నాన్ గజిటెడ్ ఉద్యోగుల పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ సంబంధిత ఉత్తర్వులతో:
🎈 తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ 2015 లో G.O.Ms.No.27 SE, తేది:24.9.2015 ప్రకారం నాన్ గజిటెడ్ ఉద్యోగుల ఇద్దరు పిల్లలకు LKG నుండి ఇంటర్ వరకు రూ.2,500 ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేందుకు ఉత్తర్వులు విడుదల చేసింది.
🎈 బిల్లు TPTC Form-47 లో డ్రా చేయాలి.
🎈 ఇటీవల ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దీనిపై Memo.No. 9782/593/A/Admin.I/2017 తేది:23.7.2018 ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది.
🎈 010 పద్దు ద్వారా జీతాలు డ్రా చేస్తున్న నాన్ గజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులు అర్హులు.
🎈 ఉద్యోగుల పిల్లలు చదివే పాఠశాల రాష్ట్ర లేక కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందియుండాలి.
🎈 భార్య,భర్త ఇరువురు ఉద్యోగస్థులైన ఒకరు మాత్రమే ఈ రియంబర్స్మెంట్ ను క్లయిం చేయాలి.
🎈 ఉద్యోగంలో ఒకరు గజిటెడ్,మరొకరు నాన్ గజిటెడ్ ఉంటే ఈ రియంబర్స్మెంట్ వర్తించదు.
🎈 ఉద్యోగి సస్పెన్షన్ లో ఉంటే రియంబర్స్మెంట్ వర్తించదు.
🎈 అకడమిక్ సంవత్సరం పూర్తయిన తరువాత ఒరిజినల్ ఫీజు రశీదులు జతచేయాలి.
🎈 పిల్లలు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ అటెస్టేషన్ తప్పనిసరి.
🎈 డైరెక్టర్ ఆఫ్ ట్రెజరిస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్,తెలంగాణ Memo.No.F4/565/2014 తేది:22.9.2018 ప్రకారం 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ను మాత్రమే అనుమతించాలని. తదుపరి ఉత్తర్వులు అందేవరకు 2015-16 నుండి అరియర్స్ ను అనుమతించకూడదని ఆదేశాలు జారీచేసింది.
0 comments:
Post a Comment