LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

Psychology

Posted by PAATASHAALANEWS on Thursday, 31 March 2016

Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

[9:14PM, 25/03/2016] Lakshya Sri uradi: యత్నదోష అభ్యసన సిద్ధాంతం- Bits
(Trail and Error Theory)
1. లోహిత్ అనే విద్యార్థి తన గణిత ఉపాధ్యాయుడు ఇచ్చిన నాలుగు సమస్యలను సక్రమంగా పూర్తిచేసి, ఆ ప్రేరణతో మరో సమస్య ఇవ్వమని అడిగితే అది థారన్‌డైక్ నియమాల్లో దేనికి సంబంధించింది?
జ: ఫలిత నియమం
2. 'అనగననగ రాగమతిశయిల్లుచునుండు' ఈ వాక్యం థారన్‌డైక్ ఏ నియమాన్ని నొక్కి చెబుతుంది?
జ: ఉపయోగితా నియమం
3. పార్థివ్ అనే విద్యార్థికి ఆంగ్ల ఉపాధ్యాయుడంటే భయం. తన తండ్రి ఆ ఉపాధ్యాయుడి మంచి ప్రవర్తనను వివరించి మెల్లగా ఆ విద్యార్థికి ఆ ఉపాధ్యాయుడి పట్ల భయాన్నితగ్గిస్తే దీన్ని ఎలా పేర్కొంటారు?
జ: ప్రయోగ విరమణం
4. కిందివాటిలో దేన్ని ఉద్దీపన - ప్రతిస్పందన (S - R Type) సిద్ధాంతమని పేర్కొంటారు?
1) కార్యసాధక నిబంధనం 2) యత్నదోష అభ్యసనం
3) శాస్త్రీయ నిబంధనం 4) వాట్సన్ ప్రయోగం
జ: యత్నదోష అభ్యసనం.
. సుస్మిత రెండు కాళ్లు గోనె బస్తాలో కట్టి, ఒక నిర్దేశిత గమ్యం వైపు నడవమని చెప్పినప్పుడు నడవడానికి కుదరదు కాబట్టి ఎలా వెళ్లాలి అని ఆ విద్యార్థిని హఠాత్తుగా స్ఫురణకు తెచ్చుకుంటే దాన్ని కిందివాటిలో ఏ అభ్యసనంగా గుర్తించవచ్చు?
1) కార్యసాధక నిబంధనం 2) అంతదృష్టి అభ్యసనం
3) శాస్త్రీయ నిబంధనాభ్యసనం 4) యత్నదోష విధానాభ్యసనం
జ: అంతర్ దృష్టి అభ్యసనం
6. ప్రవల్లిక అనే టీచర్ విద్యార్థుల వయసుకు మించిన అంశాలను బోధించినప్పుడు ఆ విద్యార్థుల్లో ఆసక్తి మందగిస్తే ఏసూత్రాన్ని అనుసరించినట్లు గుర్తించాలి?
జ: సంసిద్ధతా నియమం
1. శేషు అనే విద్యార్థి సమ్మేటివ్ - I పరీక్షలో అధిక మార్కులు సాధించిన ప్రేరణతో, సమ్మేటివ్ - II పరీక్షకు సరైన సాధన చేయలేకపోవడం వల్ల మార్కులు తగ్గాయి. ఇది థార్న్‌డైక్ ఏ నియమానికి సంబంధించిన అంశంగా పేర్కొనవచ్చు?
జ: నిరుపయోగితా నియమం
2. కిందివాటిలో థార్న్‌డైక్ ఫలిత నియమానికి సంబంధించి సత్య వాక్యమేది?
1) ఉపాధ్యాయుడు తరగతి గదిలో కల్పించే అనుభవాలు విద్యార్థులకు సంతృప్తిగా, వారి అవసరాలకు తగినట్లుగా ఉండాలి.
2) విద్యార్థులకు కల్పించే నియోజనాలు వారు సాధించేవిగా ఉండాలి.
3) అభ్యాసకులు సక్రమమైన అభ్యసనాన్ని చేసినప్పుడు వారికి సక్రమమైన ప్రశంసగానీ, బహుమతిగానీ కల్పించాలి.
4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)
3. కిందివాటిలో థార్న్‌డైక్ అభ్యాస నియమాన్ని సమర్థించే ప్రవచనం ఏది?
A) దివ్య అనే విద్యార్థి భగవద్గీతలోని శ్లోకాలను వల్లెవేస్తూ నేర్చుకోవడం.
B) నిత్య అనే విద్యార్థి రోజూ క్రమం తప్పకుండా టైప్ నేర్చుకోవడం.
C) అర్పిత ఇంటిపని (Home work) చేయడానికి ఇష్టపడకపోవడం.
D) హాసిని అనే విధ్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకోవడం.
1) A, B మాత్రమే సరైనవి. 2) A, B, C మాత్రమే సరైనవి.
3) A, B, D లు మాత్రమే సరైనవి. 4) A, B, C, D లు సరైనవి.
జ: 3(A, B, D లు మాత్రమే సరైనవి.)
4. కింది ప్రవచనాల్లో ఏవి థార్న్‌డైక్ సంసిద్ధతా నియమాన్ని పాటిస్తాయి?
A) కిరణ్ అనే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని ప్రారంభించడానికి ముందు అభినయ గేయాలు పాడటం.
B) మురళీ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి రాగానే నేరుగా పాఠ్యాంశాన్ని ప్రారంభించడం.
C) ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధిస్తాడు.
D) రచన, యామిని అనే ఉపాధ్యాయులు కలిసి ఆటపాటలతో పాఠ్యాంశాన్ని బోధిస్తారు.
1) A, B, C మాత్రమే సరైనవి. 2) A, B, D మాత్రమే సరైనవి.
3) A, C, D మాత్రమే సరైనవి. 4) A, B, C, D మాత్రమే సరైనవి.
జ: 3(A, C, D మాత్రమే సరైనవి.)
5. టైప్ నేర్చుకోవడం, క్రీడల్లో నైపుణ్యం సాధించడం, అక్షరాలు దిద్దడం, శ్లోకాలు నేర్చుకోవడం లాంటి అభ్యసనా అంశాలను నేర్చుకోవడానికి ఉపయోగపడే అభ్యసనా సిద్ధాంతం ఏది?
జ: సంధానాల సిద్ధాంతం
6. చార్మినార్ అంటే హైదరాబాద్, బల్బు అంటే ఎడిసన్, మార్చి 8 అంటే మహిళా దినోత్సవం గుర్తుకురావడం లాంటి అంశాలను పెంపొందించే థార్న్‌డెక్ ఉపనియమం ఏది?
జ: సామీప్యతా నియమం
7. 'Animal Intelligence' గ్రంథం ఏ వాదానికి సంబంధించింది?
జ: సంసర్గవాదం
[9:22PM, 25/03/2016] Lakshya Sri uradi: ����Dsc psychology

��యత్నదోష అభ్యసన సిద్ధాంతం- Bits
(Trail and Error Theory)

1. లోహిత్ అనే విద్యార్థి తన గణిత ఉపాధ్యాయుడు ఇచ్చిన నాలుగు సమస్యలను సక్రమంగా పూర్తిచేసి, ఆ ప్రేరణతో మరో సమస్య ఇవ్వమని అడిగితే అది థారన్‌డైక్ నియమాల్లో దేనికి సంబంధించింది?
జ: ఫలిత నియమం
2. 'అనగననగ రాగమతిశయిల్లుచునుండు' ఈ వాక్యం థారన్‌డైక్ ఏ నియమాన్ని నొక్కి చెబుతుంది?
జ: ఉపయోగితా నియమం
3. పార్థివ్ అనే విద్యార్థికి ఆంగ్ల ఉపాధ్యాయుడంటే భయం. తన తండ్రి ఆ ఉపాధ్యాయుడి మంచి ప్రవర్తనను వివరించి మెల్లగా ఆ విద్యార్థికి ఆ ఉపాధ్యాయుడి పట్ల భయాన్నితగ్గిస్తే దీన్ని ఎలా పేర్కొంటారు?
జ: ప్రయోగ విరమణం
4. కిందివాటిలో దేన్ని ఉద్దీపన - ప్రతిస్పందన (S - R Type) సిద్ధాంతమని పేర్కొంటారు?
1) కార్యసాధక నిబంధనం 2) యత్నదోష అభ్యసనం
3) శాస్త్రీయ నిబంధనం 4) వాట్సన్ ప్రయోగం
జ: యత్నదోష అభ్యసనం.
. సుస్మిత రెండు కాళ్లు గోనె బస్తాలో కట్టి, ఒక నిర్దేశిత గమ్యం వైపు నడవమని చెప్పినప్పుడు నడవడానికి కుదరదు కాబట్టి ఎలా వెళ్లాలి అని ఆ విద్యార్థిని హఠాత్తుగా స్ఫురణకు తెచ్చుకుంటే దాన్ని కిందివాటిలో ఏ అభ్యసనంగా గుర్తించవచ్చు?
1) కార్యసాధక నిబంధనం 2) అంతదృష్టి అభ్యసనం
3) శాస్త్రీయ నిబంధనాభ్యసనం 4) యత్నదోష విధానాభ్యసనం
జ: అంతర్ దృష్టి అభ్యసనం
6. ప్రవల్లిక అనే టీచర్ విద్యార్థుల వయసుకు మించిన అంశాలను బోధించినప్పుడు ఆ విద్యార్థుల్లో ఆసక్తి మందగిస్తే ఏసూత్రాన్ని అనుసరించినట్లు గుర్తించాలి?
జ: సంసిద్ధతా నియమం
1. శేషు అనే విద్యార్థి సమ్మేటివ్ - I పరీక్షలో అధిక మార్కులు సాధించిన ప్రేరణతో, సమ్మేటివ్ - II పరీక్షకు సరైన సాధన చేయలేకపోవడం వల్ల మార్కులు తగ్గాయి. ఇది థార్న్‌డైక్ ఏ నియమానికి సంబంధించిన అంశంగా పేర్కొనవచ్చు?
జ: నిరుపయోగితా నియమం
2. కిందివాటిలో థార్న్‌డైక్ ఫలిత నియమానికి సంబంధించి సత్య వాక్యమేది?
1) ఉపాధ్యాయుడు తరగతి గదిలో కల్పించే అనుభవాలు విద్యార్థులకు సంతృప్తిగా, వారి అవసరాలకు తగినట్లుగా ఉండాలి.
2) విద్యార్థులకు కల్పించే నియోజనాలు వారు సాధించేవిగా ఉండాలి.
3) అభ్యాసకులు సక్రమమైన అభ్యసనాన్ని చేసినప్పుడు వారికి సక్రమమైన ప్రశంసగానీ, బహుమతిగానీ కల్పించాలి.
4) పైవన్నీ
జ: 4(పైవన్నీ)
3. కిందివాటిలో థార్న్‌డైక్ అభ్యాస నియమాన్ని సమర్థించే ప్రవచనం ఏది?
A) దివ్య అనే విద్యార్థి భగవద్గీతలోని శ్లోకాలను వల్లెవేస్తూ నేర్చుకోవడం.
B) నిత్య అనే విద్యార్థి రోజూ క్రమం తప్పకుండా టైప్ నేర్చుకోవడం.
C) అర్పిత ఇంటిపని (Home work) చేయడానికి ఇష్టపడకపోవడం.
D) హాసిని అనే విధ్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకోవడం.
1) A, B మాత్రమే సరైనవి. 2) A, B, C మాత్రమే సరైనవి.
3) A, B, D లు మాత్రమే సరైనవి. 4) A, B, C, D లు సరైనవి.
జ: 3(A, B, D లు మాత్రమే సరైనవి.)
4. కింది ప్రవచనాల్లో ఏవి థార్న్‌డైక్ సంసిద్ధతా నియమాన్ని పాటిస్తాయి?
A) కిరణ్ అనే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని ప్రారంభించడానికి ముందు అభినయ గేయాలు పాడటం.
B) మురళీ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి రాగానే నేరుగా పాఠ్యాంశాన్ని ప్రారంభించడం.
C) ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధిస్తాడు.
D) రచన, యామిని అనే ఉపాధ్యాయులు కలిసి ఆటపాటలతో పాఠ్యాంశాన్ని బోధిస్తారు.
1) ?
జ: సంసర్గవాదం
[7:40AM, 27/03/2016] Lakshya Sri uradi: యత్నదోష అభ్యసన సిద్ధాంతం
(Trail and Error Theory)
              ఒక పనిలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించలేకపోవచ్చు. అయితే, మళ్లీమళ్లీ అదే పని చేయడం ద్వారా సఫలం కావచ్చు. తప్పులు చేయడం, సవరించుకోవడం, మళ్లీ ప్రయత్నించడం.. మెరుగైన ఫలితాన్ని సాధించడం ఇవన్నీ నేర్చుకునే క్రమంలో ప్రతి విద్యార్థికి ఎదురయ్యే అనుభవాలే. వీటికి సంబంధించి థారన్‌డైక్ అనే విద్యావేత్త ప్రతిపాదించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం.
           అభ్యసన సిద్ధాంతకర్తల్లో థారన్‌డైక్ అత్యున్నతస్థానం పొందాడు. ఆయన సిద్ధాంతాన్ని విద్యాచరణలోనూ, శాబ్దిక ప్రవర్తనలోనూ, శిక్షణా బదలాయింపులోనూ అన్వయించారు.
¤ 1890లో విలియం జేమ్స్ రాసిన 'ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ' (Principles of Psychology) అనే గ్రంథం చదివి థారన్‌డైక్ బాగా ప్రభావితుడై 1911లో 'యానిమల్ ఇంటెలిజెన్స్' (Animal Intelligence) అనే గ్రంథాన్ని ప్రచురించాడు.
¤ ఈయన రూపొందించిన అభ్యసనంలో ఉద్దీపన (Stimulus), ప్రతిస్పందన (Response) మధ్య నాడీసంధానం జరుగుతుంది. కాబట్టి ఇతడి సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం, బంధనాల సిద్ధాంతం, సంసర్గ సిద్ధాంతం, S.R. Type సిద్ధాంతం, విజయపథ వరణరీతి సిద్ధాంతం అని కూడా వ్యవహరిస్తారు.
థారన్‌డైక్ (అమెరికా) అభిప్రాయం ప్రకారం, అభ్యసనం అనేది ప్రయత్నం, దోషం ద్వారా జరుగుతుంది. ఈయన ఒకేసారి కొత్త విషయం నేర్చుకోవడం కష్టసాధ్యం అనీ, అనేక ప్రయత్నాలు చేయాలని, యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గి అభ్యసనంలో పట్టు సాధిస్తారని ప్రయోగ పూర్వకంగా నిరూపించారు.
¤ అనేక తప్పులు చేయడం ద్వారా, వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం ఏర్పడటాన్ని 'యత్నదోష అభ్యసనం' అంటారు.

ప్రయోగం
                                          
         థారన్‌డైక్ ఆకలిగా ఉన్న ఒక పిల్లిని 'పజిల్ పెట్టె' (Puzzle Box)లో ఉంచి, దానికి కనిపించే విధంగా ఆహారాన్ని బయటపెట్టాడు.
¤ ఈ పజిల్ పెట్టె తలుపుకు ఒక గడియ ఉంటుంది. పిల్లికి ఆకలి అనే అవసరం ప్రేరణగా, ఆహారం చేరవలసిన గమ్యంగా ఉంటుంది.
¤ పజిల్ పెట్టె తలుపు తెరుచుకోవాలంటే లోపల ఉన్న మీట (Switch)ను నొక్కవలసి ఉంటుంది.
¤ ఆహారం పొందడానికి పిల్లి అటుఇటు తిరగడం, తన పంజాలతో ఊచలను రక్కడం, పళ్లతో కొరకడం లాంటి అనేక వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంది.
¤ చివరకు అనుకోకుండా మీటను తన పంజాతో నొక్కుతుంది. దీంతో తలుపు తెరుచుకోగా బయటకు వచ్చిన పిల్లి ఆహారం తింటుంది.
¤ అంటే పిల్లి ఆహారాన్ని పొందే ప్రయత్నంలో చాలా తప్పులు చేసి, కొంత సమయాన్ని వ్యర్థం చేసిన తర్వాత లక్ష్యాన్ని చేరింది.
¤ మళ్లీ ఆకలిగా ఉన్న అదే పిల్లిని పజిల్ పెట్టెలో ఉంచినప్పుడు ఈసారి వ్యర్థ ప్రయత్నాల సంఖ్య తగ్గడమే కాకుండా, గమ్యం చేరడానికి పట్టే కాలం కూడా తగ్గుతుంది. ఇలా ప్రయత్నాల సంఖ్య పెరిగేకొద్దీ దోషాల సంఖ్య తగ్గి తక్కువ కాలంలోనే విజయవంతంగా మీటను నొక్కి ఆహారాన్ని పొందడం అనేది అభ్యసనం ద్వారా జరుగుతుందని ఈ ప్రయోగం నిరూపించింది.
¤ చలన అభ్యసనాలైన ఈత నేర్చుకోవడం, డ్రైవింగ్ ప్రక్రియ (సైకిల్, స్కూటర్, ఇతర వాహనాలు), క్రీడల్లో నైపుణ్యం, చిన్నపిల్లలు మొదట పలకపై అక్షరాలు దిద్దడం లాంటి అభ్యసనాలన్నీ 'యత్నదోష పద్ధతి' ద్వారా అభ్యసించగలిగేవే.
ప్రయోగ అభ్యసన ప్రధాన నియమాలు
          తన ప్రయోగం ద్వారా థారన్‌డైక్ మూడు ప్రధాన అభ్యసన నియమాలను పేర్కొన్నాడు.
¤ సంసిద్ధతా నియమం (Law of Readiness)
¤ అభ్యాస నియమం (Law of Exercise)
¤ ఫలిత నియమం (Law of Effect)
                                                          సంసిద్ధతా నియమం
        ఈ నియమం ప్రకారం ఒక జీవి అభ్యసనం చేయాలంటే సంసిద్ధత అవసరం. ఏవైనా భౌతిక, మానసిక చర్యలు జరపడానికి జీవిలో శారీరక పెరుగుదలతోపాటు మానసిక పరిపక్వత ఉంటేనే అభ్యసనకు సంసిద్ధత ఉంటుంది. ఇది ప్రేరణ మీద కూడా ఆధారపడుతుంది. అభ్యాసకుడు సన్నద్ధం కానప్పుడు ఎన్ని అభ్యసనానుభవాలు కల్పించినా ఫలితం ఉండదు. ఒక్కోసారి అసలు నేర్చుకోవడం కూడా జరగదు.
ఉదా: దాహం లేని గుర్రాన్ని నీటి దగ్గరకు తీసుకువెళ్లవచ్చు కానీ దానితో నీటిని తాగించలేం కదా.
                                                            అభ్యాస నియమం
        అభ్యాస నియమంలో ఉపయోగ, నిరుపయోగ లేదా అనుపయోగ నియమం అనే రెండు ఉపనియమాలు ఉన్నాయి.
ఉపయోగ నియమం:
        దీన్ని నవ్యత్వ, తరచుదన, పౌనఃపున్య నియమం అని కూడా పిలుస్తారు. నూతన అంశం లేదా ఒకే పనిని మళ్లీమళ్లీ చేయడం ద్వారా దోషాలను నివారించవచ్చు. తద్వారా అభ్యసనం సమర్థవంతం అవుతుంది
ఉదా: 'అభ్యాసం కూసు విద్య' అనే సామెత, 'తినగ తినగ వేము తియ్యనుండు' అనే పద్యం, పునస్మరణ ద్వారా విషయాన్ని బాగా గుర్తుంచుకోవడం. క్రీడల్లో నైపుణ్యం పొందడం లాంటి కృత్యాలు.
నిరుపయోగ/ అనుపయోగ నియమం:
        ఒకసారి నేర్చుకున్న అంశాన్ని మళ్లీమళ్లీ సాధన చేయకపోవడం వల్ల విషయం మధ్య సంధానాలు బలహీనపడి అభ్యసనం కుంటుపడుతుంది.
ఉదా: చిన్నతనంలో అభ్యసించిన విషయాలు మళ్లీ చదవకపోవడం వల్ల వాటిని ప్రస్తుతం గుర్తుంచుకోలేకపోవడం.
గమనిక: చలన కౌశలాలు ఈ నియమానికి వర్తించవు. ఒకసారి నేర్చుకున్న చలన కౌశలాలను (టైప్, సైకిల్ తొక్కడం) తిరిగి చేయకపోతే అందులోని నిష్పాదన తగ్గుతుంది. కానీ పూర్తిగా మరిచిపోవడం జరగదు.
                                                               ఫలిత నియమం
        థారన్‌డైక్ నియమాల్లో ఇది అత్యంత ప్రధానమైంది. ఇందులోని ఉపనియమాలను పరిశీలిస్తే .....
సంతృప్తి నియమం:
        ఒక కృత్యసాధనలో మంచి ఫలితం లేదా సంతృప్తి ఏర్పడితే దాని మధ్య సంసర్గం బలపడుతుంది.
అసంతృప్తి నియమం:
        ఏదైనా కృత్య సాధనలో విఫలం లేదా అసంతృప్తి కలిగితే వాటి మధ్య ఉన్న బంధనాలు బలహీనపడి అభ్యసనం సన్నగిల్లుతుంది లేదా క్షీణిస్తుంది.
¤ మొట్టమొదట థారన్‌డైక్ ఫలిత నియమాన్ని ప్రకటించిన తర్వాత దానికి అనేక వ్యతిరేకతలు వచ్చాయి. ప్రవర్తనావాదులు సంతృప్తి, అసంతృప్తి అనేవి ఆత్మాశ్రయమైన (Subjective terms) పదాలు అన్నారు. కానీ వీటిని ఈ సిద్ధాంతం ప్రతిఘటించింది. థారన్‌డైక్ ఫలిత సిద్ధాంతం ప్రకారం బహుమతులు, విజయాలు అభ్యసనానికి దోహదం చేస్తాయి. కానీ శిక్ష, వైఫల్యం అభ్యసనానికి ఆటంకం కలిగిస్తాయి.
¤ థారన్‌డైక్ ప్రధాన నియమాలే కాకుండా కొన్ని గౌణనియమాలను కూడా పేర్కొన్నారు.
[5:51PM, 29/03/2016] Lakshya Sri uradi: మూర్తిమత్వం (Personality)

          మూర్తిమత్వం (Personality) అనే పదం Persona అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో 'పర్సోనా' అంటే 'ముసుగు' అని అర్థం. పూర్వం గ్రీకులు ముసుగును ధరించి నాటకాలు వేసేవారు. ప్రస్తుతం నిత్యజీవితంలో ఎక్కువమంది మూర్తిమత్వాన్ని సరైన భావనతో ఉపయోగించడం లేదు. వ్యక్తి బాహ్య సౌందర్యాన్నే మూర్తిమత్వంగా భావిస్తున్నారు. వాస్తవానికి మూర్తిమత్వం అనేది శారీరక బాహ్య సౌందర్యం మాత్రమే కాకుండా అంతర్గత వికాసాలైన మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక అంశాలతో ముడిపడి ఉండే భావన.

మూర్తిమత్వం నిర్వచనాలు:
         ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని స్పష్టంగా నిర్వచించడం కష్టం. కానీ కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కిందివిధంగా వివరించారు.
వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అంటారు.        ------ ఐసెంక్
మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన శారీరక, మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు.             ------- ఆల్‌పోర్ట్
మూర్తిమత్వం ఒక సమగ్రమైన, సంపూర్ణమైన వ్యవస్థ.
                                                                                  ------ కర్ట్ లెవిన్
వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అంటారు.
                                                                                                                                 ------ డేషియల్
దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన, క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం.
                                                                                                                 ------ వాట్సన్
సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం.
                                                                                 ------ ఇ.ఫారిస్
ఒక వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి ప్రాతను, హోదాను నిర్ణయించే లక్షణాల సమైక్యం.
                                                                                                                         ------ ఇ.డబ్ల్యు.బర్జెస్
వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా.
                                                                              ------ జె.ఎఫ్.బ్రౌన్
మూర్తిమత్వం లక్షణాలు: 
వ్యక్తి పుట్టుకతోనే మూర్తిమత్వం ఏర్పడదు. జీవితానుభవాలు, అభ్యసనం ద్వారా వ్యక్తిగతంగా ఏర్పడుతుంది.
మూర్తిమత్వం వైయక్తిక భేదాలను చూపుతుంది. ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకేలా ఉండరు.
ఒక వ్యక్తి బాహ్య ప్రవర్తన, అతడి లక్షణాల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు.
మూర్తిమత్వం సరళత నుంచి ఉన్నత దశకు చేరుకుంటుంది. అనువంశికంగా వచ్చిన లక్షణాలు క్రమంగా పరిసర ప్రతిచర్యలతో నిర్మితమవుతాయి.
ప్రతి వ్యక్తిలోనూ మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది. కానీ స్తబ్ధంగా ఉండదు. ఎందుకంటే మూర్తిమత్వం గతిశీలమైన (Dynamic) ప్రక్రియ.
ఒక మనిషిలోని మూర్తిమత్వాన్ని వివరించి అంచనా వేయవచ్చు. కానీ కచ్చితంగా మాపనం చేయలేం.
మూర్తిమత్వం ప్రత్యేకమైంది. ప్రతి వ్యక్తిలోనూ సర్దుబాటు చేసుకునే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో వ్యక్తమయ్యే ప్రవర్తనా నమూనాల ఆధారంగా ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని గణించకూడదు.
మూర్తిమత్వ సిద్ధాంతాలు
వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడానికి అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి
       1) రూపక సిద్ధాంతాలు (Types Theories)
       2) లక్షణాంశ సిద్ధాంతాలు (Trait Theories)
       3) నిర్మితి సిద్ధాంతాలు (Structure Theories)

I. రూపక సిద్ధాంతాలు (Types Theories)

మూర్తిమత్వ నిర్మాణాన్ని వివరించడంలో బాహ్య రూపాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్న సిద్ధాంతాలు.
ఈ సిద్ధాంతానికి సంబంధించి వివిధ శాస్త్రవేత్తల వర్గీకరణలు
హిప్పోక్రటస్ వర్గీకరణ: గ్రీకు వైద్యశాస్త్ర పితామహుడైన హిప్పోక్రటస్ వ్యక్తుల శరీరంలో ఉత్పత్తి అయ్యే నాలుగు రకాల రసాలకు, వారి చిత్త ప్రవృత్తికి సంబంధం ఉందనే అభిప్రాయంతో కింది వర్గీకరణను రూపొందించాడు.  
మూర్తిమత్వ రకం
   స్రావకం
           చిత్తవృత్తి లక్షణం
ఔత్సాహికులు
(Sanguine)
రక్తం
వీరు శారీరకంగా, ఉద్వేగపరంగా బలంగా ఉంటారు.
సంతోషంగా, సంఘంతో మంచి సర్దుబాటు కలిగి ఆశాజీవులుగా ఉంటారు. ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు.
విషణ్ణువు
(Melancholic)
నల్లని పైత్యరసం
వీరు శారీరకంగా, ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు.
ఎల్లప్పుడూ నిరాశాజీవిగా, మందకొడిగా, విచారగ్రస్తులుగా ఉంటారు.
పైత్య ప్రవృత్తి
(Choleric)
పసుపు
పైత్యరసం
శారీరకంగా బలంగా, ఉద్వేగపరంగా బలహీనులుగా ఉంటారు. ఉద్వేగ అస్థిరతతో కోపాన్ని, చిరాకును ప్రదర్శిస్తారు.
శ్లేష్మ ప్రవృత్తి
(Phlegmatic)
శ్లేష్మరసం
శారీరకంగా బలంగా, ఉద్వేగపరంగా బలహీనులుగా ఉంటారు. సంఘంతో సంబంధం లేకుండా ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు.

క్రెష్మర్ వర్గీకరణ: జర్మనీ దేశానికి చెందిన ఎర్నెస్ట్ క్రెష్మర్ అనే శాస్త్రవేత్త వ్యక్తుల శరీర నిర్మాణానికి, వారి మూర్తిమత్వానికి సంబంధం ఉందని వివరించాడు. 'శరీర నిర్మాణం' ఆధారంగా వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడు. 
మూర్తిమత్వ రకం
   శరీర నిర్మాణం
              లక్షణాలు
పీవరకాయులు
(Pyknic)
పొట్టిగా, లావుగా ఉంటారు. 
ఉద్వేగ స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. ఎల్లప్పుడూ ఉల్లాసంగా సాంఘిక జీవనానికి అలవాటుపడి బహిర్వర్తనులుగా ఉంటారు.
క్రీడాకాయులు
(Athletic)
శారీరక ధారుడ్యం అనుపాతంలో ఉంటుంది.
ఎత్తుకు తగిన బరువు ఉండి ఆశావాదులుగా ఉంటారు. మంచి శక్తిమంతులు, ఉభయవర్తనులు.
ప్రాంశుకాయులు
(Aesthetic)
సన్నగా, పొడవుగా ఉంటారు.
సున్నిత స్వభావం కలవారు. సన్నగా, పొడవుగా, బలహీనంగా ఉంటారు. సర్దుబాటు స్వభావం ఉన్నవారు. అంతర్వర్తనులుగా ప్రవర్తిస్తారు.
షెల్డన్ వర్గీకరణ: అమెరికాకు చెందిన షెల్డన్ వందలాది యువతీ యువకుల శరీర ఆకృతిని పరిశీలించి వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించాడు.
మూర్తిమత్వ రకం
   శరీర ఆకృతి
         మూర్తిమత్వ లక్షణం
స్థూలకాయులు
(Endomorphic)
లావుగా, పొట్టిగా ఉంటారు.
సాంఘిక పరిపక్వత కలిగి ఎల్లప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు.
మధ్యమకాయులు
(Mesomorphic)
శరీరం అనుపాతంలో ఉంటుంది.
మంచి శరీర ధారుడ్యంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు. కష్టసుఖాలను సమంగా ఎదుర్కొంటారు.
లంబకృశకాయులు
(Ectomorphic)
సన్నగా, పొడవుగా ఉంటారు.
సున్నిత స్వభావం కలవారు. సాంఘిక సంబంధాలు ఇష్టపడక, అంతర్ముఖులుగా ఉంటారు.
         షెల్డన్ ప్రకారం ఏ వ్యక్తీ పూర్తిగా ఒకే రకానికి చెంది ఉండనవసరం లేదు. పై మూడు లక్షణాలు వివిధ అనుపాతంలో ఉండవచ్చు. అందుకే షెల్డన్ లక్షణాలను ఏడు పాయింట్ల మాపనిపై మాపనం చేశాడు. ఈయన ప్రకారం స్థూలకాయత ఉండే ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని 7.1.1గా సూచిస్తే... అతడు స్థూలకాయతలో 7, మధ్యమకాయతలో 1, లంబకృశకాయతలో 1 అని అర్థం. అలాగే మధ్యమకాయతను 1.7.1 అని, లంబకృశకాయతను 1.1.7 అని సూచించాడు.

వ్యక్తి పూర్తిగా ఏదో ఒక రంగానికి చెంది ఉండటం అరుదు. కాబట్టి షెల్డన్ మాపనిలో సగటు వ్యక్తి 3.4.4 కావచ్చు.
యూంగ్ వర్గీకరణ : స్విట్జర్లాండ్‌కు చెందిన కార్ల్ యూంగ్ వ్యక్తులను మానసిక గుణాల ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించాడు. కానీ సాధారణంగా వ్యక్తుల్లో ఈ రెండు లక్షణాలు వివిధ పాళ్లలో ఉంటాయి. కాబట్టి ఈ రెండింటికీ మధ్యస్తంగా ఉండే మూడో రకాన్ని ఉభయవర్తనంగా గుర్తించాడు.
మూర్తిమత్వ రకం
             మూర్తిమత్వ లక్షణాలు
అంతర్వర్తనులు (Introverts)
ఇతరులతో సాంఘిక సంబంధాలు తక్కువగా ఉంటాయి. ఎప్పుడూ ముభావంగా ఉపసంహరణ ధోరణిలో తమలో తామే ఆలోచించుకుంటూ ఏకాకులుగా ఉంటారు.
బహిర్వర్తనులు(Extroverts)
సంఘ జీవులు, ఉల్లాస ప్రియులు, జీవితాన్ని వినోదంగా గడిపేవారు. ఆలోచన తక్కువగా ఉంటుంది. మాటకారితనం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎప్పుడూ మంచి మార్పును కోరుకుంటారు.
ఉభయవర్తనులు(Ambiverts)
అంతర్వర్తన, బహిర్వర్తన గుణాలు సమపాళ్లలో ఉంటాయి. ఇలాంటివారు సమాజంలో దాదాపు 80% వరకు ఉంటారు.
స్ప్రాంగర్ వర్గీకరణ: జర్మనీకి చెందిన స్ప్రాంగర్ (స్పాంజర్) జీవితంలో ప్రాధాన్యం ఇచ్చే 'విలువలు' ఆధారంగా వ్యక్తులను 6 రకాలుగా వర్గీకరించాడు.
        మూర్తిమత్వ రకం
          చిత్తవృత్తి లక్షణాలు
సైద్ధాంతిక విలువలు ఉండేవారు(Theoritical Values)
ఆదర్శాలను నమ్మి, నిర్దిష్ట పద్ధతిలో జీవనం గడుపుతున్న మేధావులు, శాస్త్రవేత్తలు ఈ వర్గానికి చెందుతారు.
ఆర్థిక విలువలు ఉండేవారు (Economical Values)
మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా భావించి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రతి పనికి లాభ నష్టాలను బేరీజు వేసుకునేవారు.
సాంఘిక విలువలు ఉండేవారు
(Social Values)
ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలు ఉండేవారు. సంఘసేవ చేస్తూ ఉంటారు. ఉదా: గాంధీజీ
రాజకీయ విలువలు ఉండేవారు
(Political Values)
రాజకీయ ప్రాబల్యం కోసం పాటుపడుతూ ఇతరులను ఒప్పించే నైజం ఉన్నవారు.
మత విలువలు ఉండేవారు
(Religious Values)
ఇతరులను తీవ్రంగా ప్రభావితం చేస్తూ, మత విషయాలపై మక్కువ ఎక్కువగా ఉంటూ మత ప్రచారం చేసేవారు.
సౌందర్య ఆరాధనా విలువలు ఉండేవారు (Aesthetic Values)
అందాన్ని ఆరాధిస్తూ లలితకళలు, గృహ అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. సౌందర్యోపాసన ఉండేవారు. వీరు సహజంగా చిత్రకారులుగా ఉంటారు. ఉదా: బాపు

  II. లక్షణాంశ సిద్ధాంతాలు (Traits Theories)

          మూర్తిమత్వాన్ని వివరించడంలో రూపానికి బదులు లక్షణాంశాలను పరిగణనలోకి తీసుకోవడం మెరుగైన పద్ధతి. వ్యక్తిలో దాదాపు శాశ్వతంగా కనిపించే గుణాన్ని 'లక్షణం' అంటారు. మంచితనం, దౌర్జన్యం, పిసినారితనం, చిరాకు, కోపం, సహనశీలత మొదలైనవి ఇలాంటి కొన్ని లక్షణాంశాలు. వీటి ఆధారంగా మూర్తిమత్వాన్ని వివరించినవారిలో ఆల్‌పోర్ట్, రేమండ్ కాటిల్ ప్రసిద్ధులు.
1. ఆల్‌పోర్ట్ లక్షణాంశ సిద్ధాంతం
ఆల్‌పోర్ట్ ప్రకారం లక్షణాంశం అనేది సామాన్యీకరణం చేసిన కేంద్రీకృత మానసిక విధానం. లక్షణాంశం అనేది ఒక రకమైన ప్రవర్తనను వివిధ సందర్భాల్లో వ్యక్తం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఆల్‌పోర్ట్ లక్షణాలను 3 రకాలుగా వర్గీకరించాడు.
ఎ. ప్రాథమిక లేదా సాధారణ లేదా సామాన్య లక్షణాలు: దయ, ఉదారత, స్నేహగుణం, ఉదాసీనత, దౌర్జన్యం లాంటి లక్షణాలు వ్యక్తి ప్రవర్తన ద్వారా బయటపడతాయి. చాలా తక్కువగా ఉండే ఈ లక్షణాలను తేలిగ్గా గుర్తించవచ్చు. 
బి. కేంద్రీయ లక్షణాంశాలు లేదా వ్యక్తిగత డిస్పోజిషన్‌లు: ఒక వ్యక్తిని మరో వ్యక్తి నుంచి వేరుచేయగల కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వీటిని తేలిగ్గా గుర్తించగలం. ఈ వ్యక్తిగత లక్షణాలు ఇతరులకు భిన్నంగా గోచరిస్తాయి.
ఉదా: మంచి నేర్పరితనం, నృత్య ప్రదర్శన, గొప్ప ధైర్య సాహసం, హాస్యం, అధిక కోపం.
సి. మాధ్యమిక లక్షణాలు: ఇవి పరిమితంగా ఉండి ఎప్పుడో ఒకప్పుడు వ్యక్తమవుతాయి.
2. కాటిల్ సిద్ధాంతం:
''ఒక సన్నివేశంలో వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం". ఈయన 17,953 ప్రవర్తనా లక్షణాలను గుర్తించాడు. వీటిలో సారూప్యం ఉన్న 171 మూర్తిమత్వ లక్షణాలను వేరుచేశాడు. వీటిని 'ప్రాథమిక లక్షణాలు'గా పిలిచాడు. ఈ ప్రాథమిక లక్షణాంశాల్లో కొన్నింటి మధ్య సహసంబంధం ఎక్కువగానూ, కొన్నింటి మధ్య తక్కువగానూ ఉంది. వీటిని 35 ప్రత్యేక సమూహాలుగా గుర్తించాడు. కానీ చివరగా వ్యక్తి మూర్తిమత్వాన్ని నిర్ణయించేవి కేవలం 16 లక్షణాంశాలు మాత్రమే అని తెలిపాడు.
ఎ. ఉపరితల లక్షణాంశాలు: వ్యక్తి బహిర్గత ప్రవర్తన ద్వారా ప్రత్యేకంగా పరిశీలించవచ్చు.
ఉదా: సాయపడే గుణం, స్నేహ గుణం.
బి. మూల లక్షణాంశాలు: ఇవి వ్యక్తిలో దాదాపు స్థిరంగా ఉంటాయి. బహిర్గత ప్రవర్తన ద్వారా గుర్తించలేం. కానీ ఉపరితల లక్షణాంశాల ద్వారా గుర్తించవచ్చు.
ఉదా: వ్యక్తిలోని 'ప్రజ్ఞ' అనే మూల లక్షణాన్ని 'విద్యాసాధన' అనే ఉపరితల లక్షణం ద్వారా గుర్తించవచ్చు.

III. నిర్మితి సిద్ధాంతాలు (Structure Theories)

       వ్యక్తి సమగ్ర రూపం, ప్రవర్తనా ప్రాకార్యాల ఆధారంగా మూర్తిమత్వాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నమే ఈ సిద్ధాంతాలు.
మనోవిశ్లేషణ సిద్ధాంతం (Psycho Analysis Theory): ఆస్ట్రియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యక్తుల మూర్తిమత్వాన్ని మానసిక లక్షణాంశాలు లేదా అచేతన ప్రేరణ ద్వారా వివరించాడు. ఈ సిద్ధాంతంలో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి.
           1. చలన శక్తి (Dynamic aspect)
           2. ఆర్జిత శక్తి (Economic aspect)
           3. శరీరోపరితల శక్తి (Topographic aspect)
1. చలనశక్తి (Dynamic Aspect)
ఫ్రాయిడ్ ప్రకారం చలనశక్తి అనే భావన 3 ఉపభాగాలతో ఏర్పడింది.

ఎ. అచిత్తు (ఇడ్): పుట్టుకతో వచ్చే సహజసిద్ధ గుణాలు, సహజాతాలు, జంతువాంఛలు, దౌర్జన్య గుణంతో కూడుకుని ఉంటుంది. మంచి చెడులు, నైతిక విలువలు పాటించకుండా కేవలం ఆనంద సూత్రంపై మాత్రమే ఆధారపడి పని చేస్తుంది.
బి. అహం (ఇగో): 'అహం' అనేది అచిత్తు నుంచి ఏర్పడుతుంది. అనుభవం, శిక్షణ ద్వారా అచిత్తులో భాగంగా రూపొందిన భావన ఇది. సాంఘిక కట్టుబాట్లకు విలువ ఇస్తుంది. వ్యక్తిలోని సహజ వాంఛలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందిస్తుంది. అహం, అచిత్తును తన అధీనంలో ఉంచుకుంటుంది. అచిత్తులో కలిగే ఆలోచనలను రక్షకభటుడిలా నియంత్రిస్తూ వాస్తవ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.
సి. అధ్యహం (సూపర్ ఇగో): తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మంచి స్నేహితులతో జరిపే చర్యల వల్ల వ్యక్తిలోని అహం క్రమంగా అధ్యహంగా వికసిస్తుంది. ఇది మంచిని కోరే అంతరాత్మ. నీతిని బోధిస్తుంది. సంస్కృతిని తెలియజేస్తుంది. ఇగోను పర్యవేక్షిస్తుంది. నైతిక సూత్రాన్ని పాటిస్తుంది. 
       అచిత్తు - ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది.
       అహం - వాస్తవ సూత్రాన్ని పాటిస్తుంది.
       అధ్యహం - ఆదర్శ సూత్రాన్ని పాటిస్తుంది.
2. ఆర్జిత శక్తి (Economic aspect):
ఎ. జీవితేచ్ఛ (Eros): మనిషి మంచిగా జీవించాలి అని చెప్పే అంతర గుణం. పరిసరాలతో మంచి సంబంధాలు ఉండాలంటే నిర్మాణాత్మకంగా పని చేయాలని తెలియజేసే సహజాతం. సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషంగా ఉంచాలనే గుణం.
బి. మరణేచ్ఛ (Thanatos): వ్యక్తిగత జీవితంలో ఏర్పడే అననుకూల పరిస్థితులు, సంఘర్షణలు లేదా మానసిక రుగ్మతల కారణంగా మరణించాలి అనుకునే సహజాత గుణం. తనకు లేదా ఇతరులకు ఎల్లప్పుడూ ఏదో ఒక కీడు తలపెట్టాలనుకునే భావన.
3. శరీరోపరితల శక్తి (Topographic aspect): ఇందులో మూడు విభాగాలు ఉన్నాయి.
ఎ. చేతనం (Conscious): వ్యక్తి మెలకువగా ఉన్నప్పుడు తన ప్రవర్తనపై నియంత్రణ కలిగి, వర్తమాన అనుభవాలన్నింటినీ తన అధీనంలో ఉంచుకోవడాన్ని చేతనావస్థగా పేర్కొనవచ్చు. ఇందులోని విషయాలను మనం వెంటనే గుర్తుకు తెచ్చుకోగలం.
బి. ఉపచేతనం (Sub Conscious): చేతనంలోని అంశాలను ఉపయోగించకపోతే అవి క్రమంగా ఉపచేతనంలోనికి వెళ్తాయి. మనసులో ఇది కొంత వరకు లోతైన భావన. అవసరానికి అనుగుణంగా చేతనావస్థలోని అంశాలను కొంతవరకు ప్రయత్నపూర్వకంగా జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు.

సి. అచేతనం (Unconscious): వ్యక్తుల చిన్నతనంలోని అనుభవాలు, తీరని కోర్కెలు, సాధింఛలేని వాంఛలను మనసు అచేతనంలోకి నెట్టివేస్తుంది. వీటి ప్రభావం మానవుడి ప్రవర్తనపై బలంగా ఉంటుందని ఫ్రాయిడ్ అభిప్రాయం. కానీ ఎంత ప్రయత్నించినా మనం వీటిని గుర్తుకు తెచ్చుకోలేం.
మనోలైంగిక వికాసం (Psychosexual Development)

          సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యక్తిలోని లైంగిక వాంఛలు లేదా ప్రేరణకు మూర్తిమత్వ వికాసంలో అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రతి శిశువులో కొంత మోతాదులో లైంగిక శక్తి ఉంటుందని తెలియజేశాడు. దీన్నే 'కామేచ్ఛ' (లిబిడో)గా పేర్కొన్నాడు. ఇది వ్యక్తి జీవితంలో అనేక లైంగిక కేంద్రాల ద్వారా ప్రయాణిస్తుంది. ఒక్కో దశలో ఒక్కో కేంద్రం కామోద్దీపన కేంద్రంగా పని చేయడం ద్వారా తన సహజాతాన్ని తృప్తి పరచుకుంటుంది. ఈ లైంగిక వికాసాన్ని ఫ్రాయిడ్ 5 దశలుగా విభజించాడు.
1. మౌఖికదశ (Oral stage) (0 - 1 సంవత్సరాలు):
          ఈ దశలో శిశువు తన లిబిడోను నోటి ద్వారా అంటే తల్లిపాలు తాగుతూ సంతృప్తి పరుస్తాడు. ఈ దశలో పిల్లల ప్రవర్తనకు ప్రతిబంధకాలు ఏర్పడితే స్థిరీకరణం (Fixation) చెంది పెద్దయిన తర్వాత కింది లక్షణాలను కలిగి ఉంటారు.
         ఎ) ధన దాహం, ప్రేమ దాహం, అధికార దాహం, అత్యాశ.
         బి) గోళ్లు కొరకడం, వేళ్లు చీకడం, నిరాశావాదం.
2. ఆసనదశ (Anal stage)(2 - 3 సంవత్సరాలు):
        ఈ దశలోని పిల్లలు మలమూత్ర విసర్జన ద్వారా ఆనందాన్ని పొందుతారు. అంటే 'పాయువు' కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ వయసులోని పిల్లలకు తల్లిదండ్రులు 'టాయిలెట్ శిక్షణ' ఇవ్వాలి.
3. శిశ్నదశ (Phallic stage)(4 - 5 సంవత్సరాలు):
       ఈ దశలోని పిల్లలకు జననేంద్రియాలపై ఆసక్తి పెరుగుతుంది. మగ పిల్లలు తల్లిని, ఆడ పిల్లలు తండ్రిని ఇష్టపడతారు. మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణిని 'ఇడిపస్ కాంప్లెక్స్' (Oedipus Complex) అని, ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణిని 'ఎలక్ట్రా కాంప్లెక్స్' (Electra Complex) అంటారు.

వ్యక్తి అహం సృజనాత్మకమైంది. అది తనచుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ సృజనాత్మకమైన పరిష్కార మార్గాన్ని కనుక్కుంటుంది. ప్రతి సాంఘిక దశలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటూ తద్వారా నాణ్యతను పెంచుకుంటుంది. దీన్ని దిశను మార్చే కాలంగా ఎరిక్‌సన్ పేర్కొన్నాడు. మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ఎరిక్‌సన్ 8 దశలను సూచించాడు.
వ.సం.
     దశ
     వయోపరిమితి
   (సంవత్సరాల్లో)
      మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు
1.
పూర్వ శైశవం
మొదటి సంవత్సరం
నమ్మకం - అపనమ్మకం
2.
ఉత్తర శైశవం
1 - 3
స్వయంప్రతిపత్తి - సందేహం
3.
క్రీడాదశ
3 - 5
చొరవ చూపడం - తప్పు చేశామన్న భావన
4.
పాఠశాల దశ
6 - 12
శ్రమించడం - న్యూనతా భావన
5.
కౌమారదశ
12 - 20
పాత్ర గుర్తింపు - పాత్ర సందిగ్ధం
6.
పూర్వ వయోజనదశ
20 - 30
సన్నిహితం - ఏకాంతం
7.
మధ్య వయోజనదశ
30 - 60
ఉత్పాదకత - స్తబ్ధత
8.
పరిపక్వదశ
60 సంవత్సరాలపైన
సమగ్రత/సమర్థత - నిరాశ
       సాంఘిక పరిస్థితులకు స్పందిస్తూ వ్యక్తి చూపే చర్య - ప్రతిచర్యలు అతడి వ్యక్తిత్వాన్ని, అహాన్ని పెంచుతాయని ఎరిక్‌సన్ పేర్కొన్నాడు. దీన్నే మూర్తిమత్వ వికాసంగా ప్రతిపాదించాడు.
[8:58AM, 30/03/2016] Lakshya Sri uradi: మూర్తిమత్వం (Personality)

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 31, 2016

0 comments:

Post a Comment