LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

తెలంగాణ పర్యాటక ప్రదేశాలు

Posted by PAATASHAALANEWS on Tuesday, 4 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

తెలంగాణ పర్యాటక ప్రదేశాలు

పిల్లల మర్రి వృక్షం
తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక, అధ్యాత్మిక, సాంస్కృతిక తదితర పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. ఆలంపూర్‌లో అష్టాదశ శక్తిపీఠం, బాసరలో జ్ఞానసరస్వతి దేవాలయం, భద్రాచలంలోశ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం, నిజామాబాద్ సారంగపూర్ హనుమాన్ మందిరం (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), ఆర్మూర్ సిద్దులగుట్ట, నిజామాబాద్ ఖిల్లారఘునాధ ఆలయం (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), డిచ్ పల్లి ఖిల్లా రామాలయం, ( కేస్లాపూర్‌లో నాగోబా దేవాలయం, సిరిచెల్మలో సోమేశ్వరాలయం, జైనాథ్‌లో పల్లవుల కాలం నాటి ఆలయం, గంగాపూర్‌లో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చెన్నకేశ్వస్వామి ఆలయం, కదిలిలో పాపహరేశ్వరాలయం, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం,[27] కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయం, కాళేశ్వరంలో కాళేశ్వర-ముక్తేశ్వర ఆలయం, అచ్చంపేట సమీపంలో ఉమామహేశ్వర ఆలయం,నారాయణపేట సమీపంలో ఔదుంబరేశ్వరాలయం, సిర్సనగండ్లలో సీతారామాలయం, మన్యంకొండలో శ్రీవెంకటేశ్వరాలయం, మామిళ్ళపల్లిలో నృసింహక్షేత్రం, బీచుపల్లిలోపురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం[28][29], మెదక్‌లో పెద్ద చర్చి, ఏడుపాయలలో భావాని మందిరం, కొత్లాపూర్‌లో ఎల్లమ్మ ఆలయం, ఝురాసంగంలో కేతకీ ఆలయం, కొల్చారంలో జైనమందిరం, నాచగిరిలోనృసింహాలయం, బొంతపల్లిలో వీరభద్ర ఆలయం, వరంగల్‌లో వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, నిజామాబాద్ జిల్ల లింబాద్రిగుట్టపై లక్ష్మీనృసింహస్వామి ఆలయం, బోధన్ ఏకచక్రేశ్వర ఆలయం, తాండూరులో భద్రేశ్వరస్వామి ఆలయం, అనంతగిరిలో పద్మనాభస్వామి ఆలయం, కీసరలో రామలింగేశ్వరస్వామి ఆలయం, చేవెళ్ళలో వెంకటేశ్వరస్వామి ఆలయం, చిలుకూరులో బాలాజీ ఆలయం, పాంబండలో రామాయణం కాలం నాటి శివాలయం, దామగుండంలో రామలింగేశ్వరాలయం, పాలంపేటలో రామప్పదేవాలయం, కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి ఆలయం, మేడారంలో సమ్మక్క-సారక్క గద్దె ఉన్నాయి.వరంగల్ జిల్లా మేడారానికి 20 కిలోమీటర్ దూరంలో బ్రిటిష్ కాలానికి చెందిన అద్భుతమైన మరో ప్రకృతి వనం అందులోనూ కొలకత్తా హౌరా బ్రిడ్జి నమూనా రెండు వేరు వేరు దీవులను ఏకం చేస్తూ కట్టిన మరో అద్భుతం లక్నవరపు సరస్సు.
రామోజీ పిల్మ్ సిటి
ఆదిలాబాదు జిల్లాలో ఎత్తయిన కుంటాల జలపాతంపొచ్చెర జలపాతం, కవ్వాల్ అభయారణ్యం, బత్తీస్‌ఘఢ్ కోట, హైదరాబాదులో బిర్లామందిరం, బిర్లా ప్లానెటోరియం, చార్మినార్,గోల్కొండ కోటనెహ్రూ జూపార్క్రామోజీ ఫిలిం సిటిసాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లుంబినీ పార్క్, ఎన్టీయార్ గార్డెన్, సంఘీనగర్ వెంకటేశ్వరాలయం, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఖిల్లా, ఎలగందల్రామగిరిఖిల్లా, ఖమ్మం జిల్లాలో రామాయణం కాలం నాటి పర్ణశాల, పాపికొండలు, కిన్నెరసాని అభయారణ్యం, నేలకొండపల్లి బౌద్ధస్తూపం, ఖమ్మం ఖిల్లా, పాలమూరు జిల్లాలో పిల్లలమర్రి వృక్షంగద్వాల కోటఖిల్లాఘనపురం కోటఅంకాళమ్మ కోటకోయిలకొండ కోట, పానగల్ కోటప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, వరహాబాదు వ్యూపాయింట్, మల్లెలతీర్థం, నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుభువనగిరి కోట, దేవరకొండ దుర్గం, నిజామాబాదు జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అలీసాగర్ ప్రాజెక్టు, దోమకొండ కోట,నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజామాబాద్ కందకుర్తి త్రివేణి సంగమం (గోదావరి, మంజీరా, హరిద్రా నదులు కలిసే స్థలం) మరియు రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్రీ కేశవరావ్ హెగ్డేవార్ జన్మస్థలం, రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, కోట్‌పల్లి ప్రాజెక్టు, గండిపేట, శామీర్‌పేట చెరువు, వరంగల్ జిల్లాలో ఓరుగల్లు కోట, పాకాల చెరువు, మెదక్ జిల్లాలో మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యంమంజీరా అభయారణ్యం, కొండాపూర్ మ్యూజియం, తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
తెలంగాణ పర్యాటక ప్రదేశాలు
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 04, 2016

0 comments:

Post a Comment