*పారిపోయిన మొసలి -* (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ)
*********************
ఒక అడవిలో ఒక ఏనుగుపిల్ల ఉండేది.
ఒకసారి ఏనుగుపిల్ల అడవిలో పోతా వుంటే ఒక కొండచిలువ గోతిలో పడి కనిపించింది. ఆ గొయ్యి చానా లోతుగా, నున్నగా ఉంది. దాంతో అది బయటకి రాలేకపోతోంది.
ఆ ఏనుగుపిల్లది చానా జాలిగుండె.
కొండచిలువను పైకి లాగుదామని తొండం చాపింది. కానీ అది అందలేదు. దాంతో ఒక చెట్టు కొమ్మను విరుచుకొని వచ్చింది.
“ఏయ్ కొండచిలువా... కొమ్మను గట్టిగా పట్టుకో. పైకి లాగుతా" అంది. కొండచిలువ అలాగేనంటూ దాన్ని గట్టిగా చుట్టుకుంది. ఏనుగుపిల్ల నెమ్మదిగా దాన్ని పైకి లాగేసింది.
అప్పటినుంచి రెండూ బాగా కలసిమెలసి ఉండేవి.
ఒకరోజు ఏనుగుపిల్ల కొండచిలువ తెంపి ఇచ్చిన తీయని మామిడిపళ్ళు తిని అక్కడున్న చెరువులో నీళ్లు తాగబోయింది. ఆ నీళ్లలో ఒక పెద్ద మొసలి వుంది. అది చానా బలమైంది. లటుక్కున ఏనుగుపిల్ల కాలు పట్టుకుంది. నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి చానా బలం ఉంటుంది కదా. దాంతో అది తప్పించుకోలేక బాధతో అరవసాగింది.
ఆ అరుపులు కొండచిలువ వింది. వేగంగా వచ్చి నీళ్లలో మునిగిపోతావున్న ఏనుగుపిల్ల కాలును గట్టిగా చుట్టుకొని వెనక్కు లాగసాగింది.
ఏనుగుపిల్ల , కొండచిలువల బలం ముందు మొసలి బలం సరిపోలేదు. నెమ్మదిగా అవి రెండూ కలసి మొసలిని ఒడ్డుకు లాక్కొని రాసాగాయి.
“అమ్మో... నీళ్లలోంచి బయటపడిన వెంటనే నా బతుకు కుక్క కన్నా హీనంగా తయారవుతుంది. వాటి చేతిలో చావడం ఖాయం" అని మొసలి భయపడింది. వెంటనే ఏనుగుపిల్ల కాలు వదిలేసి వెనక్కి పారిపోయింది.
పారిపోయిన మొసలి -* (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ)
Posted by PAATASHAALANEWS on Saturday, 1 August 2020

You may also like these Posts
Blog, Updated at: August 01, 2020
0 comments:
Post a Comment