*నగదు ఉపసంహరణ కి కొత్త నిబంధనలు
ముంబయి: భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)లో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధనలు వచ్చాయి. బ్యాంకు శాఖల్లో పరిమితికి మించి లావాదేవీలు నిర్వహిస్తే ఇకపై రుసుము కట్టాల్సి ఉంటుంది. కాగా చిన్న, నో ఫ్రిల్ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవు.
సగటు నెలవారీ మొత్తం (ఏఎంబీ) రూ.25000 వరకు ఉండే ఖాతాదారుడు బ్యాంకు శాఖల్లో రెండుసార్లు మాత్రమే నగదు ఉపసంహరించుకొనేందుకు అవకాశం ఉంటుంది. రూ.25,000-50000 అయితే 10 విత్‌డ్రావల్స్ ఉచితం. రూ.50,000-100,000 ఉంటే 15, రూ.లక్షకు మించి ఏఎంబీ ఉంటే అపరిమితంగా నగదు వెనక్కి తీసుకోవచ్చు. పరిమితి దాటిన వారుమాత్రం ఒక్కో లావాదేవీకి రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో మాత్రం ఉచితంగా అపరిమిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఏటీఎం నిబంధనలు
1) రూ.25వేలలోపు సగటు నెలవారీ మొత్తం ఉన్న వినియోగదారుడు ఏటీఎంలో ఉచితంగా ఎనిమిది లావాదేవీలు చేసుకోవచ్చు. ఎస్‌బీఐలో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు లావాదేవీలు ఉచితం. ఇవి ఆరు మెట్రో నగరాలకే వర్తిస్తాయి. ఇతర నగరాల్లో ఎస్‌బీఐలో 5, ఇతర ఏటీఎంలలో 5 వరకు చేసుకోవచ్చు.
2) రూ.25,000-లక్ష వరకు ఏఎంబీ ఉన్న ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎనిమిది వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. మెట్రోల్లో 3, ఇతర నగరాల్లో 5 చేసుకోవచ్చు. సొంత బ్యాంకు ఏటీఎంలలో ఉచితంగా అపరిమిత లావాదేవీలు చేసుకోవచ్చు.
3) నిర్దేశించిన పరిమితిని దాటి ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహిస్తే ఒక్కోదానికి రూ.10-20 వరకు జీఎస్‌టీని కలిపి రుసుముగా వసూలు చేస్తారు.
ఇక సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటులో 5 బేసిస్ పాయింట్ల కోత విధించడంతో 31, మే నుంచి 2.7శాతం వడ్డీ మాత్రమే లభించనుంది.
0 comments:
Post a Comment