కాలరేఖ |
1948 నుండి |
1948 | సెప్టెంబరు 17: నిజాం కబందహస్తాల నుంచి విముక్తిపొందింది. |
1948 | ఆగస్టు 22: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు షోయబుల్లాఖాన్ హత్య జరిగింది. |
1950 |
1953 | ఆగస్టు 25 న తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి మరణించాడు. |
1956 | ఫిబ్రవరి 20 న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. |
1956 | నవంబరు 1 న తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. |
1960 |
1961 | ఫిబ్రవరి 6 న తెలంగాణకు చెందిన ప్రముఖ సమరయోధుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు. |
1969 | ఫిబ్రవరి 28 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ధ్యేయంగా యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు. |
1969 | మార్చి 29 న ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. |
1970 |
1970 | జూలై 24 న తెలంగాణ పితామహుడిగా పేరుపొందినకొండా వెంకట రంగారెడ్డి మరణించాడు. |
1976 | మార్చి 31 న ప్రముఖ తెలంగాణ సాయుధపోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి మరణించాడు. |
1978 | ఆగస్టు 15 న హైదరాబాదు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడింది. |
1990 |
1990 | జూన్ 21 న తెలంగాణ ప్రాంతానికి చెందినపి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. |
2000 |
2007 | ఏప్రిల్ 16 న హైదరాబాదు నగరపాలక సంస్థ స్థానంలో "గ్రేటర్ హైదరాబాదు"(హైదరాబాదు మహానగరపాలక సంస్థ) ఏర్పడింది. |
2009 | నవంబరు 29 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకైకల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది. |
2009 | డిసెంబరు 9 న భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు. |
2010 |
2011 | మార్చి 10 న ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ ఉద్యమం నిర్వహించబడింది. |
2013 | జూలై 30 న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది. |
2013 | అక్టోబరు 3 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. |
2013 | డిసెంబరు 5 న తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది. |
2014 | జనవరి 7 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. |
2014 | ఫిబ్రవరి 13 న తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడినది. |
2014 | ఫిబ్రవరి 18 న లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది. |
2014 | ఫిబ్రవరి 20 న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. |
2014 | మార్చి 1 న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. |
2014 | మార్చి 4 న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. |
2014 | జూన్ 2 న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. |
2014 | జూన్ 2 న తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుప్రమాణ స్వీకారం. |
|
0 comments:
Post a Comment