LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

తెలంగాణలోఆర్థిక పరిస్థితి

Posted by PAATASHAALANEWS on Tuesday, 4 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

తెలంగాణలోఆర్థిక పరిస్థితి

హైటెక్ సిటి
తెలంగాణలో హైదరాబాదు జిల్లా ఆర్థికంగా ముందంజలో ఉండగా ఆదిలాబాదు జిల్లా వెనుకబడి ఉంది. రాష్ట్రంలోని మొత్తం జీడిపిలో సేవారంగం వాటా 59.01% ఉంది. వ్యవసాయరంగంలో 55.7% మంది పనిచేస్తుండగా, సేవారంగంలో 32.6%, పారిశ్రామిక రంగంలో 11% పనిచేస్తున్నారు.[30] హైదరాబాదు జిల్లా నుంచి సేవారంగంలో సింహభాగం వాటా లభిస్తుండగా, పారిశ్రామిక రంగం నుంచి హైదరాబాదు పరిసరాలలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతం నుంచి, మెదక్ జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం నుంచి మరియు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు ప్రాంతం నుంచి లభిస్తుంది.
తలసరి ఆదాయం:తెలంగాణ ప్రాంతపు ప్రజల తలసరి ఆదాయం రూ.36082గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే, హైదరాబాదులో అత్యధికంగా ఉండగా ఆదిలాబాదు, మహబుబ్‌నగర్ జిల్లాల తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది.
ఖనిజాలు: తెలంగాణలో అనేక ఖనిజ నిక్షిప్తమై ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మరియు ఆదిలాబాదు జిల్లాలలో బొగ్గు గనులు, ఆదిలాబాదు, నిజామాబాద్ మరియు వరంగల్ ప్రాంతాలలో ముడి ఇనుము, ఖమ్మం మరియు మహబూబ్‌నగర్ జిల్లాలలో ముగ్గు రాయి, రంగారెడ్డి మరియు నల్గొండ జిల్లాలలో సున్నపురాయి నిక్షేపాలు విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి.
పరిశ్రమలు: హైదరాబాదు మరియు పరిసరాలలో అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు లో, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకొత్తూరులో పారిశ్రామికవాడ ఉంది. మెదక్ జిల్లా పటాన్‌చెరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. బోధన్ లో చక్కెర కర్మాగారంసిర్పూర్‌లో కాగితం పరిశ్రమ, కొత్తగూడెంలో ఎరువుల పరిశ్రమ ఉంది.
విద్యుత్ కేంద్రాలు: 1921లో హుస్సేన్‌సాహర్ విద్యుత్ కేంద్రం స్థాపించబడింది. 1930లో నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం స్థాపితమైంది. 1956లో నాగార్జున సాగర్ నిర్మించిన పిదప విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1983లోశ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయానికి ప్రాజెక్టుగా మార్చి జలవిద్యుత్ కేంద్రంగా మార్చారు. 2011లో ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టులో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్తగూడెంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. గట్టు ప్రాంతంలో భారీ సౌరవిద్యుత్ కేంద్రం స్థాపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
వ్యవసాయం: ప్రాచీన కాలంలో ముఖ్యంగా కాకతీయుల కాలంలో తెలంగాణ ప్రాంతం వ్యవసాయికంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయాభివృద్ధి కోసం కాకతీయులు నిర్మించిన పలుచెరువులు నేటికీ కనిపిస్తున్నాయి. రెండొబేతరాజు కేసరి సముద్రం నిర్మించగా, గణపతిదేవుడు దేశం (తెలంగాణ) నలుమూలలా పలు భారీ చెరువులను నిర్మించాడు. గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు ప్రఖ్యాతిగాంచిన రామప్ప చెరువును త్రవ్వించాడు. తెలంగాణ ప్రాంతంలో సువాసనలువెదజల్లే బియ్యం పండుతున్నట్లు అప్పట్లోనే సాహితీవేత్తలు పేర్కొన్నారు.[31] కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల కాలంలో కూడా ఈ ప్రాంతం వ్యవసాయంలో పేరుగాంచింది. 1914లో వ్యవసాయాభివృద్ధి కోసం సహకార వ్యవస్థను ఏర్పాటుచేశారు. నిజాంసాగర్ (1935)జలాశయం, అలీసాగర్ఉస్మాన్ సాగర్హిమాయత్ సాగర్గండిపేట చెరువుల నిర్మాణం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానము (1935) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో వరి, జొన్నలు, కందులు, ఆదిలాబాదు జిల్లాలో ప్రత్తి, నిజామాబాదు జిల్లాలో వరి, చెరుకు, మొక్కజొన్న, కరీంనగర్ జిల్లాలో వరి, ప్రత్తి, మెదక్ జిల్లాలో వరి, మొక్కజొన్న, వరంగల్ జిల్లాలో ప్రత్తి, వరి, నల్గొండ జిల్లాలో వరి, ప్రత్తిరంగారెడ్డి జిల్లాలో వరి, కందులు అధికంగా పండుతాయి
తెలంగాణలోఆర్థిక పరిస్థితి
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 04, 2016

0 comments:

Post a Comment