SBI Jobs:
*డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3850 ఉద్యోగాలు... తెలంగాణలోనూ ఖాళీలు*
బ్యాంకు ఉద్యోగం కోరుకుంటున్నవారికి శుభవార్త. బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
మొత్తం 3850 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ సర్కిల్‌లోనూ ఖాళీలు ఉన్నాయి. గుజరాత్, తెలంగాణ సర్కిల్‌కు 550 ఖాళీలను ప్రకటించింది ఎస్‌బీఐ. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో మొత్తం 3850 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 27న అంటే ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీ.
డిగ్రీ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
0 comments:
Post a Comment