GK & Current Affairs
1. తొలి అంతర్జాతీయ భగవద్గీత మహోత్సవం ఎక్కడ నిర్వహించారు?
1) పానిపట్
2) కురుక్షేత్ర
3) క నోజ్
4) పాట్నా
View Answer
సమాధానం: 2
వివరణ: కురుక్షేత్రలో తొలి అంతర్జాతీయ భగవద్గీత మహోత్సావాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీప్రారంభించారు. ఈ సందర్భంగా 18 వేల మంది విద్యార్థులు ఒకే సారి భగవద్గీతఆలపించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
2. హర్యానాలో వివాహాది శుభకార్యాల సమయంలో ఆయుధాల వాడకాన్ని ఏ సెక్షన్ ప్రకారం నిషేధించారు ?
1) సెక్షన్ 220
2) సెక్షన్ 200
3) సెక్షన్ 144
4) సెక్షన్ 102
View Answer
సమాధానం: 3
వివరణ: వివాహా శుభకార్యాల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయుధాలను ధరించడాన్ని ఐపీసీ సెక్షన్ 144 ప్రకారం హర్యానాలో నిషేధించారు. శుభకార్యాల్లో ఆయుధాలు వాడటం వల్ల గతంలో అనేక మందికి గాయాలయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంలో ఆయుధాల వాడకంపై ఆంక్షలు విధించారు.
3. భారత్ ఇటీవల ఏ దేశంతో కలిసి ‘‘ కొంకణ్- 2016’’ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించింది ?
1) బ్రిటన్
2) అమెరికా
3) కెనడా
4) చైనా
View Answer
సమాధానం: 1
వివరణ: భారత్ నావికాదళం, బ్రిటన్ రాయల్ నావికా దళం సంయుక్తంగా కొంకణ్- 2016 పేరుతో ముంబయి తీరంలో 12 రోజుల పాటు వార్షిక సైనిక విన్యాసాలు నిర్వహించాయి.
4. భారత్‌లో తొలిసారి ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో అందరికీ ఆరోగ్య బీమా అందింది ?
1) విజయవాడ
2) మల్కాజ్‌గిరి
3) గజ్వేల్
4) మెదక్
View Answer
సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాటా సంస్థతో కలిసి ‘‘ స్వాస్థ కుటుంబం’’ పేరుతో బీమా పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ప్రతి ఒక్కరూ రోజుకు రూ.1 లేదా కుటుంబం మొత్తం నెలకు రూ. 120 కడితే సరిపోతుంది. రోగ నిర్ధారణ, సర్జరీ అనంతరం చికిత్స, సహాయం వంటి సేవలు బీమా ద్వారా అందుతాయి.
5. పపంచ సానుభూతిఇండెక్స్-2016 (The Most Empathetic Companies-2016) లో తొలిస్థానంలో ఉన్న సంస్థ ఏది?
1) లింక్డ్‌ఇన్
2) ఆల్ఫాబెట్
3) ఫెస్‌బుక్
4) నెట్ ఫ్లిక్స్
View Answer
సమాధానం: 3
వివరణ: యూకేకు చెందిన The empathy business సంస్థ ప్రపంచ సానుభూతి ఇండెక్స్-2016ను విడుదల చేసింది. ఉత్తమ నాయకత్వం, నైతిక విలువలు, కంపెనీ సంసృ్కతి, సోషల్ మీడియా వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఇండెక్స్‌ను తయారు చేశారు. ఇందులో తొలి స్థానంలో ఫేస్‌బుక్, తర్వాత స్థానాల్లో ఆల్ఫాబెట్, లింక్డ్ ఇన్, నెట్‌ఫ్లిక్స్ ఉన్నాయి.
6. తమిళనాడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరు ?
1) శశికళ
2) స్టాలిన్
3) కనిమెళి
4) ఓ పన్నీర్ సెల్వం
View Answer
సమాధానం: 4
7. ఉజ్బెకిస్తాన్ నూతన అధ్యక్షుడుగా ఎంపికైంది ఎవరు?
1) ఇస్లాం కరిమోవ్
2) శవ్కత్ మిర్జియొయెవ్
3) రఫిక్ నిష్‌నోవ్
4) శామ్యూల్ స్కినోడోవ్
View Answer
సమాధానం: 2
వివరణ: 2016 సెప్టెంబర్‌లో అప్పటి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు ఇస్లాం కరిమోవ్ మరణంతో శవ్కత్ మిర్జియొయెవ్ తాత్కాలిక అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారు. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలలో 88.6 శాతం ఓట్లతో పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
8. ‘‘ స్ట్రైయిట్స్ టైమ్స్ ఆఫ్ సింగపూర్ ’’ పత్రిక ఈ ఏటి మేటి ఆసియన్‌గా ఎవరిని ఎంపిక చేసింది ?
1) సచిన్ బన్సల్, బిన్సీ బన్సల్
2) జెఫ్ బిజోస్
3) డేనియల్ జాంగ్
4) జాక్ మా
View Answer
సమాధానం: 1
వివరణ: ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఈ కామర్స్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించి సాంప్రదాయ వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. అందుకే సైయిట్ టైమ్స్ ఆఫ్ సింగపూర్ పత్రికది డిస్ప్ట్రర్స్ విభాగంలో వీరిద్దరిని ఈ ఏటి మేటి ఆసియన్‌గా పేర్కొంది.
9. 12వ అంతర్జాతీయ ఆయిల్ అండ్ గ్యాస్ కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) బీజింగ్
2) రియాద్
3) న్యూఢిల్లీ
4) టెహరాన్
View Answer
సమాధానం: 3
వివరణ: PETROTECH- 2017 పేరుతో న్యూఢిల్లీలో 12వ అంతర్జాతీయ ఆయిల్ అండ్ గ్యాస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు.
థీమ్: Hydrocarbons to fuel the future : Choices & Challenges
🍃🌺🍃🌺🍃🌺
10. రాజస్థాన్ హైకోర్టు ఇటీవల వేటిపై నిషేధం విధించింది?
1) టాంగా పందేలు
2) గుర్రపు పందేలు
3) జల్లికట్టు
4) బుల్‌ఫైట్
View Answer
సమాధానం: 1
వివరణ: మెటల్ రోడ్లపై టాంగా పందేలు నిర్వహించడం క్రూరత్వమే అని పేర్కొన్న రాజస్థాన్ హైకోర్టు ఈ పందేలను నిషేధించింది. తీర్పుని సుప్రీం కోర్టు కూడా సమర్థించింది.
11. పాలస్తీనా శరణార్థుల సహాయార్థం ఇటీవల భారత్ ఎంత గ్రాంట్ ప్రకటించింది ?
1) రూ. లక్ష కోట్లు
2) 1.25 మిలియన్ డాలర్లు
3) రూ.1.25 కోట్లు
4) రూ.1.50 కోట్లు
View Answer
సమాధానం: 2
వివరణ: ఐక్యరాజ్య సమితి రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ పాలస్తీనా శరణార్థుల కోసంప్రపంచ దేశాల నుంచి నిధులు సేకరించింది. తనవంతు సహాయంగా భారత్ 1.25 మిలియన్ డాలర్లు ప్రకటించింది. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.85 కోట్లు.
12. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఏది ?
1) హిందీ
2) మాండరిన్
3) ఫ్రెంచ్
4) ఇంగ్లీష్
View Answer
సమాధానం: 4
వివరణ: ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ఇంగ్లీష్. ఆ తర్వాత స్థానాల్లో మాండరిన్, ఫ్రెంచ్ ఉన్నాయి. పదవ స్థానంలో ఉన్న హిందీ 2050 లోపు 9వ స్థానానికి వస్తుందని నివేదిక పేర్కొంది.
13. ప్రతిష్టాత్మక టర్నర్ పుస్కారం-2016కు ఎవరు ఎంపికయ్యారు ?
1) రిచర్డ్ డెకాన్
2) టోనీ క్రాగ్
3) అనీష్ కపూర్
4) హెలెన్ మారటెన్
View Answer
సమాధానం: 4
వివరణ: చిత్రకారుడు J.M.W. గౌరవార్థం 1984లో టర్నర్ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. 50 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న చిత్రకారులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. పురస్కారం కింద 25 వేల పౌండ్ల నగదు బహుకరిస్తారు.
14. సుప్రీం కోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైంది ఎవరు ?
1) జస్టిస్ దీపక్ మిశ్రా
2) జస్టిస్ చలమేశ్వర్
3) జస్టిస్ మదన్ లోకూర్
4) జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్
View Answer
సమాధానం: 4
15. 2016 జూనియర్ మహిళల ప్రపంచ హాకీ కప్ విజేత ఎవరు ?
1) ఆస్ట్రేలియా
2) అర్జెంటీనా
3) భారత్
4) నెదర్లాండ్స్
View Answer
సమాధానం: 2
వివరణ: చిలీ రాజధాని శాంటియాగో జరిగిన హాకీ జూనియర్ మహిళల ప్రపంచకప్ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి అర్జెంటీనా టైటిల్ సొంతం చేసుకుంది.
16. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 3
2) డిసెంబర్ 5
3) డిసెంబర్ 7
4) డిసెంబర్ 9
View Answer
సమాధానం: 4
వివరణ: అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2003 నుంచి ఏటా డిసెంబర్ 9న అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
17. ముస్లింల విడాకుల వ్యవస్థ(తలాక్) రాజ్యాంగ వ్యతిరేకమని ఇటీవల ప్రకటించిన హైకోర్టు ఏది ?
1) అలహాబాద్ హైకోర్టు
2) నాగ్‌పూర్ హైకోర్టు
3) మద్రాస్ హైకోర్టు
4) కోల్‌కత్తా హైకోర్టు
View Answer
సమాధానం: 1
వివరణ: షరియత్ చట్టాల ద్వారా ముస్లింలు మూడు సార్లు తలాక్‌ను ఉచ్చరించి విడాకులు పొందడం రాజ్యాంగ విరుద్ధమని అలాహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
18. టైమ్స్ మ్యాగజైన్ 2016 మేటి వ్యక్తి ఎవరు ?
1) నరేంద్ర మోదీ
2) డొనాల్డ్ ట్రంప్
3) ఫ్రాంకాయిస్ హోలాండ్
4) హిల్లరీ క్లింటన్
View Answer
సమాధానం: 2
వివరణ: ఏటా డిసెంబర్ నెలలో టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌ను ఎంపిక చేస్తుంది. ఆ ఏడాదిలో మంచిగా లేదా చెడుగా ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యకికి టైమ్స్ మేటి వ్యక్తి అవార్డు అందిస్తుంది.
19. అసోచామ్ బెస్ట్ బ్యాంక్ ఫర్ SME అండ్ లెండింగ్ పురస్కారం-2016కు ఎంపికైన బ్యాంకు ఏది ?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) ఆంధ్రా బ్యాంక్
3) లక్ష్మీ విలాస్ బ్యాంక్
4) విజయ బ్యాంక్
View Answer
సమాధానం: 4
వివరణ: అసోచామ్ 4వ శ్రేష్ఠ పురస్కారాల్లో విజయ బ్యాంక్ బెస్ట్ బ్యాంక్ ఫర్ SME అండ్ లెండింగ్ పురస్కారాన్ని దక్కించుకుంది. కార్పొరేషన్ బ్యాంకు ఉత్తమ SME బ్యాంకు పురస్కారానికి ఎంపికైంది.
20. భారత్ నుంచి దిగుమతి అయ్యే పత్తి మీద ఇటీవల నిషేధాన్ని ఎత్తివేసిన దేశం ఏది?
1) పాకిస్తాన్
2) ఇరాన్
3) ఈజిప్ట్
4) చైనా
View Answer
సమాధానం: 1
21. ఫార్చూన్ మ్యాగజైన్ 2016 బ్లూ రిబ్బన్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న కంపెనీ ?
1) నైక్
2) ఆమెజాన్
3) ఆల్ఫా బెట్
4) గిలెడ్ సైన్స్
View Answer
సమాధానం: 3
వివరణ: బ్లూ రిబ్బన్ పేరుతో ఫార్చూన్ మ్యాగజైన్ ఏటా ఉత్తమ కంపెనీలకు ర్యాంకింగ్‌లు ఇస్తుంది. 2016 జాబితాలో గూగుల్ మాతృసంస్థ ఆల్భాబెట్ తొలిస్థానంలో నిలవగా గిలెడ్ సైన్స్, నైక్, ఆమెజాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
22. సీఐఐ జాతీయ నాణ్యతా పురస్కారం-2016కు ఎంపికైన సంస్థ ఏది?
1) BHEL
2) BDL
3) DRDO
4) BEML
View Answer
సమాధానం: 4
వివరణ: BEML-BHARATH EARTH MOVERS LIMITED. 1964లో స్థాపితమైన ఈ సంస్థ మినీరత్న కేటగిరి-1లో స్థానం పొందింది. సీఐఐ, ఎక్సిమ్ బ్యాంక్ సంయుక్తంగా జాతీయ నాణ్యతా పురస్కారాన్ని ఏటా ప్రదానం చేస్తాయి.
23. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధిక వేతనం పొందుతున్న అథ్లెట్ల జాబితాలో తొలిస్థానంలో ఉన్నది ఎవరు ?
1) టైగర్ వుడ్స్
2) మైఖెల్ జోర్డాన్
3) అర్నాడ్ పార్మర్
4) జాక్ నికోలాస్
View Answer
సమాధానం: 2
వివరణ: ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అత్యధిక వేతనం పొందుతున్న అథ్లెట్ల జాబితాలో తొలిస్థానంలో ఉన్న మైఖెల్ జోర్డాన్ గత 15 సీజన్‌లలో 93 మిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించాడు.
24. 2016 ప్రపంచ తీవ్రవాద ఇండెక్స్‌లో తొలిస్థానంలో ఉన్న దేశం ఏది?
1) పాకిస్తాన్
2) నైజీరియా
3) ఇరాక్
4) అఫ్గనిస్తాన్
View Answer
సమాధానం: 3
వివరణ: సిడ్నీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ 2013 నుంచి ప్రపంచ తీవ్రవాద ఇండెక్స్‌ను రూపొందిస్తోంది. 2016 జాబితాలో ఇరాక్ తొలిస్థానంలో ఉండగా అఫ్గనిస్తాన్, నైజీరియా, పాకిస్తాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 7వ స్థానంలో ఉంది.
🍃🌺🍃🌺🍃🌺🍃🌺
25. 2016 ISBF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లాంగ్ అప్ విభాగంలో టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) సౌరవ్ కొఠారి
2) రూపేశ్ షా
3) పిటర్ గిల్‌క్రిస్ట్
4) దేవజ్ హరీ
View Answer
సమాధానం: 3
వివరణ: బెంగళూరులో జరిగిన 2016 ISBF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లాంగ్ అప్ విభాగంలో సౌరవ్ కొఠారిని ఓడించి పిటర్ గిల్‌క్రిస్ట్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
26. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 21
2) డిసెంబర్ 18
3) డిసెంబర్ 14
4) డిసెంబర్ 10
View Answer
సమాధానం: 4
వివరణ: 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన చేసింది. దీని గుర్తుగా ఏటా డిసెంబర్ 10న ప్రపంచ మానవహక్కుల దినోత్సవాన్ని జరుపుతారు.
27. భారత్ ఇటీవల ఏ దేశంతో పౌర అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది ?
1) మయన్మార్
2) వియత్నాం
3) ఆస్ట్రేలియా
4) చైనా
View Answer
సమాధానం: 2
వివరణ: పౌర అవసరాల కోసం భారత్ వియత్నాంతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనితో పాటు పౌర విమానయాన సర్వీసులు పెంచుకోవటం, పార్లమెంటరీ విధానాలలో సహకారం, శక్తి సామర్థ్య అభివృద్ధి అంశాలపై ఒప్పందాలు జరిగాయి.
28. ఉత్తమ విదేశీ డాక్యుమెంటరీ విభాగంలో హాలీవుడ్ డాక్యుమెంటరీ పురస్కారం-2016కు ఎంపికైన చిత్రం ఏది?
1) ది చైల్డ్
2) రూఫ్
3) రైజింగ్ ది బార్
4) రైజింగ్ ది సన్
View Answer
సమాధానం: 3
వివరణ: భారత్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు ఓనీర్ తీసిన రైజింగ్ ది బార్ డాక్యుమెంటరీ ఉత్తమ విదేశీ డాక్యుమెంటరీ విభాగంలో అవార్డుకు ఎంపికైంది. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఆరుగురు పిల్లల జీవితం ఇతివృత్తంగా ఈ డాక్యుమెంటరీ తీశారు.
29. భూ వాతావరణంలో అంతరిక్ష వ్యర్థాలను సేకరించేందుకు అంతరిక్ష నౌకను పంపిన సంస్థ ఏది?
1) నాసా
2) ఇస్రో
3) జాక్సా
4) ఇఎస్‌ఏ
View Answer
సమాధానం: 3
వివరణ: జాక్సా అనేది జపాన్ అంతరిక్ష ప్రయోగ సంస్థ. దీన్ని 2003లో ప్రారంభించారు. వివిధ దేశాలు చేస్తున్న ప్రయోగాలతో గత 50 ఏళ్ల నుంచి అంతరిక్షంలో అనేక వ్యర్థాలు పోగయ్యాయి. వీటి వల్ల భవిష్యత్ ప్రయోగాలకు ఇబ్బందులు కలగకుండా, వాటి సేకరణ కోసం జాక్సా 2016 డిసెంబర్ 9న భారీ అయస్కాంత పరికరాన్ని అంతరిక్షంలోకి పంపింది.
30. భారత్‌లో అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాలు ఇటీవల ఎక్కడ జరిగాయి ?
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) కోల్‌కత్తా
4) ముంబయి
View Answer
సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాలను శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించాయి. ప్రజల కోసం సైన్స్ అనే థీమ్‌తో ఈ ఏడాది ఉత్సవాలు జరిగాయి.
31. అంతర్జాతీయ పర్వతాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 2
2) డిసెంబర్ 5
3) డిసెంబర్ 8
4) డిసెంబర్ 11
View Answer
సమాధానం: 4
వివరణ: పర్వతాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఏటా డిసెంబర్ 11న పర్వతాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
32. ఇటీవల ఏ ప్రాంతాల మధ్యపిల్లల కోసం ప్రత్యేక రైలును ప్రారంభించారు?
1) ఆగ్రా-ఎటావా
2) ఢిల్లీ-ఆగ్రా
3) బనిహల్-బారాముల్లా
4) జమ్ము-శ్రీనగర్
View Answer
సమాధానం: 3
వివరణ: 2016 డిసెంబర్ 11న బనిహల్-బారాముల్లా మధ్య పిల్లల కోసం ప్రత్యేక రైలుని జమ్ము కశ్మీర్ సీఎం మహబూబా ముఫ్తీ ప్రారంభించారు.
33. ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే సొరంగాన్ని ఎక్కడ నిర్మించారు?
1) ఫ్రాన్స్
2) స్విట్జర్లాండ్
3) జర్మనీ
4) చైనా
View Answer
సమాధానం: 2
వివరణ: జ్యూరిచ్ నుంచి లుగానో మధ్య 57 కి.మీ. రైల్వే సొరంగ మార్గాన్ని స్విట్జర్లాండ్ నిర్మించింది. 12 బిలియన్‌ల స్విస్ ప్రాంక్‌ల వ్యయంతో 17 ఏళ్ల పాటు శ్రమించి నిర్మాణాన్ని పూర్తిచేసింది.
34. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ వస్తువుపై దిగుమతి సుంకాన్ని పది శాతానికి తగ్గించింది ?
1) రాగులు
2) వరి
3) గోధుమలు
4) కొర్రలు
View Answer
సమాధానం: 3
వివరణ: దేశంలో గోధుమల ధరలు విపరీతంగా పెరగటంతో పాటు బఫర్ స్టాక్ నిల్వలు భారీ తగ్గటంతో కేంద్రం గోధుమల దిగుమతి సుంకాన్ని 25 నుంచి 10 శాతానికి తగ్గించింది.
35. ఏ క్రీడను ఇటీవల ఒలింపిక్స్‌లో చేర్చారు ?
1) చీర్ లీడింగ్
2) త్రోబాల్
3) సాఫ్ట్ బాల్
4) క్రికెట్
View Answer
సమాధానం:1
వివరణ: అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ చీర్‌లీడింగ్ మాయేథాయ్ అనే మార్షల్ ఆర్ట్స్‌ను విశ్వ క్రీడల్లో ఇటీవల చేర్చింది. దీంతో ఒలింపిక్స్‌లో ఆడే క్రీడలు సంఖ్య 37 కు చేరింది.
36. ప్రపంచ శక్తి వనరుల పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) డిసెంబర్ 21
2) డిసెంబర్ 17
3) డిసెంబర్ 14
4) డిసెంబర్ 9
View Answer
సమాధానం: 3
వివరణ: శక్తి, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా డిసెంబర్ 14న ప్రపంచ శక్తి వనరుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
37. మైక్రోసాఫ్ట్ తొలి సైబర్ భద్రత నిర్వహణ కేంద్రాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించింది ?
1) చైనా
2) భారత్
3) ఇరాన్
4) పాకిస్తాన్
View Answer
సమాధానం: 2
వివరణ: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు పూర్తి సైబర్ భద్రత అందించేందుకు మైక్రోసాఫ్ట్ భారత్‌లో తొలి పూర్తిస్థాయి నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
🍃🌺
38. ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పురస్కారం లేజియన్ ఆఫ్ హానర్-2016కు ఎవరు ఎంపికయ్యారు ?
1) డొనాల్డ్ ట్రంప్
2) హిల్లరీ క్లింటన్
3) అల్‌గోర్
4) జాన్‌కెర్రీ
View Answer
సమాధానం: 4
వివరణ: ఫ్రెంచ్ సైనిక, రాజకీయ నాయకుడు నెపోలియన్ బోనాపార్టీ1802లో లేజియన్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. నైట్, ఆఫీసర్ (సైనికుడు), కమాండర్, గ్రాండ్ ఆఫీసర్, గ్రాండ్ క్రాస్ అనే 5 విభాగాల్లో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
39. క్యాన్సర్ వ్యాప్తికి దోహదం చేసే ప్రొటీన్?
1) CD 36
2) 3C 36
3) 5E 30
4) AB26
View Answer
సమాధానం: 1
వివరణ: ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బయో మెడిసన్ (బార్సిలోనా) శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాప్తికి దోహదం చేసే సీడీ 36ను కనుగొన్నారు. ఈ ప్రొటీన్ కణితి పొరలలో కొవ్వు అమ్లాలపై ఆధారపడి ఉంటుందని గుర్తించారు.
🍃🌺
40. ఫారెన్ పాలసీ మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసిన 100 మంది ప్రపంచ ప్రముఖ మేధావుల జాబితాలో కీలకమైన వ్యక్తుల విభాగంలో చోటు దక్కించుకున్న భారతీయుడు ఎవరు ?
1) నరేంద్ర మోదీ
2) అరుణ్ జైట్లీ
3) సుష్మా స్వరాజ్
4) నిర్మలా సీతారామన్
View Answer
సమాధానం: 3
వివరణ: ఫారెన్ పాలసీ మ్యాగజైన విడుదల చేసిన 100 మంది ప్రపంచ ప్రముఖ మేధావుల జాబితాలో హిల్లరీ క్లింటన్, ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్, జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ ఉన్నారు. భారత్ నుంచి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఎంపికయ్యారు.
41. ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ పురస్కారం-2016కు ఎంపికైంది ఎవరు ?
1) లియోనల్ మెస్సీ
2) క్రిస్టియానో రొనాల్డో
3) జినదిన్ జిందాన్
4) నైమార్
View Answer
సమాధానం: 2
వివరణ: ఫ్రాన్స్ ప్రభుత్వం 1956 నుంచి ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడికి ఏటా బాలన్ డి ఓర్ పురస్కారాన్ని అందజేస్తుంది. గత ఆరేళ్ల నుంచి ప్రపంచ ఫుట్ అసోషియేషన్‌తో కలిసి అవార్డును ప్రదానం చేస్తోంది. 2016లో బాలన్ డి ఓర్అవార్డుకు ఎంపికైన క్రిస్టియానో రొనాల్డో 2008, 2013, 2014లోనూ ఈ అవార్డు అందుకున్నాడు.
42. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవల వెలువరించిన అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుడు ఎవరు ?
1) లక్ష్మీ మిట్టల్
2) అపూర్వ మెహతా
3) సైరస్ మిస్త్రీ
4) రాజా చందు సింగ్
View Answer
సమాధానం: 2
వివరణ: అమెరికాలోని 40 ఏళ్లలోపు అత్యంత ధనవంతులు జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసింది. ఇందులో భారత సంతతికి చెందిన అపూర్వ మెహతా, వివేక్ రామస్వామి చోటు సంపాదించారు. 600 మిలియన్ డాలర్ల సంపదతో వివేక్ రామస్వామి 24వ స్థానంలో నిలవగా 360 మిలియన్ డాలర్ల సంపదతో అపూర్వ మెహతా 31వ స్థానంలో ఉన్నారు.
43. యూనిసెఫ్ ప్రారంభించిన ''ప్రతి పిల్లల కోసం'' కార్యక్రమానికి సౌహార్థ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) ప్రియాంక చోప్రా
2) దీపికా పదుకొనె
3) బ్రెట్ లీ
4) జాన్ ఐర్‌టి
View Answer
సమాధానం: 1
వివరణ: పిల్లల హక్కులను కాపాడటం కోసం యునిసెఫ్ ప్రారంభించిన కార్యక్రమానికి ప్రియాంక చోప్రా సౌహార్థ రాయబారిగా నియమితులయ్యారు.
🍃🌺
44. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ ఇటీవల ప్రదానం చేసిన 2016 మేటి ప్రదర్శన పురస్కారానికి ఎంపికైంది ఎవరు ?
1) మిసాకి మత్సతోమె
2) ఆయక తకషి
3) పి.వి. సింధు
4) సైనా నెహ్వాల్
View Answer
సమాధానం: 3
వివరణ: దుబాయిలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో పీవీ సింధు ఈ ఏటి మేటి ప్రదర్శన పురస్కారాన్ని అందుకుంది.
45. 11వ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ విజేత ఎవరు?
1) పిటర్ గిల్‌క్రిస్ట్
2) ఆంగ్ హ్తయ్
3) పంకజ్ అద్వానీ
4) సౌరవ్ కొఠారి
View Answer
సమాధానం: 3
వివరణ: 11వ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్లో పీటర్ గిల్‌క్రిస్ట్‌ను ఓడించి పంకజ్ అద్వానీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
46. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇటీవల ఏ వస్తువుపై నిషేధం విధించింది ?
1) మాంజా
2) టపాసులు
3) సింథటిక్ రంగులు
4) ఫ్లై యాష్
View Answer
సమాధానం: 1
47. భారత్-రష్యా ఇటీవల ఏ పేరుతో విశాఖ తీరంలో ద్వైపాక్షిక నావికా విన్యాసాలు నిర్వహించాయి ?
1) వరుణ-2016
2) అగ్ని-2016
3) ఇంద్ర-2016
4) పవన-2016
View Answer
సమాధానం: 3
వివరణ: విశాఖ తీరంలో భారత్-రష్యా సంయుక్తంగా9వ ఇంద్రా నావికా వార్షిక విన్యాసాలు నిర్వహించాయి.
48. జేన్ డిఫెన్స్ బడ్జెట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో రక్షణరంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న దేశం ఏది ?
1) భారత్
2) యూకే
3) చైనా
4) అమెరికా
View Answer
సమాధానం: 4
వివరణ: జేన్ డిఫెన్స్ బడ్జెట్ నివేదిక ప్రకారంరక్షణ రంగానికి పపంచంలోనే అత్యధికంగా అమెరికా 622.03 బిలియన్ డాలర్లు కేటాయించింది. చెనా (50.67 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (48.68 బిలియన్ డాలర్ల)తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2016లో ప్రపంచ దేశాల రక్షణ బడ్జెట్ 1.57 ట్రిలియన్ డాలర్లు కాగా ఈ మొత్తంలో అమెరికా వాటా 40 శాతం. నివేదిక ప్రకారం 2018లోపు భారత్ రక్షణ బడ్జెట్ మూడో స్థానానికి చేరుతుంది.
49. అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ ప్రపంచ పురుషుల ఛాంపియన్ పురస్కారం-2016కు ఎవరు ఎంపికయ్యారు ?
1) నొవాక్ జకోవిచ్
2) రోజర్ ఫెడరర్
3) ఆండి ముర్రే
4) రఫెల్ నాదల్
View Answer
సమాధానం: 3
వివరణ: అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ ప్రదానం చేసే ప్రపంచ పురుషుల ఛాంపియన్ పురస్కారానికి ఆండిముర్రే ఎంపికయ్యాడు. స్త్రీల ప్రపంచ ఛాంపియన్ అవార్డు ఎంజెలిక్ కెర్బర్‌కు దక్కింది.
0 comments:
Post a Comment