LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

*"ఐక్యరాజ్య సమితి దినోత్సవము" సందర్భంగా సమాచారం*

Posted by PAATASHAALANEWS on Monday 24 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

*"ఐక్యరాజ్య సమితి దినోత్సవము" సందర్భంగా సమాచారం*

ఐక్యరాజ్య సమితి ( ఆంగ్లం: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్)
రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి.

సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా , రష్యా , బ్రిటన్ , చైనా మరియు
ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి
బాన్ కి-మూన్ .

ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన
అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం
ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.
ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలను, ఆయా దేశాల ఆధారిత భూభాగాలను (ఐ.రా.స. గుర్తింపు ప్రకారం)చూపే చిత్రపటం. - ఇందులో కలుపనివి : అంటార్కిటికా (అంటార్కిటికా ఒడంబడిక ప్రకారం నియంత్రింపబడుతున్నది), వాటికన్ నగరంలేదా హోలీ సీ (ఐ.రా.స. సాధారణ సభలో అబ్సర్వవర్ హోదా కలిగి ఉన్నది), పాలస్తీనా భూభాగాలు (ఐ.రా.స. అబ్సర్వర్), పశ్చిమ సహారా (మొరాకో , పోలిసారియో ఫ్రంట్ల మధ్య వివాదంలో ఉన్నది), తైవాన్ - (చైనా రిపబ్లిక్ (తైవాన్) అనబడే దీనిని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఒక భాగంగా ఐ.రా.స. గుర్తిస్తుంది.

*సమితి ఆవిర్భావం*

రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు థియోడార్ రూజ్వెల్ట్ మరియు బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకొన్న ఒప్పందాన్ని అట్లాంటిక్ ఛార్టర్ అంటారు.

ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధభయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినది.

తరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో
యాల్టా సమావేశంలో అమెరికా , బ్రిటన్ , రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945
ఏప్రిల్ 25నుండి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్య రాజ్య సమితి ఛార్టర్
పై సంతకాలు చేశారు. 1945 అక్టోబర్ 24న
న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.

*సమితి ఆశయాలు*

యుద్ధాలు జరగకుండా చూడటం,

అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం,

దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం,

అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం,

సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం.

*ఐక్యరాజ్య సమితికి 6 ప్రధానాంగాలు ఉన్నాయి*

సర్వ ప్రతినిధి సభ

భద్రతా మండలి

సచివాలయం

ధర్మ కర్తృత్వ మండలి

ఆర్థిక, సాంఘిక మండలి

అంతర్జాతీయ న్యాయస్థానం

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 24, 2016

0 comments:

Post a Comment