[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: Bits-1
Q. సముద్రనీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చడానికి వాడే ప్రక్రియ?
1. ఆస్మాసిస్ 2. రివర్స్ ఆస్మాసిస్
3. ఎలక్ట్రోలైసిస్ 4. ఎలక్ట్రోఫోరోసిస్
Answer: రివర్స్ ఆస్మాసిస్
Q. మెరీడియన్స్ అంటే ఏమిటి?
1. మధ్యాహ్న రేఖలు 2. సమాచార రేఖలు
3. సమలవణ రేఖలు 4. ఏదీకాదు
Answer: మధ్యాహ్న రేఖలు
Q. కోకో ఛానల్ వేటి మధ్య ఉంది?
1. భారత్-శ్రీలంక 2. భారత్-మయన్మార్
3. భారత్-మాల్దీవులు 4. భారత్-థాయ్‌లాండ్
Answer: భారత్-మయన్మార్
Q. రామసేతు పొడవు ఎంత?
1. 35 కి.మీ 2. 32 కి.మీ
3. 36 కి.మీ 4. 39 కి.మీ
Answer: 32 కి.మీ
Q. 'దేవానామ్ ప్రియ' అనే బిరుదును పొందినవారు ఎవరు?
1. సముద్రగుప్తుడు 2. కనిష్కుడు
3. హర్షుడు 4. అశోకుడు
Answer: అశోకుడు
Q. విటమిన్ బి12 ఉండే ఖనిజ ధాతువు ఏది?
1. ఇనుము 2. మెగ్నీషియం
3. కోబాల్ట్ 4. జింక్
Answer: కోబాల్ట్
Q. పార్లమెంటులో సభ్యుడు కాని వ్యక్తి ప్రధానమంత్రిగా ఎంత కాలం పనిచేయవచ్చు?
1. 5 సంవత్సరాలు 2. 6 నెలలు
3. సంవత్సరం 4. 3 నెలలు
Answer: 6 నెలలు
Q. భారతదేశ మొదటి ఉపగ్రహం 'ఆర్యభట్ట'ను అమెరికా వాహక నౌక కక్ష్యలోకి ఏ రోజున ప్రవేశపెట్టారు?
1. 18 మార్చి, 1975 2. 16 మార్చి, 1974
3. 19 ఏప్రిల్, 1975 4. 19 మే, 1975
Answer: 19 ఏప్రిల్, 1975
Q. ప్రపంచంలో విస్తీర్ణంలో భారత్ విస్తీర్ణ శాతం?
1. 3.5% 2. 2.42%
3. 5% 4. 4%
Answer: 2.42%
Q. లోక్‌సభకు ఎంతమంది ఆంగ్లో ఇండియన్‌లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు?
1. 12 2. 2
3. 7 4. 10
Answer: 2
Q. వృత్తాన్ని 360 degreesగా విభజించిన వ్యక్తి ఎవరు?
1. హిప్పార్కస్ 2. కోపర్నికస్
3. హేగల్ 4. టాలమీ
Answer: హిప్పార్కస్
Q. క్రయోజెనిక్ ఇంజిన్‌లో వాడే ఇంధనం ఏది?
1. ద్రవహైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ 2. ద్రవ హీలియం
3. ద్రవ నైట్రోజన్ 4. ద్రవ మీథేన్
Answer: ద్రవహైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్
Q. కింది ఏ పండులో ఆస్కార్బిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది?
1. మామిడి పండు 2. ఆపిల్
3. బత్తాయి 4. ఉసిరి
Answer: బత్తాయి
Q. గుడ్ల నుండి బయటకు వచ్చిన చిన్న చేపలను ఏమంటారు?
1. మిల్ట్ 2. విత్తనం
3. స్పాన్ 4. బ్రీడ్స్
Answer: స్పాన్
Q. అయస్కాంతీకరణ చేసిన ఉక్కు కడ్డీ పొడవు-
1. పెరుగుతుంది 2. తగ్గుతుంది
3. మారదు 4. ఏదీ కాదు
Answer: పెరుగుతుంది
Q. ఒక ఘన పదార్థాన్ని వేడిచేసినప్పుడు విస్తరించేది ఏది?
1. పరిమాణం 2. పొడవు
3. వెడల్పు 4. విస్తీర్ణం
Answer: పరిమాణం
Q. భారతదేశం నుంచి శ్రీలంక విడిపోయే ప్రాంతమేది?
1. ఇందిరా పాయింట్ 2. గల్ఫ్ ఆఫ్ మన్నార్
3. ఎర్నాకులం 4. తల్లైమన్నార్
Answer: తల్లైమన్నార్
Q. 2011 ప్రకారం భారతదేశ వార్షిక జనాభా పెరుగుదల రేటు ఎంత?
1. 1.8% 2. 4.1%
3. 5.1% 4. 2.4%
Answer: 1.8%
Q. భారతదేశంలో మొదటగా సూర్యోదయం ఎక్కడ అవుతుంది?
1. కన్యాకుమారి (తమిళనాడు) 2. గోపాలపూర్ (ఒడిశా)
3. డాంగ్ (అరుణాచల్‌ప్రదేశ్) 4. నాగాలాండ్
Answer: డాంగ్ (అరుణాచల్‌ప్రదేశ్)
Q. తూర్పు-పశ్చిమ దిశలను సూచించే గుర్తులు లేని రేఖాంశం ఏది?
1. కర్కటరేఖ 2. మకరరేఖ
3. గ్రీనిచ్ 4. భూమధ్యరేఖ
Answer: గ్రీనిచ్
Q. విలియం హాకిన్స్‌ను జహంగీర్ ఆస్థానానికి పంపిన ఇంగ్లండ్ రాజు ఎవరు?
1. ఏడో హెన్రీ 2. మొదటి జేమ్స్
3. మొదటి చార్లెస్ 4. రెండో చార్లెస్
Answer: మొదటి జేమ్స్
Q. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతదేశపు పొడవు ఎంత?
1. 3214 కి.మీ. 2. 2933 కి.మీ.
3. 6100 కి.మీ. 4. 4200 కి.మీ.
Answer: 3214 కి.మీ.
Q. గురుశిఖర శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది?
1. రాజస్థాన్ 2. గుజరాత్
3. మధ్యప్రదేశ్ 4. మహారాష్ట్ర
Answer: రాజస్థాన్
Q. ప్రధాన ద్వీపకల్ప నదులన్నీ తూర్పు దిశకు ప్రహహిస్తుండగా... నర్మద, తపతి మాత్రం పశ్చిమానికి ప్రవహించడానికి కారణమేంటి?
1. లావా ప్రవాహం 2. ముడుత పర్వతాలు
3. భ్రంశ్య రేఖ 4. వింధ్య, సాత్పురా పర్వతాలు
Answer: భ్రంశ్య రేఖ
Q. మొక్కల్లోని ఏ భాగంలో కణవిభజన చురుకుగా జరుగుతుంది?
1. కాండం 2. ఆకులు
3. వేళ్లు 4. పళ్లు
Answer: వేళ్లు
Q. మద్రాసు ప్రెసిడెన్సీ మొదటి గవర్నరు ఎవరు?
1. ఎడ్వర్డ్ హారిసన్ 2. థామస్ పిట్
3. జోసెఫ్ కోలెట్ 4. రిచర్డ్ బెయాన్
Answer: థామస్ పిట్
1. 1972 2. 1975
3. 1947 4. 1979
Answer: 1972
Q. మద్రాసులో సెయింట్ జార్జి కోటను నిర్మించిన ఆంగ్లేయుడు ఎవరు?
1. ఫ్రాన్సిస్ డే 2. గెరాల్డ్ ఆంగియర్
3. విలియం హాకిన్స్ 4. థామస్ రో
Answer: ఫ్రాన్సిస్ డే
Q. భారత్-చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖను ఏమంటారు?
1. మెక్ మోహన్ రేఖ 2. రాడ్‌క్లిఫ్ రేఖ
3. 24 సమాంతర రేఖ 4. డ్యూరాండ్ రేఖ
Answer: మెక్ మోహన్ రేఖ
Q. భారతదేశంలో డచ్చివారి మొదటి శాశ్వత వర్తక స్థావరం ఏది?
1. పులికాట్ 2. మచిలీపట్నం
3. సూరత్ 4. గోవా
Answer: మచిలీపట్నం
Q. అన్నివైపులా నీటితో ఆవరించి ఉన్న భూభాగం ఏది?
1. ద్వీపకల్పం 2. ద్వీపం
3. సరస్సు 4. లోయ
Answer: ద్వీపం
Q. పోర్చుగల్ దేశం స్పెయిన్ వశమైన సంవత్సరం?
1. 1570 2. 1575
3. 1580 4. 1585
Answer: 1580
Q. క్రయోజెనిక్ ఇంజిన్‌లో ఏ వాయువును ఇంధనంగా వాడతారు?
1. ద్రవ హైడ్రోజన్ 2. ద్రవ నైట్రోజన్
3. ద్రవ ఆక్సిజన్ 4. ద్రవ హీలియం
Answer: ద్రవ హైడ్రోజన్
Q. జాతీయ ఆదాయం అంచనాల కమిటీ అధ్యక్షుడు ఎవరు?
1. మహలనోబీస్ 2. వి.కె. రావు
3. మెహతా 4. షా
Answer: మహలనోబీస్
Q. మొదటి బహదూర్‌షా అసలు పేరు?
1. సలీం 2. ఖుర్రం
3. మువజ్జం 4. సమీర్
Answer: మువజ్జం
Q. శ్రీలంక తన పేరును 'సిలోన్' నుంచి ఏ సంవత్సరంలో మార్చుకుంది?
1. 1972 2. 1968
3. 1970 4. 1964
Answer: 1972
Q. భారతదేశంలో సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు ఎన్ని?
1. 7 2. 8
3. 4 4. 9
Answer: 9
Q. ప్రపంచంలో ఎత్తయిన విమానాశ్రయం ఉన్న ప్రదేశం?
1. ఛస్వల్, లఢక్ 2. లే, లఢక్
3. నాన్‌జింగ్, చైనా 4. బంగ్ధా, తూర్పు టిబెట్
Answer: బంగ్ధా, తూర్పు టిబెట్
Q. వాస్కోడిగామా రెండోసారి భారతదేశానికి వచ్చిన సంవత్సరం?
1. 1500 2. 1502
3. 1504 4. 1506
Answer: 1502
Q. అత్యంత పొడవైన పోస్టల్ నెట్‌వర్క్ ఉన్న దేశమేది?
1. చైనా 2. అమెరికా
3. భారతదేశం 4. ఇంగ్లండ్
Answer: భారతదేశం
Q. భారత న్యాయవ్యవస్థ ఏ దేశ న్యాయవ్యవస్థను పోలి ఉంది?
1. గ్రేట్ బ్రిటన్ 2. ఐర్లండ్
3. అమెరికా 4. స్విట్జర్లాండ్
Answer: గ్రేట్ బ్రిటన్
Q. సాంఘిక దురాచారాలు ప్రబలిన కాలం ఎవరిది?
1. శాతవాహనులు 2. విష్ణుకుండినులు
3. ఇక్ష్వాకులు 4. కాకతీయులు
Answer: కాకతీయులు
Q. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సహాయంతో ఇస్రో తీసిన భూమి ఛాయాచిత్రాలను ఏమని పిలుస్తారు?
1. భువన్ 2. ఇస్రో పిక్చర్స్
3. శాటిలైట్ పిక్చర్స్ 4. గగన్
Answer: భువన్
Q. దాదాభాయ్ నౌరోజీ జాతీయ ఆదాయం లెక్కించిన సంవత్సరం?
1. 1968 2. 1868
3. 1967 4. 1867
Answer: 1868
Q. 1970లో అణ్యాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది?
1. గ్రీన్‌పీస్ 2. ఎర్త్‌లాండ్
3. ఎర్త్‌ఫస్ట్ 4. నెట్‌వర్క్
Answer: గ్రీన్‌పీస్
Q. గురు నానక్ వారసుడు ఎవరు?
1. గురు అమర్‌దాస్ 2. గురు అర్జున్‌సింగ్
3. గురు అంగద్ 4. గురు రామ్‌దాస్
Answer: గురు అంగద్
Q. ఐక్యరాజ్యసమితిలోని ఏ అంగాన్ని ప్రపంచ పార్లమెంట్ అని పిలుస్తారు?
1. భద్రతామండలి 2. జనరల్ అసెంబ్లీ
3. అంతర్జాతీయ న్యాయస్థానం 4. ట్రస్టీషిప్ కౌన్సిల్
Answer: జనరల్ అసెంబ్లీ
Q. భారతదేశంలో పోర్చుగీసు గవర్నరుగా ఎవరిని నియమించారు?
1. వాస్కోడిగామా 2. కాబ్రల్
3. ఫ్రాన్సిస్కోడి అల్మైడా 4. అల్బూకర్క్
Answer: ఫ్రాన్సిస్కోడి అల్మైడా
Q. ఆహార పదార్థాలు జీర్ణం కావటానికి తోడ్పడే కణాంగాలు?
1. రైబోసోమ్‌లు 2. లైసోసోమ్‌లు
3. మైటోకాండ్రియా 4. కేంద్రకం
Answer: లైసోసోమ్‌లు
Q. భూగోళంపై జలభాగం శాతం ఎంత?
1. 71% 2. 62%
3. 45% 4. 29%
Answer: 71%
Q. DNA మరియు ప్రోటీనులతో నిర్మితమైనది?
1. క్రొమాటిన్ 2. మైట్రోకాండ్రియా
3. లైసోసోమ్‌లు 4. రైబోసోమ్‌లు
Answer: క్రొమాటిన్
Q. భారతదేశ స్థలాకృతి చిత్రాలను తయారుచేసే సంస్థ ఏది?
1. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
3. సర్వే ఆఫ్ ఇండియా 4. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా
Answer: సర్వే ఆఫ్ ఇండియా
Q. విలువైన రత్నం'కెంపు'లో అల్యూమినియం ట్రైఆక్సైడ్‌తో పాటు స్పల్పంగా ఉండే పదార్థం ఏది?
1. సిల్వర్ 2. మాంగనీస్
3. క్రోమియం 4. కోబాల్ట్
Answer: క్రోమియం
Q. నాగార్జునకొండలో బయల్పడిన అశ్వమేథ వేదిక ఎవరిది?
1. రుద్రపురుషదత్తుడు 2. వీరపురుషదత్తుడు
3. శాంతమూలుడు 4. భదంతానందుడు
Answer: శాంతమూలుడు
Q. ఇక్ష్వాకుల రాజధాని ఏది?
1. వేల్పూరు 2. విజయపురి
3. కోటి లింగాల 4. కొండాపూర్
Answer: విజయపురి
Q. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది?
1. న్యూయార్క్ 2. జెనీవా
3. లండన్ 4. హేగ్
Answer: హేగ్
Q. తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ను ఆక్రమించిన సంవత్సరం?
1. 1435 2. 1543
3. 1453 4. 1456
Answer: 1453
Q. కణాంగాలలో ముఖ్యమైనది?
1. కేంద్రకము 2. రైబోసోమ్
3. గాల్జీసంక్లిష్టము 4. అంతర్జీవ ద్రవ్యజాలము
Answer: కేంద్రకము
Q. భూమిపై ఉన్న చిన్న ఖండం-
1. యూరప్ 2. దక్షిణ అమెరికా
3. అంటార్కిటికా 4. ఆస్ట్రేలియా
Answer: ఆస్ట్రేలియా
Q. చంద్రయాన్ - 1లో ఉన్న కింది ఏ పరికరం ఉపగ్రహం నుంచి విడిపోయి చంద్రుడిపైకి చేరింది?
1. టెర్రెయిన్ మ్యాపింగ్ కెమెరా 2. ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటరు
3. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ 4. రేడియేషన్ డోస్ మానిటర్
Answer: మూన్ ఇంపాక్ట్ ప్రోబ్
Q. జీవులన్నిటికి --------- ప్రధానమైన మూలం.
1. కణం 2. ఆహారం
3. నీరు 4. గాలి
Answer: కణం
Q. పిర్ పంజాల్ పర్వతశ్రేణి యీ రాష్ట్రంలో ఉంది :
1. మేఘాలయ 2. అరుణాచల్ ప్రదేశ్
3. జమ్ము కాశ్మీర్ 4. హిమాచల్ ప్రదేశ్
Answer: జమ్ము కాశ్మీర్
Q. అత్యుత్తమ విద్యుత్ వాహకం ఏది?
1. వెండి 2. ఇనుము
3. బంగారం 4. అల్యూమినియం
Answer: వెండి
Q. కిందివాటిలో ఏది ఒకే మూలకాన్ని కలిగి ఉంటుంది?
1. వజ్రం 2. గాజు
3. మార్బెల్ 4. ఇసుక
Answer: వజ్రం
Q. మొదటి అటామిక్ బాంబు రూపకర్త ఎవరు?
1. ఇ.ఫెర్మి 2. ఒపెన్‌హైమర్
3. ఇ.టెల్లర్ 4. ఒ.హాన్
Answer: ఒ.హాన్
Q. ఏనుగు సగటు జీవిత కాలం ఎన్నేళ్లు?
1. 57 2. 10
3. 33 4. 22
Answer: 57
Q. లోక్‌సభకు పోటీచేయడానికి కనీస వయసు ఎంత?
1. 25 2. 30
3. 21 4. 35
Answer: 25
Q. ఇస్రో సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 2008, అక్టోబరు 22న పీఎస్ఎల్వీ - సీ11 ద్వారా ప్రయోగించిన ఉప్రగహం పేరేంటి?
1. చంద్రయాన్ - 1 2. రిశాట్ - 2
3. అనుశాట్ 4. ఓషన్‌శాట్ - 2
Answer: చంద్రయాన్ - 1
Q. ప్రపంచంలో అత్యధిక వేగంతో నడిచే రైలు ఉన్న దేశమేది?
1. అమెరికా 2. ఇంగ్లండ్
3. ఫ్రాన్స్ 4. జపాన్
Answer: జపాన్
Q. ఇండియన్ మూన్‌మిషన్ - 1లో భాగంగా ప్రయోగించిన ఉపగ్రహంలో భారతదేశానికి చెందిన ఎన్ని పరికరాలు అమర్చారు?
1. 5 2. 11
3. 7 4. 9
Answer: 5
Q. హుగ్లీని పోర్చుగీసు వారి నుంచి ఆక్రమించిన మొగలు చక్రవర్తి ఎవరు?
1. అక్బర్ 2. జహంగీర్
3. షాజహాన్ 4. ఔరంగజేబు
Answer: షాజహాన్
Q. జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రంలోని గీతలు ఎన్ని?
1. 24 2. 14
3. 18 4. 22
Answer: 24
Q. చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలో ఉంచడానికి ఇస్రో ఉపయోగించిన వాహక నౌక ఏది?
1. పీఎస్ఎల్వీ-సీ9 2. పీఎస్ఎల్వీ-సీ10
3. పీఎస్ఎల్వీ-సీ11 4. పీఎస్ఎల్వీ-సీ12
Answer: పీఎస్ఎల్వీ-సీ11
Q. తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి అధికంగా చేస్తున్న జిల్లా ఏది?
1. ఖమ్మం 2. వరంగల్
3. ఆదిలాబాద్ 4. కరీంనగర్
Answer: ఖమ్మం
Q. హిందూ నాగరికతను ఎవరు ఆరంభించారు?
1. మంగోలాయిడ్స్ 2. ద్రవిడులు
3. ఆర్యులు 4. పై అందరూ
Answer: ఆర్యులు
Q. నీతి ఆయోగ్ (జాతీయ ప్రణాళిక సంఘం) అధ్యక్షుడు ఎవరు?
1. రాష్ట్రపతి 2. ప్రధానమంత్రి
3. స్పీకరు 4. ఉప రాష్ట్రపతి
Answer: ప్రధానమంత్రి
Q. పొడవుగా, గొలుసులా ఉండే దీవుల సముదాయాన్ని ఏమంటారు?
1. ఒంటె వీపు 2. ఆర్చిపెలాగో
3. విల్సన్ 4. ఏదీకాదు
Answer: ఆర్చిపెలాగో
Q. ఇస్రో జీఎస్ఎల్వీ - ఎఫ్1 ద్వారా 2004, సెప్టెంబరు 20న కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన ఉపగ్రహం ఏది?
1. ఎడ్యుశాట్ 2. మెగాట్రాపిక్స్
3. జీశాట్ - 6 4. మార్స్‌మిషన్
Answer: ఎడ్యుశాట్
Q. యునెస్కో (UNESCO) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1. జెనీవా 2. న్యూయార్క్
3. ప్యారిస్ 4. లండన్
Answer: ప్యారిస్
Q. ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ వాహక నౌకల్లో మొదట విజయవంతమైంది ఏది?
1. జీఎస్ఎల్వీ -డీ1 2. జీఎస్ఎల్వీ - డీ2
3. జీఎస్ఎల్వీ - సీ1 4. జీఎస్ఎల్వీ - సీ2
Answer: జీఎస్ఎల్వీ - డీ2
Q. 2013 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక భాషా సమ్మాన్ పురస్కారాన్ని సాహిత్య అకాడమీ ఎవరికి ప్రకటించింది?
1. ఆర్. మోహన్‌దాస్ 2. కె. మీనాక్షీ సుందరం
3. ఎల్. పార్వతీశం 4. జి. జీవేశ్వర్
Answer: కె. మీనాక్షీ సుందరం
Q. శీతలీకరణ బోగీ కలిగిన దేశంలోనే మొట్టమొదటి డెము (డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్- DEMU) రైలును ఎక్కడ ప్రారంభించారు?
1. విశాఖపట్నం 2. కోల్‌కతా
3. ముంబయి 4. కొచ్చి
Answer: కొచ్చి
Q. ఆస్ట్రోనాట్‌కు కనిపించే విశ్వం ఏ రంగులో ఉంటుంది?
1. తెలుపు 2. నలుపు
3. నీలం 4. వెండి
Answer: నలుపు
Q. టీ, కాఫీల్లో ఉండే ముఖ్యమైన ఉత్ప్రేరకం ఏది?
1. నికోటిన్ 2. క్లోరోఫిల్
3. కెఫిన్ 4. ఆస్పిరిన్
Answer: కెఫిన్
Q. న్యూయార్క్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైన తొలి భారత సంతతి మహిళ ఎవరు?
1. రేణు మల్హోత్రా 2. కీర్తి కన్నన్
3. శ్వేతా శేఖర్ 4. రాజ రాజేశ్వరి
Answer: రాజ రాజేశ్వరి
Q. ప్రతిష్ఠాత్మక 'సిల్క్‌రోడ్' రహదారుల ప్రాజెక్టు ఏ దేశానికి చెందింది?
1. జపాన్ 2. అమెరికా
3. జర్మనీ 4. చైనా
Answer: చైనా
Q. అండర్ - 20 ఫిఫా ప్రపంచకప్ 2015 విజేత .......
1. సెర్బియా 2. న్యూజిలాండ్
3. బ్రెజిల్ 4. రష్యా
Answer: సెర్బియా
Q. అరుదైన 'బౌద్ధ బ్రహ్మ' విగ్రహం ఇటీవల తెలంగాణలోని ఏ జిల్లాలో బయటపడింది?
1. నల్గొండ 2. రంగారెడ్డి
3. కరీంనగర్ 4. మహబూబ్‌నగర్
Answer: కరీంనగర్
Q. 'భారత్‌లో సామాజిక వేదికలు 2014' నివేదిక ప్రకారం ఏప్రిల్ 2014 నాటికి వివిధ సామాజిక వేదికల్లో ఖాతాలు కలిగిన భారతీయుల సంఖ్య ఎంత?
1. 12.3 కోట్లు 2. 14.3 కోట్లు
3. 16.3 కోట్లు 4. 11.3 కోట్లు
Answer: 14.3 కోట్లు
Q. 2015 ఆగస్టులో పెట్రోలియం పైప్‌లైన్ నిర్మాణం కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకరించింది?
1. శ్రీలంక 2. బంగ్లాదేశ్
3. నేపాల్ 4. పాకిస్థాన్
Answer: నేపాల్
Q. 'రెపా' పురస్కారాన్ని 2015కు గాను ఏ రాష్ట్రం గెలుచుకుంది?
1. తెలంగాణ 2. కేరళ
3. కర్ణాటక 4. తమిళనాడు
Answer: తెలంగాణ
Q. 'ఎడ్యుకేషన్ ఆఫ్ ముస్లిమ్స్; యాన్ ఇస్లామిక్ పర్‌స్పెక్టివ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్- ఇండియన్ కాంటెస్ట్' పుస్తక రచయిత ఎవరు?
1. జహంగీర్ ఖాన్ 2. పి.ఎల్. కాంతారావు
3. అహ్మద్ సుభాగ్ 4. జె.ఎస్. రాజ్‌పుత్
Answer: జె.ఎస్. రాజ్‌పుత్
Q. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక 'మ్యూజియం ఆఫ్ ది మూవింగ్' ఇటీవల ఏ భారతీయ సినీ ప్రముఖుడి గౌరవసూచకంగా ప్రత్యేక చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసింది?
1. అమితాబ్ బచ్చన్ 2. మణిరత్నం
3. షారుక్ ఖాన్ 4. పై ముగ్గురూ
Answer: మణిరత్నం
Q. మద్యపాన నిషేధాన్ని ప్రపథమంగా విధించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
1. బాబర్ 2. అక్బర్
3. హుమయూన్ 4. జహంగీర్
Answer: జహంగీర్
Q. ప్రాచీన కాలం నుంచి విశేష ప్రాచుర్యం పొందిన హస్తకళ?
1. చేనేత 2. లోహకళ
3. వజ్రాల పరిశ్రమ 4. కొయ్యబొమ్మలు
Answer: చేనేత
Q. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు?
1. గవర్నర్ 2. స్పీకర్
3. రాష్ట్రపతి 4. గవర్నర్ స్పీకరును సంప్రదించి
Answer: గవర్నర్
Q. కేంద్ర ప్రభుత్వం ఈ-పర్యాటక వీసా పథకాన్ని ఇటీవల ఏ దేశానికి విస్తరించింది?
1. చైనా 2. హాంకాంగ్
3. మకావు 4. పై మూడూ
Answer: పై మూడూ
Q. 2015 జూన్‌లో ఏ దేశం నిర్వహించిన 'అంగారకుడి పైకి భారీ వ్యోమనౌకను దించడానికి ఉద్దేశించిన ల్యాండింగ్ వ్యవస్థ' పరీక్ష విఫలమైంది?
1. అమెరికా 2. రష్యా
3. చైనా 4. జపాన్
Answer: అమెరికా
Q. భారత సైన్యం మొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశించి అక్కడ తలదాచుకున్న 20 మంది తీవ్రవాదులను హతమార్చింది?
1. పాకిస్థాన్ 2. శ్రీలంక
3. మయన్మార్ 4. బంగ్లాదేశ్
Answer: మయన్మార్
Q. భారత ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1. కె.వి. చౌదరి 2. విజయ్ శర్మ
3. టి.ఎం. భాసిన్ 4. సుధీర్ భార్గవ
Answer: విజయ్ శర్మ
Q. 'ఫ్రెంచ్ ఓపెన్ - 2015' పురుషుల టైటిల్ విజేత ఎవరు?
1. నొవాక్ జకోవిచ్ 2. స్టానిస్లాస్ వావ్రింకా
3. ఆండీ ముర్రే 4. రోజర్ ఫెదరర్
Answer: స్టానిస్లాస్ వావ్రింకా
Q. 'బంగ భవన్' ఏ దేశాధ్యక్షుడి అధికారిక నివాసం?
1. నేపాల్ 2. శ్రీలంక
3. బంగ్లాదేశ్ 4. మాల్దీవులు
Answer: బంగ్లాదేశ్
Q. మాస్టర్ కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ రూపొందించిన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న తొలి పది నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది?
1. బ్యాంకాక్ 2. సింగపూర్
3. కౌలాలంపూర్ 4. సియోల్
Answer: బ్యాంకాక్
Q. భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూలును ఎన్నో సవరణ ద్వారా కలిపారు?
1. 32వ 2. 42వ
3. 35వ 4. 52వ
Answer: 52వ
Q. భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడు?
1. ప్రధానమంత్రి 2. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3. లోక్‌సభ స్పీకర్ 4. ఉపరాష్ట్రపతి
Answer: ఉపరాష్ట్రపతి
Q. చలికాలంలో చెట్లు ఆకులను ఎందుకు రాలుస్తాయి?
1. వేడిని నిలుపుకోవడానికి 2. వేసవి పెరుగుదలకు ముందు విశ్రాంతికి
3. నీటిని నిల్వ చేసుకునేందుకు 4. పశువులు తినడానికి వీల్లేకుండా తప్పించుకునేందుకు
Answer: వేడిని నిలుపుకోవడానికి
Q. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్త్లెవ్‌కు, కుట్రదారులకు మధ్య రహస్య ఒప్పందాన్ని కుదిర్చిన వ్యక్తి ఎవరు?
1. జగత్ సేఠ్ 2. అమీన్‌చంద్
3. రాయ్‌దుర్లబ్ రామ్ 4. మాణిక్‌చంద్
Answer: అమీన్‌చంద్
Q. కిందివారిలో 'ఇసా అవార్డ్ ఫర్ సర్వీస్ టు హ్యుమానిటీ' పురస్కారాన్ని గెలుచుకున్న వ్యక్తిని గుర్తించండి.
1. శైలేష్ నాయర్ 2. ధీరజ్ మహాపాత్ర
3. కేలూచరణ్ బాలు 4. అచ్యుత సమంత
Answer: అచ్యుత సమంత
Q. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
1. మద్రాసు 2. మంగళూరు
3. శ్రీరంగపట్టణం 4. పాండిచ్చేరి
Answer: మంగళూరు
Q. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) సెక్రటరీ జనరల్‌గా నియమితులైన పెట్టెరి టాలస్ ఏ దేశస్థుడు?
1. ఫ్రాన్స్ 2. జర్మనీ
3. గ్రీస్ 4. ఫిన్‌ల్యాండ్
Answer: ఫిన్‌ల్యాండ్
Q. జీఎస్ఎల్‌వీ మాక్ - 3 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1. ఎం. వెంకటేశన్ 2. ఆర్. శరవణన్
3. జి. అయ్యప్పన్ 4. కె. గోపాలన్
Answer: జి. అయ్యప్పన్
Q. టిప్పు సుల్తాన్ ఎప్పుడు మరణించాడు?
1. 1792 2. 1795
3. 1797 4. 1799
Answer: 1799
Q. ఇటీవల మృతి చెందిన 'టిఫానీ టూ' అనేది ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన .......
1. కుక్క 2. పిల్లి
3. కోతి 4. కుందేలు
Answer: పిల్లి
Q. చర్మం రంగు దేని వల్ల ఏర్పడుతుంది?
1. మెలనిన్ 2. రెనిన్
3. మెసోటోసిన్ 4. మెటాటోరిన్
Answer: మెలనిన్
Q. కిందివాటిలో అరుదైన లోహమేది?
1. స్ట్రానియం 2. రేడియం
3. పాదరసం 4. వెండి
Answer: రేడియం
Q. రాష్ట్రపతులుగా పనిచేసిన కిందివారిలో ఎవరు 'ఇండియన్ పోస్ట్ ఆఫీసెస్ బిల్లు'పై సంతకం చేయడానికి నిరాకరించారు?
1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 2. జ్ఞానీ జైల్‌సింగ్
3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ 4. ఆర్.వెంకటరామన్
Answer: జ్ఞానీ జైల్‌సింగ్
Q. సూక్ష్మజీవినాశిని పెన్సిలిన్ దేని నుంచి లభిస్తుంది?
1. బ్యాక్టీరియా 2. ఫంగస్
3. పుష్పించే మొక్క 4. సముద్రపు కలుపు మొక్క
Answer: ఫంగస్
Q. బెలారస్ దేశ రాజధాని నగరాన్ని గుర్తించండి.
1. మిన్స్క్ 2. తిరానా
3. యెరెవాన్ 4. సరజెవో
Answer: మిన్స్క్
Q. పాలలో ఉన్న నీటిశాతాన్ని కొలిచే పరికరం ఏది?
1. లాక్టోమీటరు 2. హైడ్రోమీటరు
3. హైగ్రోమీటరు 4. పీకోమీటరు
Answer: లాక్టోమీటరు
Q. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
1. రాబర్ట్ క్త్లెవ్ 2. వెల్లస్లీ
3. హెన్రీ లారెన్స్ 4. కారన్ వాలిస్
Answer: రాబర్ట్ క్త్లెవ్
Q. తిమింగలం ఏ జంతువుల రకానికి చెందుతుంది?
1. క్షీరదం 2. సరీసృపం
3. చేప 4. ఉభయచరం
Answer: క్షీరదం
Q. మానవాభివృద్ధి సూచికను అభివృద్ధిపరిచేది?
1. ఎఫ్ఏవో 2. డబ్ల్యూటీవో
3. యూఎన్‌డీపీ 4. మధ్యంతర ఎన్నికల నిర్వహణ
Answer: యూఎన్‌డీపీ
Q. రాజ్యాంగ అత్యవసర స్థితి ప్రకటన దేనికి దారితీస్తుంది?
1. రాష్ట్రపతి/ గవర్నర్ పాలన 2. స్వేచ్ఛ హక్కు తాత్కాలిక రద్దు
3. ఉద్యోగుల జీతాల్లో కోత 4. మధ్యంతర ఎన్నికల నిర్వహణ
Answer: స్వేచ్ఛ హక్కు తాత్కాలిక రద్దు
Q. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నియమిస్తారు?
1. మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు 2. ఇద్దరు
3. 10 మంది 4. 12 మంది
Answer: 12 మంది
Q. చట్టం ద్వారా శిక్షపడిన వ్యక్తులకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా భారత రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టవచ్చు?
1. ఆర్టికల్ 62 2. ఆర్టికల్ 63
3. ఆర్టికల్ 70 4. ఆర్టికల్ 72
Answer: ఆర్టికల్ 72
Q. స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలను మన రాజ్యాంగం ముందుమాటలో పొందుపరిచాం. వీటికి ప్రేరణ ఇచ్చింది ఏది?
1. ఫ్రెంచి విప్లవం 2. రష్యా విప్లవం
3. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన 4. యు.ఎన్.ఒ. చార్టర్
Answer: ఫ్రెంచి విప్లవం
Q. మానవ దేహంలో అతిపెద్ద గ్రంథి ఏది?
1. అడ్రినల్ గ్రంథి 2. పిట్యూటరీ (పీయూష) గ్రంథి
3. కాలేయం 4. థైరాయిడ్ గ్రంథి
Answer: కాలేయం
Q. 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు తరలివచ్చిన ఎఫ్‌డీఐల మొత్తం ఎంత?
1. 10.93 బి. డాలర్లు 2. 20.93 బి. డాలర్లు
3. 30.93 బి. డాలర్లు 4. 40.93 బి. డాలర్లు
Answer: 30.93 బి. డాలర్లు
Q. థయామిన్ (విటమిన్ బి1) లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది?
1. అనీమియా 2. బెరిబెరి
3. స్కర్వీ 4. రేచీకటి
Answer: బెరిబెరి
Q. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మ్యాగీ నూడిల్స్‌ను తయారుచేసే బహుళజాతి సంస్థ 'నెస్లే' ఏ దేశానికి చెందింది?
1. అమెరికా 2. స్విట్జర్లాండ్
3. ఇంగ్లండ్ 4. చైనా
Answer: స్విట్జర్లాండ్
Q. అధిక శక్తి ఉన్న ద్రవ్యాన్ని ఇలా కూడా పిలవవచ్చు.
1. ఎం 1 2. ఎం 2
3. ఎం 3 4. ఎం 4
Answer: ఎం 1
Q. 'గన్‌కాటన్' పేరుతో పిలిచే శక్తిమంతమైన విస్ఫోటనకారి ఏది?
1. పొటాషియం క్లోరేట్ 2. సెల్యులోజ్ నైట్రేట్
3. పొటాషియం నైట్రేట్ 4. సెల్యులోజ్ ఎసిటేట్
Answer: సెల్యులోజ్ నైట్రేట్
Q. మానవ రక్తంలో అధికశాతం ఉండేవి?
1. ఇస్నోఫిల్స్ 2. బేసోఫిల్స్
3. న్యూట్రోఫిల్స్ 4. మోనోసైట్స్
Answer: బేసోఫిల్స్
Q. 2015 అక్టోబరులో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటించిన దేశాన్ని గుర్తించండి.
1. జోర్డాన్ 2. పాలస్తీనా
3. ఇజ్రాయెల్ 4. అన్నీ
Answer: అన్నీ
Q. మానవుడిలో ఉండే మాస్టర్ గ్రంథి ఏది?
1. పిట్యూటరీ 2. థైరాయిడ్
3. అడ్రినల్ 4. థైమస్
Answer: పిట్యూటరీ
Q. అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు?
1. డిక్ చెనీ 2. అల్ గోర్
3. జో బిడెన్ 4. డాన్ క్వేల్
Answer: జో బిడెన్
Q. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది?
1. విటమిన్-బి 2. విటమిన్-ఇ
3. విటమిన్-కె 4. విటమిన్-ఎ
Answer: విటమిన్-ఎ
Q. చీకటి గది ఉదంతం గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరు?
1. హాల్‌వెల్ 2. రోజర్ డ్రేక్
3. ఆంగియర్ 4. జాబ్ చార్నాక్
Answer: హాల్‌వెల్
Q. 'ఈస్టర్న్ స్టార్' భారీ విహార నౌక ప్రమాదం ఇటీవల ఏ దేశంలో చోటు చేసుకుంది?
1. జపాన్ 2. రష్యా
3. చైనా 4. స్విట్జర్లాండ్
Answer: చైనా
Q. మొదటితరం కంప్యూటర్లలో వాడిన కీలక పదార్థం
1. ఇంటిగ్రేటెడ్ చిప్స్ 2. చిప్
3. వ్యాక్యూమ్ ట్యూబ్స్ 4. ట్రాన్సిస్టర్స్
Answer: వ్యాక్యూమ్ ట్యూబ్స్
Q. టొమాటోలకు దేనివల్ల రంగు వస్తుంది?
1. కెరోటినాయిడ్లు 2. ఫ్లేవనాయిడ్లు
3. విటమిన్లు 4. ఖనిజ లవణాలు
Answer: కెరోటినాయిడ్లు
Q. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగానికి సంబంధించింది?
1. జర్నలిజం 2. శాస్త్ర సాంకేతికత
3. సాహిత్యం 4. శాంతి
Answer: శాస్త్ర సాంకేతికత
Q. బ్రిటిష్ పాలనలో భారతదేశ మొదటి జాతీయ ఆదాయ అంచనాలను సమకూర్చినవారు?
1. లార్డ్ కర్జన్ 2. దాదాభాయ్ నౌరోజీ
3. ఆర్.గిఫిన్ 4. వి.కె.ఆర్.వి.రావు
Answer: దాదాభాయ్ నౌరోజీ
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: TSPSC
HISTORY
గౌతమీపుత్ర శాతకర్ణి
(శాతవాహన రాజు)
బిరుదులు
ఏకశూర
రాజరాజ
వినివర్తిత
రామకేశవ
ఏకబ్రాహ్మణ
ఏకధనుర్ధన
ఆగమనిలయ
ద్విజకులవర్ధన
బెణాకట స్వామి
చాతుర్వర్ణ సంకర
శత్రు భయంకర
పరివారణ విక్రమ
ఉదార పరిపాలక
వర్ణసౌంకర్య నిరోధక
క్షత్రియదర్పమాన మర్ధన
వైదిక విద్యాధర్మ తత్పర
త్రిసముద్రతోయ్పీతవాహన
క్షహరాటవంశ నిరవశేషకర
శకయవనపహ్లవ నిషూదన
సమరసిరసి విజితరిపుసంఘాత
శాతవాహన కులయశః ప్రతిష్ఠాపనకర
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: తెలంగాణ చరిత్ర
1507 గోల్కొండ స్వతంత్ర రాజ్య అవతరణ
1562 హుస్సేన్ సాగర్
1578 పురానాపుల్
1578 గోల్కొండ కోట నుంచి ముసీకి దక్షిణంగా నగర విస్తరణ
1580 నూతన నగరానికి ఆవిష్కరణ
1589 -91 చార్మినార్, గుల్జార్ హౌజ్, చార్ కమాన్ల నిర్మాణం
1793 సరూర్ నగర్ లో జనావాసాలు
1803 సుల్తాన్ శాహీలో టంకశాల
1805 మీరాలం మండీ
1806 మీరాలం చెరువు
1808 బ్రిటిష్ రెసిడెన్సీ
1828 చందూలాల్ బారాదరీ
1831 చాదర్ ఘాట్ వంతెన
1859 -66 అఫ్జల్ గంజ్ వంతెన (నయాపుల్)
1862 పోస్టాఫీసులు
1873 బాగే ఆం –పబ్లిక్ గార్డెన్
1873 బొంబాయి – సికిందరాబాదు రైల్వే లైన్
1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
1884 ఫలక్‌నుమా ప్యాలెస్
1882 చంచల్‌గూడ జైలు
1883 నాంపల్లి రైల్వే స్టేషన్
1884 ముస్లిం జంగ్ వంతెన
1885 టెలిఫోన్ ఏర్పాటు
1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు
1893 హనుమాన్ వ్యాయమాశాల
1910 హైదరాబాద్ స్టేట్ విద్యుత్ బోర్డు
1920 హైకోర్టు నిర్మాణం
1920 ఉస్మాన్ సాగర్ (గండిపేట)
1927 హిమాయత్ సాగర్ ఆనకట్ట
1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి
1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల
1935 బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు
1945 డక్కన్ ఎయిర్ వేస్
1871 సింగరేణి బొగ్గు గనులు
1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876 ఫిరంగుల ఫ్యాక్టరి
1910 ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
1910 ఐరన్ ఫ్యాక్టరీ
1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1919 వీఎస్‌టీ
1921 కెమికల్ లాబొరేటరి
1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929 డీబీఆర్ మిల్స్
1931 ఆజంజాహి మిల్స్
1932 ఆర్టీసీ స్థాపన
1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939 సిర్పూర్ పేపర్ మిల్స్
1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
1942 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరబాద్
1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
1943 ప్రాగా టూల్స్
1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్
1947 హైదరాబాద్ లామినేషన్ ప్రాడక్స్
1864 రెవెన్యు శాఖ
1866 కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)
1866 జిల్లాల ఏర్పాటు
1866 వైద్య శాఖ
1866 మొదటి రైల్వే లైను
1867 ప్రింటింగ్, స్టేషనరీ
1867 ఎండోమెంట్ శాఖ
1867 అటవీ శాఖ (జంగ్లత్)
1869 మున్సిపల్ శాఖ
1869 పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్
1870 విద్యా శాఖ
1870 హైకోర్టు
1875 సర్వే, సెటిల్మెంట్ శాఖ
1876 ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ
1881 జనాభా లెక్కల సేకరణ
1882 ఎక్సైజ్ శాఖ (ఆబ్కారీ)
1883 పోలీసు శాఖ
1892 గనుల శాఖ
1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
1893 లోకల్ ఫండ్ శాఖ
1896 నీటిపారుదల శాఖ
1911 స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్
1912 సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా)
1913 వ్యవసాయ శాఖ
1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి TS.P.S.C.)
1914 ఆర్కియాలజీ శాఖ
1932 ఆకాశవాణి హైదరాబాద్
1945 కార్మిక శాఖ
1856 దారుల్ ఉల్ ఉలుమ్ స్కూలు
1872 చాదర్ ఘాట్ స్కూలు
1879 ముఫీడుల్ అనం హైస్కూల్
1879 ఆలియా స్కూల్
1884 సికిందరాబాద్ మహబూబ్ కాలేజి
1884 నిజాం కాలేజి
1887 నాంపల్లి బాలికల స్కూలు
1890 వరంగల్‌లో మొదటి తెలుగు స్కూలు
1894 ఆసఫియా స్కూలు
1904 వివేక వర్ధిని స్కూలు
1910 మహాబుబియా బాలికల స్కూల్
1918 ఉస్మానియా యునివర్సిటీ
1920 సిటీ కాలేజీ
1923 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
1924 మార్వాడి హిందీ విద్యాలయ
1926 హిందీ విద్యాలయ
1930 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ
1946 కాలేజి ఆఫ్ వెటర్నరీ సైన్స్
1890 ఆయుర్వేద, యునాని వైద్యశాల
1894 మెడికల్ కాలేజీ
1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
1905 విక్టోరియా ప్రసూతి దవాఖాన)
1916 హోమియోపతి కాలేజి
1927 యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్
1945 నిలోఫర్ దవాఖానా
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారంటే..?
రాజ్యాంగంలోని 356వ అధికరణం(రాష్ట్రపతి పాలన) .
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు.
అధికార పార్టీలో చీలికలు ఏర్పడినప్పుడు/భాగస్వామ్యపక్షం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న సందర్భాల్లోనూ ఆర్టికల్ 356ను ప్రయోగించిన సందర్భాలున్నాయి.
రాష్ట్రాల్లో మతకల్లోలు చెలరేగడం వంటి కారణాలతో శాంతిభద్రతలు క్షీణించినప్పుడూ ఈ పాలనను విధించవచ్చు. ఎన్నికలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో ఏ పార్టీ/భాగస్వామ్యపక్షం కూడా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేనప్పుడూ రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుంది.
న్యాయస్థానాలు అనర్హులుగా ప్రకటించడం వంటి కారణాలతో ముఖ్యమంత్రులు రాజీనామా చేసినప్పుడూ ఈ పాలన అమల్లోకి వచ్చిన సందర్భాలున్నాయి.
2014 ఫిబ్రవరిలో జన్‌లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం పొందడంలో విఫలమై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సందర్భమూ ఈ కోవలోకి వస్తుంది.
పంజాబ్, జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద చొరబాట్లు; అసోం, త్రిపురల్లో జాతిపోరు, ఉత్తర్ ప్రదేశ్‌లో మతకల్లోలాలు వంటి కారణాలతో విధించిన రాష్ట్రపతి పాలన శాంతిభద్రతల అంశం పరిధిలోకి వస్తుంది.
అసెంబ్లీలో మెజారిటీ కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వాలను రద్దు చేసిన సందర్భాలూ ఉన్నాయి.
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: TSPSC
HISTORY
శ్రీనాథుడు
(క్రీ.శ 15వ శతాబ్ధం)
రచనలు
కాశీఖండం
భీమఖండం
హరవిలాసం
శృంగారనైషదం
శివరాత్రిమహత్యం
మరుత్తరాట్చరిత్ర
పండితారాధ్యచరిత్ర
పల్నాటి వీరచరిత్ర
ధనుంజయ విజయం
శాలివాహన సప్తశతి
బిరుదులు
కవిసార్వభౌమ
కర్ణాటక పద్శవనహేళి
ఆశ్రయం
వీరభద్రారెడ్డి(రాజమహేంద్రవరం)
రచించిన శాసనం
సంతానసాగరం
[10:25AM, 30/03/2016] Lakshya Sri uradi: సైన్స్ అంతర్జాతీయ దినోత్సవాలు
-ఫిబ్రవరి 2-ప్రపంచ చిత్తడి నేలల దినం
-ఫిబ్రవరి 28-జాతీయ సైన్స్ డే
-మార్చి 3- వరల్డ్ వైల్డ్ లైఫ్ డే
-మార్చి 21 -వరల్డ్ ఫుడ్ డే
-మార్చి 23 -ప్రపంచ వాతావరణ దినం
-ఏప్రిల్ 7- ప్రపంచ ఆరోగ్య దినం
-ఏప్రిల్ 22- ప్రపంచ ధరిత్రి దినం
-ఏప్రిల్ 25 - ప్రపంచ మలేరియా దినం
-ఏప్రిల్ 26-ప్రపంచ మేథోసంపత్తి దినం


0 comments:
Post a Comment