Heart Problems -రాబోయే గుండె జబ్బుల్ని చేతి వేళ్లు ముందే చెబుతాయా?
Our fingers tell many secrets. If not here's a new product just for you! 'What's new in the fingers that we see daily,' we take the light. But scientists at the University of Liverpool say the same fingers predict our future. They researched 151 people who had a heart attack. They found that the heart attack was coming at a younger age than those with a ring finger. This thing surprised not only us, but them as well.
మన చేతి వేళ్లు చాలా రహస్యాల్ని చెబుతాయి. కాకపోతే వాటిని మనం అంతగా గమనించం. 'రోజూ చూసే వేళ్లేగా కొత్తేముంది' అని లైట్ తీసుకుంటాం. కానీ ఇవే వేళ్లు మన భవిష్యత్తును ముందే చెబుతున్నాయని యూనివర్శిటీ ఆఫ్ లివర్‌పూల్‌కి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ వచ్చిన 151 మందిపై వాళ్లు పరిశోధనలు చేశారు. వాళ్లలో ఉంగరం వేలు కంటే, చూపుడు వేలు పొడవు ఎక్కువగా ఉన్న వారికి హార్ట్ ఎటాక్ త్వరగా, చిన్న వయసులోనే వస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం మనకే కాదు, వాళ్లకు కూడా ఆశ్చర్యం కలిగించింది.
35 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నవాళ్ల ఉంగరం వేళ్ల కంటే చూపుడు వేళ్లు పొడవుగా ఉంటే, వాళ్లకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు తేల్చారు.
అలాగే చూపుడు వేలు, ఉంగరం వేలు సమానంగా ఉన్నవారికి హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని కూడా సైంటిస్టులు చెబుతున్నారు.
తల్లి గర్భంలోని పిండంలో బిడ్డ రూపుదిద్దుకునేటప్పుడు, మిగతా శరీర భాగాల కంటే చేతివేళ్లు త్వరగా తయారవుతాయి. చేతులు, వేళ్ల నిర్మాణం చక్కగా ఏర్పడినప్పుడే,... మిగతా శరీర భాగాలు కూడా సక్రమంగా పెరుగుతాయట. గుండె, మెదడు వంటి కీలక అవయవాలు చక్కగా ఏర్పడాలంటే చేతి వేళ్లు కూడా చక్కగా ఉండాలంటున్నారు సైంటిస్టులు.
చేతి వేళ్లు ఉన్నా, వాటితో సంబంధం లేకుండా కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులు. ప్రధానంగా పొగ తాగేవారు, మద్యం సేవించేవారు, ఆర్థరైటిస్ ఉన్నవారు గుండెను జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంతేకాదు, డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు, అధిక బరువు, స్థూలకాయం ఉన్నవారు కూడా గుండె విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టల్సిందేనట. ఒత్తిడి అధికంగా ఫీలయ్యేవారు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారికి కూడా హార్ట్ ఎటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. మన గుండె పదిలంగా ఉంటేనే, మనం ఆరోగ్యంగా జీవించగలం. అందువల్ల దాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తూ, హార్ట్‌ని హ్యాపీగా ఉంచుదాం.
0 comments:
Post a Comment