*ఓ వ్యక్తి రోజుకు ఎంత వాటర్ తాగాలో చెప్పే సూత్రం= (బరువు/10)-2.*
మానవ శరీరంలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు నీరే ఉంటుంది. ఏ అవయవం పనిచేయాలన్నా నీటి అవసరం ఎక్కువ. వ్యాధులు మన ధరి చేరకుండా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. అయితే ఎంత బరువున్న వ్యక్తి ఎంత మొత్తంలో నీటిని తాగాలనే విషయంపై ఓ జనరల్ ఫార్ములా ఉంది. ఈ సూత్రాన్ని అనుసరించి మీ బరువును బట్టి మీరు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగాలో తెల్సుకోవొచ్చు.
ఫార్ములా:
ఓ వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి= ( ఆ వ్యక్తి బరువు/10)-2
ఉదాహరణకు 60 KG ల బరువున్న వ్యక్తి తాగాల్సిన నీటి పరిమాణం= (60/10)-2 =6-2 =4 లీటర్లు
అంటే…60 KG ల బరువున్న వ్యక్తి తాగాల్సిన నీటి పరిమాణం 4 లీటర్లు. 70 Kg ల వ్యక్తి 5 లీటర్లు, 80 Kg ల వ్యక్తి 6 లీటర్లు ఇలా శరీర బరువును బట్టి తాగాల్సి ఉంటుంది.
Note: 3 సంవత్సరాల లోపు పిల్లలకు 1 లీటర్ నీటి ఆవసరం ఉంటుంది. మరీ చిన్న పిల్లల విషయంలో వారు అవసరాన్ని బట్టే నీటిని తాపాల్సి ఉంటుంది. అధికంగా 8 లీటర్ల నీటికంటే కూడా ఎక్కువ తాగడం శ్రేయస్కరం కాదు.
0 comments:
Post a Comment