భారత రాజ్యాంగ లక్షణాలు
1. గణతంత్ర అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి
గ్రహించారు ? – ఫ్రాన్స్
2. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో
ఏ పదాలను చేర్చారు ? – సామ్యవాద, లౌకిక, సమగ్రత
3. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి పేరుగాంచిన దేశం ?
– స్విట్జర్లాండ్
4. భారత ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు తోడ్పడేవి ? – ప్రాథమిక విధులు
5. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ? – బెరుబెరి వర్సెస్ యూనియన్ – 1960
6. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ?
– కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం – 1973
7. రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ వంటిదని పేర్కొన్నవారు ?
– జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
8. రాజ్యాంగానికి ప్రవేశిక తాళంచెవి వంటిదని
పేర్కొన్నవారు ? – ఎర్నెస్టు బార్కర్
9. ప్రవేశిక మన కలలకు, ఆలోచనలకు ప్రతిరూపం అని పేర్కొన్నవారు ? – కృష్ణస్వామి అయ్యర్
10. రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ప్రకరణలు, షెడ్యూళ్లు, భాగాలు ఉన్నాయి ?
– ప్రకరణలు – 450, షెడ్యూళ్లు -12, భాగాలు -24 ఉన్నాయి.
11. రాజ్యాంగ ప్రవేశికకు మూలం ?
– నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం
12. ప్రవేశిక ప్రకారం మన దేశం ?
– సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రదేశం.
13. రాజ్యాంగ మూలతత్వం, ఉపోద్ఘాతంగా దేన్ని పేర్కొంటారు ? – రాజ్యాంగ ప్రవేశిక
14. రాజ్యాంగ ప్రవేశిక ఏ అంశాలను తెలుపుతుంది ?
– 1. అధికారానికి మూలం, 2. రాజకీయ స్వభావం, 3. రాజ్యాంగ ఆశయాలు, 4. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ
15. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికిగల మరోపేరు ?
– బాధ్యతాయుత ప్రభుత్వం
16. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ ప్రధాన లక్షణం ?
– శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించడం
17. అధికార పృద్ధక్కరణ (అధికార పంపిణీ) సిద్ధాంతం
ఏ ప్రభుత్వ విధానంలో అమల్లో ఉంటుంది ?
– అధ్యక్ష తరహా విధానం
18. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏ సూత్రాలతో పనిచేస్తుంది ? – సమష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత
19. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాగా తోడ్పడే ప్రభుత్వం ఏది ?
– పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
20. మన దేశంలో పార్లమెంటరీ విధానానికి పునాదులు వేసిన చట్టం ? – 1919 మాంటెంగ్ చేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం
21. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగమేది ? – అమెరికా రాజ్యాంగం
22. ఏ తరహా ప్రభుత్వానికి లిఖిత రాజ్యాంగం తప్పనిసరి ?
– సమాఖ్య ప్రభుత్వం
23. రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి తెలిపే షెడ్యూల్ ? – నాల్గో షెడ్యూల్
24. ఏడో షెడ్యూల్‌లో ఏ అంశాన్ని చర్చించారు ? – కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
25. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు ? – దక్షిణాఫ్రికా
26. రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ప్రకరణేది ? – 368
27. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను సవరించేందుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతిని పాటిస్తారు ? – దృఢ పద్ధతి
28. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతి పాటిస్తారు ? – సరళ పద్ధతి – 1/2 పార్లమెంట్ మెజార్టీ
29. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లును ఎవరు ప్రవేశపెట్టాలి ? – కేంద్ర హోంమంత్రి
30. రాజ్యాంగ సవరణ విధానం ఏ భాగంలో ఉంది ?
– 20వ భాగం
31. ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలకు ఉదాహరణ ?
– స్విట్జర్లాండ్, అమెరికా
32. ప్రవాస భారతీయులకు మనదేశంలో ఇచ్చే పౌరసత్వాన్ని ఏమని పిలుస్తారు ? – ఎల్లోకార్డు
33. మన దేశంలో ద్వంద్వ పౌరసత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ?
– జమ్మూ కాశ్మీర్
34. విదేశీయులకు కూడా వర్తించే హక్కులకు ఉదాహరణ ?
– అధికరణం -14,17,21,23,24
35. ప్రాథమికంగా రాజ్యాంగం 14 అధికార భాషలను గుర్తించింది. 15వ అధికార భాషగా సింధి భాషను ఎప్పుడు గుర్తించింది ? – 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా
36. న్యాయం అనే పదాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు ?
– రష్యా
37. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను ఎక్కడి నుంచి గ్రహించారు ? – ఫ్రాన్స్
38. ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ?
– 26 నవంబర్, 1949
39. ప్రపంచశాంతి కోసం ఐక్యరాజ్యసమితిలో భారతదేశం ఎప్పుడు చేరింది ? – 30 అక్టోబర్ 1945
40. సామ్యవాద సమాజ స్థాపనకోసం 20 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ? – 1975
41. మనదేశంలో ఏ తరహా న్యాయవ్యవస్థ ఉంది ?
– స్వయం ప్రతిపత్తి ఉన్న ఏకీకృత న్యాయవ్యవస్థ
42. ఏకీకృత న్యాయవ్యవస్థను ఎక్కడి నుంచి గ్రహించారు ?
– బ్రిటన్
43. ఏ తరహా న్యాయవ్యవస్థకు న్యాయసమీక్ష అధికారం ఉంటుంది ? – స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ
44. న్యాయసమీక్ష అంటే ? – శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేవోనని పరిశీలించే అధికారం
45. ఆల్ట్రావైరస్ అంటే ఏమిటి ? – ఏదైనా శాసనాన్ని రాజ్యాంగ విరుద్ధమైందిగా ప్రకటించడం
46. ఏ ప్రకరణ ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి ? – ప్రకరణ-50
47. లౌకికరాజ్యం అంటే ? – అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, ఏ మతాన్నీ అధికార మతంగా స్వీకరించకుండా ఉండడం
48. మతరహిత రాజ్యానికి ఉదాహరణ ? – చైనా
49. ఏదైనా ఒక మతాన్ని అధికార మతంగా స్వీకరిస్తే మత రాజ్యంగా పేర్కొంటారు. దీనికి ఉదాహరణలు ?
– పాకిస్తాన్, శ్రీలంక
50. మన రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కల్పిస్తున్న ప్రకరణ ఏది ? – ప్రకరణ-25
51. లౌకిక రాజ్యస్థాపనకు తోడ్పడే ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటు చేయాలని ఏ అధికరణం తెలుపుతోంది ?
– అధికరణం -44
52. ప్రజాస్వామ్యానికి పునాది అయిన సార్వజనీన వయోజన ఓటు హక్కును ఏ అధికరణం ప్రకారం కల్పించారు ?
– అధికరణం -326
53. ఓటింగ్ వయోపరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు ఎప్పుడు తగ్గించారు ? – 1989లో 61వ సవరణ ద్వారా
54. మహిళలకు ఓటు హక్కును కల్పించిన మొదటి దేశం ?
– న్యూజిలాండ్
55. చట్టసభల్లో మహిళ భాగస్వామ్యం అధికంగా
ఉన్న దేశం ? – రువాండ
56. ప్రస్తుత లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య ఎంత ?
– 66
57. పౌరులకు మాత్రమే వర్తించే హక్కులు ?
– రాజకీయ హక్కులు
58. పౌరసత్వం గురించి తెలిపే నిబంధనలు ఏవి ? – 5-11
59. భారత పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ?
– 1955
60. ఏ కమిటీ సిఫార్సు మేరకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు ?
– ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ – 1986
61. 1951లో చేసిన మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా
ఏ షెడ్యూల్‌ను చేర్చారు ? – తొమ్మిదో షెడ్యూల్
62. భారత రాజ్యాంగంలో మన ప్రభుత్వాన్ని ఏవిధంగా పేర్కొన్నారు ? – రాష్ట్రాల సమ్మేళనం
63. భారత ప్రభుత్వం ఒక కేంద్రీకృత సమాఖ్య అని ఎవరు పేర్కొన్నారు ? – ఐవర్ జెన్నింగ్స్
64. భారత ప్రభుత్వం సాధారణ సమయంలో సమాఖ్య, అత్యవసర సమయంలో ఏకకేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తుంది అని పేర్కొన్నవారు ? – బి.ఆర్.అంబేద్కర్
65. ప్రవేశిక ప్రకారం మన రాజ్యాంగ ఆశయాలు ?
– న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
0 comments:
Post a Comment