పాలీసెట్ ఫలితాలు విడుదల
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2018 పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం అభ్యర్థులు
వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లోని పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయిలో పాలీసెట్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టీఎస్ పాలీసెట్ పరీక్షను గడిచిన ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించారు.*
0 comments:
Post a Comment