పదవీ విరమణ-మరణం-స్వచ్చంధ పదవీ విరమణ-అర్జిత సెలవు నగదుగా మార్చుకోను విధానం:
💥 ఉద్యోగులు పదవీ విరమణ చేసినా, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినా లేదా పదవిలో ఉంటూ అకాల మృత్యువాత పడినా, అతని అర్జిత సెలవు ఖాతాలో నిలువ ఉన్న రోజులకు 300 రోజులకు మించకుండా నగదు మార్పిడి చేసుకొను సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. ఒకవేళ 300 రోజులు అర్జిత సెలవు ఖాతాలో నిల్వలేనియెడల ఎంతమేరకు తక్కువ రోజులు ఉన్నాయో ఆ మేరకు అర్ధజీతం సెలవుకు సరిపడా నగదు పొందవచ్చు. ఉద్యోగి పదవీ విరమణ తేదీ నాటికి నెలకు ఎంత జీతం పొందుచున్నాడో అనగా కరువుభత్యం(DA), ఇంటి అద్దె అలెవెన్సు (HRA) ఇంకా అతను పొందుచున్న కాంపెన్సేటరీ అలవెన్సులు అన్నీ కలిపి 300 రోజుల అర్జిత సెలవులను నగదు పొందు సౌకర్యం ప్రభుత్వం కల్పించింది G.O.Ms.No.38 F&P తేది: 26.2.1996
💥 సర్వీసులో ఉంటూ మృతి చెందిన/పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మిగులు అర్జిత సెలవు నగదుగా మార్చుకొను మంజూరు ఉత్తర్వులు కార్యాలయపు అధికారులే చెప్పవచ్చు.
💥 సర్వీసులో ఉంటూ మృతి చెందిన ఉద్యోగి అర్జిత సెలవు నగదు మార్పిడి మొత్తము కుటుంబ సభ్యులకు/చట్టపర హక్కుదారులు (Legal heirs) కు గాని ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్-1 లోని నియమావళి 80 ప్రకారం చెల్లింపులు చేయవచ్చు.
💥 ఫారిన్ సర్వీసులో పనిచేస్తున్న వారి విషయంలో, పదవీ విరమణ చేసినా, చనిపోయినా, ఆర్ధిక సౌలభ్యాలు మాతృ సంస్థ నుంచి పొందవలసి ఉంటుంది.
💥 సస్పెన్షన్ లో ఉంటూ పదవీ విరమణ చేసిన ఉద్యోగి గాని లేక పదవీ విరమణ తర్వాత క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటూ,అట్టి చర్యలు అపరిష్కృతంగా ఉన్నప్పుడు, ఉద్యోగి నుండి ఏవైనా డబ్బులు రికవరీ చేయవలసిన అవసరం ఉందని భావించిన యెడల ఆ మేరకు ఉద్యోగికి రావలసిన అర్జిత సెలవు నగదు మార్పిడి మొత్తం నుంచి మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించవచ్చు. ఆ విధంగా మినహాయించిన మొత్తాన్ని క్రమశిక్షణా చర్యలు పూర్తయిన తర్వాత ఉద్యోగికి తిరిగి చెల్లించవలసి వస్తే అట్టి మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు
G.O.Ms.No.1097 F&P తేది:22.6.2000
💥 అవినీతి నిరోధక శాఖ(ACB) వారు నమోదు చేసిన కేసులు ఎదుర్కొంటున్న, మరియు అలాంటి కేసులు అపరిష్కృతంగాఉన్న సందర్భాల్లో ఆ ఉద్యోగి నుండి రాబట్టవలసిన మొత్తాలు ఏమైనా ఉంటే ఆ మేరకు మినహాయింపులు చేసి మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చు.
🌺 *ఖాతాలో ఉన్న అర్ధవేతన సెలవులను నగదుగా మార్చుకోనుట:*
💥 పదవీ విరమణ చేసిన చేసిన ఉద్యోగులకు తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవును నగదుగా మార్చుకోను అవకాశాన్ని రాష్ట్రప్రభుత్వం G.O.Ms.No109 ఆర్ధిక తేది:29.7.2015 ద్వారా కల్పించింది.
💥 అర్ధవేతన సెలవు నగదును పొందడానికి సూత్రం = పదవీ విరమణ తేదికి (అర్ధవేతనం + అర్ధవేతనం పై ఆ రోజుకు చెల్లిస్తున్న డి.ఏ)/30 x అర్ధవేతన సెలవులు
💥 300 రోజుల పరిమితికి లోబడి లెక్కిస్తారు.
💥 ఎయిడెడ్ సిబ్బందికి అర్ధవేతన సెలవును నగదుగా మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఆర్.సి.నెం.22/బి2-2/2011 తేది:26.3.2013 కల్పించింది.
💥ఉదాహరణ: ఒక ఉపాధ్యాయుడు 69,750 మూల వేతనంతో జులై 2020 న పదవీ విరమణ చెందేనాటికి అతని ఖాతాలో 152 ఆర్జిత సెలవులు,520 అర్ధవేతన సెలవులు ఉన్నాయనుకుంటే,300 రోజుల గరిష్ట పరిమితికి లోబడి 152 రోజుల ఆర్జిత సెలవులు పోగా,148 రోజుల అర్ధవేతన సెలవుల జీతం నగదుగా లభిస్తుంది.
💥 డి.ఏ శాతం 33.536
💥 అర్ధవేతన సెలవుల జీతం నగదు = (34,875+11696)/30x148 = Rs.2,29,750
0 comments:
Post a Comment