LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

సాయుధ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం (1956

Posted by PAATASHAALANEWS on Friday, 19 May 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

సాయుధ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం (1956)
➖➖➖➖➖➖➖➖➖➖
1. హైదరాబాద్ రాష్ట్ర తొలి స్పీకర్ ఎవరు?
1) జి. రామాచారి 
2) కాశీనాథరావు వైద్య 
3) వి.డి. దేశ్‌పాండే 
4) జి.ఎస్. మెల్కోటె

View Answer

సమాధానం: 2

2. హైదరాబాద్ రాష్ట్రంలో ‘హితరక్షణ సమితి’ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 
1) 1956 
2) 1953
3) 1952 
4) 1954

View Answer

సమాధానం: 3

3. ‘విశాలాంధ్ర’ ఆలోచన కలిగి ఉన్న తొలి నాయకులు ఎవరు?
1) రావి నారాయణరెడ్డి
2) హయగ్రీవాచారి
3) శ్రీశ్రీ 
4) సుందర రామిరెడ్డి

View Answer

సమాధానం: 4

4. ‘ఆంధ్రరాష్ట్రం’ గ్రంథ రచయిత?
1) వీరబ్రహ్మం
2) ఆదిపూడి సోమనాథ్ రావు
3) పుచ్చలపల్లి సుందరయ్య
4) కొండా వెంకటప్పయ్య

View Answer

సమాధానం: 4

5. ‘విశాలాంధ్ర మహాసభ’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) వరంగల్ 
2) హైదరాబాద్ 
3) విజయవాడ
4) బాపట్ల

View Answer

సమాధానం: 3

6. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని సూచించింది ఎవరు?
1) వల్లభాయ్ పటేల్
2) సి. రాజగోపాలాచారి
3) కె.వి. రంగారెడ్డి
4) నెహ్రూ

View Answer

సమాధానం: 2

7. విశాలాంధ్ర ఉద్యమాన్ని సామ్రాజ్యవాద ధోరణిగా అభివర్ణించింది ఎవరు?
1) జవహర్‌లాల్ నెహ్రూ
2) బూర్గుల రామకృష్ణారావు 
3) రాజగోపాలాచారి
4) వల్లభాయ్ పటేల్

View Answer

సమాధానం:1

8. 1950లో విశాలాంధ్ర మహాసభ తొలి సమావేశాన్ని ఎవరి అధ్యక్షతన నిర్వహించారు?
1) శ్రీశ్రీ
2) అయ్యదేవర కాళేశ్వరరావు
3) హయగ్రీవాచారి
4) స్వామి రామానంద

View Answer

సమాధానం: 3

9. విశాలాంధ్ర మహాసభ రెండో సమావేశానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) దీన్ని 1954లో హైదరాబాద్‌లో నిర్వహించారు
2) దీనికి శ్రీశ్రీ అధ్యక్షత వహించారు
3) నాటి డిప్యూటీ మేయర్ మీర్ అహ్మద్ అలీఖాన్ విశాలాంధ్రను సమర్థించారు
4) అయ్యదేవర కాళేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

View Answer

సమాధానం: 4

10. ‘రాష్ట్రాల పునర్విభజన కమిషన్’ (ఎస్సార్సీ)అధ్యక్షులు ఎవరు?
1) ఎస్.కె. థార్ 
2) ఫజల్ అలీ 
3) జె.వి.పి.
4) కుమార రాజా

View Answer

సమాధానం: 2

11. ఎస్.ఆర్.సి. అంటే?
1) స్టేట్ ఆర్గనైజేషన్ కమిటీ
2) స్టేట్ రీ-ఆర్గనైజేషన్ కమిషన్ 
3) స్టేట్ రిపబ్లిక్ కమిషన్ 
4) స్టేట్ రీజినల్ కమిషన్

View Answer

సమాధానం: 2

12. కింద పేర్కొన్న వారిలో రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌లో సభ్యులు కానివారెవరు?
1) పన్నాలాల్
2) ఫజల్ అలీ 
3) కుంజ్రు 
4) 1, 2

View Answer

సమాధానం: 4

13. ‘కమ్యూనిస్ట్ విశాలాంధ్ర’ రెండో సమావేశానికి అధ్యక్షత వహించిందెవరు?
1) శ్రీశ్రీ 
2) బద్దం ఎల్లారెడ్డి
3) రావి నారాయణ రెడ్డి
4) పుచ్చలపల్లి సుందరయ్య

View Answer

సమాధానం: 1

14. కింద పేర్కొన్న వారిలో ‘జస్టిస్ థార్’ కమిషన్ సభ్యులు కానివారెవరు?
1) శివనారాయణ
2) జగత్ నారాయణ్ 
3) పన్నాలాల్
4) బి.సి. భాంజర్

View Answer

సమాధానం: 1

15. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ గ్రంథ రచయిత ఎవరు?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) చండ్ర రాజేశ్వర్ 
3) బద్దం ఎల్లారెడ్డి 
4) రావి నారాయణ రెడ్డి

View Answer

సమాధానం: 1

16. కింది వారిలో ‘పెద్ద మనుషుల ఒప్పందం’పై సంతకం చేయనివారు ఎవరు?
1) మర్రి చెన్నారెడ్డి
2) గౌతు లచ్చన్న 
3) ప్రకాశం పంతులు
4) బెజవాడ గోపాల్‌రెడ్డి

View Answer

సమాధానం: 3

17. కింద పేర్కొన్న వారిలో తెలంగాణకు చెందిన ఏ నాయకుడు ‘పెద్ద మనుషుల ఒప్పందం’లో పాల్గొనలేదు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) జె.వి. నర్సింగ రావు
3) మందుముల నర్సింగ రావు
4) మర్రి చెన్నారెడ్డి

View Answer

సమాధానం: 3

18. ‘పెద్ద మనుషుల ఒప్పందం’ ఎప్పుడు జరిగింది? 
1) 1956 ఫిబ్రవరి 29
2) 1956 జనవరి 26
3) 1956 ఫిబ్రవరి 20
4) 1956 మార్చి 20

View Answer

సమాధానం: 3

19. పెద్దమనుషుల ఒప్పందంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంత మంది నాయకులు సంతకం చేశారు? 
1) 6
2) 4
3) 8
4) 5

View Answer

సమాధానం:2

20. ‘తెలంగాణ ప్రాంతీయ సంఘం’ ఏ విధమైన సంస్థ?
1) రాజ్యాంగబద్ధ సంస్థ
2) చట్టబద్ధ సంస్థ 
3) సలహాబద్ధ సంస్థ
4) ఏదీకాదు

View Answer

సమాధానం: 2

21. ‘తెలంగాణ సాయుధ పోరాటం’ ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1946 
2) 1947
3) 1948 
4) 1949

View Answer

సమాధానం: 1

22. తెలంగాణలో రైతు ఉద్యమం మొదటగా ఏ జిల్లాలో ప్రారంభమైంది?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్ 
3) వరంగల్ 
4) ఖమ్మం

View Answer

సమాధానం:4

23. కమ్యూనిస్టు పార్టీని తెలంగాణలో ఎప్పుడు నిషేధించారు?
1) 1946 నవంబర్
2) 1946 డిసెంబర్ 
3) 1945 అక్టోబర్
4) 1945 డిసెంబర్

View Answer

సమాధానం: 1

24. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని ఎన్ని దశలుగా విభజించవచ్చు?
1) 2 
2) 3
3) 4
4) 5

View Answer

సమాధానం: 3

25.తెలంగాణలో నిజాం సొంత భూమిని ఏమని పిలిచేవారు?
1) జాగీర్దార్ 
2) ఖల్సా 
3) సర్ఫ్-ఎ-ఖాస్
4) గైర్ ఖల్సా

View Answer

సమాధానం: 3

26. తెలంగాణలో రైతుల నుంచి భూస్వాములు వసూలు చేసే వడ్డీని ఏమని పిలిచేవారు?
1) నాగు 
2) నానాల్ 
3) లెవీ 
4) చౌకీలు

View Answer

సమాధానం:1

27. ‘ది సాగా ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్’ గ్రంథ రచయిత ఎవరు?
1) కె.వి. రంగారెడ్డి
2) మర్రి చెన్నారెడ్డి
3) కృష్ణకాంత్
4) పింగళి గౌతమ్

View Answer

సమాధానం: 3

28. తెలంగాణలో నిజాం ప్రత్యక్ష పాలన కింద ఎంత శాతం భూమి ఉండేది?
1) 60
2) 30
3) 50
4) 40

View Answer

సమాధానం: 1

29. విసునూరి రామచంద్రారెడ్డి అనే జమీందారు ఏ తాలూకాకు చెందినవారు?
1) సూర్యాపేట
2) వనపర్తి 
3) దేవరకొండ
4) జనగామ

View Answer

సమాధానం: 4

30. ‘హైదరాబాద్ ప్రజాపరిషత్తు’ సమావేశమైన తేది?
1) 1937 నవంబర్ 22
2) 1937 నవంబర్ 12
3) 1936 నవంబర్ 12
4) 1936 నవంబర్ 22

View Answer

సమాధానం: 2

31. తెలంగాణా పోరాటంలో తొలి అమరుడిగా పేర్కొనే దొడ్డి కొమురయ్యను దేశ్‌ముఖ్ గూండాలు ఎప్పుడు హత్య చేశారు?
1) 1946 జూలై 4
2) 1946 జూలై 5
3) 1945 జూన్ 5
4) 1944 జూన్ 4

View Answer

సమాధానం: 1

32. హైదరాబాద్ సంస్థానం మొత్తం వైశాల్యం ఎన్ని చదరపు మైళ్లు?
1) 81239 
2) 82498 
3) 80698 
4) 82698

View Answer

సమాధానం: 4

33. తెలంగాణలో రైతుల నుంచి భూస్వాములు  ‘నాగు వడ్డీ’ ఏవిధంగా వసూలు చేసేవారు?
1) బస్తా ధాన్యానికి ఏడాదిన్నరకు వడ్డీ రెండు బస్తాల ధాన్యం
2) బస్తా ధాన్యానికి 6 నెలలకు వడ్డీ బస్తా ధాన్యం
3) బస్తా ధాన్యానికి వడ్డీ 6 నెలలకు ఒకటిన్నర బస్తాల ధాన్యం
4) పైవేవీ కావు

View Answer

సమాధానం: 3

34. నిజాం ప్రభుత్వం ‘హైదరాబాద్ సంస్థానం స్వతంత్రం’ అని ఏ తేదీన ప్రకటించుకుంది?
1) 1947 మే 12
2) 1946 జూలై 12 
3) 1947 జూన్ 12
4) 1948 జూన్ 12

View Answer

సమాధానం: 3

35. 1951 జనాభా గణాంకాల ప్రకారం హైదరాబాద్ సంస్థానం జనాభా ఎంత?
1) 1.50 కోట్లు
2) 1.80 కోట్లు
3) 1.40 కోట్లు 
4) 1.30 కోట్లు

View Answer

సమాధానం: 2

36. హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య చేపట్టిన సమయం(1948)లో కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) జవహర్‌లాల్ నెహ్రూ
3) బలదేవ్ సింగ్
4) బి.ఆర్. అంబేడ్కర్

View Answer

సమాధానం: 1

37. హైదరాబాద్ సంస్థానంలో ఎన్ని జిల్లాలు ఉండేవి?
1) 14
2) 17
3) 15
4) 16

View Answer

సమాధానం:4

38. హైదరాబాద్ సంస్థానంలో దాదాపు ఎంతశాతం మంది హిందువులు ఉండేవారు?
1) 68
2) 78
3) 88
4) 75

View Answer

సమాధానం: 3

39. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాల పై అంగీకారం కుదిరింది?
1) 12
2) 14
3) 16
4) 18

View Answer

సమాధానం: 2

40. ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ ఎవరు?
1) చందూలాల్ మాధవ్ త్రివేది
2) నీలం సంజీవరెడ్డి
3) అయ్యదేవర కాళేశ్వరరావు
4) కల్లూరి సుబ్బారావు

View Answer

సమాధానం: 1

41. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు బిల్లు’ను రాష్ట్రపతి ఏ తేదీన ఆమోదించారు?
1) 1956 ఆగస్టు 30
2) 1956 ఆగస్టు 31
3) 1956 ఆగస్టు 28
4) 1956 ఆగస్టు 15

View Answer

సమాధానం: 2

42. ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1952 
2) 1950 
3) 1956 
4) 1954

View Answer

సమాధానం:1

43.తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ గా వ్యాఖ్యానించింది ఎవరు?
1) వి.ఎ. స్మిత్
2) ఆర్.సి. బ్రౌన్ 
3) సి.పి. బ్రౌన్
4) చార్లెస్ విల్‌కిన్స్

View Answer

సమాధానం: 3

44.కింద పేర్కొన్న వారిలో విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించిన నాయకుడు ఎవరు?
1) పి.వి. నరసింహారావు
2) రామానంద తీర్థ
3) హయగ్రీవాచారి
4) జె.వి. నర్సింగరావు

View Answer

సమాధానం:4

45.‘హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం- అనుభవాలు’ పుస్తక రచయిత ఎవరు?
1) రామానంద తీర్థ
2) బూర్గుల రామకృష్ణారావు
3) రావి నారాయణ రెడ్డి
4) హయగ్రీవాచారి

View Answer

సమాధానం:1

46. విశాలాంధ్ర ఏర్పాటుపై హైదరాబాద్ శాసనసభలో ఏ తేదీన చర్చ ప్రారంభించారు?
1) 1955 నవంబర్ 23
2) 1955 నవంబర్ 27 
3) 1955 నవంబర్ 25
4) 1955 నవంబర్ 20

View Answer

సమాధానం: 3

47. ‘ప్రజా ఉద్యోగ చట్టం’ను ఎప్పుడు అమలు చేశారు?
1) 1956 
2) 1957 
3) 1958 
4) 1959

View Answer

సమాధానం: 2

48. ‘పెద్ద మనుషుల ఒప్పందం’లో పాల్గొన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఎవరు?
1) జె.వి.నర్సింగరావు
2) కె.వి. రంగారెడ్డి
3) మర్రి చెన్నారెడ్డి
4) బూర్గుల రామకృష్ణారావు

View Answer

సమాధానం: 2

49. ‘సయ్యద్ ఫజల్ అలీ కమిషన్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1953 నవంబర్ 22
2) 1953 డిసెంబర్ 22
3) 1954 డిసెంబర్ 22
4) 1954 నవంబర్ 22

View Answer

సమాధానం: 2

50. ‘స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్’ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
1) 1955 సెప్టెంబర్ 25
2) 1955 సెప్టెంబర్ 30
3) 1955 నవంబర్ 25
4) 1955 నవంబర్ 30

View Answer

సమాధానం: 2

51. ‘తెలంగాణ ప్రాంతీయ కమిటీ’ని ఏర్పాటు చేసిన తేదీ?
1) 1958 ఫిబ్రవరి 20
2) 1959 ఫిబ్రవరి 28
3) 1958 ఫిబ్రవరి 15
4) 1958 ఫిబ్రవరి 22

View Answer

సమాధానం: 1

52. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ‘తెలంగాణ ప్రాంతీయ కమిటీ’ ఏర్పాటుకు ఏ సంవత్సరంలో ఆదేశాలు జారీ అయ్యాయి?
1) 1956 ఫిబ్రవరి
2) 1957 ఫిబ్రవరి 
3) 1958 ఫిబ్రవరి
4) 1956 జూన్

View Answer

సమాధానం: 3

53. పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు హెచ్.ఎన్.సి. అధ్యక్షుడు ఎవరు?
1) స్వామి రామానంద తీర్థ
2) జె.వి. నర్సింగరావు
3) మాడపాటి హనుమంతరావు
4) హయగ్రీవాచారి

View Answer

సమాధానం: 2

54. తెలంగాణ ప్రాంతీయ సంఘానికి చివరి ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు?
1) సయ్యద్ రహమత్ అలీ
2) కోదాటి రాచమల్లు
3) టి. రంగారెడ్డి
4) జె. చొక్కారావు

View Answer

సమాధానం: 1

55. తెలంగాణ ప్రాంతీయ కమిటీలో సభ్యుల సంఖ్య?
1) 6
2) 9
3) 12
4) 14

జవాబు:2.

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: May 19, 2017

0 comments:

Post a Comment