1. మానవాభివృద్ధి సూచీ - 2016లో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1) ఆస్ట్రేలియా
2) నార్వే
3) స్విట్జర్లాండ్
4) స్వీడన్
View Answer
సమాధానం: 2
వివరణ: మానవాభివృద్ధి సూచీని ఏటా ఐక్యరాజ్య సమితి విడుదల చేస్తుంది. 2016 సూచీలో నార్వే తొలిస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సూచీలో భారత్ 131వ స్థానంలో ఉంది.
2. 2020 లోపు దేశంలోని ఏ జిల్లాను కార్బన్ తటస్థ (Carbon Neautral) ప్రాంతంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ?
1) హైదరాబాద్
2) పూణె
3) మజులి
4)అమృత్‌సర్
View Answer
సమాధానం: 3
వివరణ: మజులి జిల్లా అస్సాం రాష్ట్రంలో ఉంది. 2020 నాటికి వాయుకాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఈ ప్రాంతాన్ని జీవ వైవిద్య హెరిటేజ్ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
3. భారత ప్రభుత్వం ఏ సంవత్సరం లోపు అణు విద్యుత్ సామర్థ్యాన్ని 15 వేల మెగావాట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ?
1) 2024
2) 2022
3) 2020
4) 2018
View Answer
సమాధానం: 1
4. భారత స్మార్ట్ గ్రిడ్ ఫౌండేషన్ ఇచ్చే స్మార్ట్ టెక్నాలజీ ఆఫ్ ది ఇయర్ - 2016 పురస్కారానికి ఎంపికైన సంస్థ ?
1) సీడీఎఫ్ ఇండియా
2) బీడీకే ఇండియా
3) ఏఎమ్‌ఎఫ్ ఇండియా
4) ఏబీబీ ఇండియా
View Answer
సమాధానం: 4
వివరణ: కర్ణాటకలోని 1,035 మెగావాట్ల శరవాతి హైడ్రో పవర్ ప్లాంట్‌ను పునరుద్ధరించినందుకు గాను బెంగళూరుకు చెందిన ఏబీబీ ఇండియా సంస్థకు ఈ పురస్కారం లభించింది.
5. అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ (ఐఎస్‌ఏ)కు పూర్తికాల డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఉపేంద్ర త్రిపాఠి
2) నారయగ్ త్రిపాఠి
3) విద్యా ఘోష్
4) రాజేంద్ర కృష్ణ
View Answer
సమాధానం: 1
వివరణ: సౌరశక్తి వినియోగం, అభివృద్ధి, అవగాహన కోసం 2015 నవంబర్ 30న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ అంతర్జాతీయ సోలార్ అలయెన్స్‌ను ప్రారంభించారు.
6. జాతీయ సూపర్ కంప్యూటర్ మిషన్ కింద ఏ విద్యా సంస్థలో సూపర్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నారు ?
1) ఐఐటీ - మద్రాస్
2) ఐఐటీ - బాంబే
3) ఐఐటీ - ఖరగ్‌పూర్
4) ఐఐటీ - ఢిల్లీ
View Answer
సమాధానం: 3
వివరణ: రానున్న ఏడేళ్లలో రూ. 4,500 కోట్ల వ్యయంతో దేశంలోని అతి ముఖ్యమైన విద్యాసంస్థల్లో సూపర్ కంప్యూటర్‌ను ఏర్పాటు చే యడమే లక్ష్యంగా జాతీయ సూపర్ కంప్యూటర్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తొలి సూపర్ కంప్యూటర్ ( 1 పెటా ప్లాప్ వేగం) ను ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఏర్పాటు చేయనున్నారు.
7. టాటా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు చెందిన GRAPES - 3 టెలిస్కోప్ ఎక్కడ ఉంది ?
1) పోఖ్రాన్
2) ఊటి
3) నైనిటాల్
4) సిమ్లా
View Answer
సమాధానం: 2
వివరణ: అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చే కాస్మిక్ కిరణాల అధ్యయనం కోసం ఊటీలో ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు.
GRAPES - 3 : Gamma Ray Astronomy Pev Energies Phase - 3
8. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న న్యూట్రినో అబ్జర్వేటరీ ప్రాజెక్టుకు ఇటీవల జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ పర్యావరణ అనుమతి నిరాకరించింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) కేరళ
4) కర్ణాటక
View Answer
సమాధానం: 2
వివరణ: న్యూక్లియర్ ఫిజిక్స్ పరిశోధనల కోసం తమిళనాడు రాష్ట్రంలో 1200 కి.మీ. లోతైన గుహలలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇది మతికెట్టన్ షోల జాతీయ పార్కుకు 5 కి.మీ. దూరంలో ఉండటం వల్ల జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ పర్యావరణ అనుమతికి నిరాకరించింది.
9. ప్రపంచ జల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 16
2) మార్చి 19
3) మార్చి 22
4) మార్చి 26
View Answer
సమాధానం: 3
వివరణ: 1992 రియో డిజనిరోలో జరిగిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ, అభివృద్ధి సమావేశంలో అజెండా 21కి అన్ని దేశాలు అంగీకరించాయి. దీని ప్రకారం జల సంరక్షణ ఆవశ్యకత గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
10. 5వ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
1) తవాంగ్
2) లడఖ్
3) శ్రావణ బెళగళ
4) అమరావతి
View Answer
సమాధానం: 1
వివరణ: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 5వ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవాన్ని తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్ లో) ప్రారంభించారు. ఈ ఉత్సవాలను 9 రోజుల పాటు ( మార్చి 23 - 31 ) ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో నిర్వహించారు.
11. తొమ్మిదో గూర్ఖా రైఫిల్స్‌ను 1817లో ఏ ప్రాంతంలో ప్రారంభించారు ?
1) రేణిగుంట
2) సికింద్రాబాద్
3) విశాఖపట్నం
4) మునగాల
View Answer
సమాధానం: 2
వివరణ: గూర్ఖా రైఫిల్స్‌ను సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఉత్సవాలు నిర్వహించారు. ఈ రెజిమెంట్ ఇప్పటి వరకూ 3 విక్టోరియా క్రాస్‌లు, 5 మహావీర్ చక్రలు, 17 వీర్ చక్ర మరియు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రశంసా పతకాలు అందుకుంది.
12. గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ ప్రదర్శన ఇండెక్స్ - 2017లో భారత్ స్థానం ?
1) 10
2) 30
3) 87
4) 107
View Answer
సమాధానం: 3
వివరణ: 127 దేశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ ప్రదర్శన ఇండెక్స్‌ను తయారు చేసింది. ఈ నివేదికలో స్విట్జర్లాండ్ తొలి స్థానంలో నిలవగా చివరి స్థానంలో బహ్రెయిన్ ఉంది.
13. ఇటీవల ఆధార్ ఆధారిత చెల్లింపుల అప్లికేషన్‌ను ప్రారంభించిన బ్యాంకు ఏది ? 
1) కర్ణాటక బ్యాంకు
2) ఆంధ్రాబ్యాంకు
3) కొటక్ బ్యాంకు
4) సౌత్ ఇండియా బ్యాంకు
View Answer
సమాధానం: 4
వివరణ: నగదు రహిత డిజిటల్ చెల్లింపుల వృద్ధి కోసం సౌంత్ ఇండియా బ్యాంకు ఆధార్ ఆధారిత చెల్లింపుల అప్లికేషన్‌ను ప్రారంభించింది.
14. ప్రతిష్టాత్మక ఏబెల్ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) పీటర్ లాక్స్
2) ఎస్.ఆర్. శ్రీనివాస వర్దన్
3) వైవ్స్ మేయర్
4) జాన్ మిల్నర్
View Answer
సమాధానం: 3
వివరణ: నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ 2003 నుంచి గణిత శాస్త్రంలో ప్రతిభ చూపిన వారికి ఏబెల్ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. ఈ అవార్డు కింద 6 మిలియన్ క్రొన్‌ల నగదు బహుమతి అందజేస్తారు. వేవ్‌లెట్ సిద్ధాంతాన్ని విశదీకరించినందుకు గాను వైవ్స్ మేయర్‌ను 2017 పురస్కారానికి ఎంపిక చేశారు.
15. హల్ డేవిడ్ స్టార్ లైట్ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) ఎడ్ షిరాన్
2) మూడి రేజ్‌మ్
3) యూసఫ్ కీన్
4) రోమిట్సి విన్స్
View Answer
సమాధానం: 1
వివరణ: సాంగ్ రైటర్స్ హల్ ఎమిరిటస్ ఛైర్మన్ హల్ డేవిడ్ గౌరవార్థ్ధం 2004లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.
16. మొదటి కుల్‌దీప్ నయ్యర్ జర్నలిజం పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) బర్ఖాదత్
2) రవిశ్ కుమార్
3) అర్నబ్ గోస్వామి
4) రాకేశ్ చింతల
View Answer
సమాధానం: 2
వివరణ: ఈ పురస్కారాన్ని జర్నలిస్ట్ కుల్‌దీప్ నయ్యర్ అండ్ గాంధి శాంతి ఫౌండేషన్లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.
17. ఎయిర్‌టెల్ సంస్థ 4జీ సేవలను విస్తరించేందుకు ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) టికొనా డిజిటల్
2) మ్యాక్సిస్ డిజిటల్
3) టాటా డిజిటల్
4) మహేంద్ర డిజిటల్
View Answer
సమాధానం: 1
వివరణ: ముంబయికి చెందిన టికొనా (TIKONA) డిజిటల్ నెట్‌వర్క్‌తో భారతి ఎయిర్‌టెల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం టికొనాకు చెందిన 5 సర్కిళ్లలో 4జీ సర్వీసులను ఎయిర్‌టెల్ పొందుతుంది.
18. నాసా ఏ సంవత్సరంలోపు అంతరిక్షంలోకి అణు గడియారాన్ని పంపనుంది ?
1) 2023
2) 2021
3) 2019
4) 2017
View Answer
సమాధానం: 4
వివరణ: 2017 చివరిలోగా నాసా అంతరిక్షంలోకి అణు గడియారాన్ని పంపనుంది. దీన్ని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ (కాలిఫోర్నియా) తయారు చేసింది.
19. చీకటిలో సంచరించే చిలుకను ఎక్కడ కనుగొన్నారు ?
1) ఆస్ట్రేలియా
2) దక్షిణాఫ్రికా
3) బ్రెజిల్
4) కాంగో
View Answer
సమాధానం: 1
వివరణ: చీకటిలో మాత్రమే సంచరించే చిలుక పసుపు ఆకు పచ్చ రంగులో ఉంటుంది. దీని ఈకలు నల్లని రంగులో ఉంటాయి. ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే ఈ చిలుక గత వందేళ్లుగా కనిపించలేదు. అయితే ఇటీవల పశ్చిమ ఆస్ట్రేలియాలో ఇది మళ్లీ కనిపించింది.
20. అంతర్జాతీయ షూటింగ్ ఫెడరేషన్ షాట్‌గన్ ప్రపంచ కప్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) జేమ్స్ విల్లెట్
2) హింగ్
3) అంకుర్ మిట్టల్
4) జెర్రి మిక్సూలెక్
View Answer
సమాధానం: 3
వివరణ: మెక్సికోలో జరిగిన ఈ పోటీల్లో ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ విల్లెట్ ను ఓడించి భారత్‌కు చెందిన అంకుర్ మిట్టల్ విజేతగా నిలిచాడు. చైనాకు చెందిన హింగ్ కాంస్యం గెలుచుకున్నాడు.
21. అంతర్జాతీయ ఐపీసీ అథ్లెటిక్ గ్రాండ్ ప్రీ పోటీలను ఎక్కడ నిర్వహించారు ?
1) బాకు
2) దుబాయి
3) రియోడి జనిరో
4) హవాయి
View Answer
సమాధానం: 2
22. అంతర్జాతీయ ఐపీసీ అథ్లెటిక్ గ్రాండ్ ప్రీ జూవెలిన్ త్రోలో బంగారు పతకాన్ని గెలుచుకుంది ఎవరు ?
1) సుందర్ సింగ్ గుర్జర్
2) విట్స్ విలియమ్స్
3) రోజాలిన్ విలియమ్స్
4) మాథ్యూ విల్లిస్
View Answer
సమాధానం: 1
వివరణ: ఈ పోటీల్లో జావెలిన్ త్రో ఎఫ్ - 46 విభాగం మరియు డిస్కస్ త్రోలో సుందర్ సింగ్ గుర్జర్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ క్రీడలలో భారత్ మొత్తం 5 బంగారు పతకాలు, 3 వెండి పతకాలు, 5 కాంస్య పతకాలు గెలుచుకుంది.
23. ప్రపంచ మెటిరోలాజికల్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) మార్చి 30
2) మార్చి 27
3) మార్చి 23
4) మార్చి 19
View Answer
సమాధానం: 3
వివరణ: 1950 మార్చి 23న ప్రపంచ మెటిరోలాజికల్ ఆర్గనైజేషన్ ప్రారంభమైంది. దీనికి గుర్తుగా ఏటా మార్చి 23న ప్రపంచ మెటిరోలాజికల్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఐరాస ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ భూమిపై వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తుంది.
24. 23వ కామన్‌వెల్త్ దేశాల కాగ్ అధికారుల సమావేశం ఎక్కడ జరిగింది ?
1) లండన్
2) ప్రిటోలియా
3) కొలంబో
4) న్యూఢిల్లీ
View Answer
సమాధానం: 4
వివరణ: కామన్ వెల్త్ దేశాల కాగ్ అధికారుల సమావేశం 3 ఏళ్లకోసారి జరుగుతుంది. 22వ సమావేశం 2014లో మాల్టాలో జరిగింది.
2017 Theme : Fostering Partnership for capacity development in public audit
25. ఫార్చూన్ ప్రపంచ 50 అత్యుత్తమ నాయకుల జాబితాలో భారత్ నుంచి చోటు సంపాదించింది ఎవరు ?
1) అరుంధతి భట్టాచార్య
2) నందన్ నీలేకని
3) నారాయణ మూర్తి
4) చంద్రశేఖరన్
View Answer
సమాధానం: 1
వివరణ: ఈ జాబితాలో తొలి స్థానంలో చికాగో కబ్స్ బేస్ బాల్ అధ్యక్షుడు థియో ఎపిస్టీన్ ఉన్నారు. తర్వాతి స్థానాల్లో జాక్ మా (ఆలిబాబా గ్రూప్), పోప్ ఫ్రాన్సిస్ (మొదటి లాటిన్ అమెరికన్ పోప్) ఉన్నారు. ఈ జాబితాలోఅరుంధతి భట్టాచార్య 26వ స్థానం దక్కించుకోగా భారత సంతతికి చెందిన డా. రాజ్ పంజాబి (లాస్ట్ మైల్ హెల్త్) 28వ స్థానంలో ఉన్నారు.
26. ప్రతిష్టాత్మక "ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ హానర్" కి ఎంపికైన భారతీయులు ఎవరు ?
1) అరుంధతి భట్టాచార్య
2) ఇంద్రనూయి
3) రాజ్ పంజాబి
4) డా. రాజ్‌కృష్ణ
View Answer
సమాధానం: 2
వివరణ: ది నేషనల్ ఎథినిక్ కొలేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ (NECO) 1986లో ఈ పురస్కారాన్ని ప్రారంభించింది. అమెరికాలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ( ఏటా 88 మందికి) ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ ఏడాది పురస్కార గ్రహీతల్లో ఆరుగురు భారత అమెరికన్‌లు కూడా ఉన్నారు. వారు ఇంద్రనూయి (పెప్సికో), ఫరిద్ జకారియా(సీఎన్‌ఎన్), దినేష్ పాలివల్ (హర్మన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ), డా.అన్నపూర్ణ ఎస్‌కాని (మౌంట్ సినాయ్ స్కూల్), యశ్వంత్ ఎటెల్ మరియు మోహన్ పటే ల్.
27. 6వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డుల్లో జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు ?
1) అర్నబ్ గోస్వామి
2) రఘురాయ్
3) శంకర్
4) శ్రీధర్
View Answer
సమాధానం: 2
వివరణ: రఘురాయ్ దేశంలో ప్రముఖ ఫోటో జర్నలిస్ట్.
28. ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ సూర్యుడిని ఇటీవల ఏ దేశంలో ఏర్పాటు చేశారు ?
1) ఫ్రాన్స్
2) కెనడా
3) ఆస్ట్రేలియా
4) జర్మనీ
View Answer
సమాధానం: 4
వివరణ: synlight ప్రాజెక్టు పేరుతో జర్మనీలోని జులిచ్ నగరంలో ప్రపంచంలో అతిపెద్ద కృత్రిమ స్యూరుడిని ఏర్పాటు చేశారు.
29. దేశంలో తొలిసారిగా నిలువు గార్డెన్‌లను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) లూథియానా
2) న్యూఢిల్లీ
3) బెంగళూరు
4) హైదరాబాద్
View Answer
సమాధానం: 3
వివరణ: బెంగళూరులోని హోసుర్ రోడ్డులోని ఎలక్ట్రానిక్స్ సిటి ఫ్లై ఓవర్ స్తంబాలకు నిలువు గార్డెన్‌లను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో తొలి నిలువు గార్డెన్‌లను చైనా ప్రారంభించింది.
30. ప్రపంచ ట్యూబర్ క్యూలోసిస్ దినాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) మార్చి 24
2) మార్చి 26
3) మార్చి 28
4) మార్చి 30
View Answer
సమాధానం: 1
వివరణ: 1882 మార్చి 24న డా. రాబర్ట్ కోచ్ ట్యూబర్ క్యూలోసిస్‌కు కారణాలను కనుగొన్నట్లు ప్రకటించారు. దీనికి గుర్తుగా టీబీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా మార్చి 24న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
31. భారత్‌లోని ఏ నగరాన్ని ఇటీవలయునెస్కో వారసత్వ సంపద జాబితాలో చే ర్చింది ?
1) హైదరాబాద్
2) ఢిల్లీ
3) పూణె
4) ముంబయి
View Answer
సమాధానం: 2
వివరణ: సాంస్కృతిక మరియు సహజ ప్రాముఖ్యత గల ప్రాంతాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తుంది. ఇటీవల ఢిల్లీ, అహ్మదాబాద్, భువనేశ్వర్, జైపూర్, విక్టోరియా, ఆర్ట్ డెకో నగరాలను ఇటీవల ఈ జాబితాలో చేర్చింది.
32. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఇటీవల తొలి మహిళా అధికారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) తనుశ్రీ పరేఖ్
2) రాజ్యలక్ష్మీ
3) సైంథవి లాడికి
4) శిరోజ శర్మ
View Answer
సమాధానం: 1
వివరణ: 1965 డిసెంబర్ 1న ఏర్పాటైన బీఎస్‌ఎఫ్‌లో ఒక మహిళను అధికారిగా నియమించటం ఇదే తొలిసారి. తనుశ్రీ పరేఖ్ 2014లో బీఎస్‌ఎఫ్‌కు ఎంపికయ్యారు.
33. అంతర్జాతీయ డైమండ్ కాన్ఫరెన్స్ - 2017ను ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) ముంబయి
4) విశాఖపట్నం
View Answer
సమాధానం: 3
34. 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు ?
1) నాగార్జున విశ్వవిద్యాలయం
2) ఉస్మానియా విశ్వవిద్యాలయం
3) పూణె విశ్వవిద్యాలయం
4) అన్నామలై విశ్వవిద్యాలయం
View Answer
సమాధానం: 2
వివరణ: 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను 2018లో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. ఓయూ ఇప్పటి వరకూ 5 సార్లు ఈ సమావేశాన్ని నిర్వహించింది.
35. ఈఎస్‌ఐసీ ఇటీవల ఏ ప్రాంతంలో దేశంలోని తొలి మొబైల్ క్లినిక్‌ను ప్రారంభించింది ?
1) తెలంగాణ
2) ఛత్తీస్‌గఢ్
3) కేరళ
4) గోవా
View Answer
సమాధానం: 1
వివరణ: ఈఎస్‌ఐసీ దేశంలోనే తొలి మొబైల్ క్లినిక్‌లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించింది.
36. దేశీయ ఎయిర్ ట్రాఫిక్‌లో తొలిస్థానంలో ఉన్న దేశం ?
1) చైనా
2) భారత్
3) జపాన్
4) అమెరికా
View Answer
సమాధానం: 4
వివరణ: సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్ సంస్థ ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఈ జాబితాలో 719 మిలియన్‌ల దేశీయ ప్రయాణికులతో అమెరికా ఎయిర్ ట్రాఫిక్‌లో తొలిస్థానంలో ఉంది. 436 మిలియన్‌ల దేశీయ ప్రయాణికులతో చైనా రెండో స్థానంలో, 100 మిలియన్‌ల దేశీయ ప్రయాణికులతో భారత్ మూడో స్థానంలో ఉంది.
37. కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ ప్రభుత్వ రంగ సంస్థకు రూ.591 కోట్ల జరిమానా విధించింది ?
1) ఓన్‌జీసీ
2) ఎన్‌ఎమ్‌డీసీ
3) కోల్ ఇండియా
4) బీఈఎల్
View Answer
సమాధానం: 3
వివరణ: కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రమాణాలను అతిక్రమించినందుకు గాను కోల్ ఇండియాకు రూ.591 కోట్ల జరిమానా విధించారు.
38. అమెరికన్ ఫైనాన్సియల్ మ్యాగజైన్ విడుదల చేసిన 30 అత్యుత్తమ సీఈవోల జాబితాలో చోటు సంపాదించిన భారతీయుడు ఎవరు ?
1) ఇంద్రనూయి
2) ఆదిత్య పూరి
3) చందా కొచ్చర్
4) అరుంధతి భట్టాచార్య
View Answer
సమాధానం: 2
వివరణ: హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పూరి ఈ జాబితాలో 23వ స్థానంలో ఉన్నారు. జాబితాలో తొలిస్థానంలో మారి బార్రా (జనరల్ మోటార్స్), చివరి స్థానంలో మార్క్ జుకెర్‌బర్గ్ (ఫేస్‌బుక్) ఉన్నారు.
39. ప్రపంచంలో అతిపెద్ద క్యాప్ స్టోన్‌ను ఎక్కడ కనుగొన్నారు ?
1) నగునూరు
2) నర్మెట్ట
3) భోపాల్
4) మీరట్
View Answer
సమాధానం: 2
వివరణ: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో పురావస్తు శాఖ అధికారులు ఆది మానవుల శ్మశాన వాటికలో 40 టన్నుల బరువు గల క్యాప్ స్టోన్ (సమాధుల మీద నిర్మించే గోడ లాంటి నిర్మాణం)ను కనుగొన్నారు.
40. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ విజేత ఎవరు ?
1) లేవిస్ హామిల్టన్
2) వెల్టరీ బాటాస్
3) సెబాస్టియన్ వెటెల్
4) కిమిరై కొంనైన్
View Answer
సమాధానం: 3
వివరణ: మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ రేసులో లేవిస్ హామిల్టన్‌ను ఓడించి సెబాస్టియన్ వెటెల్ టైటిల్ గెలుచుకున్నాడు.
41. ఇటీవల ఏ దేశ పార్లమెంటులో గిల్గిత్ - బాల్టిస్తాన్ ప్రాంతము భారత్‌లో అంతర్భాగ మని తీర్మానం చేసింది ?
1) బ్రిటన్
2) అమెరికా
3) చైనా
4) రష్యా
View Answer
సమాధానం: 1
వివరణ: బ్రిటన్ పార్లమెంటులోని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్ - బాల్టిస్తాన్ భారత్‌లో అంతర్భాగమని పేర్కొంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ప్రాంతంలో చైనా - పాకిస్తాన్ ఆర్థిక నడవా నిర్మించారు.
42. పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రదానం చేసే కళారత్నన్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) అమితాబ్ బచ్చన్
2) ఓంపురి
3) నసిరుద్దిన్ షా
4) అనుపమ్ ఖేర్
View Answer
సమాధానం: 4
వివరణ: పంజాబ్ యునివర్సిటీ 66వ స్నాతకోత్సవంలో కళారత్నన్ పురస్కారాన్ని అనుపమ్ ఖేర్‌కు ప్రదానం చేసింది.
43. మియామి ఓపెన్ టైటిల్ విజేత ఎవరు ?
1) రాఫెల్ నాదల్
2) జిమ్మి కార్నర్
3) రోజర్ ఫెదరర్
4) ఫిలిప్ కోహల్స్ స్క్రైబర్
View Answer
సమాధానం: 1
వివరణ: మియామి ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫిలిప్‌ను ఓడించి రాఫెల్ నాదల్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
44. పురుషుల ప్రపంచకప్ హాకీ - 2018 టోర్నమెంట్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు ?
1) షార్జా
2) దుబాయి
3) భువనేశ్వర్
4) రాంచి
View Answer
సమాధానం: 3
వివరణ: ఈ టోర్నమెంట్‌ను భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో నిర్వహించనున్నారు. 2018 నవంబర్ 24 నుంచి డిసెంబర్ 16 వరకు జరగనున్న ఈ పోటీలకు ఒడిశా అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
45. ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1)మార్చి 30
2) మార్చి 27
3) మార్చి 23
4) మార్చి 20
View Answer
సమాధానం: 2
వివరణ: అంతర్జాతీయ థియేటర్ ఇనిస్టిట్యూట్ 1961 మార్చి 27న ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ప్రారంభించింది. థియేటర్ మాధ్యమం ద్వారా సమాజంలో మార్పునకు కృషి చేసే లక్ష్యంతో ఈ రోజున వివిధ నాటకాలు ప్రదర్శిస్తారు.
46. ఇటీవల ఏ రాష్ట్రం అనధికార కబేళాలను మూసివేసింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గోవా
4) జార్ఖండ్
View Answer
సమాధానం: 4
వివరణ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అనధికార కబేళాలను మూసివేసింది. ఆ రాష్ట్రం స్ఫూర్తితో జార్ఖండ్ ప్రభుత్వం కూడా అనుమతి లేకుండా నడుస్తున్న కబేళాలను మూసివేసింది.
47. 9వ వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ (WEEC) ను ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) వాంకోవర్
3) లండన్
4) బెర్లిన్
View Answer
సమాధానం: 2
వివరణ: 2017 Theme : Culture Environment : Weaving New Connections
48. ప్రతిష్టాత్మక సిక్కు రత్న - 2017 పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) కపిల్ సింగ్
2) నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు
3) రవిందర్ కౌర్
4) గురిందర్ చద్ధా
View Answer
సమాధానం: 4
వివరణ: భారత సంతతికి చెందిన ఇంగ్లీష్ సినిమా రచయిత, డెరైక్టర్ గురిందర్ చద్ధాకు బిటిష్ సిక్కు అసోసియేషన్ ఈ పురస్కారాన్ని అందజేసింది. వెస్రాయి హౌస్ చిత్రానికి గాను ఆమెకు ఈ అవార్డు లభించింది.
49. ఉన్నతి పేరుతో క్రెడిట్ కార్డులను ప్రారంభించిన సంస్థ ఏది ?
1) హెచ్‌డీఎఫ్‌సీ
2) ఐసీఐసీఐ
3) ఎస్‌బీఐ
4) ఆంధ్రాబ్యాంక్
View Answer
సమాధానం: 3
వివరణ: ఖాతాల్లో రూ. 25 వేలు నిల్వ ఉంచే వారికి ఉన్నతి క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.
50. ప్రవాసీ భారతీయ సమ్మాన్ - 2017 అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ?
1) ప్రీతి పటేల్
2) శేఖర్ శర్మ
3) ఆనంద్ మిశ్రా
4) రోజారెడ్డి
View Answer
సమాధానం: 1
వివరణ: భారత సంతతికి చెందిన బ్రిటిష్ కేబినెట్ మినిస్టర్ ప్రీతి పటేల్ ఈ అవార్డు అందుకున్నారు. భారత్ - బ్రిటన్ మధ్య సంబంధాల బలోపేతం కోసం కృషి చేసినందుకు ఆమెకు ఈ అవార్డు లభించింది.
0 comments:
Post a Comment