుంది. దీన్నే సమశీతోష్ణ అల్పపీడన మేఖల అంటారు.

*4. ధ్రువ అధిక పీడన మేఖల*: 750-900 అక్షాంశాల మధ్యగల అతి శీతల ప్రాంతాన్ని ధ్రువ అధిక పీడన ప్రాంతం అంటారు.
*పవనాలు*
  గాలి ఎప్పుడూ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపునకు ప్రయాణిస్తుంది.
*భూమి ఉపరితలంపై క్షితిజ సమాంతరంగా వీచే గాలిని పవనం అంటారు*.

� భూమి ఉపరితలంపై నిటారుగా పైకి కదిలే గాలిని గాలి ప్రవాహం అంటారు.
రెండు ప్రదేశాల మధ్య వీచే గాలి.. పీడన మార్పుపై ఆధారపడి ఉంటుంది.
 
�సమాన పీడనం గల ప్రదేశాలను కలిపే రేఖలు.. సమభార రేఖలు (ఐసోబార్‌‌స).
 
�రెండు ప్రదేశాల మధ్య పీడన భేదాన్ని పీడన ప్రవణత అంటారు. పీడన ప్రవణత ఎక్కువైతే గాలి వేగం పెరుగుతుంది.
 
�గాలి వేగాన్ని కొలిచే పరికరం అనిమోమీటర్ (పవనవేగమాపకం) / బ్యూఫోర్టు స్కేల్.
 
�సమాన పవన వేగం గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలు - ఐసోకైనటిక్స్.
 
�గాలి వీచే దిశను సూచించేది పవన సూచిక
 
�భూ భ్రమణం వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని కొరియాలిస్ ఎఫెక్ట్ అంటారు.
  కొరియాలిస్ బలం భూమధ్యరేఖ వద్ద తక్కువగా, ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుంది.
  *కొరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఫ్సై సూత్రం ప్రకారం ఉత్తరార్ధ గోళంలో వీచే పవనాలు కుడి వైపునకు, దక్షిణార్ధ గోళంలో వీచే పవనాలు ఎడమ వైపునకు నెట్టబడతాయి*.
*పవనాలు రకాలు*
పవనాలు మూడు రకాలు అవి..
1) ప్రపంచ పవనాలు
2) కాలాన్ని బట్టి వీచే పవనాలు 
3) స్థానిక పవనాలు

*1.ప్రపంచ పవనాలు*
  ఈ పవనాలు ఏడాది పొడవునా నిరంతరం ఒకే దిశలో, స్థిరంగా వీస్తాయి. అందుకే వీటిని *స్థిర  పవనాలు* అని కూడా అంటారు.
ప్రపంచ పవనాలు 3 రకాలు
ఎ.వ్యాపార పవనాలు: ఇవి ఉప ఆయనరేఖా అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్యరేఖా అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి. ఇవి 80-300 అక్షాంశాల మధ్య వీస్తాయి.   
  వీటిని ఉత్తరార్ధ గోళంలో ఈశాన్య వ్యాపార పవనాలు అని, దక్షిణార్ధ గోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు అని అంటారు.
  వీటి వేగం గంటకు 15-20 కిలోమీటర్లు. ఈ పవనాల వల్ల ఖండాల తూర్పు తీరాల్లో వర్షం సంభవిస్తుంది.
బి. పశ్చిమ పవనాలు: ఉప ఆయనరేఖా అధిక పీడన ప్రాంతం నుంచి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి.
  ఇవి 350-600 అక్షాంశాల మధ్య వీస్తాయి. వీటిని ప్రతి వ్యాపార పవనాలు అంటారు.
  వీటి వేగం గంటకు 45-75 కిలోమీటర్లు.
  ఉత్తరార్ధ గోళంలో నైరుతి దిశ నుంచి, దక్షిణార్ధ గోళంలో వాయవ్య దిశ నుంచి వీస్తాయి.
  400 అక్షాంశాల వద్ద వీటిని గర్జించే నలభైలు (దక్షిణార్ధ గోళంలో) అంటారు.
  500 అక్షాంశాల వద్ద వీచే వీటిని భయపెట్టే యాభైలు, కోపోద్రిక్త యాభైలు అంటారు.
  600 అక్షాంశాల వద్ద వీచే వీటిని వణికించే అరవైలు అంటారు.
  ఇవి బయలుదేరే ప్రాంతాన్ని అశ్విక అక్షాంశాలు  (300 అక్షాంశాలు) అంటారు.
సి. ధ్రువ తూర్పు పవనాలు: అధిక పీడన ధ్రువ ప్రాంతాల నుంచి ఉపధ్రువ అల్పపీడన మేఖల వైపునకు వీస్తాయి. వేగం తక్కువ, స్థిరత్వం ఉండదు.
  ఇవి 600-800 అక్షాంశాల మధ్య వీస్తాయి.
 
*2.కాలాన్ని బట్టి వీచే పవనాలు*
  వీటినే రుతుపవనాలు అంటారు. ఒక రుతువులో ఒక దిశలో, మరొక రుతువులో దానికి వ్యతిరేక దిశలో వీస్తాయి.
  భూ పవనాలు: తీరం నుంచి సముద్రం వైపునకు వీస్తాయి.
  సముద్ర పవనాలు: సముద్రం నుంచి తీరం వైపునకు వీస్తాయి.
  లోయ పవనాలు: పగటి సమయంలో పర్వతాల మీదకు వీస్తాయి.
  పర్వత పవనాలు: రాత్రి సమయాల్లో పర్వతాల నుంచి లోయలోకి వీస్తాయి.

*3.స్థానిక పవనాలు*
  ఉష్ణోగ్రత, వాతావరణ పీడనంలో స్థానికంగా సంభవించే మార్పు వల్ల ఇవి ఏర్పడతాయి.
ఇవి రెండు రకాలు
1. వెచ్చని పవనాలు 2. శీతల పవనాలు.
వెచ్చని పవనాలు
  *ఫోన్* : ఆల్ఫ్స్ పర్వతాల నుంచి స్విట్జర్లాండ్ మీదకు వీస్తాయి.
 
*చినూక్*: అమెరికా, కెనడాల్లో వీస్తాయి (హిమభక్షకి).
 
*శాంట అనా:* కాలిఫోర్నియాలో వీస్తాయి.

*సిరోకో*: మధ్యధరా సముద్రం నుంచి ఐరోపాకు వీస్తాయి.
 
*బెర్‌‌గ్స:* దక్షిణాఫ్రికాలో వీస్తాయి.

*నార్వెస్టర్*:    న్యూజిలాండ్‌లో వీస్తాయి.
 
*హార్మాటాన్*: పశ్చిమ ఆఫ్రికాలో వీస్తాయి.
 
*సలానో*: స్పెయిన్‌లో వీస్తాయి.
 
*ఖమ్సిన్*: ఈజిప్టులో వీస్తాయి.
 
*గిబ్లీ:*  లిబియాలో వీస్తాయి.
 
*గర్బీ:* ఏజివ్, ఏడ్రియాటిక్ సముద్రం మీదుగా వీస్తాయి.
 
*సిమ్మన్:* అరేబియా ఎడారి ప్రాంతంలో వీస్తాయి.

*బ్రిక్ ఫెల్లర్:* ఆస్ట్రేలియాలో వీస్తాయి.
 
*జోండా*: అర్జంటీనాలో వీస్తాయి.
శీతల పవనాలు
 
*మిస్ట్రల్:*  ఐరోపాలో ఫ్రాన్‌‌స నుంచి మధ్యధరా సముద్రం వైపునకు వీస్తాయి.
 
*బోరా:* ఐరోపా (యుగోస్లావియా)లో వీస్తాయి.
 
*పాంపిరో*: అర్జంటీనాలో వీస్తాయి.

*బురాన్*: రష్యా, సైబీరియాలో వీస్తాయి.

*నెవడాస్*: గ్రీన్‌లాండ్‌లో వీస్తాయి.
 
*పుర్గా*:  రష్యాలో వీస్తాయి.
 
*కెటబాటిక్:* అంటార్కిటికా ఖండంలో వీస్తాయి.
 
*బైస్:* ఫ్రాన్ ‌‌సలో వీస్తాయి.
 
*ప్యూనా:* ఆండీస్ పర్వతాల్లో వీస్తాయి.
 
*నార్టె:* మెక్సికోలో వీస్తాయి.

*ప్రాక్టీస్ బిట్స్*
1. మంచును తినే పవనం?
1) సిరోకో        2) లెవిచె
3) హార్మాట్టాన్    4) చినూక్
2. భూ పవనం అంటే ?
1) ప్రపంచ పవనం    2) స్థానిక పవనం
3) వ్యాపార పవనం    4) రుతుపవనం
3. ఆండీస్ పర్వతాల్లో వీచే పవనం?
1) నార్టె    2) లూ    3) చినూక్    4) ప్యూనా

*సమాధానాలు*: 1) 4; 2) 4; 3) 4.

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 10, 2016

0 comments:

Post a Comment