ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన విషయం...గ్రాట్యుటీ అంటే ఏమిటి ? ఎంత చెల్లిస్తారు ?
What is gratuity? How Much to Pay? ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన విషయం...గ్రాట్యుటీ అంటే ఏమిటి ? ఎంత చెల్లిస్తారు ? గ్రాట్యుటీ అంటే ఏమిటి ? ఎంత చెల్లిస్తారు ?
- ఏళ్ల తరబడి చేసిన పనికి ప్రతిఫలంగా కంపెనీ చెల్లించే మొత్తమే 'గ్రాట్యుటీ', రిటైరయ్యాకనో, ఉద్యోగం వదిలేస్తేనో లేదా ఉద్యోగం నుంచి తొలగిస్తేనో... కంపెనీ ఆ వ్యక్తికి గ్రాట్యుటీని చెల్లిస్తుంది. ఏదైనా సంస్థలో పనిచేసిన ఉద్యోగి ఉద్యోగం మానేసినా, రిటైరైనా గ్రాట్యుటీ రూపంలో కొంత మొత్తాన్ని పొందుతారు.
- 1972లో గ్రాట్యుటీ చెల్లింపు చట్టం (పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972) రూపొందించింది. దీని ప్రకారమే కంపెనీలు నిర్ధారిత నియమాలు, షరతులకు లోబడి, ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపులు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలు ఉద్యోగులు, సంస్థలు... ఇద్దరికీ వర్తిస్తాయి.
- ఏడాదికీ, రెండేళ్లకే ఉద్యోగాలు మారుతుంటే మీకు గ్రాట్యుటీ ఎప్పటికీ అందని ద్రాక్ష, ఏదైనా కంపెనీలో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు పనిచేసినవారే గ్రాట్యుటీకి అర్హులవుతారని చట్టం చెబుతోంది.
- ప్రభుత్వ పెన్షన్ పోర్టల్ ప్రకారం... గ్రాట్యుటీ అనేది 15 రోజుల బేసిక్ శాలరీ, డీఏల మొత్తానికి సమానం. ఇది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- మొదటిది వేతనం, రెండోది ఎంతకాలం పనిచేశారనే సర్వీస్ పీరియడ్. ఆరునెలలు అంతకన్నా ఎక్కువ కాలం ఉన్నసమయాన్ని సంవత్సరంగానే లెక్కిస్తారు.
- ఎన్ని సంవత్సరాలు పనిచేశారో అంత కాలానికి ఏడాదికి 15 రోజుల బేసిక్ శాలరీ, డీఏలను లెక్కించి, దీన్ని చెల్లిస్తారు.
- గ్రాట్యుటీకి కనిష్ట పరిమితి ఆంటూ ఏమీ లేదు. కానీ గరిష్ట పరిమితి రూ.20 లక్షలు. ఉద్యోగం మానేసినా, రిటైర్మెంట్ తర్వాత ఆయినా 30 రోజులలోపు గ్రాట్యుటీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏ కంపెనీ అయినా గ్రాట్యుటీ చెల్లించకపోయినా లేదా చెల్లించాల్సిన దానికన్నా తక్కువ చెల్లించినా ఆసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
gratuity
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends
You may also like these Posts
Blog, Updated at:
July 15, 2020
0 comments:
Post a Comment