విద్యాసంస్థలు
ప్రధాన వ్యాసం: తెలంగాణాలోని విశ్వవిద్యాలయాల జాబితా
1959లో వరంగల్లో నిట్ (NIT) జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం స్థాపించబడింది.1919లో హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1964లో ఎన్.జీ.రంగా విశ్వవిద్యాలయం, జే.ఎన్.టి.యూ, 1974లో హైదరాబాదు విశ్వవిద్యాలయం, 1976లో వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రారంభించబడినవి. 2000 తర్వాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నిజామాబాదులో తెలంగాణ విశ్వవిద్యాలయం, మహబూబ్నగర్లో పాలమూరు విశ్వవిద్యాలయం, కరీంనగర్ లో శాతవాహన విశ్వవిద్యాలయ, నల్గొండలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రారంభించబడ్డాయి. హైదరాబాదులో టటా ఇంస్టిట్యుట్ ఆఫ్ సొశ్యల్ సైంసెస్,
కళలు
తెలంగాణలోని పలు ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందినవి. ఆదిలాబాదు జిల్లా నిర్మల్ కొయ్యబొమ్మలకు పేరుగాంచగా, వరంగల్ జిల్లా పెంబర్తి ఇత్తడి సామానుల తయారికి ప్రసిద్ధి చెందింది.[47] ఆదిలాబాదు జిల్లా కేంద్రం రంజన్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. నారాయణపేట జరీచీరల తయారీకి పేరుపొందింది.
రాష్ట్ర చిహ్నాలు
తెలంగాణ రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పండు మామిడి పండు, రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ, రాష్ట్ర చిహ్నం తెలంగాణ అధికారిక చిహ్నం, రాష్ట్ర భాష తెలుగు, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు, రాష్ట్ర చేప కొర్రమట్ట (కొర్రమీను)[48], రాష్ట్ర క్రీడ కబడ్డీను రాష్ట్ర ప్రభుత్వం ఖరారుచేసింది.[49]
0 comments:
Post a Comment