*మోగిన నగారా: లోకసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, ఏపీలో ఒకే విడతలో ఎన్నికలు*
*సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు లోకసభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికలు ఉంటాయనే వాటితో పాటు పలు అంశాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని సీఈసీ చెప్పారు. తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు కనిపించనున్నాయి. ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు నిర్వహిస్తారు.*
- జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది.
-అసోం, ఛత్తీస్‌గఢ్‍లలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
-కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
-మొత్తం 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.
-ఆంధ్రప్రదేశ్‌లో లోకసభ ఎన్నికలు ఒకే విడతలో ఉండనున్నాయి. తెలంగాణలోను అదే విడతలో ఒకేసారి నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
-ఫేజ్ 1 ఎన్నికలు: ఏప్రిల్ 11వ తేదీన తొలి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంటుంది. ఫేజ్ 2 ఎన్నికలు: ఏప్రిల్ 18వ తేదీన రెండో విడత పోలింగ్ ఉంటుంది. ఫేజ్ 3 ఎన్నికలు: ఏప్రిల్ 23వ తేదీన మూడో విడత పోలింగ్ ఉంటుంది. ఫేజ్ 4 ఎన్నికలు: ఏప్రిల్ 29వ తేదీన నాలుగో విడత పోలింగ్ ఉంటుంది. ఫేజ్ 5 ఎన్నికలు: మే 6వ తేదీన ఐదో విడత పోలింగ్ ఉంటుంది. ఫేజ్ 6 ఎన్నికలు: మే 12వ తేదీన ఆరో విడత పోలింగ్ ఉంటుంది. ఫేజ్ 7 ఎన్నికలు: మే 19వ తేదీన ఆరో విడత పోలింగ్ ఉంటుంది.
-మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉంటాయి
-ఏప్రిల్ 18న తొలి విడత పోలింగ్
-ఏప్రిల్ 11వ తేదీన తొలి విడత పోలింగ్
-మార్చి 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్
-7 విడతల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి.
-సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలింగ్ అబ్జర్వర్లు.
-ప్రచారం సమయంలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి నిరాకరణ
-ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలు ఉంటాయి.
0 comments:
Post a Comment