LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం (GIS) సమాచారం సంబంధిత ఉత్తర్వులతో

Posted by PAATASHAALANEWS on Tuesday, 28 July 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం (GIS) సమాచారం సంబంధిత ఉత్తర్వులతో:

❄ ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ (FBF) స్థానంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని 1.11.1984 నుండి ప్రవేశపెట్టారు.
*G.O.Ms.No.293 Fin తేది: 8.10.1984*

❄ ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పంచాయతీ రాజ్ సంస్థలకు,మున్సిపల్, ఎయిడెడ్ సంస్థలలో పనిచేస్తున్న బోదన, బోధనేతర సిబ్బంది 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న వర్క్ ఛార్జ్ డ్ ఉద్యోగులకు వర్తిస్తుంది.

❄ ఎయిడెడ్ సంస్థలలో పనిచేస్తున్న  బోదన,బోధనేతర సిబ్బందికి 1986 నుండి వర్తింపచేశారు.
*G.O.Ms.No.315 Fin తేది:22.7.1986*

❄ ఉద్యోగి నవంబర్ తరువాత సర్వీసులో చేరితే వచ్చే సంవత్సరం నవంబర్ నుండి మాత్రమే సభ్యునిగా స్వీకరించాలి. ఎయిడెడ్ యాజమాన్య విషయంలో జులై నుండి సభ్యునిగా స్వీకరించాలి.

❄ ఉద్యోగికి సర్వీసులో నియామకం, ప్రమోషన్, రివర్షన్ తదితర కారణముల వల్ల స్కేలులో మార్పులు సంభవిస్తే మారిన దాని ప్రకారం GIS ప్రీమియం మార్చుకోవడానికి నవంబర్ 1వ తేదీనే అనుమతించాలి.

❄ ఈ పథకంలో సభ్యత్వ రుసుం నిర్ణయించడానికి ఉద్యోగులను A,B,C,D అనే 4 గ్రూపులుగా విభజించారు.

❄ 1.11.1994 నుండి యూనిట్ ప్రీమియం రేటు రూ.10 నుండి రూ.15 కు పెంచారు.
*G.O.Ms.No.367 Fin తేది:15.11.1994*

 A Group-Rs.120

 B Group-Rs.60

C Group-Rs.30

D Group-Rs.15

❄ 2015 PRC అనుసరించి
GIS స్లాబ్ రేట్లు
*G.O.Ms.No.151 Fin తేది: 16.10.2015*

 Rs.35120-110850-A-Rs.120- 

8 Units

 Rs.23100-84970-B-Rs.60- 

4 Units

 Rs.16400-6633౦-C-Rs.30-

2 Units

 Rs.13000-47330-D-Rs.15-

1 Unit

❄ ప్రతినెలా ఉద్యోగి జీతం నుండి GIS ని మినహాయించాలి. ఉద్యోగి EOL లో ఉంటే డ్యూటీలో చేరిన తరువాత ప్రిమీయంను వడ్డీరేటుతో సహా జీతం నుండి మినహాయించాలి. బకాయి మొత్తాన్ని 3 వాయిదాల లోపుగానే మినహాయించాలి.

❄ ఉద్యోగి ఫారిన్ సర్వీసులో పనిచేస్తున్నప్పుడు, ఆయా శాఖలు ఉద్యోగి ప్రీమియంను మినహాయించి ప్రభుత్వమునకు చలనా రూపంలో సంబంధిత అకౌంట్ హెడ్ కు జమచేయాలి.

❄ ఈ పథకంలోని రూలు.17 ప్రకారం ప్రతి ఉద్యోగి తన కుటుంబ సభ్యులు లేదా సభ్యునికి మాత్రమే నామినేషన్ ఇవ్వాలి. అట్టి విషయాన్ని సర్వీస్ రిజిష్టర్ లో నమోదు చేయాలి.

❄ 1.11.1994 తర్వాత మినహాయిస్తున్న రూ.15 యూనిట్ లో రూ.4.50 ఇన్సూరెన్స్ నిధికి, రూ.10.50 సేవింగ్స్ నిధికి జమచేస్తారు.

❄ పదవీ విరమణ,స్వచ్చంధ పదవీ విరమణ చేసినా లేదా ఉద్యోగం నుండి తొలగించబడిన ఉద్యోగులకు ఈ పద్దతిలోని రూలు.10 ప్రకారం అప్లికేషన్-3 ద్వారా సేవింగ్స్ నిధికి జమ అయిన మొత్తాన్ని ఉద్యోగికి చెల్లించాలి.

❄ ఉద్యోగి సర్వీసులో మరణిస్తే అతని నామిని లేదా వారసులకు ఇన్సూరెన్స్ నిధి మరియు సేవింగ్స్ నిధి  రెండూ చెల్లిస్తారు.

❄ ఇన్సూరెన్స్ మొత్తం ఉద్యోగి ఏ గ్రూపులో ఉంటే దాని రేటు ప్రకారం చెల్లిస్తారు.

♦A Group Rs.1,20,000

♦B Group Rs.60,000

♦C Group Rs.30,000

♦D Group Rs.15,000

దీనితో పాటు సేవింగ్స్ నిధిలో జమయిన మొత్తాన్ని కూడా చెల్లిస్తారు.

❄ పథకంలోని రూలు.11 ప్రకారం ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఇన్సూరెన్స్ నిధి నిండి కాని లేదా సేవింగ్స్ నిధి నుండి గాని నగదు తీసుకోవడానికి వీలులేదు.

❄ ఈ స్కీంలో ఉద్యోగికి ఎలాంటి రుణాలు లేదా అడ్వాన్సులు మంజూరు చేయబడవు.

❄ కనిపించకుండా పోయిన ఉద్యోగి GIS మొత్తాన్ని 7 సంవత్సరాల తరువాత నిర్ధారిత పత్రాలైన FIR, నామినేషన్ పత్రాలు, వారసుల గుర్తింపు లాంటివి దాఖలు చేసి పొందవచ్చును.

❄ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించవలసి ఉండగా ఉద్యోగి మరణిస్తే అతని నామిని లేదా వారసులకు చెల్లించే GIS మొత్తం నుండి బకాయిలు సర్దుబాటు చేయడానికి వీలులేదు.
*Govt.Memo.No.B-90/D.6/131-A/Admn.M/91 Fin,తేది: 25.7.1991*

❄ ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరున, గడిచిన సంవత్సరం ఏప్రిల్ నుండి మార్చి వరకు GIS ప్రిమీయం ఎంత మొత్తం ఏ స్లాబ్ లో రికవరీ చేశారో అన్ని వివరాలు పట్టిక రూపంలో సర్వీసు రిజిష్టరులో నమోదు చేయాలి.GIS Subscription Rates post and scale wise

RPS 2020 

👉1. Attender(OS) all scales to Record Asst. 6 Yrs scale - Rs.15/-


👉2. Record Asst. 12 Yrs scale to Jr.Asst. all scales, SGT/LP/PET 6Yrs scale - Rs.30/-


👉3. SGT/LP/PET 12 Yrs scale to SA/LFL HM 6Yrs scale-  Rs.60/-


👉4. SA/LFL HM 12Yrs/SGT /LP 24Yrs.Scale to GHM all scales- Rs.120/-

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 28, 2020

0 comments:

Post a Comment