మన ఆరోగ్యం --- మనచేతుల్లో ( 14)
ముక్కుకి రెండు రంధ్రాలు ఎందుకు
బెల్లం ( Jaggery ) గురించి -----
ఆయుర్వేద శాస్త్రం బెల్లంకు ప్రాధాన్యం ఇస్తుంది. బెల్లం ఔషధాల గని. పాతతరంలో బెల్లం వాడకం బాగుండేది. బెల్లంతోనే పలు రకాల తిండి పదార్ధాలను వండేవారు. ఇప్పుడు ప్రతి దానికీ పంచదార వాడడం వల్ల బలవర్ధకమైన పదార్ధాన్ని కోల్పోతున్నాం. చక్కెర వల్ల పలు దుష్పృభావాలు పొడచూపు తున్నాయి.
చెరకు నుండి బెల్లం తయారు చేస్తారు. చెరకు రసాన్ని పరిశోధిస్తే ఫాస్ఫరస్ ఎక్కువ లేదు. చెరకు రసంను వేడి చేసి బెల్లంగా మార్చినప్పుడు ఫాస్ఫరస్ అత్యధికంగా ఉన్నది.
బజారులో తెల్లగా ఉన్న బెల్లం దొరుకుతుంది. బెల్లం ఎంత తెల్లగా ఉంటే అది అంత విషం. ఎందుకంటే బెల్లంలోని తెల్లదనానికి కారణం వాషింగ్ పౌడర్. ఎంత ఎక్కువగా వాషింగ్ పౌడర్ వాడితే బెల్లం అంత ఎక్కువ తెల్లగా వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అసలు తినకూడదు. బెల్లం యొక్క అసలు రంగు చాక్లెట్ కలర్ లో ఉంటుంది. " రాగి " రంగులో ఉండే బెల్లం శ్రేష్టమైనది. దీనినే మీరు ప్రతి రోజు ఉపయోగించుకోండి.
ప్రతి రోజూ చిన్న బెల్లం ముక్క తినడం మంచిది. ఇది జీర్ణ శక్తిని పెంపొదిస్తుంది. బెల్లంలో ఇనుము అధికం , తద్వారా హిమగ్లోబిన్ వృద్ది చెందుతుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. మైగ్రేన్ కు చక్కటి విరుగుడు బెల్లం. అధిక బరువును తగ్గిస్తుంది ఈ బెల్లం. మీరు రోజు ఏదో ఒక రూపంలో కొంచెమైనా బెల్లం తీసుకుంటే మంచిది.
పాలు త్రాగి బెల్లాన్ని తినవచ్చు లేదా బెల్లాన్ని తిని పాలు త్రాగవచ్చు. పాలతో బెల్లాన్ని కలిపి వాడకూడదు. పెరుగుతో బెల్లాన్ని కలిపి తినండి. ఇది చాలా గొప్ప ఆహారం. నువ్వులు బెల్లం కలిపి ఉండ చేసుకుని తినండి. వేరుశనగ గుళ్ళు బెల్లం కలిపి పప్పుండ చేసుకొని తినండి. దీని వల్ల కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి.
" ఆరోగ్యమే ---- మహాభాగ్యం "
రమేష్, సంగారెడ్డి:
*ప్రశ్న:* ముక్కుకి రెండు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? వాటి పనిలో ఏమైనా తేడా ఉందా?
*జవాబు:* మనిషికి ముక్కు ఒక్కటే అయినా రెండు రంద్రాలు విడివిడి గా ఉంటాయి. చూడడానికి రెండూ ఒకే లా ఉన్నా, ప్రక ప్రక్కన ఉన్నా రెండు రంద్రాలు భిన్నము గా పనిచెస్తాయి. మానవ శరీరములొ అవయవాలు *కొన్ని తప్ప* అన్నీ అర్ధ నారీశ్వరము గా అమరి ఉంటాయి . ఒకటి పని చేయడం లో తేడా వచ్చినపుడు శరీరము ఇబ్బంది పడకుండా అలా అమరి ఉన్నాయని అనుకోవాలి . రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఆరోగ్యం గా ఉన్నప్పుడు వాటి పనిని సర్ది పంచుకొని కొచం భిన్నం గా పనిచెస్తాయి . జీవ పరిణామ క్రమములో ఒకజీవి నుండి పరివర్తనం చెంది మరొక జీవి పుట్టేవే కాబట్టి పురాతన జీవులలో రెండు నాసికా రంధ్రాలు వేరు వేరు పనులు నెరవేర్చేందుకు వాడబడేవని అనుకోవాలి.
వాసన వచ్చేదిశ పసిగట్టేందుకు రెండు ముక్కు రంద్రాలు బిన్నముగా స్పందిస్తాయి . అంతేకాదు ఒక రంధ్రం ఒకలాంటి వాసనలను గ్రహిస్తే , రెండవ రంధ్రం మరోరకం వాసనలను గ్రహిస్తుంది .
రెండు ముక్కు రంధ్రాలలొ గాలి ప్రవహించే వేగం ఒకేలా ఉండదు . రక్త సరఫరా జరిగే తీరు లో కూడాకొద్ది తేడా ఉంటుంది . వీటివలన నాసికారంధ్రాలు రెండూ భిన్నం గా పనిచేస్తాయి.
0 comments:
Post a Comment