ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువు పొడిగింపు
- ఐటీ రిటర్న్‌ల దాఖలు గడవును ఆదాయం పన్ను శాఖ శుక్రవారంనాడు పొడిగించింది.
- 2019-20 ఆర్థిక సంవత్సరం ఆదాయం పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.
- ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
- 2018-19 రివైజ్డ్ ఐటీఆర్ గడువును జూలై 31 వరకూ కేంద్ర ప్రభుత్వం రెండ్రోజుల క్రితం పొడిగించిన నేపథ్యంలో ఐటీ శాఖ తాజా గడువు పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించింది.
- ఇదేవిధంగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి టీడీఎస్/టీసీఎస్ స్టేట్‌మెంట్ల సమర్పణ గడువును జూలై 31 వరకూ, టీడీఎస్/టీసీఎస్ సర్టిఫికెట్ల జారీ గడువును ఆగస్టు 15 వరకూ పొడిగించినట్టు ఆదాయం పన్ను శాఖ ప్రకటించింది
- . https://www.incometaxindiaefiling.gov.in/
పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసే గడువును సైతం 2021 మార్చి 31 వరకూ పొడిగించింది.
పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం
0 comments:
Post a Comment