_Current affairs
1. స్వచ్ఛభారత్ కార్యక్రమానికి అంబాసిడర్‌గాసాక్షి మాలిక్‌ను ఏ రాష్ట్రంనియమించుకుంది?
1) జమ్మూ కాశ్మీర్
2) పంజాబ్
3) హర్యానా
4) ఉత్తర ప్రదేశ్
View Answer
సమాధానం: 3
వివరణ: సాక్షి మాలిక్ హర్యానా రాష్ట్రానికి చెందిన రెజ్లర్. ఈమె రియో ఒలింపిక్స్‌లో 58 కేజీల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించింది.
2. ఆకాశవాణి కార్యక్రమాలను ఏ దేశంలో ప్రసారం చేయడానికి భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు?
1) పాకిస్తాన్
2) నేపాల్
3) భూటాన్
4) బంగ్లాదేశ్
View Answer
సమాధానం: 4
వివరణ: బెంగాలీ భాష, సంస్కృతి రక్షణలో భాగంగా బంగ్లాదేశ్‌లో కూడా ఆకాశవాణి కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు.
3. దక్షిణ భారతదేశంలో మొదటి బాలల కోర్టును ఎక్కడ ప్రారంభించారు?
1) ముంబయి
2) హైదరాబాద్
3) బెంగళూరు
4) విజయవాడ
View Answer
సమాధానం: 2
వివరణ: బాల నేరస్తులను విచారించడానికి మొత్తం మూడుప్రత్యేక కోర్టులను ఢిల్లీ, గోవా, హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో మొదటి బాలల కోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
4. ఇటీవల హర్యానా ప్రభుత్వం ‘భేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎవరిని నియమించింది?
1) పి.వి. సింధు
2) సాక్షి మాలిక్
3) సానియా మీర్జా
4) దీపా కర్మాకర్
View Answer
సమాధానం: 2
5. రియో ఒలింపిక్స్‌లో భారత పేలవ ప్రదర్శనపై సమీక్షించడానికిఏర్పాటు చేసిన కమిటీ ఏది?
1) అభినవ్ బింద్రా కమిటీ
2) సచిన్ టెండూల్కర్ కమిటీ
3) సందీప్ పాటిల్ కమిటీ
4) నీతా అంబానీ కమిటీ
View Answer
సమాధానం: 1
వివరణ: రియో ఒలింపిక్స్‌లో భారత షూటింగ్ విభాగంలో వైఫల్యాలకు గల కారణాలు, అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి అభినవ్ బింద్రా అధ్యక్షతన కమిటీ వేశారు.
6. 2016లో సార్క్ సర్వసభ్య సమావేశం ఎక్కడ నిర్వహించనున్నారు ?
1) ఇండియా
2) అఫ్ఘనిస్తాన్
3) పాకిస్తాన్
4) నేపాల్
View Answer
సమాధానం: 3
వివరణ: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో సార్క్ 11వ సమావేశం నిర్వహించనున్నారు.
7. ప్రపంచంలో తొలిసారిగా సెల్ఫ్ డ్రైవింగ్ కారును ప్రవేశపెట్టిన దేశం ఏది?
1) సింగపూర్
2) కెనడా
3) అమెరికా
4) న్యూజిలాండ్
జి సైదేశ్వర రావు
View Answer
సమాధానం: 1
8. ఇటీవల విడుదలైన ‘‘ వరల్డ్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్-2016’’ (world disaster risk index 2016) లో ఇండియా ఏ స్థానంలో ఉంది?
1) 20
2) 38
3) 59
4) 77
View Answer
సమాధానం: 4
వివరణ: ప్రపంచ విపత్తు రిస్క్ ఇండెక్స్ - 2016 ను ఐక్యరాజ్య సమితి యూనివర్శిటీ అయిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ హ్యుమన్ సెక్యూరిటీ విడుదల చేసింది. 171 దేశాలలో ఇండియా ర్యాంక్ 77.
9. నీతి అయోగ్ మొదటి వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు
1) మైత్రిపాల సిరిసేన
2) థర్మణ్ షణుముగరత్నం
3) అషఫ్ ్రఘని
4) ప్రచండ
View Answer
సమాధానం: 2
వివరణ: ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏన్‌డీఏ ప్రభుత్వం నీతి అయోగ్‌ను ప్రారంభించింది. నీతి అయోగ్ మొదటి వార్షిక సమావేశానికి సింగపూర్ ఉపప్రధాని థర్మణ్ షణుముగరత్నం హాజరయ్యాడు.
10. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) దీపికా పదుకొనే
2) అనుష్క శర్మ
3) రణ్‌వీర్ సింగ్
4) హృతిక్ రోషన్
View Answer
సమాధానం: 1
వివరణ: ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీని 1929లో స్థాపించారు. ఈ సంస్థ మానసిక ఒత్తిడితో బాధపడేవారికి చేయూత అందించి, వారిని మామూలు మనుషులుగా మార్చడానికి కృషి చేస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు జి. ప్రసాద్‌రావు.
11. రియో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారతదేశం తరపున నాయకత్వం వహించినది ఎవరు ?
1) పి.వి. సింధు
2) దీపా కర్మాకర్
3) యోగేశ్వర్‌దత్
4) సాక్షిమాలిక్
View Answer
సమాధానం: 4
వివరణ: రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సర వేడుకల్లో భారత్ తరపున నాయకత్వం వహించినది అభినవ్ బింద్రా. ముగింపు వేడుకల్లో నాయకత్వం వహించినది సాక్షి మాలిక్.
12. ప్రవాసీ భారతీయ దివస్ 2017 ను ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1) జైపూర్
2) బెంగళూరు
3) కాన్పూర్
4) కొయంబత్తూరు
View Answer
సమాధానం: 2
వివరణ: 1915 జనవరి 9న గాంధీ ధక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారు. ఈ రోజును 2003 నుంచి ప్రతి సంవత్సరం ప్రవాస భారతీయుల దినముగా జరుపుకుంటున్నారు.
13. ఇటీవల ఏ దేశం దీపావళి పండుగ గుర్తుగా పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది ?
1) పాకిస్తాన్
2) కెనడా
3) అమెరికా
4) జర్మనీ
View Answer
సమాధానం: 3
14. దేశంలో మొదటిసారిగా ఏ ప్రాంతంలో వస్త్రాల విశ్వవిద్యాలయం (textile university) ను ప్రారంభించారు?
1) సూరత్
2) అహ్మద్ నగర్
3) ముంబయి
4) మధురై
జి సైదేశ్వర రావు
View Answer
సమాధానం: 1
వివరణ: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా టెక్స్‌టైల్ విశ్వవిద్యాలయంను సూరత్‌లో రూ.800-900 కోట్ల వ్యయంతో ప్రారంభించింది.
15. ప్రపంచంలో అతిపెద్ద ఇండోర్ థీమ్ పార్క్‌ను ఎక్కడ ప్రారంభించారు ?
1) సింగపూర్
2) కౌలాలంపూర్
3) మనీలా
4) దుబాయ్
View Answer
సమాధానం: 4
వివరణ: 1,40,000 చ.కి.మీ. వైశాల్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్ థీమ్ పార్క్‌ను దుబాయ్‌లో ప్రారంభించారు.
16. ‘IEI-IEEE’ అవార్డు ఫర్ ఇంజనీరింగ్ ఎక్స్‌లెన్స్-2015 నకు ఎవరు ఎంపికయ్యారు?
1) విజయ్ సింగ్ రాథోడ్
2) సతీష్ రెడ్డి
3) అజయ్ మాధుర్
4) రాజ్యవంశ్ సింగ్
View Answer
సమాధానం: 2
వివరణ: IEI-IEEE అవార్డ్ ఫర్ ఇంజనీరింగ్ ఎక్స్‌లెన్స్- 2015నకు సతీష్ రెడ్డి ఎంపికయ్యాడు. ఈయన ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌నకు సాంకేతిక విభాగ సలహాదారుడుగా పనిచేస్తున్నాడు.
17. ‘కనెక్టికట్ ఓపెన్’ 2016లో డబుల్ ్స విజేత ఎవరు ?
1) జూలియా జార్జస్ , లూసి హర్డకా
2) సానియా మీర్జా, మోనికా నిక్లూస్
3) లీసా రెమండ్, లేజియల్ హుబర్
4) యాన్‌జే, జేన్ జీ
View Answer
సమాధానం: 2
వివరణ: అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ‘కనెక్టికట్ ఓపెన్’ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ పోటీల్లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా, మోనికా నిక్లూస్విజయం సాధించారు.
18. ఫోర్బ్స్ మేగజీన్ విడుదల చేసిన ‘‘ప్రపంచంలో అత్యంత ఎక్కువ నవకల్పనలు చేస్తున్న కంపెనీల జాబితా’’ లో ఇండియా నుంచి ఎన్ని కంపెనీలు చోటు దక్కించుకున్నాయి ?
1) 2
2) 3
3) 5
4) 7
View Answer
సమాధానం: 3
వివరణ: ఫోర్బ్స్విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలో అతి ఎక్కువ నూతన ఆవిష్కరణలు చేపడుతున్న కంపెనీలలో ఇండియా నుంచి 5 చోటు సంపాదించుకున్నాయి. అవి. ఆసియన్ పెయింట్స్ (18 వస్థానం), హిందుస్థాన్ యూనిలీవర్ (31వ స్థానం), టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (66వ స్థానం), సన్ ఫార్మా (73 వ స్థానం), ఎల్ అండ్ టీ (89వ స్థానం).
19. ఫోర్బ్స్విడుదల చేసిన వినూత్న ఆవిష్కరణలు చేపడుతున్న సంస్థల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది?
1) టెస్లా మోటార్స్
2) సెల్స్‌ఫొర్స్ డాట్ కామ్
3) రిజెనరా ఫార్మా
4) ఇన్న్‌త్
View Answer
సమాధానం: 1
వివరణ: ఫోర్బ్స్జాబితాలో అమెరికాకు చెందిన టెస్లా మోటార్స్ మొదటి స్థానంలో, సెల్స్‌ఫొర్స్ డాట్ కామ్రెండవ స్థానంలో, రిజెనరా ఫార్మామూడవ స్థానంలో, ఇన్న్‌త్నాల్గో స్థానంలో ఉన్నాయి.
20. కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం సద్భావన మండపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
1) హిందువులు
2) బౌద్ధులు
3) సిక్కులు
4) ముస్లింలు
View Answer
సమాధానం: 4
వివరణ: ముస్లింల సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం సద్భావన మండపాలు ఏర్పాటు చేయనున్నారు.
21. అంబులెన్స్ సర్వీసుల కోసం మొబైల్ యాప్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
1) తెలంగాణ
2) మహారాష్ట్ర
3) హిమాచల్ ప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
జి సైదేశ్వర రావు
View Answer
సమాధానం: 3
వివరణ: అంబులెన్స్ సర్వీసుల కోసం‘108 HP' అనే పేరుతో హిమాచల్‌ప్రదేశ్మొబైల్ యాప్‌ను ప్రారంభించింది.
22. ఇటీవల భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించిన నూతన రాకెట్ ఇంజన్ ఏది?
1) వికాస్
2) స్క్రామ్‌జెట్
3) కృష్ణా
4) కలాం
View Answer
సమాధానం: 2
వివరణ: స్క్రామ్‌జెట్భూ వాతవరణంలోని ఆక్సిజన్‌ను ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి దూసుకుపోగలదు. ఈ ప్రయోగంతో ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ రూపకల్పనలో ఇస్రో ముందడుగేసింది. దీనితో రాకెట్‌లో ఇంధన బరువు తగ్గి ఉపగ్రహ ప్రయోగ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది.
23. ఇండియా ఏ దేశంతో ‘‘లాజిస్టిక్స్ ఎక్స్‌ఛేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1) రష్యా
2) ఫ్రాన్స్
3) అమెరికా
4) కెనడా
View Answer
సమాధానం: 3
వివరణ: ఇండియా, అమెరికాతో లాజిస్టిక్స్ ఎక్స్‌ఛేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ చేసుకుంది. దీని ద్వారా మిలటరీ, రక్షణ రంగ ఆస్తులు, ఎయిర్‌బేస్‌లు పరస్పరం వినియోగించుకునేందుకు వీలు కలుగుతుంది.
24. ‘‘ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ 2016’’ పురస్కారానికి ఎంపికైన రాష్ట్రం?
1) తమిళనాడు
2) కేరళ
3) గుజరాత్
4) తెలంగాణ
View Answer
సమాధానం: 4
వివరణ: అభివృద్ధిలోనే కాకుండా, దేశ సమగ్రత, నిబద్ధతలకు అనుగుణముగా వ్యాపార దృక్పథం, మార్కెటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించిన వ్యక్తులు లేదా సంస్థలకు, రాష్ట్రాలకు 11 ఏళ్ల నుంచి సీఎన్‌బీసీ గ్రూప్ ఈ అవార్డును అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విన్నూతమైన పారదర్శక విధానాలను పరిగణనలోనికి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
25. ఐక్యరాజ్య సమితి దక్షిణాది మహిళా సంక్షేమ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) కరీనా కపూర్
2) ఐశ్వర్యా ధనుష్
3) విద్యాబాలన్
4) ఐశ్వర్యారాయ్
View Answer
సమాధానం: 2
వివరణ: మహిళల హక్కులు వారిపై జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావడం కోసంఐశ్వర్యా ధనుష్‌నుయూఎన్‌ఓ దక్షిణాది మహిళా సంక్షేమ రాయబారిగా నియమించారు.
26. జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?
1) ఆగస్టు 23
2) ఆగస్టు 25
3) ఆగస్టు 28
4) ఆగస్టు 29
View Answer
సమాధానం: 3
వివరణ: మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినంగా జరుపుకుంటారు. ధ్యాన్ చంద్ 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లలో ఇండియాకు హాకీలో బంగారు పతకాలు సాధించాడు.
27. అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినంగా ఏ రోజును జరుపుకుంటారు ?
1) ఆగస్టు 24
2) ఆగస్టు 25
3) ఆగస్టు 28
4) ఆగస్టు 29
View Answer
సమాధానం: 4
వివరణ: ఆగస్టు 29, 1991 కజికిస్థాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్‌బజేవ్ అణు పరీక్షల కేంద్ర ంను మూసివేసిన సందర్భాన్ని పురస్కరించుకొని, ఐక్యరాజ్యసమితి ఆగస్టు 29ని అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినంగా నిర్వహిస్తుంది.
28. పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంటుంది?
1) 990 కోట్లు
2) 890 కోట్లు
3) 850 కోట్లు
4) 800 కోట్లు
జి సైదేశ్వర రావు
సమాధానం: 1
వివరణ: పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో‘ప్రపంచ జనాభా డేటాషీట్‌ను’ తయారు చేసింది. దీనిలో 2050 నాటికి ప్రపంచ జనాభా 990 కోట్లకు చేరుతుందని తెలిపింది. మానవ అవసరాలు, సుస్థిర వనరులు అనే ఇతివృత్తంతో తయారు చేసిన ఈ డేటాషీట్ యూరప్‌లో జనాభా 74 కోట్ల నుంచి 72.8 కోట్లకు తగ్గుతుందని, ఆఫ్రికా జనాభా 250 కోట్లకు చేరుతుందని వెల్లడించింది.
29. ఫిక్కీ ప్రదానం చేసే ‘ఆరోగ్య సంరక్షణ’ ఎక్స్‌లెన్స్ పురస్కారానికి ఎంపికైన రాష్ట్రం ఏది?
1) తమిళనాడు
2) గోవా
3) తెలంగాణ
4) ఆంధ్రప్రదేశ్
View Answer
సమాధానం: 3
వివరణ: తెలంగాణ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఫిక్కీ ప్రదానం చేసే హెల్త్ కేర్ ఎక్స్‌లెన్స్ పురస్కారంనకు ఎంపికైంది.
30. టెంజింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) హరీందర్ సింగ్
2) హర్భజన్ సింగ్
3) విజయ్ సింగ్
4) నవజ్యోత్ సింగ్
View Answer
సమాధానం: 2
వివరణ: ఈ పురస్కారాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన టెంజింగ్ నార్గె పేరు మీద ప్రతి సంవత్సరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రదానం చేస్తుంది. 2016 గాను పర్వతరోహణలో కృషి చేసిన ఐటీబీటీ ఐజే హర్భజన్ సింగ్ఎంపికయ్యాడు.
31. ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ ’ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది?
1) ఎస్‌బీఐ
2) పీఎన్‌బీ
3) ఐసీఐసీఐ
4) ఆర్‌బీఐ
View Answer
సమాధానం: 4
వివరణ: క్రీడాకారులకు ఉద్యోగవకాశాలు కల్పించడంతో పాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల ఆర్‌బీఐకి ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్’ పురస్కారం దక్కింది.
32. ఫిక్కీ సర్వే ప్రకారం 2016-17 సంవత్సరానికి గాను భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత?
1) 7.2 శాతం
2) 7.4 శాతం
3) 7.6 శాతం
4) 7.8 శాతం
View Answer
సమాధానం: 4
వివరణ: ఫిక్కీ సర్వే ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 7.8 శాతం ఉండొచ్చు.1927లో గాంధీ సలహా మేరకు జిడి బిర్లా, పురుషోత్తమ్ దాస్, ఠాకూర్ దాస్ కలసి ఫిక్కీని ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వేతర, లాభేక్ష లేని సంస్థ.
33. మయన్మార్ దేశ అధ్యక్షుడు/అధ్యక్షరాలు ఎవరు ?
1) ఆంగ్‌సాన్ సుకీ
2) థియిన్ సేయిన్
3) హెచ్‌తిన్ క్యా
4) మిన్‌తూన్ ఊన్
View Answer
సమాధానం: 3
వివరణ: ఇటీవల మయన్మార్ అధ్యక్షుడు హెచ్‌తిన్ క్యాభారతదేశాన్ని సందర్శించాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ఉగ్రవాదం పై పోరు, చొరబాటు కార్యక్రమాల నిరోధం, రవాణా, వైద్యం, పునరుత్పాదక ఇంధన రంగాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
34. సరస్వతి సమ్మాన్ పురస్కారం-2015 నకు ఎంపికైనది ఎవరు?
1) పద్మాసచ్ దేవ్
2) మధుకర్ గుప్తా
3) గోవింద మిశ్రా
4) సుర్జత్ పాతర్
View Answer
సమాధానం: 1
వివరణ: 2015 సంవత్సరానికి సరస్వతి సమ్మాన్ పురస్కారంనకు పద్మా సచ్‌దేవ్ ఎంపికయ్యారు. డోగ్రి భాషలో ‘చిట్-చెటె’ అనే పేరుతో పద్మా సచ్‌దేవ్రాసిన ఆత్మకథకు గాను ఈ అవార్డు దక్కింది.సరస్వతి సమ్మాన్ పురస్కారంను ప్రతి సంవత్సరం భారత రాజ్యంగంలోని భాషలలో చేసిన రచనలకు ఇస్తారు.
35. రామన్ మెగసేసే పురస్కారం-2016 నకు ఎవరు ఎంపికయ్యారు?
1) బెజవాడ విల్సన్
2) కార్సియోమొరెల్స్
3) టి.ఎమ్. క్రిష్ణా
4) పైవన్నీ
జి సైదేశ్వర రావు
సమాధానం: 4
వివరణ: 2016 సంవత్సరానికి గాను రామన్ మెగసేసేపురస్కారానికి ఇండియా నుంచి సఫాయి కర్మాచరన్ ఆందోళన జాతీయ కన్వీనర్ అయిన బెజవాడ విల్సన్, కర్ణాటక సంగీత విద్వాసుడు టి.ఎమ్. క్రిష్ణా ఎంపికయ్యారు. ఆసియాలో అత్యున్నతమైన పురస్కారం రామన్ మెగసేసే. 1957 నుంచి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు.
36. సరిహద్దు రక్షణపై సూచలను చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
1) సుందరేశన్ కమిటీ
2) మధుకర్ గుప్త కమిటీ
3) కాంట్ కమిటీ
4) కజ్జు కమిటీ
View Answer
సమాధానం: 2
వివరణ: ఇండియా- పాకిస్తాన్ సరిహద్దు చొరబాటు స్థావరాలు, వాటి నిర్మూలన, పటిష్టమైన రక్షణ కోసం సూచనలు ఇవ్వడానికి మధుకర్ గుప్త కమిటీని ఏర్పాటు చేశారు.
37. చిన్న పరిశ్రమల దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు ?
1) ఆగస్టు 28
2) ఆగస్టు 29
3) ఆగస్టు 30
4) ఆగస్టు 31
View Answer
సమాధానం: 3
వివరణ: చిన్న పరిశ్రమలకు సహకారం, ప్రోత్సాహకాలు అందించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 30న చిన్న పరిశ్రమల దినోత్సవంను జరుపుకుంటారు.
38. ఫోర్బ్స్ ప్రకటించిన ‘అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల జాబితా’ లో టాప్ 10లో స్థానం పొందినది ఎవరు?
1) అమితాబ్ బచ్చన్
2) సల్మాన్ ఖాన్
3) అమీర్ ఖాన్
4) షారుఖ్ ఖాన్
View Answer
సమాధానం: 4
వివరణ: ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో షారుఖ్ ఖాన్ రూ.221 కోట్లతో 8వ స్థానంలో, రూ.211 కోట్లతో అక్షయ్ కుమార్ 10వ స్థానంలో, సల్మాన్ ఖాన్ రూ.191 కోట్లతో 14వ స్థానంలో, అమితాబ్ బచ్చన్ రూ.134 కోట్లతో 18వ స్థానంలో ఉన్నారు.
39. పన్ను ఎగవేత కారణంగా యురోపియన్ యూనియన్ ఏ సంస్థకు భారీ జరిమానా విధించింది ?
1) మైక్రోసాఫ్ట్
2) మైక్రోమాక్స్
3) గూగుల్
4) ఆపిల్
View Answer
సమాధానం: 4
వివరణ: ఆపిల్యూరప్‌లో చట్ట విరుద్ధంగా పన్ను ప్రయోజనాలు పొందిందనే కారణంతో 13 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
40. కుష్ఠు వ్యాధి నిర్మూలన కోసం వ్యాక్సిన్‌ను తయారు చేసింది ఎవరు?
1) అశోక్ దాస్
2) రఘునాథ్ మిశ్రా
3) జీపీ తల్వార్
4) సీజర్ మిల్ స్టీన్
View Answer
సమాధానం: 3
వివరణ: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ డెరైక్టర్ జిపి తల్వార్ కుష్ఠువ్యాధి నిర్మూలన కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. బీహార్, గుజరాత్‌లోని ఐదు జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.
41. బెల్జియం గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ విజేత ఎవరు?
1) నికో రోస్‌బర్గ్
2) లేవిస్ హ మిల్టన్
3) సెబాస్టియన్ వెటల్
4) డేనియల్ రిక్కియార్డొ
View Answer
సమాధానం: 1
వివరణ: బెల్జియం గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ రేసు విజేత మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్. ఇది రోస్‌బర్గ్‌కు మొదటి బెల్జియం గ్రాండ్ ప్రీ టైటిల్. అతని తర్వాతి స్థానాల్లో రిక్కియార్డొ, లేవిస్ హామిల్టన్ నిలిచారు.
42. ఐరోపా ఉత్తమ పుట్‌బాలర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1) లియోనెల్ మెస్సీ
2) థామస్ ముల్లర్
3) క్రిస్టియానో రొనాల్డో
4) గరెల్ బెత్
జి సైదేశ్వర రావు
సమాధానం: 3
వివరణ: ఐరోపా దేశాల పుట్‌బాల్ సంఘం ఇచ్చే ఉత్తమ పుట్‌బాలర్‌గా క్రిస్టియానో రొనాల్డో ఎంపికయ్యాడు.
43. ఇటీవల 2 కోట్ల ఎల్‌ఈడీ బల్బ్‌లను పంచిపెట్టినరాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) కేరళ
3) గుజరాత్
4) రాజస్థాన్
View Answer
సమాధానం: 3
వివరణ: ‘‘ఉన్నత్ జ్యోతి బై అఫర్డ్‌బుల్ ఎల్‌ఈడీ ఫర్ ఆల్’’ (UJALA)అనే పథకంను మే 2, 2015 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద 2 కోట్ల ఎల్‌ఈడీ బల్బ్‌లను పంచిన మొదటి రాష్ట్రం గుజరాత్.
44. సార్క్ దేశాల స్టాటిస్టిక్స్ ఎనిమిదో సమావేశం ఏ ప్రాంతంలో నిర్వహించారు?
1) ఖాట్మండు
2) న్యూఢిల్లీ
3) ఢాకా
4) కొలంబో
View Answer
సమాధానం: 2
వివరణ: సార్క్ స్టాటిస్టిక్స్ (SAARC STAT) 8వ సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించారు.
థీమ్: ‘‘ ట్రేడ్ స్టాటిస్టిక్స్ - మెర్చండైజ్ అండ్ సర్వీసెస్’’
45. 6వ టోక్యో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ ఎక్కడ జరిగింది?
1) ైనె రోబి
2) టోక్యో
3) మలావి
4) లెసెతో
View Answer
సమాధానం: 1
వివరణ: ఈ కాన్ఫరెన్స్ను కెన్యా రాజధాని నైరోబిలో ఆగస్టు 27, 28న జపాన్, UNOSSA, UNDPకలిపినిర్వహించాయి.
UNOSSA: యునెటైడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ ది స్పెషల్ ఆడ్వైజర్ ఆన్ ఆఫ్రికా
46. కొలంబియా దేశం ఏ వామపక్ష తిరుగుబాటు వర్గంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది?
1) కొలంబి ఫ్రంట్
2) చేరోమంబి
3) FARC
4) రోమ అమెరిండ్
View Answer
సమాధానం: 3
వివరణ: గత 50 సంవత్సరాల నుంచి కొలంబియాలో ప్రభుత్వం, FARC(Revolutionary Armed Forces of Colombia) తిరుగుబాటుదారుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుంది. దీనిలో 2,20,000 మంది చనిపోయారు. 5 మిలియన్ ప్రజలు నిరాశ్రయులయ్యారు. క్యూబా రాజధాని హవానాలో కొలంబియా ప్రభుత్వం, FARCతిరుగుబాటుదారుల మధ్యచారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్యుద్ధం ముగిసింది.
47. బ్రహ్మపుత్ర నదిలో పూడిక తీయుట కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత కే టాయించింది?
1) రూ. 890
2) రూ. 980
3) రూ. 1200
4) రూ. 1300
View Answer
సమాధానం: 2
వివరణ: బ్రహ్మపుత్ర నదిలో పూడిక తీయుట ద్వారా బంగ్లాదేశ్‌లో నీటి రవాణా మార్గాలు అనువుగా మారతాయి. అందుకోసం ప్రపంచ బ్యాంక్ రూ. 980 కోట్లు ఇచ్చింది.
48. నంద్యాల- ఎర్రగుంట్ల మధ్య నూతన రైల్వే మార్గంను ఎన్ని కోట్ల వ్యయంతో నిర్మించారు ?
1) రూ. 800
2) రూ. 450
3) రూ. 650
4)రూ. 967
View Answer
సమాధానం: 4
వివరణ: నంద్యాల నుంచి ఎర్ర గుంట్ల మధ్య 123 కి.మీ.ల రైల్వే మార్గాన్ని రూ. 967 కోట్ల వ్యయంతో నిర్మించారు. నంద్యాల నుంచి కడప నూతన ప్యాసింజర్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు.
49. ఏషియన్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం-2016 నకు ఎవరు ఎంపికయ్యారు?
1) అంగ్‌లీ
2) అబ్బాస్ కైరోస్టామి
3) కింగ్ హ్యు
4) సోయాంగ్ కిమ్
View Answer
సమాధానం: 2
వివరణ: బుసాన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఇరాన్‌కి చెందిన డెరైక్టర్ అబ్బాస్ కైరొస్టామి మరణానంతరం ‘ఏషియన్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికయ్యాడు. జూలై 4న 76 సంవత్సరాల వయస్సులో అబ్బాస్ మరణించాడు.
జి సైదేశ్వర రావు పి ఈ టి
*ZPSS చిరునోముల*
*బోనకల్ మండలం*
*ఖమ్మం జిల్లా*
0 comments:
Post a Comment