LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

TS గురుకుల సెట్ - 2018 నోటిఫికేషన్ విడుదల

Posted by PAATASHAALANEWS on Thursday, 22 February 2018


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register


*TS గురుకుల సెట్ - 2018 నోటిఫికేషన్ విడుదల*

Common Entrance Test for Admission into 5th Class for the academic year 2018-19
(in TREIS, TSWREIS, TTWREIS, MJPTBCWREIS)
21st Century Schools

SC, ST, BC సంక్షేమ మరియు విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో (ఇంగ్లీష్ మాధ్యమంలో) ప్రవేశానికై ప్రకటన వెలువడింది.

ప్రవేశ పరీక్ష తేదీ: 8.4.2018 నాడు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు.

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్ లైన్ లో http:/tgcet.cgg.gov.in/www.tswreis.in ద్వారా సమర్పించాలి.

ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2017-18 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదివే విద్యార్థులు అర్హులు.

తేదీ 1.9.2018 నాటికి 9 నుండి 11 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు.

SC, ST విద్యార్థులకు 2 సంవత్సరాల వయసు సడలింపు కలదు.

అర్హులైన అభ్యర్థులు తేదీ 19.02.2018 నుండి 16.03.2018 వరకు ఆన్ లైన్ లో ₹. 50/- రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేయడానికి ఆధార్ నెంబర్ తప్పనిసరి.

ప్రాస్పెక్టస్ మరియు ఇతర వివరాల కొరకు http:/tgcet.cgg.gov.in ని చూడగలరు.

ఇతర సమాచారం కొరకు ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ 1800 425 45678 ని లేదా సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్ లో సంప్రదించవచ్చు.

*TG గురుకుల సెట్ - 2018 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంలో వివిధ సొసైటీల వివరణ*

*1.TREIS:*
Telangana Residential Educational Institutions Society.

1972లో స్థాపించబడినది. దీని ఆధ్వర్యంలో ప్రస్తుతం 35 రెసిడెన్షియల్ స్కూల్స్, 2 జూనియర్ కాలేజ్ లు నడుపబడుచున్నవి.

*2.TSWREIS:*
Telangana Social Welfare Residential Educational Institutions Society.

June 2014లో APSWREIS ను తెలంగాణలో TSWREIS గా మార్చారు. దీని ఆధ్వర్యంలో ప్రస్తుతం తెలంగాణలో 268 Residential Institutions ఉన్నాయి.

*3.TTWREIS:*
Telangana Tribal Welfare Residential Educational Institutions Society

దీని ఆధ్వర్యంలో ప్రస్తుతం తెలంగాణలో 169 Residential Institutions ఉన్నాయి.

*4.MJPTBCWREIS:*
Mahatma Jyotiba Phule Telangana Backward Classes Welfare Residential Educational Institutions Society.

June 2014లో APREIS ను తెలంగాణలో  MJPTBCWREIS గా మార్చారు. దీని ఆధ్వర్యంలో ప్రస్తుతం తెలంగాణలో 162 Residential Institutions ఉన్నాయి. అందులో 142 Residential Schools, 19 Junior Colleges, 1 Degree Colleges ఉన్నాయి.

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: February 22, 2018

0 comments:

Post a Comment